"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

27 జన, 2014

నవ్వు ..పువ్వు


జీవితం ..పిల్లాడి చేతిలో తాయిలం లాంటిది ..

నీ చేతిలో ది నీకు నచ్చదు ..

వాడి చేతిలో దే కావాలి అని ఏడుస్తావు ..

పెద్ద వాడివి వి కదా ,లోలోపల

ఈ లోపల నీ చేతిలో తాయిలం

రుచి కోల్ఫోతుంది ..లేదా కాకి ఎత్తుకు పోతుంది

అవతలవాడి చేతిలో ఏముందో ,ఎందుకు నీ చింత ..

పువ్వు ఎలా వికసిస్తుంది ?

ఎక్కడినించి ఎరువు తెచ్చుకుంటుంది ఆ రంగు ? ఆ హంగు ?

భూసారం నించే ..వెలుతురు నించే ..

అందరికీ సమానం గా ఉండే ఆ వనరులు నించే

నాకు ఏదో లేదు అని ఎన్నడూ నివేదించదు ..

మరిన్ని రంగులు ..మరిన్ని అందాలు ఇమ్మని ఎన్నడూ

ప్రార్ధించదు .. ఉన్న అందాల తోనే వికసిస్తూ

ఆకర్షిస్తూ ..పూజ కో ,పూల జడ కో ,మెత్తని మట్టి నేల పై నో 

నా చివరి పయనం అంటూ అట్టే శషభిషలూ లేవు ..

తన పని తాను నిమ్మళం గా ..పుష్పిస్తూ ..

ఎంత గొప్ప జీవన సౌందర్యం ?

దాచుకుంది ఆ పూవు ..ఈ పూవు ..

మెత్తని రేకలు , వాటి పై పుప్పొడి ..

ఆకు పచ్చటి ఆకుల ఒడి లో పరవసించిన

బాల్యం లాంటి పూవు ..

ఎంత అందమైన చక్కలగిలి నవ్వు లాంటి పూవు ..

సూర్యుడి కిరణాలని ఎన్ని రంగులు గా

పరావర్తనం చేస్తుంది ? అవలీల గా ..

మనకెందుకో మరి నవ్వు పూవు పూయదు ?

కాళ్ళు బురదలో చిక్కుకుని లేవే ?

ఐనా కమలం లేదూ ,బుద్ధి నేర్పడానికి ..

చక్కగా అమరిక కలిగిన వారమే అయినా

నవ్వు కోల్ఫోయిన బుద్ధి మాంద్యులం ..

అమ్మ ,నాన్న ఇంకా ఏదో అమర్చి పెట్ట లేదు అని

నిరంతరం నొసలు చిట్లించి ,ఎద ని కుంగదీస్తూ

నవ్వు పువ్వు ని నిర్దాక్షిణ్యం గా నలిపి నలిపి

అబ్బ ఎంత మూర్ఖులం ..ఎంత నిర్దాక్షిణ్యత ?

ఏ మట్టి లో పుట్టాం ? పూవు పుష్పించిన మట్టి లోనే ! ?

పూవు చేతిలో పడింది ఈ రోజు ..

అవును ,అలా నడిచి వెళుతూ ఉంటే ,నీ చేతిలో ఎక్కడినించో

ఒక పూవు పడింది ,జోడించిన నీ చేతిలో

నవ్వుకుంటావో , పూవు నేల పై విడిచేస్తావో ..మరి నీ ఇష్టం ..

నవ్వు ..పువ్వు ..నీ లోనే ..

అవును పుస్పిస్తాయి ..నీ లోనే ..