"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

25 ఫిబ్ర, 2010

టమాటాలు అర్ధ రూపాయి,కేజీ ?

టమాటాలు అర్ధ రూపాయి కేజీ ట, టీవీ లో చూసాను, ఎగిరి కోనేయాలని, సంవత్స రానికి సరి పడ పచ్చడి పెట్టు కోవాలని అనిపించ లేదు, చాల దుఖం, బాధ కలిగి, ఆలోచన లో పడ్డాను. నిన్నటి కి నిన్న కష్టపడి, వంకాయ కూర ఉల్లికారం, మసాల అంతా దట్టించి చేస్తే, విషం లాగ, చేదు గా, వగరు గా ఉంది ఆ కూర, ముందు గా నేను రుచి చూసి, డస్ట్ బిన్ కి ఆహరం చేశాను, ఉసూరు మంటూ, మళ్లీ ఇంకో కూర వండాను. వండితే కాని, రుచి  తెలియదు, వెధవ వంకాయ అని మనసు లో తిట్టుకున్నాను. మొన్న కష్ట పడి , తెలుగు లో ఏదో ఒక బ్లాగ్ అంతా రాసాక ఏమి నొక్కానో, మొత్తం అంతా మాయం అయిపొయింది, కన్నీళ్లు ఒక్కటే తక్కువ.ఇవాళ టీవీ లో అర్ధ రూపాయి కి పడి పోయిన టమాటాల  ధర ను చూసి, కడుపు మండి పోయి, నేల మీద ఒంపుకున్న రైతు లని చూసి, నా కన్నీళ్లు ఎంత వృధా నో అనిపించింది. 
నేల దున్ని, సాగు చేసి, విత్తనాలు  వేసి, చీడలు కి మందు పెట్టి, నీరు పెట్టి, పంట అందు కునే సమయాని కి ఆ విత్తనాలు నకిలీ వి, పంట బూటకం, చేతిలో అప్పులే నిజం అని తెలిసిన రైతు కన్నీళ్లు ఎంత నిజం. పంట చేతికి వచ్చేంత వరకు, ఆ విత్తనాలు మంచివో , కావో , ఎవరికీ తెలుసు. వ్యవ సాయ శాఖ అధికారులు ,చెప్పినవే కొన్నారు. ప్రైవేటు వ్యాపారస్తులు మోసం చేస్తారు అని, ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలే ,పోసారు, అయినా నష్టం  తప్పలేదు. అంతా మాయ లాగ ఉంటుంది. ఇప్పుడు యూరియా ధర పెంచారు, కరెంటు, ఎప్పుడూ వస్తుందో, నీరు ఎప్పుడూ పెట్టు కోవాలో, ఏ క్షణం లో తుఫాను వస్తుందో, ఏ క్షణం లో ధరలు పడి పోతాయో, ఏ క్షణం లో ప్రభుత్వం ఈ భూములు మాకు అమ్మండి, ఇక్కడ ఒక పెద్ద సెజ్ వస్తుంది, మీకు ఒక ఉద్యోగం వస్తుంది అని మాయ మాటలు చెప్పి మోసం చేస్తారో, ఏ క్షణం లో నాన్నా నాకు పరీక్ష ఫీజు కట్టాలి, డబ్బు పంపు అని కొడుకు ఉత్తరం రాస్తాడో, ఏ క్షణం లో, భార్య నగలు తాకట్టు కి నడుస్తాయో, ఏ క్షణం లో ఏ కబురు వస్తుందో,  ఏమవుతుందో ఆ రైతు, మనకి అన్నం పెట్టే ఆ రైతు కి తెలియదు. 
ఉల్లిపాయలు  ధర పెరిగితే, ఆందోళన లు చేస్తాం, పెట్రోల్ ఏభై రూపాయలు అయితే, అంతర్జాతీయ మార్కెట్ అని నిట్టూర్చి ,  స్కూటర్లు లో ,కార్ల లో పోయించు కుని ప్రయాణం చేస్తాం రోజూ తప్పదు కదా మరి. బియ్యం ధర పెరిగి పోయింది, అని వాపోతం కంచం లో అన్నం లాగిస్తూ, రైతు కి ఏమైనా ఇస్తున్నారా ఈ పెరిగిన ధర లో, అతనికి ఎంత, మధ్య వర్తులు కి ఎంత, ప్రభుత్వం ఎంత?? ఈ ధరల పెరుగుదల బాధ్యత? రైతు ఎందుకు అంత బీద పరిస్థితి లో ఉన్నాడు? నష్టం  వస్తున్నా  ఎందుకు ఇంకా పండిస్తున్నాడు?? మనకి మన ఉద్యోగం లో జీతం నచ్చక పోతే, ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాం, రైతు ఇంకో పంట వేస్తాడు, ఎలాగో ఒక లాగ , భూమి ని నమ్ముకుని బతుకుతాడు . 
మనం రోజూ, ప్రొద్దున్నే లేచి, దణ్ణం పెట్టు కోవాలి, రైతు కి, మనకి కంచం లో కి అన్నీ రుచులు అమర్చి పెట్టేది, ఆ మహానుభావుడే. రైతు లని నానా  కష్టా లు  పెడితే, అతను విసిగి, పంటలు పండిం చడం మానేసి, భూములు అమ్ముకుని, కారులు కొను క్కుని, పట్టణం లో వ్యాపారాలు చేసుకుని, బ్రతికితే మనం ఇంక రోజు ఇంత అన్నం తినడం మానేసి, బర్గర్లు, పిజ్జాలు, అమెరికా వాళ్ళు మనకి వడ్డించేవి, గుప్పెడు డబ్బులు పుచ్చుకుని,తిని, నోరు కట్టుకుని బతకాల్సిందే . 
మనం ఒక వస్తువు ఉత్పత్తి   చేస్తే, మనమే ఆ ధర నిర్ణయిస్తాం, ఒక సాఫ్ట్ వారే ప్రోగ్రమ్మే రాస్తే,మనమే అమ్ముతాం మనకి లాభం వచ్చే ధరకి.కాని, ఒక రైతు మటుకు తన పంట ని ఎవరో చెప్పిన ధర కు అమ్మలి, ప్రభుత్వం కూడా ఈ మోసం లో భాగం. అమ్మక పోతే, ఎక్కడా దాచు కొంటాడు ,ఆ పంటని? మళ్లీ, పొలం పనులు మొదలు పెట్టాలి, ఇంకో పంట కి భూమి ని సిద్ధం  చేసుకోవాలి, సంవత్సరం పొడుగునా ఏదో ఒక పని, ఆదివారాలు లేవు, సిక్ లీవులు  లేవు, అప్పులు ఇచ్చే బ్యాంకులు చుట్టూ తిరగాలి, మోటార్లు కాలిపోతే లో వోల్టేజ్  కి, బాగు చేయించు కోవాలి, పిల్లలని చదువు కోసం పట్నం లో పెట్టాలి, ఒళ్ళు బాగో లేక పోతే, పట్నం కి పోయి హాస్పిటల్ లో చూపించు కోవాలి, ఇన్ని ఈతి బాధ లతో, ఇంకా భూమి ని నమ్ముకుని, మనకి బియ్యాలు, పప్పులు, కాయ గూరలు ఇంక ఎన్నో పండించి, మనకి ఒక జీవం ఇస్తున్నాడంటే , రైతు కాళ్ళ కి మొక్క ల్సిందే, దేముడా అని.
రైతు ని పట్టించు కోండి అని ప్రదర్శన లు చేద్దాం, ప్రభుత్వం మేలుకునేలా, ప్రజలు మేలు కోవాలి, టమాటాలు అర్ధ రూపాయి కి అమ్ముతున్నారు అంటే, పచ్చళ్ళు పెట్టు కోవడం కాదు, ఏమిటి ఈ దురాగతం అని మధ్య వర్తి, వ్యాపార స్తులని ప్రశ్నించుదాం . రైతు ల కన్నీళ్లు మన కి శాపం అని ఎరిగి, బడా వ్యాపారస్తు లు   చిన్న చిన్న రైతు లని కొనేయడం మనకి ఎంత నష్ట మో ముందు ముందు మన దేశం తిండి కోసం ఎలా పెద్ద దేశం ముందు అడుక్కు తినాల్సి వస్తుందో, ఆ ఖర్మ ఏమిటో, ఆ దుస్థితి ఏమిటో, అన్నీ కాస్త తెలివి గా అలోచించి  , మెలకువ తో మెలగ వలసిన రోజులు ఇవి.
రైతులని , మట్టి తో అనుబంధం పెంచు కున్న రైతుల ని కాపాడడం మన దేశం లో అందరి బాధ్యత, అంటే, నీది, నాది. ఎవరో కాదు...ఇంక నేను ఇంకో కూర తో అన్నం తిన వచ్చు.. ను ఇవాల్టికి. నాకు అన్నం పెట్టే రైతు మహా రాజు ని తలచు కుంటూ.. తల వొంచి నమస్కరిస్తూ.. నా చిన్న పొట్ట, శ్రీరామా  రక్షా... 

21 ఫిబ్ర, 2010

మాతృ భాష దినం ట.. ఇవాళ

మాతృ భాష దినం ట, ఇవాళ , 
మాటలు నేర్చు కోవడం మొదలు పెట్ట గానే, మాట్లాడే అమ్మ భాష మాతృ  భాష,ఆనందం  కలిగినా, బాధ పుట్టినా, నవ్వే, ఏడ్చే భాష మాతృ భాష. చిన్నప్పుడు , స్నేహితుల తో అల్లరి చేస్తూ, పరుగులు తీస్తూ, దెబ్బలు తింటూ, రాత్రి, అమ్మ పెట్టే అన్నం తింటూ, కథలు వింటూ, నాన్న సుద్దులు వింటూ, అమ్మ పాడే జోల పాటలు వింటూ, తెల్లవారు ఝామున , పాడే పిట్టల ,కోయిల పాటలు, వీచే సన్నని, చల్లని గాలి, అన్నీ, మనం మన మాతృ భాష లోనే అనుభ విస్తాం. ఇంకో భాష మనకి అనుభవమే లేదు, ఆ చిన్న తనం  లో.

అక్షరా భ్యాసం , ఓం నమాసివయః అని బియ్యం లో రాయిస్తారు, ఇప్పటికీ. ఇంక స్కూల్ లో చదువు అనే సమయానికి ఎందుకు ఆంగ్ల మాధ్యమం ,బడి లో పడేస్తున్నాం. ఇంక నువ్వు నవ్వినా, ఏడ్చినా అది ఒక అవస్థ. మాతృ భాష మరచి పోయి, కొత్త భాష లో మాట్లాడాలి, నీ ఆలోచనలు ఒక భాషలో ,నువ్వు నేర్చుకునే భాష ఇంకొకటి. తెలుగు భాష ,అని ఒకే ఒక గంట ( పిరియడ్  ), మిగిలిన సమయం లో , సైన్సు, లెక్కలు, సోషల్ అన్నీ నీకు వచ్చిన భాష లో కాదు, నీకు పూర్తి గా కొత్త అయిన ఆంగ్లం భాష లో. ఇంట్లో ఎక్కడా ఈ భాష మాట్లాడడం ఉండదు. ఇది ఒక శిక్ష, చదువు పేరుతో, నీ గొంతు కి పడే ఒక ఉరి. అయినా అందరం అదే పని, అతి మామూలు గా ,ఏమి ఆలోచన కూడా లేకుండా, గర్వం గా, పెద్ద, పెద్ద ,బడు ల లో పోటి పడి, పడేస్తున్నాం. 

 మన ప్రభుత్వాలు ఇందుకు సమ్మతిస్తున్నాయి. ప్రాధమిక  పాఠశాలలు  మూత బడుతున్నాయి  చిన్న, చిన్న గ్రామా లలో, నారాయణ, కేశవ అంటూ కార్పోరేట్  విష శక్తుల , బలమైన , పునాది లతో , ధన సంస్కారం తో విజృ ం భిస్తున్నాయి.  మార్కెట్ శక్తులు అంటూ, నమ్మిస్తున్నారు. ఆంగ్లం రాక పోతే మనుగడే లేదు అని భయ పెడుతున్నారు, మనం ఆ శక్తులకి ,ఇప్పటికే లొంగి ఉన్నాం.

కాల్ సెంటర్ ల ఉద్యోగ భద్రతే మనకు ముఖ్యం. మన వేమన చెప్పిన సూక్తులు, సుమతి చెప్పిన నీతులు, యోగులు చెప్పే మాటలు, కుటుంబ రావు గారు రాసిన చదువు, శ్రీ శ్రీ  ఎలుగెత్తిన మహా ప్రస్థానం, తిలక్ అందించిన వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అనే కవితలు, చలం పరచిన మైదానం, గోపీచంద్ అసమర్ధుని జీవ యాత్ర, ఆరు సారో కథలు, ఆరు సారా కథలు, పోసిన రావి శాస్త్రి గారు, మొదలు, ఇవాల్టి , రాజారం, మహేంద్ర, వంశీ,ఇలాంటి ఎందఱో కథల కబుర్లు వినేది ఎవరు? వినిపించేది ఎవరు? 

ఆంధ్ర భాష , గట్టి బైన్డు పుస్తకాల రూపం లో బీరువాల్లో బంధించ పడుతుంది. మాట్లాడుకుని, వాడుతూ, చదువుతూ, రాస్తూ ఉంటేనే కదా ఏ భాష అయినా వికసించేది. తలా పాపం తిలా పిడికెడు. 


కళ్ళు, చెవులు మూసుకుని , ఏమి పట్టని ప్రభుత్వం ఒక వేపు, మన భాష ని మనమే గౌరవించుకోని  ఆంధ్ర ప్రజానీకం వేరొక వేపు.  పారిస్ లో ఫ్రెంచ్ మాట్లాడు తారు, టోక్యో లో జపనీస్ మాట్లాడుతారు, చైనా లో చైనీసే మాట్లాడుతారు, ఆంధ్ర లో మటుకు  ఇంగ్లీష్ లో చదువు కుంటారు. మీకు అంటూ ఒక భాష ఏమి లేదా ? అని విడ్డూరం గా చూసారు, మేము గర్వం గా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే.


అవసరమే, ఆంగ్లం అవసరమే.. కాని, మన భాష ని తొక్కి పెట్టి, పర భాష ని నెత్తి కి ఎక్కించు కోవడమే, పరమ నీచం, బానిసత్వం.  మన పిల్లలు , ఇప్పటి వరకు, మాట్లాడుతున్నారు, కాని తరువాత తరం, ఏమి అవుతుంది? మనం నవ్వుకో డానికి, ఏడవడానికి, మనకి ఇంక ఏ భాష ఉంటుంది? మన సంగీతం, మన పాటలు, హరి కథలు, బుర్ర కథలు, తప్పేట్ గుళ్ళు, ఒక పురాతన తరం కి చెందినా ఒక సంస్కృతి గా మిగిలి పోతుంది. ఒక డెడ్ లాంగ్వేజ్. ఒక కప్పి పెట్టిన గని, ఒక మరచి పోయిన జ్ఞాపకం. ఒళ్ళు జలద రిస్తుంది. 


ఈ దుస్వప్నం నుంచి మెలకువ తెచ్చు కుని, ఒక సజీవ , సరాగాల, మధుర మైన , సుసంపన్న మైన, అమ్మ నోటి, కమ్మటి మాట ని ,నిత్యం వాడు కుంటూ, ఈ దినాలు, తద్దినాలు లేని రోజులు కోసం మనం ఏమి చెయ్యాలో    ఆలోచించాలి,  తప్పదు, అలోన్చించే సమయం ఇది, ఆచరించే సమయం ఇది.


తెలుగు మాట మనది.. అని గర్వం గా పాడుకునే సమయం ఇది.

.

15 ఫిబ్ర, 2010

ఉత్తరాల యుగం ముగిసినట్టేనా ???

 పోస్ట్ అన్న కేక తో సుభద్ర ఇంట్లోంచి బయటకి వచ్చింది. యీ వాక్యం తో, పేర్లు తేడాతో ఎన్ని కథలు ప్రారంభం అయి ఉంటాయి. మన రోజు జీవితం లో పోస్ట్ మాన్ కి ఎంత ప్రాముఖ్యం ఉండేది. పోస్ట్ మాన్ ఇంటికి రాని రోజు, ఒక  దుర్దినం. సూర్యుడు ఉదయించని దినం. బంధువుల క్షేమ సమాచారాలు, ప్రియ మిత్రుల కులాసా కబుర్లు,   సెలవుల్లో ఊరికి వెళ్ళిన మిత్రురాలి  పలకరింపులు, నాన్నగారు క్యాంపు నుంచి రాసే కుశలమా ,నేను కుశలమే అన్న రెండు ముక్కల కార్డు తెచ్చే ఆనందం, అన్నయ్య ఇంటర్వ్యూ బాగా జరిగిందని,  రాసి పడేసిన కార్డు, తమ్ముడు పుట్టాడని, తాత గారి ఇంటి నుంచి వచ్చే కార్డు, అత్తయ్య కి పెళ్లి కుదిరింది అని శుభం తెలిపే కార్డు,    ఏదో దుర్వార్త అని చింపి పడేసే కార్డు, పెళ్లి అయిన అక్కయ్య కు, బావ గారు వ్రాసే కవర్ లో పెట్టిన ఉత్తరం, ప్రేమ లేఖ అంటారు,  అక్కయ్య మిల మిల లాడే కళ్ళు ఆ కళ్ళు చెప్పే   కథలు, కబుర్లు, అన్నీ  ఇంకా నిన్నో, మొన్నో అన్నట్టు ఉన్నాయి నాకైతే.
బీరువా లో దాచుకున్న చిక్కని ప్రేమ లేఖలు, అవీ తెచ్చే అనర్ధాలు, పెళ్లి ఒక చోట, ప్రేమ ఒక  చోట అయిన కథల లో, హిందీ సంగం సినిమా లో, రాధ(వైజయంతి మాల)  దాచుకున్న ప్రేమ లేఖలు ఎంత తుఫాను సృష్తిస్తాయి. ఆఖరికి ప్రేమికుడు రాజేంద్ర కుమార్ ప్రాణం తీసుకున్నాయి.  
మన తెలుగు లో కూడా ప్రేమలేఖలు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లా డిలీట్ సదుపాయం లేదు కదా.. చింపడానికి చేతులు రావు కాబోలు.   రోజు లో పోస్ట్ మాన్ కోసం ఎదురు చూడడం ఒక పని. మనకి ప్రత్యేకం రాక పోయినా ,ఇంటికి రాగానే, పోస్ట్ వచ్చిందా అని అడగడం ఒక ఆనవాయితి.
ఎవరికీ పోస్ట్ వస్తే వాళ్ళు ఒక గొప్ప ఫీలింగ్ తో, వెలిగి పోవడం, మనకి రాలేదే పోస్ట్ అని మిగిలిన వారు, కుంగి పోవడం.. ఎంత చిన్న ఆనందాలు, ఎంత చిన్న సరదాలు, ఎంత చిన్న నిరాశలు. 'స్నైల్ ' అని చిన్న చూపు ఇప్పుడు యీ ఈమెయిలు సదుపాయం వచ్చాక. చలం ప్రేమలేఖలు, నెహ్రు గారు తన కూతురు ,ఇందిరా కు రాసిన ఉత్తరాలు, ఇంకా ఎంతో లేఖా సాహిత్యం వెలిసింది, యీ ఉత్తరాల కాలంలో, ఆఖరికి, తెలుగు, ఇంగ్లీష్, ఏ భాష పరీక్ష అయిన సరే, నూటికి నూరు మార్కులు తెచ్చే ప్రశ్న, లేఖ రాయండి.   సెలవుల్లో మీ ఊరి నుండి నీ స్నేహితుని కి ఒక లేఖ రాయి.. అన్న ప్రశ్న చదివి, ఎలా విజృంభించి  రాసే దాన్నో, ఉత్తరం.   పోస్ట్ మాన్ ఇప్పుడు తెచ్చే వి అన్నీ బిల్లులు, రసీదులు, చందా కట్టండి అనే నిస్తేజ, జీవం లేని ఉత్తరాల కట్ట.
ఎవరు అయినా మిస్ అవుతున్నారా , ఈ ఉత్తరాల కాలం ను. ఇప్పుడు ఇన్స్టంట్ మెయిల్ తో ఆ ఎదురు చూడడం, ఆ ఆశ, నిరాశ, ఆ ఉత్సాహం, ఆ ఉత్తరాలు, చక్కగా పెన్నుతో,  చక్కని పూలు, ఉన్న కాగితం మీద పెట్టడం, ఆ లేఖ ల కోసం, అందమైన లెటర్ పాడ్స్ కొనడం, tequila రంగు ఉన్న ఇంకు , సముద్రం నీలం రంగు తో  ఎంత మురిపం గా ఉండేదో, ఎవరికీ అయినా గుర్తు వస్తున్నాయా ఆ రోజులు??
ఇంకా పేజీలు, పేజీలు కథలే ఉత్తరాలు గా రాసి, మూడు, నాలుగు కవర్లు లో పెట్టి, సీరియల్ లాగా, 1 ,2 ,3 , అని పైన రాసి, పోస్ట్ చేయడం ,అవీ అందు కుని చదివే వాళ్ళ కి పిచ్చి ఎక్కించడం, ఇలా ఇన్ని ఒకే సారి రాస్తే ఎలా అమ్మయీ అని..తంటాలు పడడం.. ఈ రోజులు ఎంత మంది మిస్ అవుతున్నారు.
 చదివిన పుస్తకం, చూసిన సినిమా, కొత్త ఫ్రెండ్ తో కబుర్లు, కొత్త గా వచ్చిన టీచర్లు ,  వెళ్ళి పోయిన టీచేర్లు, పరీక్షల్లో మార్కులు, రాంకులు, అబ్బాయిలు, చూపులు, ఎన్నో, ఎన్నెన్నో, కాదేది లేఖ కి అర్హతి?  అన్నట్టు, మదిలో పుట్టే ప్రతి ఆలోచన, ఆవేశం ఒక లేఖ రూపం లో పెడితే గాని మనసు కుదుట పడేది కాదు.లేఖలే మనసు కి ఊతం ఇచ్చేవి, కష్ట
కాలం లో. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ తో ఊరట పడుతున్నట్టు. నాకు ఒక ఈమెయిలు అడ్రస్ ఉంది ఇప్పుడు. ఇరవై నాలుగు గంటలూ, ఆన్ చేసి ఉంచి కంప్యూటర్ ఇన్బొక్ష్ లో  టపా  కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పాత అలవాటు, పోస్ట్ !!! అని ఒక కేక కూడా పెడితే బాగుండును, ఈ మెయిల్ బాక్స్ లో .
ఉత్తరాల , లేఖల యుగం, మెయిల్ బాక్స్ యుగం లోకి మారింది. పోస్ట్ మాన్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు... ఇంగ్లాండ్ లో ,అమెరికా లో, పచ్చళ్ళు , అవీ కూడా పోస్ట్ చేయ వచ్చుట. అలాగే చేయాలి మన దేశం లో కూడా ఇంక.. అమ్మ పెట్టె పచ్చళ్ళు పోస్ట్ లో అందు కోవచ్చు. పోస్ట్ మాన్ మటుకు ఉండాల్సిందే.
పోస్ట్ అన్న కేక కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, ఇంకా అని నా నమ్మకం.మీరేమంటారు.
                                                  

14 ఫిబ్ర, 2010

ఎవరి దీ భూమి???

మేము చిన్నప్పుడు, చదువుకుంటూ,మాకు అంతా వచ్చినట్టు,ఒక పాప కి ట్యూషన్  చెప్పాము.ఒకసారి ,దోమలు మమ్మల్ని, కుట్టి చంపుతుంటే, టీచర్, దేముడు ఈ దోమలుని, పాముల్ని, తేల్లుని, ఇలాంటి వాటిని ఎందుకు తయారు చేసాడు? అని చాల అమాయకం గా అడిగింది.మాకు, నాకు, నాతో ఇంకో కసిన్ కి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ఇలాంటి ప్రశ్నలు సిలబస్ లో లేవు   అని చెప్పి.. తప్పించు కున్నాం.కొంచం పెద్ద వాళ్ళం అయాక, ఒక రోజు మన టీవీ లో ఒక ప్రోగ్రాం చూసాను. ఆ రోజే గుర్తు వచ్చింది ,ప్రశ్న .. చక్కగా ,అందం గా  ,రంగు రంగుల చీరలు కట్టి, చాల అందం గా తయారు అయిన ఉన్నారు, ముగ్గురు వనితలు. వారి ముందు టేబుల్ మీద రాక రకాల డబ్బాలు, సీసాలు ఉన్నాయి. ఒకరి తరువాత ఒకరు, వరస గా, ఆ డబ్బాలో ఉన్న రసాయనాలు ఉపయోగించి, చీమలు   ని, బొద్దింకలు  ని, బల్లులని, ఎలా చంపాలో వివరం గా చెపుతున్నారు. ఎంత అందం గా ఉన్నారో, ఇవేమీ బుద్ధులు అనుకున్నాను. పెస్ట్ కంట్రోల్ వాళ్ళు చేసే పని ఇదే కదా.. అనుకుని, నా అహింస సిద్ధాంతం పక్కన పెట్టాను. అందం గా తిరిగే   సీతాకోక చిలుకలు ని చూసి ఆనందిస్తాము. పక్షులని, పిట్టలని , చూస్తాం, ఎంత బాగున్నాయో అనుకుంటాం. పావురాలు ని చూస్తాం, శాంతి కపోతం అంటాం,మన ఇంట్లో గూడులు కట్టి రెట్టలు వేసి అందం పాడు చేస్తే, విసుక్కుని, గూడులు బయట పడేస్తాం. ఈ పావురాల గోల భరించ లేకే, ఇప్పుడు భవనాలు ని అద్దం తో కడుతున్నారు, బయట గోడలు. పావురాలని తరిమి వేయడానికి.. గాలి, వెలుతురు ,లేని భవనాలు కడుతున్నారు. పంటలు నాశనం చేస్తాయి అని, పిట్టలు ని వడి వేసి కొడతాం.మనం అడవి లని నాశనం చేసి, పంటలు వేస్తాం, చెట్టులు లేక బోసి పోయిన అడవి ల్లోంచి ఏనుగులు గుంపులు గా వచ్చి, పంటలని నాశనం చేస్తున్నాయి అని కేరేంట్   పెడతాం  చుట్టూ.     
అడవి ల చివర పల్లెలు  ఉంటాయి, extinct   అయిపోతున్నాయి  అని పులులకి  ఒక అభయ అరణ్యం అని పెడతాం. ఈ పల్లెల లో కోడి పెట్టలు, మేకలు మాయం అవుతాయి. పులులు ని మందు పెట్టి చంపేస్తారు. టీవీ లలో ,గగ్గోలు పెడతారు. పులులు ని రక్షించండి అని పెద్ద ,పెద్ద, ఆక్టర్స్,   క్రి కెటర్లు, మనకి బుద్ధులు చెపుతారు. ఇంకా సముద్రాలని వదలం. మాంసం   చాల రుచి గా ఉంటుందని పెద్ద,పెద్ద తిమింగలా లని వేటాడి, హర్పూన్ లతో, కసి గా చంపుతారు. వాటి నూనెలని     అమ్ముతారు. చాల డబ్బు చేసుకుంటారు. మనం తినడానికి, మనకి ఉపయోగ పడేవి, జంతువలని ఉండ నిస్తాం. మన దారి కి అడ్డు వచ్చేవాటిని, మొహమాటం లేకుండా, చంపి పడేస్తాం.

నేను ఒక్క రోజు, ఒక పిట్టనో, పావురాన్నో, పామునో, పులి నో, ఒక ఏనుగనో, ఒక తిమింగాలమో అయితే బాగుండును.

దేవుడా, నాకు అడ్డం గా ఈ మనిషి ని ఎందుకు పుట్టించావు అని అడగకుండా ఉంటానా???

11 ఫిబ్ర, 2010

కొత్త పరీక్షలు.

 నాకు పరీక్షలు అంటే చాల ఇష్థం అంటే అందరు నవ్వుతారు, పరీక్షలా?? ఇష్టమా?? మీరు ఎప్పుడూ అయినా జైంట్ వీల్ ,ఎక్కారా, పై  నుంచి కిందకి ఆ వీల్ దిగుతూంటే  ,కడుపు లో ఏదో గమ్మత్తు అయిన ఫీలింగ్ వస్తుంది. ఏదో ఖాలీ అయిపోయి, శరీరం అంత తేలి పోతున్నట్టు. నాకు అలాగా ఉంటుంది, పరీక్షలు రాసి, బయటకి వచ్చాక. బాగా, రాసిన, రాయక పోయిన, అది ఒక థ్రిల్, నాకు.  ఇంకా , పరీక్ష ఫలితాలు వస్తున్న రోజు, మరో థ్రిల్. చిన్నప్పట్టి ,రెండు జడల, బడి కి వెళ్ళే ,స్కూల్ పిల్లల మనస్తత్వం, నాలో ఇంకా పోలేదు అనుకుంటాను. జీవితం లో ఏవో కష్తాలు వస్తాయి కదా, అబ్బాయి చెయ్యి విరగడం, ఇంట్లో, నేను ఒక్కర్హ్తే ఉండడం, ఇంట్లో సమయానికి డబ్బులు లేక పోవడం, హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడం ,అప్పటి కప్పుడు, ATM లు లేని రోజు లు అవీ, ఆప్తులు మనకి ఇంకా లేరు అని తెలిసిన రోజులు, ఇలాగ, ఏవో వస్తాయి, జీవితం లో పరీక్షలు ఇలాగే ఉంటాయి, అనుకుని, ౩ Idiots లో ఆమిర్ ఖాన్ లాగ అల్ ఇస్ వెల్ బదులు  అన్నీ పరీక్షలే, అన్నీ  పరీక్షలే, నేను యీ పరీక్షలో ఓడిపోను, ముందు ఉంటాను , ఎప్పుడూ ఒడి పోను, ఎప్పుడూ ముందే ఉంటాను అని నాకు నేను భుజం తట్టుకుంటూ ,ముందుకే వెల్లతాను.


కాని, ఇప్పుడు, యీ కొత్త పరీక్షలు చూస్తుంటే, నాకు చాల అయోమయం గా ఉంది. మీ టూత్ పేస్టు యీ పరీక్ష  లో గెలుస్తుందా అని అందమైన అమ్మాయిలు, అరుస్తారు, మా అబ్బాయి ఓడిపోలేదు, టూత్ పేస్టు ఓడిపోయింది అంటున్నారు, ఇదేమి కొత్త పరీక్ష ??? ఇంకా మీ జుట్టు యీ పరీక్ష లో  గెలుస్తుందా అని మరో అరుపు. మనం వాడే షాంపూ కి ఒక పరీక్ష ట. ఇదేమి కొత్త పరీక్ష. ఏ షాంపూ అయితే నేమి ఊడి  పోయే జుట్టు కి అని, ఏదో కొంటాము. ఇప్పుడు ఆ షాంపూ కి కూడా పరీక్షేనుట. పిల్లల కి కంప్లన్ పడితేనే , పరీక్షల్లో పాస్ అవుతారు ట. బోర్నవీట   వాడితే నే ఫస్ట్ వస్తారు ట. క్లాసు లో. ఇంకా చేతులు శుభ్రం చేసు కోవడానికి ఎన్ని soap లో, వాటికి ఎన్ని పరీక్షలో, చిన్న ,చిన్న పిల్లలని ఇలాంటి ఎన్ని పిచ్చి పరీక్షల కు గురి చేస్తారు??? అని చాల బాధ, భయం. ఆవేదన కలుగు తాయి. తరగతి గది లో కూర్చుని, పాఠాలు, విని, చక్కగా ,ఆడుకుంటూ, పాడుకుంటూ, చదువు వుకుంటూ, సంవత్సరంకి      ఒక్క సారి పెద్ద పరీక్షలు రాసి, పెద్ద క్లాసు కి ప్రమోటే అవడం, మాకు ఇంతే తెలుసు, ఈ షాంపూ ,టూత్ పేస్టు  , సబ్బులు,  చంటి    పిల్లల లంగోటి  పరీక్షలు... ఇవి అన్నీ మనకి  అవసరమా ?? ?


ఇప్పటికే ఎంసెట్ అని, IIT అనీ పుట్టిన పిల్ల లకు క్లాస్సేస్ మొదలు పెడుతున్నారు. బాగా చదివే పిల్లలని ఒక గది లో విడి గా కూర్చో బెట్టి, వాళ్ళకి, ఇంతెన్సివె కోచింగ్ అని,  అర్ధ రాత్రి , దాటగానే, మూడు గంటలకి, క్లాస్సేస్ మొదలు పెట్టి, బుర్రల్ని వేపుకుని తింటూ, వాళ్ళ ఫలితాల గొప్ప కోసం, ఒక నిర్వీర్య, నిస్తేజ , మనసు లేని, కల్మష ,జాతి పిల్లలని తయారు చేస్తున్న ఈ కోచింగ్ సెంటర్ ల అఘాయిత్యం తప్పటం లేదు. ఇంకా ఎన్ని మనసు లేని, వ్యాపార పరీక్షలు కి మనలని బలి చేస్తారు?


ఈ అర్ధం లేని కొత్త పరీక్షలు మటుకు నేను రాయలేను, నేను ఒప్పుకోను, మీరు ఒద్దు అనండి. అప్పుడే మనం గెలిచేసం. పరీక్షలు ఒద్దు అనుకుని, మనం  గెలిచేం, రండి, చెయ్యి కలపండి.

7 ఫిబ్ర, 2010

ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ కుసుమములు???

ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ కుసుమములు??? అని నేను పాడుకుంటాను, అని ఎప్పుడూ కల కనలేదు.ఉదయం లేస్తూనే, ఇవాళ ఆదివారం కాక పోతే, పిల్లలని నిద్ర లేపడం, లంచ్ బాక్స్ లోకి టిఫిన్ లు చేయడం, బడి కి తరమడం, ఇల్లు సర్దు కోవడం, వంట వండు కోవడం, మళ్లీ, సాయంత్రం వంటకి తయారు కావడం, మధ్యలో, ఏవో చిన్న ,చిన్న పనులు, బ్యాంకు కి వెళ్లి, డబ్బు తెచ్చుకోవడం, అప్పుడు ATM లు లేవు లెండి, కూరలు కొనడం, సరుకులు తెచ్చు కోవడం, పిల్లల కోసం  స్తేషనోరీ షాపులకి వెళ్లి, పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బెర్లు,  ఇంకులు  తెచ్చి ఉంచడం ఇంట్లో,ఆ మధ్యలో, ఏదైనా ఒక మంచి పుస్తకం కన పడితే కొను క్కునే మురిసి పోవడం, దొరికిన టైం లో, పుస్తకం చదివి అమ్మయ్యా నేను ఇంకా ఒక అడుల్ట్ బుక్ చదివే స్థితి లో ఉన్నాను అని సంతో షించడం,బండెడు పుస్తకాలు మోసుకుని, వాడి పోయిన మొహాలతో ఇంటికి వస్తే, ఏవో టిఫిన్లు, పాలు ఇచ్చి, హోం వర్క్ పుస్తకాలు తీసి, నేను చెప్పగలనా లేదా అని ఆలోచిస్తూ, ఎప్పుడో చదివిన పాఠాలు గుర్తు తేచు కుంటూ, హోం వర్కులు చేయించడం, మళ్లీ భోజనాలు, పవర్ కట్ టైం కి , కరెంట్ పోవడం, నేను చదివిన ఇంగ్లీష్ నవల కథలు సీరియల్ లాగా, పిల్లలికి చెప్పడం, మధ్యలో, జలుబులు, జ్వరాలు, typhoidlu , డాక్టర్లు చుట్తో  తిరగడం, మధ్యలో, పరీక్షలు అని ఇంకో పెద్ద పరీక్ష నాకు, ప్రాజెక్ట్స్ కోసం నేను తిరిగి, తిరిగి , సాయం చేయడం...ఎప్పుడూ అవుతాయి, యీ బడులు, యీ పరీక్షలు, యీ పిల్లల పర్వం..అని  ఎన్ని సారులు అనుకున్నానో, ఎందుకు అనుకున్నానో?? తధాస్తు దేవతలు ఉంటారు మరి.
ఏవి ఆ పిల్లల సవ్వడులు? ఆ అరుపులు? ఆ పరుగులు? నాకు ఇప్పుడు చేతి నిండా ఖాలీ.. యీ టైం అంత నేను ఏమి చెయ్యాలి? వాళ్ళు, ఇంజినీరులు  , డాక్టరులు, పెద్ద వాళ్ళు అయిపోయి, అమ్మ ఇలా చేయి, అమ్మ ఇలా చేయొద్దు అని సలహాలు ఇస్తున్నారు.సింకు నిండా గిన్నెలు ఉంటే , వాటిని తోమడం ఒక్కటే ఇప్పుడు నేను చేస్తున్న productive పని.పిల్లలని ,తల తల తోమి, మెరిసేలా చేయడానికి, ఒక సగం జీవిత కాలం సరి పోయింది.ఇప్పుడు, ఏమి తోచక, పాతవన్నీ తవ్వి, పాతర వేసి, ఇలాగ చేయ వలసినది మనం అని ఒకటే బాధ పాడడం. ఇంట్లో కొంచం పోపు ఘాటులు ఎక్కువై, ఇదిగో యీ బ్లాగులు త ఏవో రాయి, అని, నాకు చెప్పడం, నేను ఇలా దేశం మీదకి బ్లాగులు వదలడం మొదలు అయింది.
అమ్మలూ మీరు చేస్తున్న యీ అమ్మ పనులు, ఇంకా బాగా ఆనందించండి. ఎన్నో రోజులు లేవు,పిల్లల  చదువులు అయిపోతే, మీరు ఎంత మిస్ అవుతారో యీ రోజులు..ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ కుసుమములు అని నా లాగే బాధ పాడుతారు.. ఎంజాయ్ యువర్ motherhood .. fully .ఎంజాయ్..every మొమెంట్.

6 ఫిబ్ర, 2010

నాగరికత రోడ్డులేనా???

నిన్న మేము యీ దేశం లో, ఒక నూట ఎనభై కిలో మీటర్లు దూరం ప్రయాణం చేసాం.. ఒక ఎడారి క్యాంపు లో పిక్నిక్ కి వెళ్ళాము. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఒకటే దృశ్యం.. వెడల్పు గా నాలుగు లైన్ల రోడ్డులు, నిరంతరం ప్రయాణించే కారులు. ఇంకో దృశ్యం మారదు. పాత సినిమాల్లో, కారు లో కూర్చుంటే, సీనేరి  మార్చే వారు..అలాగా అనిపించింది నాకు.
మన దేశం లో ఇలాంటి ప్రయాణం గుర్తు వచ్చాయి. ఇంట్లో నుంచి బయలు దేరితే మా ఏలూరు వరకు ,ఎంత నయనాంద కరమో, ఆ దృశ్యాలు, కారు లోంచి బయటకి చూస్తుంటే, పచ్చగా కళ కళ లాడుతూ ఎన్ని దృశ్యాలు చూస్తామో. గాజువాక దాటి, స్టీల్ ప్లాంట్ దాటి, అనకాపల్లి లోకి వస్తామా , మన అంత ఎత్తు పెరిగి, చెరకు తోటలు, తియ్యగా  నండూరి వారి ఎంకి-నాయుడు పాటలు ని గుర్తు తెస్తాయి. మధ్యలో, నిండు గర్భిణి  లాగ ఒంగిన అరటి మొక్కలు, పండంటి పండ్లు  గెల మోసుకుని, చెయ్యి ఊపుతాయి, పుల్లని మామిడి తోటలు, నోట్లో నీరు ఊరిస్తాయి, ఇంతలో ,ఓణీలు వేసుకునే నవ యవ్వని లాగ, శారద నది, ఒయ్యరాలు పోతుంది, ఆ బ్రిడ్జి దాటి, తమల పాకు వంటి తమ్ముడు నివ్వవే అని గొబ్బమ్మ పాటలు పాడుకునే అమ్మాయలని గుర్తు చేస్తూ, తుని  దాటుతాం.
ఇక్కడ   కావాలి   అంటే మంచి టిఫిన్లు తిన వచ్చు, ఇంతలోనే, ఎతైన కొండలు ఎక్కుతుంది రోడ్డు. రోడ్డు మలుపులు తిరుగు తూ , సత్యనారాయణ స్వామి ఊరు, అన్నవరం చేరుతుంది, మన లాంటి తొందర ప్రయాణి కులకు , క్రిందనే, ప్రసాదం కూడా అమ్ముతారు, ఎంత రుచిగా ఉంటుందో. ప్రసాదం భక్తులం కదా, చేతులు నాక్కుంటూ, దూరం నుంచే ఒక నమస్కారం పెడతాం, మళ్లీ వస్తాం   అని ఒక ప్రమాణం చేస్తూ, చాలా దూరం వరకు, కొండ మీద దేముడు మనకి ఆశీర్వ దిస్తూ కన బడ తాడు.ఎంత అందమైన నది తీరంలో ,కొండల మధ్య వెలిసాడో, యీ దేవుడు. ఇలా తలుచు కుంటూ, ప్రయాణం చేస్తూంటే, బుట్టల్లో జామ కాయలు నోరు ఊరిస్తూ కన పడతాయి. మంచి పచ్చని రంగు లో, సీతా  ఫలం పళ్ళు , అరటి పళ్ళు, అన్నీ కార్లు దగ్గరకు తీసుకుని వస్తారు. రాజమండ్రి వచ్చింది. గోదావరి తల్లి ప్రసాదం యీ పళ్ళు. ఊరులోకి వెళ్ళక్కర్లేదు, ప్రక్క నుంచి ఇంకో రోడ్డు ..టొబాకో  కంపెనీలు అవీ దాటు తూ. ధవళేస్వరం పక్క నుంచి, ఇంకా అలాగా వెళ్ళుతూ వుంటే, మల్లెల ఘుమ ఘుమలు, రోజా పువ్వుల గుబాళింపులు, గాలి అంతా  నిండి , కారుకి బ్రేకులు పడతాయి.కడియం వచ్చింది.. అని కారు కు కూడా తెలుసు, ఇక్కడ పువ్వులు కొనకుండా వెళ్ళితే, రాత్రి దుర్భరం అని కారు నడిపే   వానికి తెలుసు.  పొడవైన మల్లెల మాలలు పది రూపాయలు, ఇంకా బేరం ఆడితే ఇంకా తగ్గిస్తారు, కాని ఆ పూలు అమ్మే చిన్న,చిన్న   పిల్లలు ని చూస్తే , బేరం ఆడాలని  అనిపించదు. పూల దగ్గర బేరమా?? ఎంత  కఠిన హ్రిదయాలు.. నేను ఒక పూల మొక్క చెంత  నిలిచి అంటూ పుష్ప విలాపం పాడుకుంటూ, పరుగు పెడతాం  కా రులో. గోదావరి     రెండు పాయలు  ,వసిష్త,గౌతమీ లు కలసి, నిడదవోలు, తనుకు ,రావుల పాలెం పొలాల లో బంగారం పండిస్తాయి. కమ్మని పాట లాగ ,మాటలు, అయ్య అంటూ దీర్ఘం తీస్తూ  , సంగీతం విని పిస్తారు, యీ ప్రాంతం ప్రజలు, మోతుబరులు. మొక్కజొన్న పొత్తులు  కాల్చి, నిప్పుల మీద ఆ బ్రిడ్జి దగ్గర అమ్ముతారు, ఇంకా స్వచ్చ మైన నదీ తీరం లో, ఇసుక లో పండిన పుచ్చ కాయలు, పంచదార కన్నా తియ్యగా ఉంటాయి.ఇవి అన్నీ కొనిపించి, తాడేపల్లి గూడెం దాటి మా ఊరు చేరేసరికి, పొట్టలు నిండి పోతాయి. ఇంకా మనసు ని కూడా నింపుతుంది     ఏలూరు ఊరు, మా ఊరు.
నాలుగో,ఆరో, రోడ్డులు, కారులు ఉంటేనే  నాగరికత??? ఇలాంటి నదులు, గుడులు, పొలాలు పంటలు, పళ్ళు, ఫలాలు, పండించే మన భూమి, మన దేశం కి నాగరికత లేదా? నాలుగు లైనుల  రోడ్డులు మనకీ ఉన్నాయి. రండి, చూడండి. మా దేశం.. మా నాగరికత...అని యీ దేశం, ఆ దేశం లో ఉన్న వాళ్లకు..చెప్పాలి అనిపిస్తుంది. మీరు ఏమంటారు?  

4 ఫిబ్ర, 2010

ఇల్లు ,గూడు,నీడ, ఉనికి...

తలుపులు లాక్ చేసి ఉన్నాయి,నా హ్యాండ్ బాగ్ లో ఉండాల్సిన తాళాలు ,లేవు..ఏదో మతి మరపు తో, తాళాలు లోపలే మరచి పోయాను.ఏమి చెయ్యడం ఇప్పుడు? ఒక్క నిమిషం ,ఇల్లు లేని దేని లాగా ,హోమేలేస్స్ గా ఫీల్ అయ్యాను. మా ఇంటి ముందు ఉన్న,పెద్ద చెట్టు ఏదో నిన్నే సమూలం గా కొట్టి పడేసారు.కిచ కిచ మంటూ ,పొద్దున్నే లేచి ,మాకు కొంచం సుప్రభాతం లాగా ,మేలుకొలుపులు పలికే ,ఆ చిట్టి పక్షులు, సాయంత్రం ఇంటికి చేరేసరికి, దాని ఇల్లు లేదు, దానికీ తాళం లేదు, ఆ ఇంటికి ,ఇల్లే మాయం అయిపొయింది. మరి మన కారులు ,బస్సులు విశాలం గా పోవడానికి ,రోడ్డులు కావాలి కదా అంటున్నారు.ఆ పక్షులు ఏమి అయ్యయో?యీ భాష లో మనలని తిట్టుకున్నాయో, అసలు, మనమే కారణం అని తెలుసా ,ఆ పక్షులు కి.మనిషే ముఖ్యం, యీ భూమి మీద అని ఎవరు చెప్పారో? అవే కాదు, ఏదో నదిలో, అల్లరి, చిల్లరి గా ఒక గుంపుగా తిరిగే ఆ చాప పిల్లలు,అలవాటు గా తిరిగే ,నది జలాలు,ఒక్క రోజు ఒక గట్టు కట్టి,ఆనకట్ట అని, ఇంకా ఇదే , నీ ప్రపంచం, ఇంతే నీ నది, నీ ఉనికి ఇంతే అని చెప్పడ్డానికి మనం ఎవరు? ఒక చిన్న భూమి ని నమ్ముకుని, ఆరు గాలాలు, శ్రమించి, మనకి తిండి పెట్టి, తన పొట్ట పోషించుకునే ,రైతు ల దగ్గర భూమి లాగుకుని, ఇన్ని లక్షల డబ్బు,ఇచ్చి , ఇదే నీకు పరిహారం అని చేతిలో పెడితే, ఆ రైతు ఎలా బతుకుతాడు? ఇంకో పని రాదు కదా అతనికి? ఒక పట్టణం లో తెచ్చి అతన్ని పడేస్తే ఏ వృత్తి ని సాగిస్తాడు.. ఎలా బతుకు  తాడు? ఎవరు నిర్ణయించారు, అతని భూమి కన్నా, మన రోడ్డులు, పరిశ్రమలు, ఎక్కువని.ఒక జాలరి కుటుంబం, సముద్రం లో వేట కి వెళ్లి చేపలు పట్టి ,ఇంటిల్లిపాది అదే పని తో బతుకు తారు.వాళ్ళని పట్టుకు వచ్చి, ఒక పట్టణం లో పడేస్తారు, ఒక ఇల్లు ఇచ్చి. కొంత డబ్బు ఇచ్చి. ఎలా బతకాలి ఆ జాలరులు, సముద్రానికి దూరంగా?  ఎవరు నిర్ణయించారు, ఆ ఓడ రేవు ముఖ్యం ,యీ జాలర్లు కాదని. ఒక కొండ జాతి, అడవి తెగ వాడిని, తరుము తారు, ఒక concrete jungle లోకి, ఒక్క చింత చెట్టు ని నమ్ముకుని, ఇంటిల్లపాది బతికే ఆ కుటుంబం. ను రోడ్డు మీద పడేస్తారు. ఎవరు నిర్ణ ఇస్తున్నారు.. మనం ఎక్కడ, ఎలా బతకాలో, ఎవరు వీళ్ళు, ఏమిటా శక్తులు.. ఇవీ నా ఆలోచనలు  రెండు నిముషాలు నా ఇంటికి తాళం, నేను మర్చి పోయి, బయట నిలబడితే. అమ్మ ఇదిగో తాళం అని మాఅబ్బాయి ఇచ్చాడు.. ఇంకో తాళం. నేను తాళం తెరుచు కూని, నాకు ఇష్త మైన నా ఇంట్లోకి ప్రవేశించాను.
నేను, నా ఇల్లు, నా వాళ్ళు అంత క్షేమం.. ఇంకా లోకమ.. ఎవరో ఉన్నారులే.. తలుపులు గట్టిగా మూసుకున్నాయి.. నా ఇంటివే...

1 ఫిబ్ర, 2010

పాతిక కేజీల బరువు

పాతిక కేజీల బరువు .. అంతే .. ఒక దేశం నుంచి ఇంకో దేశం కి మనం మనతో పాటూ మోసుకుని వెళ్ళగలిగేది అంతేనుట. ఒకటి పెట్టడం, పది తీసేయడం, అయ్యో అనుకోవడం, బెంగ గా చూడడం ఆ వస్తువుల వంక. పసుపు కుంకుం, ఉసిరి కాయ పచ్చడి,మెత్తని బంగారం లాంటి బెల్లం, ఎర్రని కారం గుండ, అమ్మ చేసిన కంది గుండ, కొత్త చింత పండు, పిక్క తీసింది, బ్రూక్ బాండ్ కాఫీ పొడి,( ఫిల్టర్ లోకి ) మాగాయ పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, ఇంకా వేయించు కోవడానికి వడియాలు, అప్పడాలు, ఊర మిరపకాయలు,అన్నీ పెట్టె లో సర్ది, మళ్లీ, బయటకు తీసి, ఉసురు ఉసురు అనడం, ఇంకా ఊదా రంగు పట్టు చీర, గోధుమ రంగు నూలు చీర, ఇష్టం గా కుట్టించు కున్న కొన్ని చుడి దారులు, లోకెర్ లో పెట్టి, వెలుగు చూడని కొన్ని ఓల్డ్ మోడల్ నగలు, మళ్లీ ఇప్పుడు ఫ్యాషను ట, అవీ పెట్టడం, తీయడం.. అచ్చం బంగారు గాజుల్ల గా మెరిసే యీ రాళ్ల గాజులు ఎంత మోజు పడి కొన్నాను, వాటి మధ్యలో వేసుకోవడానికి మళ్లీ, పచ్చ గాజులు, ఎర్ర గాజులు, తెలుగు క్యాలెండరు, పండగలు అవీ చూసు కోవడానికి, మళ్లీ కొన్న ఒక వ్రతాల కథల పుస్తకం, (ఏమో ఏ నిముషం లో నాకు దేవుడి మీద బుద్ధి కుదిరి, పూజలు వ్రతాలు ,ఇక్కడ వాళ్ళ లాగ చేయడం మొదలు పెడతానో అని, ముందు చూపు గా)కువైట్ లో దేవుడు కోసం చిన్న వెండి కుందులు, ఎవరో ఇచ్చ్హిన డాన్స్ పళ్ళెం, దేవుడి ఫోటో, మందులు, మాకులు, ఇవి అన్నీ తప్పవు. బీరువా లోంచి తీసిన చీరల కట్ట, మళ్లీ అలాగా లోపల పెట్టడం, కలరా ఉండలు పడేయడం, రెండు చీరలు, రెండు డ్రెస్సులు పడేసరికి, గుండె ఝల్లు మంది, నా దిగులు అంత  యీ పెట్టె లో చేరి, ఇంత బరువు      గా ఉందా అని, ఒక పాతిక ఏళ్ళు, యీ ఇంట్లో, యీ ఊరులో గడిపి, ఇప్పుడు ఒక్క పాతిక కేజీల తో, ఎలా వెళ్ళడం, ఏది వదిలేయడం. అన్నీ ఇష్టం  గా నన్ను చూస్తున్నాయి, ఇంకా ఒక సంచి లో పడేసి, దారి లో పంటి కిందకి అన్నట్టు, నాలుగు పుస్తకాలు కూడా ఉంటాయి. అల్లుద్దిన్ మేజిక్  కార్పెట్ ఏదైనా ఉంటే బాగుండును. గంట గంట కూ, బెంగ పెరిగి  వంద కేజీలు  అయింది. టెన్షను తట్టుకోలేక, అవీ ,ఇవి తిని, నేను ఇంకో నాలుగు కేజీలు పెరిగాను. కువైట్ నుంచి ఇంకా లిస్టు పెరిగి పోతోంది, ఇంజనీరింగ్ పుస్తకాలు, వాళ్ళకి మందులు, వీళ్ళకి  మంచి ముత్యాలు, అనీ ,అంత కలపి మళ్లీ ఆ పాతిక కేజీలు ఉండాలి ట. బెంగతో మొహం పీక్కు పోయింది. ఎందుకమ్మా ఇన్ని చీరలు, అక్కడ బోలెడు ఉన్నాయి కదా అని అబ్బాయి సాధింపులు, కార్బోన్ జాడలు మనం తక్కువ  వదలాలి అమ్మా ! తక్కువ బరువు తో ప్రయాణం చేయాలి, అని, పాఠాలు, నాకు.. అమ్మకి.అందరికి నేనే దొరికానా?? అసలు నేను ప్రయాణం చేయను అని రాత్రి అనుకుని, మళ్లీ పొద్దున్నే లేచి, మళ్లీ పెట్టె సర్దడం,  ఎందుకు వచ్చిన బాధ, ఎవరి ఊరులో, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండ వచ్చు కదా అని మనసులో అనుకోవడం, మళ్లీ ఇంత జీతాలు    ఎవరు    ఇస్తారు  ,  అనుకుని మనసు కి సర్ది చెప్పు కోవడం, ఇంట్లో ని ప్రతి మూల నుంచి, ఏదో కని పిస్తుంది, ఇది అక్కడ ఉండాలి, అని పిస్తుంది, మనసుని రెండు ముక్కలు గా చేసి, ఒక ముక్క అక్కడ వదిలి, ఇక్కడ కి ఇంకో ముక్క ని గట్టిగ పట్టుకుని, కువైట్ లో ఉన్నా సహచరుని వద్దకు, చివరి ఆఖరకి, బిజినెస్ క్లాసు కి మార్పించుకుని, ఒక నలభై కేజీల బరువు తో క్షేమంగా చేరాను.
ఇంకా పెరిగిన నా నాలుగు కేజీల బరువు ఎలా తగ్గుతానో???