"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 మార్చి, 2010

వికృత నామ ఉగాది శుభాకాంక్షలు.

వికృతి నామ సంవత్సరం ట.. అంత వికృతం గా ఉంటుందా అని కంగారు పడుతున్నారు, కొంతమంది. మనం ప్రకృతి కి ఎంత దూరం గా జరిగి పోయమో గుర్తు చేయడానికే వచ్చిందేమో, ఈ ఉగాది. పచ్చని చెట్లు కొట్టేస్తాం, చిక్కని అడవుల్లో, రోడ్డులు వేసి, అటవీ సంపద అని కొల్ల గొడతం, అటవీ పుత్రులని తరిమి తరిమి, పట్టణాల్లోకి పంపిస్తాం, పులులు కనిపిస్తే, చర్మం కోసం ,గోళ్ళు కోసం, షూట్ చేస్తాం, నదులని ఎండ కడతాం, ఎడ పెడ ఆనకట్టలు కడతాం, ఇంక వర్షాలు పడవు అంటే, ఏమి చేస్తాం, హెలికాప్టర్లు పిలిపించి, కృత్రిమ వర్షాలు కురి పించ డానికి కోట్లు ఖర్చు పెడతాం  ..
పచ్చని పర్యావరణం, పులకించి, కోయిల లు మామిడి చెట్లు మీద దాక్కుని కు కుహు కుహు అని, ఆమనీ సంకేతాలు పాటల్లో వినిపిస్తూ, నదులు గల గల మని నిత్య నృత్యాలు చేస్తూ, నిర్మలం గా సాగరం లో కలయిక కోసం పరుగులు తీస్తూ, ఆరు రుతువులు, ప్రకృతి అతిథులు గా మనలని పలకరిస్తూ, పాడి పంటలు తో ,సుభిక్షం గా  మన ప్రజలు, సుఖ సంతోషాలతో అలరారే రోజులు అన్నీ, మనమే మన వికృత చేష్తలతో ,చేతులారా నాశనం చేసుకున్నాం, చేసుకుంటున్నాం  .. . 
ఈ రోజూ మనకి గడిస్తే చాలు, ముందు ముందు ఎంత నష్టం కలుగు తుందో, మన చేష్తలతో అని ఆలోచించం. మన పిల్లలకి ఇంత డబ్బు మూటలు సంపాదించి  ఇస్తే చాలు, అనుకుంటాం. పచ్చని ఒక చెట్టు నాటమని చెపితే, ఆ నెలలో ఒక చిన్న మేడ లేపితే అద్దెలు కి ఇవ్వొచ్చు , నెలకి ఇంత ఆదాయం అని లెక్కలు వేస్తాం, ఇంత ఊపిరి పోస్తాయి చెట్లు, అని ఎలా ఒప్పించడం? ఊపిరి ఉంటేనే కదా మేడలు, మిద్దెలు అనుభవించడానికి. అన్నీ డబ్బు తో కొనుక్కుంటాం అని ఒక వెర్రి ఊహ, ప్రాణం కి అవసర మయ్యే గాలి కూడా సీసాల్లో అమ్ముతారేమో, ముందు ముందు. ఇప్పటికే, దాహం కి నీళ్ళు ప్లాస్టిక్ సీసాల్లో కొనుక్కుని, నీళ్ళు తాగి, ప్లాస్టిక్ ని, వ్యర్ధం గా, భూమి కి కానుక గా ఇస్తున్నాం.. ఎంత స్వార్ధ మానవులం మనం?
మనకి, ఆకలి ని తీర్చే భూమి అంటే ఎంత నిర్లక్షం.. ప్లాస్టిక్, భూమి కి గొంతు లో అడ్డం పడే ప్రానంతక వ్యర్ధం అని తెలిసి పదే పదే అదే పని చేస్తున్నాం. రసాయనాలు తో, పంటలు పండిస్తున్నాం, అట్టడుగు వరకు, గొట్టాలు వేసి, మనకి కావాల్సిన జలం అంత పిన్దేస్తున్నాం, వట్టి పోతున్న భూమి, వర్షాలు లేక, ప్రాణ జలం కరువై, కోపంతో మండి పడి, భూకంపాలు తో మనకి జవాబు ఇస్తోంది. ప్రకృతి ఇచ్చే సంకేతాలు అందు కునే ,సున్నితత్వం మనలో ఎక్కడా లేదు ఇప్పుడు.
పురుషుడే అధిపతి, పురుషుడే గొప్ప, పురుషుడే ముఖ్యం, అంటూ మిడిసి పడి, ప్రకృతి -పురుషుడు ద్వందత్వం లో నుంచి, బలవంతం గా విడి పడి, ఎంత కాలం మనగలం మనం? వికృతి నామ సంవత్సరం, మళ్లీ ప్రకృతి ని స్మరించు కోవాలి, ప్రకృతి కి తల ఒంచాలి, ప్రకృతి చేయి విడిస్తే, ప్రకృతి సాహచర్యం విడిచి, అడుగు వేస్తే, మనకి మిగిలే నరకం ,భూమి మీద ప్రాణ శక్తులు అంతరించే ఆ ఆత్మ హత్య సదృశం అయే రోజులు ని గుర్తు చేయడానికి, ఒక హెచ్చరిక గా వచ్చిందేమో ఈ వికృత నామ ఉగాది.
ఉదయం లేవగానే, మనం అడుగులు వేసే ,వేయ నిస్తున్న ఈ భూదేవి కి  శిరసు వంచి, నమస్కారం చేసి, ప్రాణ శక్తి నిచ్చే ఆ సూర్య శక్తి కి ,చేతులు ఎత్తి మరో నమస్కారం చేస్తూ, రోజూ ని ప్రారంభించాలి అని మన పెద్దలు చెప్పారు. మనకి దాహం తీర్చే జలా న్ని అంతే గఉరవం తో, మితం గా వాడుకుంటూ, అను క్షణం, మనలో భాగ మైన ప్రకృతి శక్తులకి అనురక్తి గా మసులు కుంటూ, ఒక బాధ్యత తో కూడిన జీవితం, ఒక అపురూప వరం గా మసలాలి, మనం.
మా మాస్టారు గారు చెప్పారు ఒకసారి, వినాయక చవితి వ్రతం నాడు, మనం చదివే పత్రం ల పేర్లు కల వృక్షాలు అన్నీ ,మన చుట్టూ  ఉంటే, మనం పర్య వరణ సమతుల్యం పాటిస్తూ, మన మనుగడ ని పరిరక్షించు కున్తున్నాం అని అర్ధం. ఇప్పుడు ఏవో గడ్డి, గన్నేరు, నాలుగు మామిడి   ఆకులతో పని కానిస్తున్నాం. మన పిల్లల కు, నాకూ కూడా, ఆ పత్రాల చెట్లు ఎలా ఉంటాయో  తెలియదు. ఇంటి చుట్టూ మట్టి, దాంట్లో మొక్కలు పెంచే రోజులు పోయి, శుబ్రం  కోసం సిమెంట్ గట్టు, చిన్న చిన్న గోలేల్లో, ఇంటి మొక్కలు పెంచే రోజులు వచ్చాయి. చుట్టూ  మట్టి ఉంటే, వర్షం నీరు భూమి లోకి ఇంకి, మనకి మేలు, మనకి తీసు కోవడమే కాని, ఇవ్వడం తెలీదు, మనకి ఒక అవకాసం ఇచ్చింది, ఈ వికృత నామ ఉగాది.
మేలుకున్టామో, మన గొయ్యి మనమే తవ్వుకుంటూ, వినాశనం వేపు అడుగులు వేస్తూ , ఇదే స్వర్గం అనే మిధ్య లో కలి యుగాంతం కి పునాదులు తవ్వుతామో, అంతా మన చేతిలోనే, అంత నీ మెలకువ లోనే, నీ ఆచరణ లోనే..
వికృత నామ ఉగాది, ఇదే నా స్వాగతం, పచ్చని భూమి కోసం ఇదే నేమో యుగాది.



















14 మార్చి, 2010

చిన్నప్పట్టి తుఫాన్లు...

బాల్యం అంతా బంగారు అందరికి ,  మాకూ అంతే. చీకు, చింత లేని బాల్యం అంటే ఎవరికి మురిపెం గా ఉండదు? అందులో, ఈ తుఫాను రోజుల గురించి ప్రత్యేకం చెప్పాల్సిందే. 
పొద్దున్న లేచినప్పట్నించి దట్టం గా మబ్బులు పట్టిన ఆకాశం, ఏనుగుల గుంపు వెళుతున్నట్టు  నల్లని ఆకాశం, అయినా బడి కి వెళ్ళడం లో ఆనందం, చల్లని గాలులు వీస్తూంటే, క్లాసు రూం లో చీకట్లు కమ్మి, టీచర్  కి బోర్డు కనిపించక, ఏం పాఠాలు చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక, ఏవో కథలు చెపుతూ, బెల్ ఎప్పుడూ కొడతారా అని ఎదురు చూడ్డం,మేము ఈ లోపల, గల గల మని కబుర్లు పోగేయడం, సైలెంట్ అని అయిష్టం గా అప్పుడప్పుడు అరుస్తూ, ఇంతలోనే, భోరున కుంభ వృష్టి మొదలు, మాకూ ఎక్కడ లేని ఆనందం, ఆకాశం లో మెరుపులు మా మొహాల్లో నే విలసిల్లేవి , కబుర్ల, కేకల ఉరుములు క్లాసు రూం లో ,ఇంత లోనే ఎదురు చూస్తున్నసర్కులర్ వచ్చేసింది, వర్షం తుఫాను గా మారుతుంది అని వాతావరణ సూచన లో చెప్పారుట, స్కూల్ కి సెలవు ప్రకటించారు. బెల్ కూడా మొగక ముందే, పొలోమని అందరం పరుగులు, ఆ వర్షం లో ఎలా వెళతాం ఇంటికి, అన్నాలోచన స్కూల్ వాళ్లకి ఉండేది కాదు ఏమిటో?  ఫోన్లు, సెల్ ఫోన్లు లేని కాలం అది. అందరం, పుస్తకాల సంచి ని జాగ్రత్తగా , గుండెలు కి హత్తుకుని దాచుకుంటూ, మెల్లగా, పూల వాన లో నడుస్తున్నట్టు, కబుర్లు చెప్పుకుంటూ,హాయిగా వర్షం లో తడుచు కుంటూ, ఇంటికి చేరడం. పూర్తిగా తడిసి పోయిన ఆ స్కూల్ డ్రెస్ ఒక మూల విడిచి,పొడి బట్టలు కట్టుకుంటే కలిగిన ఆ వెచ్చని , భద్రత స్పర్స ఎప్పటికి మరిచి పోలేను. 
దారిలో మేము చూసిన గాలి విసురు, ఊగిపోతున్న చెట్లు, రోడ్లు ఎలా మునిగి పోయాయో, అన్నీ అమ్మకి కథలు, కథలు గా చెప్తూంటే, అమ్మ పట్టె మంచం కింద  బొగ్గులు నిప్పు చిన్న కుంపటి లో పెట్టేది, జలుబు  చేస్తుంది, ఇంతలా తడిసి ముద్ద అవాలా ఎక్కడో ఆగొచ్చు కదా అని సుద్దులు చెపుతూ, వేడి వేడి  కాఫీ కప్పు  చేతికి అందించి సేద తీర్చేది అమ్మ. ఇలాగ నేను ఒక్కర్తిని కాదు, ఇంకా అయిదుగురం మేము. 
ఇంక మొదలు ఇంట్లో నే ఆటలు, చీకట్లో  దుప్పటి కప్పుకుని దాక్కోడం ,చీకటి గది ఆట, దొంగాటలు, ఇంకా ఏవేవో ఆటలు, ఇల్లంతా చిందర వందర చేసే ఆటలు.కరెంట్  ఉండదు, కొవ్వుత్తులు, కేరోసేనే లాంతరు వెలిగించి, ఇల్లంతా ఏదో దీపావళి పండుగ వచ్చినట్టు, ఒకటే సంబరం. చీకట్లో ,వండ డానికి అమ్మ ఏం కష్టపదేదో, ఏమిటో అమ్మా ఆకలి అంటే, పకోడీలు, ప్రత్యక్షం. మళ్లీ ఆటలు, చీకట్లో ఏం వండుతాను అని రెండు కేజీల అన్నం వార్చి, అందరికి  కలిపి, కంది గుండ అన్నం కలిపి చేతిలో పెట్టడం, మేము గుటుకు గుటుకు మని మింగేసి, మళ్లీ చెయ్యి చాచడం. మజ్జిగ  అన్నం కూడా అలాగే, జుర్రుకుని తినేసి, ఇంక పక్కలు పరచుకుని, నేలమీదే ఒకరి పక్క ఒకరు, ఏవేవో కబుర్లు చెప్పుకుని పడుకోవడం, మధ్యలో చిరు జల్లు కొట్టేది, పక్కలమీదకు గిలిగింతలు పెట్టే ఆ వర్షం జల్లు కి కిల కిల నవ్వుకోవడం...అవే కదా తీయని, బంగారు గుర్తులు అంటే..
రెండో  రోజూ కూడా ముసురు పట్టి ఉంటే, ఇంక కష్టాలు మొదలు, తడిసి పోయిన స్కూల్ బట్టలు ఒక పక్క, రాత్రి వర్షానికి ఓ మూల తడిసిన దుప్పట్లు , కూరా  నార లేదు, ఏం వండడం అని అమ్మ ఆలోచన, ఇవాళ కూడా స్కూల్ లేదు, ఎలా కాలక్షేపం అని బెంగ మాకూ, రెండో రోజూ మా ఆటలు, పిడి గుద్దులు, కీచు లాటలు, అమ్మా చూడు అని, ఒకరి మీద ఒకరు చాడీలు, ఆడపిల్లలు అంతా ఒక గ్రూపు గా మగ పిల్లలు ఒక గ్రూపు గా కొట్టుకోవడం ఒక ఆట, తలగడ లు పెట్టి యుద్ధం చేసు కోవడం, ఇంక ఆగని వర్షం లో, పిల్ల కాలువలు ప్రవహించేవి  రోడ్డు మీద, పుస్త కాల లో నుంచి, కాగితాలు చింపి నిర్ధాక్షిణ్యం గా ,జంట పడవలు, కత్తి పడవలు, మామూలు పడవలు చేసి, నీటి లో వదలడం, ఎంత దూరం వెళతాయో అని, వాటి వెనకాల పరుగులు తీయడం, మళ్లీ తడుస్తున్నారా అని అమ్మ అరుపులు, ఒక చెవి లో విని ఇంకో చెవిలో నుంచి వదిలేసి, మాకూ ఆట విడుపు కదా.. అమ్మకి ఎప్పుడు  ముసురు విడుస్తుందా, ఎప్పుడూ, ఈ పిల్ల రాక్షసలు బడి కి వెళతారా అని ఆరాటం, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేనేమో. ఆకాశవాణి లో వచ్చే వార్తలే ప్రపంచం తో సంబంధం నిలిపేవి, నాన్న గారు వార్తలు విని, రేపటికి తీరం దాటు తుంది ట అని అంటే, అయితే మాకు స్కూల్ ఉంటుందా రేపు అని కోరస్ గా అడిగే వాళ్ళం. ఆ తుఫాను ఏమో గాని, ఇంట్లో మీ తుఫాను ఎప్పుడు దాటుతుందో  తీరం అనే వారు. ఇంట్లో ఆరుగురు పిల్లలతో, ఎలా పెంచారో, మా తల్లి తండ్రులు అంత ఓపికగా?? ఇప్పుడు ఉన్న సౌకర్యాలు లేవు, ఫోన్లు లేవు, టీవీ లేదు, ఫ్రిడ్జే లేదు ,  అందరు కలిసి హాయిగా ఉన్నంతలో సంతోషం గా గడిపేం.
తుఫాన్లు కూడా ఇంత ఆనందం ని ఇస్తాయి అని మా చిన్నప్పుడే తెల్సింది. 
ఇప్పుడు అనుక్షణం టీవీ లో వార్తలు వింటూ, మన పిల్లలు ఏమి మిస్ అవుతున్నారో, వారికే తెలియదు. ఈ టెక్నాలజి అంతా మనషులని ,మనసులని దూరం చేసిందా?? అనిపిస్తున్నది ఇప్పుడు. చిన్నప్పట్టి తుఫాన్లు కథలు ఇంకా చాల ఉన్నాయి.. ఉంటాయి, మరో సారి...

13 మార్చి, 2010

ఆ రోజూ పుట్టారుట వీళ్ళు.. మార్చ్ ఎనిమిది న

ఆ రోజూ పుట్టారుట వీళ్ళు.. మార్చ్ ఎనిమిది న ..
ఉత్తర భారత  దేశం లో, ఒక ఇంట్లో కేరే మంటూ ఏడిచింది, ఓ శిశువు. అందరి మొహం లో ఒక బాధ, ఒక సంతోషం. ఆడపిల్ల కి పెళ్లి చేయాలని ఒక బాధ, బిందెల తో మంచి నీళ్ళు మోయడానికి మరో రెండు చేతులు దొరికాయని, ఒక సంతోషం. ఇంకో రాష్ట్రం లో మరో పుట్టుక, ఇంకో నోరు భోజనం కి, ఆడ పిల్లే కదా, కొంచం ఆకలి తక్కువే, నాకూ చేయి సాయం అని, ఇంకో తల్లి, ఆలోచన, అడవి ఒడ్డున ఊరు లో ఒక కూతురు , పుట్టింది, పేడ,కట్టెలు ,తెచ్చే మరో రెండు చిట్టి చేతులు, పుట్టాయి.
ఒక మధ్య తరగతి , ఇంట్లో, అమ్మ కుళ్ళి, కుళ్ళి, ఏడుస్తోంది, లక్ష్మి పుట్టింది అనుకునే ఇంటి నించి వచ్చింది, కాని ఈ ఇంట్లో అత్తగారు, కొడుకే కావాలని, ముందే బెదిరించింది, ఇంక ఈ కూతురు బతుకు ఎలా ఉంటుందో? ఈ ఇంట్లో, అని బెంగ గా దిక్కులు చూస్తోంది. స్వాతంత్రం వచ్చింది దేశానికీ గాని, ఆడదాని  కి కాదు కదా? అనుకుంటూ ..
కూరలు అమ్మే నూకాలమ్మ కి, ఒక కూతురు, బుట్ట మోసే మరో చిన్న తల,పుట్టింది ఈ రోజే. రోడ్డులు ఊడ్చే  చిన్నదాని కి  చీపురు పట్టే మరో చిన్న సాయం, పుట్టింది ట.. ఈ రోజే. అంట్లు తోమే పనిమనిషి కీ పుట్టింది ఒక చిన్న పాప. పదేళ్ళకే నాకు అంది వస్తుంది, ఇంకో అమ్మగారి ఇంట్లో పెడతాను, అని మురిసి పోయింది. 
ఆ అమ్మగారికి ఒక ముద్దులు మూట గట్టే బుజ్జి పాప పుట్టింది. మూడో నెల కే, ఈ పాప ని ఎక్కడో ,ఎవరో చేతుల్లో వదిలి పెట్టి వెళ్ళాలి, ఈ పాప ని చక్కని చదువులు చదివించాలంటే, నేను కూడా ఉద్యోగం చేయక తప్పదు, పాప ని మూడో నెల నుంచి, క్రేచే లో వేయక తప్పదు, నా పాప పెరిగి పెద్ద అయి, తను అయినా మాతృత్వం పూర్తిగా అనుభవించే రోజూ వస్తుందా?? అని పొంగే గుండెలు తో అలమటించింది. పక్కనే ఇంకో ఇంట్లో రెండో సారి పాప పుట్టింది, ఇంక మన వంశం ఎలా నిలుస్తుంది? అని వాపోతున్నాడు ఒక తండ్రి. లక్ష్మి, సరస్వతి అని ముద్దులు పెడుతోంది, తల్లి, రహస్యంగా.. 
ఒక చక్కని , పెద్ద వారి ఇంట్లో, అపురూపం గా ,ఒక పాప పుట్టింది, చక్కని నా పాప ని డాక్టర్ ని చేస్తాను అని మురిసి పోతున్నారు, ఇద్దరు, చదువుకుని, చక్కగా , ఆస్థి, అంతస్తు ఉన్న కుటుంబం అది మరి.
ఒక రాజకీయ ప్రముఖుని ఇంట్లో ఒక పాప పుట్టింది ఈ రోజే.. హమ్మయ్య, మన రాజకీయ వారసత్వం కి ధోకా లేదు అని మురిసి పోయాడు, పెద్ద ఎత్తున సంబరాలు మారు మోగాయి.. ఆ ఇంట్లో. .
అవును మరి, ఈ రోజే మహిళా రేసేర్వషన్ బిల్లు పాస్ అయింది, రాజ్య సభ లో. ఏ రాయి అయితేనేమీ తల కొట్టడానికి, ఇప్పుడు, పేరున్న రాజకీయ మహిళా ఎంపీలు, ఎమేల్లెలు లు ఉంటారు మరి. వందల కోట్లు డబ్బు, పరపతి ఉంటేనే మరి ఎలెక్షన్లు గెలిచేది, అని మనం చూస్తున్నాం కదా? అట్టడుగున , పేద వర్గాలు, తిండి, నీడ చదువు లాంటి కనీస అవసరాలు కోసం చేసే ప్రయత్నం లో మునిగి ఉన్నారు, వారిని జేజేలు కొట్టండి, మహిళా బిల్లు జారి  అయింది అంటే, ఉండండి, ఉండండి, మా చేతులు ఖాళీ అవనీయండి.. అంటున్నారు.


ఇది మన దేశం లో పరిస్థితి, అయితే, ఇది ఒక అడుగు, ముందుకు, రాజకీయ అధికారం మహిళలని ముందుకి నడిపిస్తుందా ? అలా నడిపించడానికి, ఏ శక్తులు ఏకం అవ్వాలి.. అని ఆలోచించడం మొదలు పెడితే, తెరిచిన తలుపులు ని ఇక ఆపడం ఎవరి వల్ల కాదు, స్త్రీ శక్తీ ని తక్కువగా అంచనా   వేయకండి.. ఈ బిల్లు కి ముందు పాస్ అయిన అందరికి కంపుల్సరి చదువు ఆక్ట్ , పన్నెండు లోపల పిల్లలకి చదువు అనేది, సఫలం అవుతే, ఈ మహిళా రాజకీయ  సాధికారత  బిల్లు మరింత అర్ధవంతం అవుతుంది. 
దేశమే నా ఇల్లు అనుకుని చక్క బెట్టేందుకు, ఇల్లాళ్ళు నడుం బిగిస్తే.. ఉందేలే మంచి కాలం ముందు ముందునా..అందరు సుఖ  పడాలి నంద నందనా...అని పాడుకుందాం, ఇప్పటికీ.

11 మార్చి, 2010

పైన్ ఆపిల్ కేకు రెసిపి ....

లెక్క పత్రం లేకుండా ఖర్చు చేస్తున్నాము , అని, ఈ నెల నుంచి ప్రతి దీనర్ లెక్క రాద్దామని, నిశ్చయించు కున్నాం. సరే అని, పాత డైరీ తీసాను, పైన్ ఆపిల్ కేకు వండే విధానం,  చోకోలేట్ కేకు , ఇంకా ఏవో రెసిపీలు దొరికాయి. ఎప్పుడో ఎవరో, ఇంట్లో అప్ అండ్ డౌన్ పైన్ ఆపిల్ కేకు ట తిన్నాం. తిని ,బాగుంది ,అనుకుని, ఇంటికి వచ్చి, ఇంక ఎక్కడేక్కడో వెతికి , సంపాందించి రాసుకున్నాను. ఈ కేకు చేసే విధానం. ఎప్పుడైనా చేసానా? ఇంత వరకు లేదు. ఫ్రిడ్జ్ లో   ఎప్పుడూ ఉండే,  వనిల్ల ఎస్సెంస్ , మోజిరల్ల చీస్ , డార్క్ చాక్లోట్  బ్రిక్,  మష్ రూమ్స్ , ఇలాంటివి, అలంకార ప్రాయం గా ఉండి  ఎప్పుడూ సఖ్యం గా ఉండే మా మధ్య పేచీలు పెడతాయి. ఇవన్ని ఎందుకు కొంటావు? ఎప్పుడూ చేస్తావు? అంటే కళ్ళల్లో నీరు, తో, అంటే నేను ఏమి చెయ్యనా? ఎప్పుడూ ఏమి వండలేదా? అని పెద్ద సీన్ అయిపోతుంది. పాడయి పోయినవి పడేయి, అంటే సరే అని, మళ్లీ కొత్త గా కొని   పెట్టడం, ఏమో, యే క్షణం లో నాకు అనిపిస్తుందో, ఈ  కేకు వండాలని. ఇలాగ నాలుగు డైరీలు తీసి చూసాను, అన్నిట్లోనూ, ఇవే. పత్రికల్లో, టీవీ లలో,  నెట్ లో, అన్నీ రకాలు గా కల్లెక్ట్ చేసినవి.
ఇవి కాక, ఫ్రిడ్జ్  తలుపు కి మాగ్నెట్ తో అంటించి పెట్టుకున్న రోజు వారి రెసిపీలు, అంటే వంకాయ కూర, బెండ కాయ పులుసు, దోసెలు, పచ్చడ్లు, ఇలాంటివి. ఇవి అన్నీ చదివి, ఆవాలు లేవనో, జీలకర్ర లేదు అనో, నాకు చిన్నపట్నించి తెలిసిన పద్ధతి లోనే వండి పడేయడం. సేఫ్ గా తిన వచ్చు కదా అని. ఎందుకో మరి ఇలా అన్నీ  రాసి పెట్టుకోవడం? అది ఒక వ్యసనం లాగ  అయిపోయింది.  ఎప్పటి కప్పుడు నెట్ లో, అన్నీ దొరుకుతాయి కదా, మళ్లీ రాసుకోవడం ఎందుకు అంటే, ఏమో ఆ టైం లో కరెంట్  ఉండక పోతే, నెట్ డౌన్ అయి, కనెక్ట్       అవక పోతే,  ఎంత ముందు ఆలోచనో???  నా భుజం నేనే తట్టు కోవాలి.
ఇవి కాక, ఎప్పుడూ పుస్తకాల షాప్ కి వెళ్ళినా, రెండు నవలలు కొంటే ఒక రెసిపి  పుస్తకం కొనడం ఒక అలవాటు అయిపొయింది, మైక్రో వేవ్  లో వండించే పుస్తకం,  ౩౦ నిముషాలలో వండించే ఇంకో పుస్తకం,  పచ్చడ్లు, పులుసులు కి ఒక పుస్తకం,   బి పీ , షుగరు   ఇట్టే తగ్గించే ఇంకో రకం వంటలు, మన చిన్నపట్నించి అలవాటు అయిన మాలతీ చందూర్ గారి, వంటలు- పిండి వంటలు,  లేటెస్ట్ ఎడిషను,  అందు లోనించే కదా ,నేను అన్నం ఎలా వండాలో, ముద్ద పప్పు ఎలా వండాలో నేర్చు కున్నాను, పెళ్లి అయినా కొత్త లో, ఇంకా రాజు గారి, ఉప్పు, రుచి లేని  వంటల పుస్తకం,  నేను ఎప్పుడూ అది , దాచే స్తూ ఉంటాను,  కాని ,అదే ముందు కని పిస్తుంది,  ఏ  పుస్తకం కోసం వెతికినా. ఉప్పు, కారం వేస్తేనే , ఒక మాదిరి మన వంటలు,  ఉప్పు లేక పోతే  , మన వంటలు పేరు పోదూ? నేను అసలు ఉప్పు లేని కూర నోట్లో పెట్టుకోలేను. అందుకే ఆ పుస్తకం దాచేయడం.
ఉప్పు లేని కూరలు తింటే ఒక  గుప్పెడు అన్నం తక్కువ తింటామని ,ఇంట్లో వాళ్ళ ఆశ. కాని, మనం అలా  పడిపోం. ఇప్పుడి ప్పుడే  ఏభై ఏళ్ళకి, వంట కొంచం రుచి గా చేయడానికి, చేయి తిరిగింది, ఇప్పుడు, నోరు కట్టేసు కోమంటే ఎలాగా?  అన్నది నా వాదన. ఆంధ్ర వంటలు , బాగా వచ్చేసాయి, ఇంక పంజాబీ వంటలు, గుజరాతి వంటలు అని మొదలు పెట్టాను, కాని వాళ్ళని పిలిచి వడ్డిస్తే,  కారం, కారం గా ,ఈ వంట ఏదో చాల బాగుంది, ఏమిటి దీని పేరు అని పరువు తీసారు. అన్నీ  మన  పద్ధతి లో ఒక పోపు పడేసి వండేస్తాం  కదా.. ఇప్పటికీ ఒక డజను పుస్తకాలు   నిండాయి  , నా రెసిపి  కలెక్షను లతో,  కాని నేను ఎప్పుడూ చేసేవి, పండగ కి సేఫ్  గా ఒక పసుపు రంగు, ఒక తెలుపు రంగు వి అంటే, పులిహోర, సేమ్యా పాయసం, ఇవి కాక ఏవి వండినా, అమ్మా ఎందుకు అంత కష్ట  పడతావు, పద అందరం డాల్ఫిన్ లో డిన్నరు కి వెళదాం అంటూ, చాల ప్రేమ కురిపిస్తారు. ఎంతటి అమ్మ లైనా  పిల్లల ప్రేమ కి లొంగి పోతాం కదా.. అయినా పాపం ఈ బెజవాడ  స్వీట్స్ వాళ్ళు, శివరాం స్వీట్స్ లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళ కోసమే కదా ఇంతింత పెద్ద  ,పెద్ద దుకాణాలు పెట్టుకున్నారు, వాళ్ళు ఏమి అయిపోతారు?  పావు కేజీ తెచ్చుకుంటే సరి పోతుంది, ఇంట్లో వండితే ఒక కేజీ అయినా చేస్తాం, ఎవరు తింటారు?
నా రెసిపీలు అన్నీ ఎప్పుడో, పబ్లిష్ చెయ్యాలని ఒక చిన్న, పెద్ద, రహస్యమైన కోరిక ఒకటి నా మనసు లో ఉంది, నా లాంటి వారు ఎవరో కొంటారు అని నా ధైర్యం.
అప్పటిదాకా, ఈ రోజూ వారి పద్దు రాసుకోవ డానికి, ఇంకో పుస్తకం కొనాల్సిందే.
ఎప్పుడో, ఒక రోజూ పైనే ఆపిల్ కేకు చేస్తాను, చూస్తూ ఉండండి. అదిగో, మా ఊరు వంట వచ్చే టైం అయింది.. రాసుకోవాలి మరి,ఉంటాను.

9 మార్చి, 2010

విమోచన

అమ్మా, ఎన్ని రోజులయింది అమ్మా నువ్వు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు? కళ్ళల్లో నీళ్ళు తిరుగు తూడగా, తుడుచుకుని, నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? అంటూ మంగ , మాట్లాడుతోంది. ఇక్కడ కష్టాలు ఎన్ని అని చెపుతుంది. చెప్పిన ప్రయోజనం ఏముంది? తను పంపించే డబ్బులతోనే బ్రతుకుతున్నారు, ముగ్గురు జీవులు అక్కడ ,ఇండియా లో, ఏలూరు లో. తాగి, తాగి, ఒళ్ళు గుల్ల చేసుకున్న మొగుడు, హై వే మీద భోజన సాల, రోజూ వెయ్యి రూపాయలు తెచ్చే వ్యాపారం,  తెల్లవారు ఘమున లేచి, ఒళ్ళు దాచు కోకుండా, పిండి రుబ్బి, అంట్లు కడిగి, హోటల్ బల్లలు తుడిచి, పొయ్యి రాజేసి, వచ్చే పోయే lorry కస్టమర్లు    తో కబుర్లు ఆడి,మాటలు పడుతూ, వినకూడని మాటలు ని వెనక్కి తోస్తూ, మనసు, ఒళ్ళు అలసి పోయే చాకిరీ చేస్తూ, మొగుడి సతాయింపులు, పిడి గుద్దులు, పిడికెడు మెతుకుల కోసం, ఉన్న ఒక్క  నీలి ,తన కూతురు కోసం భరించేది. ఏమి సాధించింది? పద్నాలుగు ఏళ్ల కే కూతురి కి పెళ్లి చేసింది.  వ్యాపారం లో సాయం గా ఉంటాడు అనుకున్న అల్లుడు, మావా కలసి తాగి, తందా నాలుడు తూ, అంత నాశనం చేసారు. ఏలూరు ఊరు కి పడిన బై  పాస్  రోడ్  ఉన్న కాస్త వ్యాపారం ని మూత పడేలా చేసింది.

కూతురి కి మళ్లీ కూతురు, అల్లుడు, చీప్ లికోర్ తాగి, చీప్ గా చచి పోయాడు. ఒళ్ళు గుల్ల చేసుకున్న మొగుడు, కూతురు, మళ్లీ ఇంకో ప్రాణం తో, వచ్చి చేరారు. అప్పు చేసి, అజేంట్  ని పట్టుకుని ఎలాగో కువైట్ వచ్చి చేరింది. కూతురు, నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుంటూ, అయ్యని చూసు కుంటోంది. మానవ రాలు కి నాలుగు ఏళ్ళు అప్పుడు వచ్చింది మంగ ఈ దేశం కి.

 అదే ఊరులో ఉన్న పంచాయతి బడి లో చదువుకున్న రాణి ,తన మనవరాలు కోసం తన తాపత్రయం ఇప్పుడు. అమ్మా.. ఇక్కడ మేము బాగానే ఉన్నాం, నీ ఆరోగ్యం జాగ్రత్త, అని కూతురు ఆరాట పడుతోంది. మంగా ! తన మొగుడు మాట మధ్య లో. ఏంటి సంగతి, అక్కడ ఎవర్నైనా చూసుకున్నావా? నెల అయింది, నువ్వు ఫోన్ చేసి, ఇక్కడ నేను ఎలా చస్తానో నీకు పట్టదా?? అంటూ ఫోన్ లో అజమాయిషీ చేస్తున్న తన మొగుడు ని తలచు కాగానే ఛి.. వెధవ బతుకు.. అని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మళ్లీ. తను పంపే డబ్బుతో నే వైద్యం జరుగు తున్నది, తాగుడు తో  గుల్ల అయినా ఒళ్ళు కి, అయినా ఇంక లోకువే, పెళ్ళాం అంటే పడి ఉండాలి, అనే మగ మనసు.

అమ్మా రాణి టెన్త్ పరీక్ష పాస్ అయింది అమ్మా.. ఇంకా ఏమి చదివిస్తాను? పెళ్లి చేసేద్దాం అమ్మా .. అంది నీలు. నెత్తిన  పిడుగు పడి నట్టైంది, అప్పుడే పెళ్ళా?? ఇంక పసి పిల్ల, అంది. అమ్మా నువ్వు చూసి అయిదు ఏళ్ళు అయింది, ఇప్పుడు పెద్ద మనిషి కూడా అయింది కదా అమ్మా అంది కూతురు.

 అప్పుడే ఏమి తొందర? ఇంటర్ చదివిన్చుదాం. తరువాత చూద్దాం, అంది, అది కాదు అమ్మా , నీకు ఎలా చెప్పాను, మగ పిల్లలు బతక నివ్వటం లేదు, ఎవరో వెంట పడి , ఏదిపిస్తున్నాడు ట. వాడికి భయ పడి, బడి కి పోను అని, ఏడుపు అమ్మా రాణి, అంది బాధ గా.

మంగ కి దిక్కు తోచ లేదు, తమ బతుకు తాము బతక డానికి, ఆడు గు అడుగునా ఈ మగ వాళ్ళు, ఎన్ని ఆటంకాలు పెడతారు? ఎక్కడో పర దేశం లో, నానా కష్టాలు పడి, తను సంపాదించి పంపితే, ఫోన్ లో కూడా, వదలడు , అవమానించే మాటలు. చదువు కుందాం అంటే మగ వెధవల అఘాయిత్యం , ఆసిడ్ దాడులు అంటారు. దేవుడా ,మాకు మోక్షం లేదా? మాకు బాగుపడే రోజూ రాదా? ఏమి చెయ్యాలో, ఏమి చెప్పాలో , ఆ కష్టాల బావి లోనించి ఎలా బయట పడడం.. మార్గమే లేదా??

మళ్లీ, ఇంకో మగ వాడి చేతిలో పెట్టడమేనా?? వాడు ఎలాంటి వాడో? తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఇంక ఈ ఆగడాలు కి అంతం చెప్పాలి, మూడో తరం లో రాణి అయినా బాగు పడాలి, ముందు చదువుకుని, ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని, చిన్న దైనా, తరువాతే పెళ్లి, ఇలాగ ఎవరో అన్నారని కాదు, అని మనసు లో గట్టిగా నిర్ణయించు కున్న మంగ, అమ్మా నీలు, నువ్వు ఒక పని చేయి, మన ఊరులో  రాధ గారు అని లాయేరు గారు ఉన్నారు,  ఆవిడ ని కలసి, మన రాణి ని చదివించ డానికి సాయం చేయమని అడుగు, తప్పకుండ చేస్తారు. నేను కూడా మాట్లాడుతాను.

ఈ చదువు లేని, మగ వాడి మీద ఆధార పడడం అనే దుర్భర స్థితి నించి మన రాణి అయినా తప్పించు కోవాలి.
నా కష్టం, నీ కష్టం .. ఇంక మనకి పాఠం నేర్పించా లేదా??  అంటూ, ఫోన్ పెట్టింది మంగ.. నిట్టురుస్తూ.

 ఎన్నో తరం కి ముక్తి ? మాకు ఆడ వాళ్ళు కి, చదువుకుంటే విముక్తేనా? ఇంక ఎన్ని మెట్లు ఎక్కాలో?? మంగ ఆలోచనలు ఆకాశం లోకి, పై, పై కి సాగుతున్నాయ్.

ఈ దేశం లో ప్రాణాలు ఎంత లోకువ ??

మన దేశం లో ప్రాణం ఖరీదు ఇంత లోకువా??
మొన్న ,మొన్న బెంగుళూరు లో అపాయం లో తెరుచు కునేందుకు వీలుగా పెట్టే ఎగ్జిట్ తలుపులు తాళం వేసి ఉండడం తో,  కొంత మంది  విలువైన తమ  ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం అందం గా కనపడాలని  అంతా గాజు పలకలతో, కట్టేరు, safety ని గాలికి వదిలి. ఎప్పటి   కప్పుడు  చెకింగ్ చేయ వలసిన  అధికారులు, ఏదైనా ప్రమాదం అఏంత వరకు కళ్ళు మూసుకుని ఉంటారు. ఎగ్జిట్ తలుపులు తాళం వేసి , ఒక పక్క విష వాయువులు కమ్ము తూంటే, బయటకు వచ్చే మార్గం లేక, పై నించి కిందకి దూకిన మనుషులు, పని చేయని  లిఫ్టులు , అయినా, అగ్ని ప్రమాదం అవగానే లిఫ్టులో ప్రయాణించడం ,  ఎంత ప్రమాదం.  వెంటనే, మెట్లు ఉపయోగించాలి , ఆ మెట్లు కి ఒక తలుపు, fire  ప్రూఫ్  తలుపు ఉండాలి. మంటలు ఆర్పడానికి ఒక ఫైర్ హోసే  ఉండాలి. ఇవేమీ లేకుండా  ఆ భవనం కి ఎవరు ఇచ్చారు పెర్మిత్??  ఇలాంటి ఇంకా ఎన్ని భవనాలు ఇలాగ ప్రాణాలు తీసేందు కి ఎదురు చూస్తున్నాయి?   కుటుంబం లో అమ్మో, నాన్నో , చెల్లో,   అన్నయ్యో , ప్రాణాలు కోల్పేయి , అందరు ఏడుస్తూంటే, ఒక లక్ష రూపాయలు,లేదా రెండు లక్షలు నస్త  పరిహారం  టీవీ లలో ప్రక టించి, ఇంకా  అవమానం , ఇంకా పుండు మీద కారం చల్లడం అంటే ఇదే నేమో. ఒక ప్రాణం ఖరీదు ఇంత లోకువా?? మన దేశం లో. 
రోడ్డులు తవ్వి, గోతులు తీసి, ఒక బోర్డు కూడా పెట్టరు, చీకట్లో వీధి దీపాలు కూడా ఉండవు. నిండు ప్రాణాలు బలి అయిపోతాయి ఈ నిర్లక్షానికి. మళ్లీ మామూలు, ఏదో నష్ట పరి హారం ప్రకటన.  ఇన్ని కోట్ల మంది లో ఒక ప్రాణం పోతే నష్టం ఏమిటి అన్నా నిర్లిప్తత? ఏమిటో ఈ నిరాసక్త ,నిర్లిప్త ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ నిర్వహణ? మన మానాన మనం రోడ్డు మీద వెళుతూంటే , హోర్డింగులు పడి, గాయ పడతం, లేదా ఒక్కసారి ప్రాణాలు పోతాయి. ఒక ప్రాణం కి విలువ ఇచ్చి, ఎవరి పని వారు నిక్కచ్చి గా చేస్తే ఎంత బాగుంటుంది ఈ దేశం. 
నిన్నటికి నిన్న, ఆశ్రమం లో  ఉచిత బట్టలు, గిన్నెలు ఇస్తారంటే, వేల మంది స్త్రీలు, పిల్లలు ఒక్క సారి గా గేటులు తోసి, తొక్కిడి లో ఊపిరి ఆడక అరవై మంది స్త్రీలు, పిల్లలు ప్రాణాలు కోల్పెయారు అంటే ఎంత బాధ గా ఉందో.  ఎంత పేద దేశం మనది, ఒక చీర, ఒక పాత్ర కోసం ప్రాణాలు కూడా కోల్పోతారు. ఆ దానం చేసే వారికి ఏమి బాధ్యత లేదా?  ఒక పూట తిండి పెడతాము, ఉచితంగా , అంటే ఎంత మంది వస్తారు ఈ దేశం లో?  దాత్రు గుణం గొప్పదే కాని, ఒక బాధ్యత లేని , ఒక పేరు కోసం చేసే ,ఆలోచన లేని పనులు , ఎంత అనర్ధ దాయకం. పేద ప్రజలు ఎంత లోకువ?? 
9/11 లో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకు ఎంత విలువ నిచ్చారు  ఆ దేశం? పరిహారం, ప్రకటనలు ఎక్కడా కనపడవు. ఏది చేసినా వ్యక్తిగతం గా చేసారు, కాని, ఇలాగ టీవీ లో ప్రకటనలు ఇచ్చి కాదు. మన దేశం ఎంత పేద దేశం, ఎంత థర్డ్ వరల్డ్ దేశం అని అందరు అన్నా, మనమే  మన దేశం లో ప్రజలని ,వారి ప్రాణం విలువని ఇంత  చీప్ గా చూస్తే, ఇంక వేరే వాళ్ళు, వేరే దేశాలు, మనలని ఎందుకు గురవిస్తాయి. 
తెర్రోరిస్ట్ తో పోరాడి, చనిపోయిన ఇన్స్పెక్టర్ వేసుకున్న జాకెట్ ని కూడా మాయం చేసి, అమ్ముకునే హాస్పిటల్ ఉద్యోగులు, అప్పుడే పుట్టిన పసి శిశువు ని కుక్కలు లాక్కుని వెలు తూంటే, అయిదు వందలు కోసం బేరం అదే ఆయాలు, వార్డ్ బోయలు, మున్సిపాలిటీ కులాయిల్లో వచ్చే నీరు తాగి , ఆసుపత్రి పాలయి, ప్రాణాలు పోయిన వారు,  కడుతున్న  బ్రిద్జేలు   కూలిపోయి, నలిగి పోయేవారు, అన్నీ, టీవీ లలో చూస్తూ  ఉంటాం, మనము మర్చి పోతాం.
ఈ దేశం లో ప్రాణాలు ఎంత లోకువ? ఎవరు కాపాడుతారు ఈ దేశాన్ని??
రైతుల ,చేనేత కార్మికుల చావులు అయితే, హెడ్ లైన్స్ న్యూస్ దాటి, ఆఖరి పేజి లలో దాగున్నాయి, ఇప్పుడు. మనకి పొద్దున్నే పేపర్ లో ఇంక ముఖ్య మైన విషయాలు ఉన్నాయి. 
యధా రాజా, తథ ప్రజా...
దేవుడా నా దేశం లో ప్రాణం కి విలువ నిచ్చే ప్రభుత్వం కోసం మేము ఏమి చెయ్యాలో???


3 మార్చి, 2010

ఆడ పని, మగ పని, కాదు, ఇంటి పని




ఆడ పని, మగ పని కాదు, ఇంటి పని.. అని ఆలోచించే రోజులు వచ్చాయా అంటే వచ్చాయి అనే అనిపిస్తున్నది, ఇవాల్టి పరిస్తితి  చూస్తే.ఫ్యామిలీ కోర్టులు కిట కిట లాడుతూ న్నాయి అంటున్నారు. ఆడ పిల్లలు, మునపటి లాగ లేరు, అని వాపోతున్నారు. పెళ్లి, అయితే, ఇంకా జీవితాంతం, అతనే నాకు భర్త, అతనే నా తోడూ, అని పాడుకుంటూ, భరించే పిల్లలు కాదు ఇప్పుడు, వారు చదువు కుంటున్నారు, సమానం గా సంపాదిస్తున్నారు. ఇంటి పని ఇద్దరు సమానం గా చేయాలి అని కొత్త రూల్స్ పెడుతున్నారు. పిల్లలని ఎప్పుడూ కనాలో, వారే నిర్ణయిస్తున్నారు, వారి, స్నేహితుల్లో, ఆడ వారు, మగ వారు కూడా ఉండవచ్చు, ఆఫీసు లో లేట్ గా పని చేస్తారు,  ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ కోసం, ఆఫీసు పార్టీలు , ఆఫీసు కోల్లెగేస్ అంటూ  ఒక కొత్త ప్రపంచం వారిది, శనివారం , వీకెండ్ పార్టీలు కూడా ఉంటున్నాయి. ఆడ వారిదే ఇంటి పని అన్నఆలోచనతో, ఆ వాతావరణం లో  పెరిగిన మగ పిల్లలు, ఇవి , ఈ మార్పులు జీర్ణించు కోలేక, విడాకులు అంటున్నారు, లేదా, అమ్మాయిలే, మాకు వద్దు, ఈ భర్త అంటున్నారు. అందు కే ఫ్యామిలీ కోర్టులు అంత గా నిండి పోతున్నాయి. ఆడ పిల్లలు అలోచించి, తమ మెదడు లకి  పని పెడితే , ఇవాల్టి పరిస్తి ది ఉంటుంది మరి. ఇన్నాళ్ళు, ఆమె ని, ఇల్లు, స్వర్గం, భర్త దైవం , పిల్లలు , బాధ్యతలు అంటూ బంధించారు. పెళ్లి వద్దు, అని కాదు, పిల్లలుని  కనరు అని కాదు,  కాని, ఒక  స్వతంత్ర భావన  ఆమెను కుదిపి , తన జీవితం తనది అనే ఒక   నవ్య ,విశాల, ప్రపంచం లోకి  ఆమెని లాక్కుని వెళ్ళుతోంది. కాలం మారుతోంది , లేచింది మహిళా లోకం అని ఎప్పుడో  పాడినా, ఇప్పుడే ఆ కాలం  మొదలు అయింది.
అబ్బయలు, ఈ సత్యం గమనించాలి, ఇంట్లో వంట అంతా ఆడ వారి మీద వదిలేసి, భోజనం అయ్యిందా ?? నాకు ఆకలి వేస్తోంది, అంటే, వడ్డించే వారు,  ఇప్పుడు ఉన్నారా ?? ఆడ వారికి వంటిల్లు తన రాజ్యం అనుకునే రోజులు కావివి. భార్య  ఒక్క రోజూ, ఊరికి వెళితే ,భర్త  కాఫీ ,డబ్బా ఎక్కడుందో, పంచదార ఏ రంగు లో ఉంటుందో  అని సత మతం అయ్యే రోజులు కావివి.  ఉదయం ఎనిమిది కల్ల  ఇంటిల్లి పాది, బయట పడి, ఉద్యోగాలుకి   , బడులు కి వెళ్ళాలంటే, ఇంటి ఇల్లాలు  ఒక్కరి వల్ల అయే పని కాదు. భార్య భర్తలు ఇద్దరు, తలో చెయ్యి వేస్తే కాని పని తెమలదు . ఇంట్లో పెద్ద వారు, అందరికి సాయం ఉండరు కదా. 
చంటి పిల్లలు ఉన్న వారు అయితే ,మరి కష్తం. సాయం కని వచ్చిన అత్తగారు, మా పిల్లడు, ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు అని ఎంచుతూ  కూర్చునే రోజులు కావివి. ఏ పని అయినా చెయ్యాలి, దపెర్స్ మార్చడం ఆడ వారి పని ఎక్కడా రాసి లేదు, మధ్య రాత్రి లేచి పాలు పట్టడం, నాన్న కూడా చేయ వచ్చు. తప్పేమీ లేదు. ఒక తరం వారికి , ఇవి కష్తం గా అనిపించ వచ్చు.  కాని, వచ్చింది, మహిళా లోకం నిజం గా నిద్ర లేచిన కాలం వచ్చింది. 
ఏమిటి ఫేషన్లు? ఏమిటి వస్త్రాలు? ఉన్నట్టా? లేనట్టా?? ఇంత పొట్టి గా అసలు ఎలా కుడతారు? ఎలా వేసుకుంటారు? మన పిల్లలేనా ఇలాంటివి ధరించేవి?  ఫ్రెండ్స్ అంటే మగ స్నేహితులు కూడా నా ?? ఇలాగ తిరుగుతుంటే  పెళ్లి ఎలా అవుతుంది? పెళ్లి  చేసుకుంది, తన ఇష్థం తోనే, మళ్లీ విడాకులు అంటుంది, వంట వండడం బోర్ అంటుంది,   పిల్లలు  అప్పుడే వద్దు అంటుంది, ఇంకా చదువు అంటుంది, మంచి ఉద్యోగం, మంచి జీతం. ఇవే తన ధ్యేయం  అంటుంది. ఇవి ఇప్పటి ఆడ పిల్లల తల్లి తండ్రుల ఆలోచన. ఈ మార్పు ఒక పెను మార్పు, అందరిని కుదిపి వేస్తున్నది. 
ఇంకా అమ్మలూ   , ఇంట్లో అబ్బాయలకు కూడా  వంట పని నేర్పించే సమయం వచ్చింది.  బాబూ, నీకు ఆకలి వేయ గానే , ఎవరో ఒక ఆడ వాళ్ళు ,నీకు వండి, వడ్డించ డానికి రెడీ గా ఉండరని, నీ ఆకలి కి నువ్వు బాధ్యుడవని తెలుసుకుని మెలగాలి ఇంకా.. ఇప్పటికే, పై చదువులకి వెళ్ళే మగ పిల్లలు ఇంట్లో అన్నీ నేర్చు కుని వెళుతున్నారు. నీ మాసిన బట్టలు, నీ సర్దని గది, నీ అస్త వ్యస్త ఇల్లు ఇవి, అదృశ్య హస్తాలు సర్దు తు ఉండవు ఇంక  ... చదువుతూ ఉంటే, నిజమా ?? అని పిస్తుంది. 
కాని, ఇది ఒక సంధి కాలం. విలువలు అతి వేగంగా మారి పోతున్న కాలం. ఇది మంచి, ఇది చెడు అని  విశ్లేషించు కునే సమయం లేదు. మీడియా, ఇంటర్నెట్, ప్రపంచం ని తెచ్చి మన  ఇంట్లో కట్టి పడేస్తూ న్నాయి. మన పిల్లలు పెరుగుతున్న ప్రపంచం ఇది. ఇది నువ్వు, నేను ,చేయి పెట్టి ఆపలేము, చేయి కలిపి, ఈ తరాన్ని , అర్ధం చేసుకుంటూ, ముందుకు సాగాలి, అందు కే అంటున్నా 
ఆడ పని, మగ పని, కాదు, ఇంటి పని..అని మనం మన పిల్లలకి నేర్పే కాలం ఇది.