"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

10 జన, 2010

మన అలవాట్లు..మనం....

మనం చిన్నప్పట్ట్టి నుంచి నేర్చు కున్న అలవాటులే మనలని జీవిత కాలం వరకు నడిపిస్తాయి. ఎంత మారాలని ప్రయత్నించిన, మనం మన అలవాట్లు కి బానిసలం.నడి వయస్సు రాగానే, అందరం, పుల్కాలు అంటూ కొత్త అలవాటు చేసుకుంటామా ఎప్పుడైనా, ఒక రోజు అవి మానేసి, అన్నం తింటే, ఎంత తృప్తి గా ఉంటుందో? వేడి, వేడి, తెల్లని అన్నం లో, ఆవకాయో, కంది పోడో,ఇంత నెయ్యో, నానో వేసుకుని ,కంచం నిండుగా తింటూ ఉంటే, స్వర్గం కి కొంచం దూరం లో ఉన్నట్టు ఉంటుంది.మనం చిన్నప్పుడు, ఏమేమి చేసామో, అవన్నీ, ఇప్పుడు చేయ లేక పోయిన, ఆ అలవాట్లు ని మటుకు మర్చి పోలేము. ఇరవై ఒక్క రోజులు ఏ పని అయిన చేస్తే అది అలవాటు అవుతుంది అని, కొంత మంది నమ్మిస్తారు. అర్ధ రాత్రి ,పన్నెండు గంటలు వరకు  గుడ్ల గూబ లాగ మేలుకుని, ఏదో ఒక స్వీట్ తిని పడుకుంటే కాని, నాకు నిద్ర పట్టదు.చిన్నప్పుడు ఏళ్ళ తరబడి ,  పరిక్షల కోసం చదివి, చదివి, అయిన అలవాటు ఇది. ఉదయం ఏడు గంటలకి తెల్ల వారుతుంది అందుకే.. నాకు.ఉదయించే సూర్యుడు, అందాలు అని ఎంత వర్ణించినా.. అస్తమయం చూస్తూ, ఊహించు కోవడమే.ఎందు కైనా, అవసరం అయి, తెల్ల వారు ఝామున అయిదు గంటలు కి లేస్తే, ఆ రోజు అంతా మత్తు  మంది ఇచ్చి  ఆపరేషన్ చేసేక, మెలకువ వస్తే, ఎలాగా అవక తవక గా ఉంటుందో, అలాగా అస్త వ్యస్తం అయిపోతుంది. మన శరీర వ్యవస్థ, మనస్సు కూడా. చిన్నప్పటి అలవాట్లు అందుకే అంత   powerful అంటున్నాను. ఇలాంటివే పుస్తకం చేతిలో పట్టుకుని చదువుతూ పడుకోవడం, పొద్దున్నే, కాఫీ తాగాలి అంటే, చేతులో, హిందూ పేపర్ ఉండాలి అనుకోవడం,అమెరికా అవీ వేరే దేశాలు వెళ్లి నప్పుడు , పొద్దున్నే పేపర్ రాదు అంటే, నెట్ లో చదువు కుంటూ, కాఫీ తాగ డానికి ప్రయత్నం చేయడం, ఇవి అన్నీ చిన్నప్పటి అలవాట్లే మరి. మన దేశం లోని రైళ్ళు సరిగ్గా సమయానికి రావడం, నాకు, చాల ఇబ్బంది కలిగించింది. చిన్నప్పటి అలవాటు ప్రకారం, ఒక గంట లేటు అని బయలు దేరితే, ఇప్పుడు రైళ్ళు మిస్ అవుతాము. నేను మారలేదు కాని, యీ రైళ్ళు మారాయి.అలవాట్లు ని మార్చు కున్నాయి. రేపటి నుండి నేను కూడా, ఉదయించే సూర్యు డిని చూడ డానికి ప్రయత్నిస్తాను. మరి, తొమ్మిది గంటల కే మంచం ఎక్కేయాలి, సెలవా మరి???

3 జన, 2010

నా అస్తిత్వం, నా ఉనికి..

నా అస్తిత్వం.. మీద నాకు అనుమానం, బెంగ, దిగులు కలిగాయి. ఒక నేర్పరి అయిన చోరుడి  వల్ల. నా హ్యాండ్ బాగ్ లో, నా క్రెడిట్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సు, ఒక పాన్ కార్డు, ఒక క్లబ్ సభ్యత్వ  కార్డు..అన్నీ పోయాయి. ఆ దొంగ ని తలుచుకుని జాలి కూడా పడ్డాను, ఒక్క రూపాయి కూడా  లేని  ఆ పర్సు అతని  ఆకలి తీర్చదు కదా! అని. నా కార్డులు పోయిన వెంటనే ,నాలో కలిగిన భావాలు.. అనేకం. నేను ఇప్పుడు ఎవరిని? బ్యాంకు లో డబ్బు ఉన్నా, చేతిలో ఒక్క రూపాయి కూడా లేని, బీద రాలిని.నేను ఫలానా వసంత ను అని చెప్పడాని కి రుజువులు అడిగితే ,నా దగ్గర ఏమి లేవు. నా ఆకారం, నా వేష భాషలు, తెలిసిన ఫ్రెండ్స్, సరే, చెల్లెళ్ళు, సంబంధీకులు సరే, ఆ హైదరాబాదు నగరం లో , మీరు ఎవరని అడిగితే, నేను చెపితే నమ్మే వాళ్ళు ఉన్నారా? నేను ఫలానా అని. నేను అపుడప్పుడు టీవీ లలో కనిపించను, ప్రింట్ లో నా పేరు లేదు, ఒక నటి ని కాదు, ఒక రచయిత్రి ని కాను, ఒక డాక్టర్ ను కాను, ఎక్తర్  ను కూడా కాను. ఒక ఆఫీసు లో నా రికార్డు లేదు, జీతం తీసు కున్న స్లిప్ లేదు, ఆ ఊరిలో నా అడ్రెస్స్ ప్రూఫ్ లేదు, ఆఖరికి ట్రైన్ టికెట్ లో కూడా, నా పేరు నాదేనని ,ఒక రుజువు చూపించాలిట, జేబు లోంచి డబ్బులు తీసి ,వస్తువులు కొనే రోజులు కావివి. అన్నిటికి ఒక మాయ మంత్రం చేసే ఒక బ్యాంకు కార్డు ఉండాలి.. ఇప్పుడు. అదే నాది పోయింది. కార్డు పోయింది అని ఫోన్ చేస్తే, నువ్వు నువ్వేనా అని అరగంట ఫోన్ లో అనుమానం గా మాట్లాడి,  అనేక భేతాళ ప్రశ్నలు కు , విక్రమార్కు రాలి గా జవాబు ఇస్తే, తల వెయ్యి ముక్కలు అవలేదు గాని,  తల నొప్పి, depression , అనుమానం, అవమానం, బెంగ, దిగులు అదే వరసలో కలిగాయి.
ఆ తరువాత, ఎక్షిభిశున్ లో అందరు, ఏవేవో బేరం ఆడుతోంటే, నేను నిర్లిప్తం గా ఆకాశం లోకి, చుట్టూ, మనుషలను చూస్తూ న్నప్పుడు , ఎవరో, దూరం గా ఆనందిస్తూ న్నట్టు అనిపించింది.కార్డు లు ఉంటె, ఎంత ఖర్చు యేదో, ఇప్పుడు ఎంత సేవ్ అయిందో అని ఒక దూర నేస్తం, అసలు ఆ కార్డులు ఇప్పించిన ఒక  మహా మనిషి, నిశ్చింత గా, చేతులు గుండెలు మీద వేసుకుని పడుకున్న ఒక దృశ్యం కనిపించింది.
అప్పుడే, అసలు నేను ఎవరు? నాకు ఎవరో యీ కార్డులు ఇవ్వడం, అవి పోవడం, ఇదంతా ఏమిటి.. అని ఒక దీర్ఘ నిట్టుర్పులతో ,అంతర్ మధనం ప్రారంభం అయింది.ఎవరో, నా కోసం వారి పర్సు లోంచి డబ్బులు తీసి ఇస్తే కాని, నాకు గడవదా?  నాకు అంటూ ఏమి ఆదాయం నాకు లేదు కాని, అదేమిటో ఖర్చు మాత్రం బాగా ఉంటుంది. అందమై నవి, అందు బాటు లో లేనివే , నాకు నచ్చుతాయి. పుస్తకాలు, కొని చదవడం, ఇంకా అందరికి, ఏదో గిఫ్త్స్ ఇవ్వడం, పిల్లలకి, ఐస్కరీం లు కొనడం, లాంటి క్షణ భంగు రమైన ఆనందాలు అన్నీ నాకు నచ్చు తాయి.
కాని, నేను ఫలానా అని ఒక కార్డు ఏదో చూపించాలి ట. నేను ఎవరో నాకు తెలుసు. కాని అందరికి తెలియదు కదా? ఇప్పుడు ఏది దారి? అని ఆ హైదరాబు లో దిక్కు తోచ లేదు. అప్పుడే నేను ఎవరిని? అని ఒక అస్తిత్వ వాద దిగులు ఒక చలి దుప్పటి లాగా కప్పేసింది. ఆ చలి లో, ఒక వెచ్చని చెల్లి నాకు అండ గా నిలిచింది అనుకోండి.
ఇలా, అండ ,కొండ, లేకుండా, నేను లేనా?? అని మళ్లీ, కొసాన వచ్చే చివరి మార్గశిర చలి లాగ, మళ్లీ దిగులు..యీ హైదరాబాదు అంత బాగుంది, కాని యీ చలి..అనుకుంటూ.. రైలు ఎక్కాను.
నా రెసేర్వషున్ టికెట్ ప్రింట్ చూసి, టికెట్ కలెక్టర్, మర్యాదగా, టిక్కు పెడితే, అమ్మయ్యా .. నా అస్తిత్వం మీద నాకు నమ్మకం కుదిరి, ఒక వెచ్చని వెలుగు ,మొహం లో ప్రకాశించింది.నీ కార్డు చూపించు అనలేదు. నేను నేనే అని త్రికరణ శుద్ధి గా నమ్మాడు. నాకు, నేను నేనే అని ఒక ధైర్యం ప్రవేశించింది.
ఇంటికి చేరాం. టేబుల్ మీద, కొత్త కార్డులు ప్రత్యక్షం.పక్కనే, కొత్త  సీమర్  మాల్ ప్రారంభోత్సవం కార్డు కూడా. శుభం.. నేను మళ్లీ నేనే .. నా అస్తిత్వం, నా ఉనికి.. ఇదే.. అని నమ్మకం.. మళ్లీ కలుసు కుందాం..కొత్త సంవత్సర శుభాకాంక్షలు.