"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 మార్చి, 2014

వెలుతురు కావాలి నాకు ,మాకు ,మనకి


ఉదయం వార్త పత్రిక చూడాలంటే భయం వేస్తోంది ..

పరువు హత్య ముందు పేజీ లో ,ప్రేమ పెళ్ళా ? 

కన్నందుకు నువ్వు మా ఆస్తివి, మా బొమ్మవి ..

మేం చెప్పినట్టు వినాలి, మన కులం లోనే పెళ్ళి ..

లేదా మృత్యువు .ఇదే మా శాసనం అంటూ గొంతు కి
ఎద మీద ఆట్లాడే చున్ని తో ఉరి వేసిన రాక్షస తల్లి తనండ్రులు 
యే సంఘ సూత్రాలు వారిని ఆ పనికి ప్రేరేపించాయి ?
నీ బ్రతుకు అంతా ,నీ కులం నిర్ణయిస్తుంది , అదే మా న్యాయం ,మా చట్టం ..
మరే చట్టం మాకు వర్తించదు ,,అనే ఈ అమనుష మనుషులు ,
మన మధ్యే ,ంసులుతున్నారు, జీవిస్తున్నారు ..
మరో వార్త ..
తన శరీరాన్ని ,వ్యాపార మదుపు గా అంగీకరించనందుకు
ఆమె అంగంగాలు కోసారు ట ..
ఎంత దారుణం ?
ఏమయ్యాయి ? చట్టాలు ? స్త్రీలని రక్షించే పోలీసు వ్యవస్థలు ?
పోలీసులే దగ్గరుండి నడిపిస్తారు అని విని మరీ అంత దిగ్భ్రాంతి పొందకండి
ఒక మహిళ దగ్గరుండి ,ఈ అఘాయిత్యం చేయించింది ట ..
ఇది మన సమాజం మన చుట్టు ,మంకేమీ పట్టనట్టు మసిలే సమాజం ..
ఇలాంటి వార్త లు చదవ లేక ఉదయమే ,వార్త పత్రిక చదవడం మానేద్దామా ?
శుభం ..తప్పించుకుని తిరుగువారు ధన్యులు ..అనేసారు కదా
మనం చెవులు మూసుకుని, కళ్ళు మూసుకుని ,నోరు మూసుకుని ..
ఈ దుర్మార్గాలు భరిస్తూ ... మనకి సంబంధం లేని విష్యాలు అంటూ
బ్రతికేద్దాం ..మన బబెల్ లో ,మన నాలుగు గోడల .నేను కూడా ఆ మనం లో ఒకటే ..
చాలా కోపం ...పిచ్చి కోపం గా ఉంది ..
ఇంకా బంధించండి ఆమాయిలని, అసలు వెలుగు తాకనీయకండి ..
ఆమె ఒక క్షేత్రం అంతే ..కంచెలూ వేసి కాపాడండి ..కంచే చేను మేసినా
అదంతే ,మగ తనం అని మీసాలు మెలి తిప్పండి ..
ఆమె కి జరిగిన అన్యాయాలు ,హింస లు , అవహేళనలు
పైకి మటుకు నోరు విప్పి చెప్పకూడదు , పరువు -ప్రతిష్ట ,,అమ్మో .
ఉద్యోగాలు చేయాలి ,వేణ్ణిల్లు కి చణ్ణీళ్ళు ..తప్పదు ..ధరలు ఎలా పైకి పోతున్నాయి ?
అక్కడ జరిగే , హేళనలు, చేతులు తాకించడం , రెండర్ధ్హాల మాటలు అవి మటుకు
ఇంటికి మోసుకు రాకూడదు ..సహించాలి , భూదేవి అంత సహనం నీకు
నీ సహనమే నీకు రక్ష ..ఎలా ? సహిస్తూ ఉంటే లోకువ గా ఇంకా హరాస్మెంట్ ఎక్కువయిందే ?
నోరు మూసుకు ఉంటావా ? నీ పేరు పాడు చేయనా ? అంటూ బెదిరించే తోటి ఉద్యోగులు
అయ్యో ఈ వ్యవస్థ లో మహిళ లూ మీరు కీలు బొమ్మలు ఎందుకు ఎలా అయారు ?
కుమిలి పోతున్న ఆమె మీద నువ్వు కూడా ఒక చెడు మాట ..విసిరుతావా ?
మొత్తం అంతా కుళ్ళి పోయింది , లుక లుక లాడుతూ పురుగులు పెట్టి ఉంది
చా .. ఎంత గొప్ప సూర్యోదయం అవుతుంది ? ప్రతి రోజూ ??
దానికింద , చీకటి నీడలు ఎందుకు ? నా కళ్ళ్ కి కనిపిస్తాయి ..
నాకు సూర్యోదయం కావాలి ,ఎర్రగా కాల్చేసే కిరణాల తో ,ఈ మురికి ని ఎండ గొట్టే కిరణాలు కావాలి ,ఎండ మండి పోయినా సరే ,ఈ చీకటి, చీదర చెదర గొట్టే మిరుమట్లు గొలిపే వెలుతురు కావాలి నాకు ,మాకు ,మనకి ..

21 మార్చి, 2014

దినాలు ...365 రోజులు

భగ భగమని మంటలు
నా చుట్టూ
వసంతం వచ్చేస్తోంది కోయిలా
ఎక్కడికి పోయావు ? గొంతు సవరించుకో .

ఏ కొమ్మ పై వాలను ?
ఏ చిగుర్లు మేయను ?
యే కోయిల మరి కుహు కుహు
అంటూ తిరిగి జవాబు చెపుతుంది ?

వేప చెట్లు ,రావి చెట్లు ,మర్రి చెట్లు
ఊరు ఊరుకి అమ్మ లా వీవెనలు ఊపుతూ
మాయం అయి పోయి ,ఇనప చెట్లు ట
మొలిచాయి వాడ వాడ లా ,
యే చెట్టు పై వాలను ?

మండుటెండ కాల్చేస్తోంది ,
చుక్క నీరు లేవు ,ఏ పక్క
కుహు కుహు అని యే చిగురు తిని
సవరించుకోను గొంతు ?

మా అమ్మ కథలు చెప్పేది
ఊరి లో పిల్లలు చెట్లు కింద చేరి
అల్లరిగా కూ కూ అంటూ కూతలు
కూసేవారట , చదువుల బడి జైలు ట
ఇప్పుడు చెట్టు పుట్ట కొండా అన్ని
పుస్తకాల మీద బొమ్మలై పోయాయి ట .

ఇంకెక్కడ అల్లరి ? ఆటలు ?
ఇంకెక్కడ వసంతాగమన సంకేతాలకై
ఎదురు చూపులు ,
పట్టణాల లో అన్ని ఋతువులూ
ఒక్కటే ,మండే ఎండలు ..అంతే ..

నీ చేత్తో నీవు తవ్వుకున్నావు గొయ్యి
నీ వినాశనం నీవే కోరి తెచుకున్నావు
అంటే నమ్మరు ఈ జనం ..
ప్రకృతి ని రక్షించండి అంటూ కవితలు
అల్లుతారు , ఒక్క మొక్క నాటండి అంటే
అమ్మూ నా ఫేస్ బుక్ లో కొంపలు అంటుకుంటాయి
నే ఒక్క క్షణం మిస్ అవుతే అంటూ బడాయిలు పైగా

అడవి కి ఒక రోజు ,పిచుక కి ఒక రోజు
పులి కి మరో రోజు , ఆడ పిల్ల ల కి కూడా
ఒక రోజు ట ,ఇన్ని నోట్లు , నాణాలు కంచం లో
పోసుకుని తింటరా ఏమిటి ? అదీ చ్హూద్దాం ..

నల్లటి కోయిల కార్చిన కన్నీటి చుక్క
మరి నలుపులో కలిసి , కనిపించనే లేదు ..
రండి ,మరో రోజు జరుపుకుందాం ..పోనీ
కోయిల కి ఈ రోజు పెడదాం ...సరి పోతుంది ..

మనం చేయ గలిగింది అదే ..
దినాలు .. హుహ్ ..పెట్టు కోవడమే ..
రండి ,365 రోజులు ..దినాలు గా ప్రకటిద్దాం ..
ఈ ఫేస్ బుక్ లో నే జరుపుకుందాం ..శుభం ..

17 మార్చి, 2014

హాపీ హోలీ అందరికీ

ఆకు రాలుస్తున్న చెట్టు కి తెలుసా
చిగురాకుల చికిలింత దాగుందని
నేల రాలిన పూవు కి తెలుసా
కొమ్మ కొమ్మ కీ మరి కొన్ని పూలు
పులకరిస్తూ పలకరిస్తాయి అని
తెలుసు అనుకుంటా
అందుకే యే బెంగా లేదు వాటికి
అయిపోయిన రోజు ,ఘడియ గురించి
మనకే ఎందుకో చింత ?
కాలం రెమ్మకి ప్రతి ఉదయం ఒక పువ్వు
పూస్తుంది ,అదే ఈ రోజు ..
ఆశల మారాకు వేయనీ
రంగు రంగుల పూల జల్లుల
హోలీ జరుపు కుంటున్న ప్రకృతి
ఎన్నెన్ని సందేశాలు ఇస్తుందో ,
మనసున రంగులు మాయనీకు అని
ఎన్ని రంగులు ఉన్నాయో ,ప్రకృతి లో
మనిషి లో అన్ని రకాలు అని ,
యే పువ్వు ,యే మనిషి ఒక్కలా ఉండరు
వైవిధ్యాన్ని ఇష్టపడి గౌరవిస్తే
మనసుకి ఎంత శాంతి ?
రంగుల పండగ చేసుకో ఈ రోజు
మనసులో రంగుల వైవిధ్యం నింపుకో ..
హాపీ హోలీ అందరికీ

16 మార్చి, 2014

The QUEEN మూవీ

నిన్న హై వే ,ఇవాళ మాటినీ ది queen , రెండూ ఆడ పిల్లల దృష్టి లో తీసినవే , రెండిట్లోనూ హీరోయినే హీరో ,అంటే కథకి ప్రాణం ..
నెమ్మదిగా .'.స్లో అనిపించినా ఈ సిన్మా కూడా బాగుంది , అందుకే అమ్మాయిలు బయటకి వెళ్ళి చదువుకోవాలి ,అందులో పర దేశం వెళితే ,కొత్త సంస్కృతులు ,కొత్త ఆలోచనలు కి ఆలోచనా పరిధి విశాలాం అవుతుంది ..
ఇంకా మన దేశ సంస్కృతి అంతా ఆడ వారి భుజ స్కంధాల మీదే నిలబెట్టాలి అనుకునే వారు ఈ సిన్మా తప్పకుండా చూడాలి .
ఒక్క సారి ఆడ పిల్ల ,పరిధి పెరిగి , కూపస్థ మండూకం లాంటి తన ప్రపంచం లోంచి బయటకి వచ్చి, నలు దెశలా చూసి ,తన దృష్టి విశాలం చేసుకుంది అంటే ,ఈ మగ వారు ,వారి ముందు నిలవలేరు ,ఆమె ని అందుకే నాలుగు గోడల మధ్య బంధించారు ,ఇంత కాలం ..
నాలుగు గోడల ని భేధించుకుని ,వెలుగు లోకి వస్తున్నారు అమ్మాయిలు, వారికి కావల్సింది ఏమిటొ వారికి స్పష్టం గా తెలుసు వారికి ..ఇంకా మగవాడు చెప్పినట్టు ,నాకే తెలుసుస్ అన్నీ అంటే వినే రోజులు పోయాయి ..
కల్చరల్ షాక్ అంటారు అలాంటిది ,తగులుతోంది అబ్బాయిలకి ,వంట వండదు , పిల్లలల్ని చూడమ్మంటుంది, గిన్నెలు తోమ మంటుంది ..అవును ..అంటుంది ..
ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ,పని షేరింగ్ తప్పదు ,వంట రాని అబ్బయిల లాగా ,వంట రాని అమ్మాయిలూ ఉంటారు ,
అన్నిటికీ సి్ద్ధ పడండి .
స్పెషల్లి ఆడ మగ స్నేహం అంటే ఒక్కటే ఆలోచించే కుసంస్కారం పోవాలి , ఒక ఆడ ,ఒక మగ రూం షేర్ చేసుకుని ఉంటారు ..చాలా చోట్ళ హాస్టెల్స్ లో , బయట దేశాల లో ఇది మామూలు ,ఆమె పెర్మిషం లేకుండా అబ్బాయి ఆమె పై చేయి కూడా వేయడు ..
అదే పనిగా ,ఎప్పుడూ ఆడ వారినే చూడనట్టు అలా తినేసాలా చూడరు ..ఇవన్ని మనం ఎప్పటికి నేర్చుకుంటామొ ?
ఆడవారిని ,దేవత అని కొలవడం కాదు ,మామూలు మనిషి గా సమానం గా చూడండి ..అంతే చాలు .
నువ్వీపని చేయలేవు ,నీ వల్ల కాదు అనే ప్రపంచం నుండి ,ఒంటరి తల్లి , పది మందిలో డాంసులు లు చేసి ,కుటుంబాన్ని పోషించే మరో యువతి , సునామీ లో సర్వస్వం పోగుట్టుకున్న ఒక యువకూడు , గిటార్ వాయించే ఒక బ్లాక్ , మరో చిత్ర కారుడు ..వీరందరి పరిచయం తో జీవితాన్ని తనకు తాను ,ఎవరి వెనక్కి లాగే మాటలు లేకుండా ,ఎలా జీవించాలొ తెలుసుకుని ,నవ ఉత్శాహం తో ,జవ జీవాలు నింపుకుని ,సంపూర్ణ యువతి గా , తిరిగి వచ్చి ,నువ్వు నన్న పెళ్ళి  కి ఒక్క రోజు ముందు ,వద్దు  ...అని తిరస్కరించి ఎంత మేలు చేసావో అంటూ ఆ విజయ్ కి ఒక హగ్ ఇచ్చేంత ..ఎదిగి పోతుంది ..
చప్పట్లు , చప్పట్లు ..తాళి యాం ..తాళియాం ..
ఇది ద QUEEN మూవీ

13 మార్చి, 2014

హైవే .

హై వే ,,ఏడు గంటల షో చూసి వచ్చి ,అన్నం తిని కూర్చున్నాను ,
నా మనసు మటుకు , పెద్ద పెద్ద కళ్ళ ల్లో ,తన లోని బాధని ,భావాలని చూపించిన ఆలియా భట్ చుట్టు తిరుగు తోంది ఇంకా ..
గొప్పింటి అమ్మాయి , దుండగులు ఎత్తుకు పోతారు ,అయినా బెంగ ,భయం లేదే ? ఈ అమ్మాయికి ? ఎందుకని ? అనుకునే లోపల ,తన లో గూడు కట్టుకున్న గుబులు,చీదర ,నాలుగు గోడల మధ్య ఊపిరి ఆడని తనం ..అంతా చెపుతుంది ..
మనసు బరువెక్కుతుంది , ఇల్లు అంటే ,సుఖం గా సురక్షితం గా ఉండే నాలుగు గోడల ప్రదేశం ,కానీ ఆమెకి తన ఇంట్లో ఊపిరి ఆడదు , ఇంకా ఆ ఊపిరి ఆడని తనం లో ఉక్కిరి బిక్కిరి అవుతూ ,తన ని తాను బయట పడేసుకోవాలని కోరిక ,ఇంకా వీడని పసితనం ...
రేపటికి పెళ్ళి అంటూ చేసి ,మరొక మగవాడి తో పంపిచేస్తున్నారు ,మగవాడు అంటే ఇంకా భయం ,చీదర,హుష్ హుష్ అంటూ ఆమె లోని సర్వ శక్తులని అణిచేస్తున్న నాలుగు గోడల ల ఇరుకు నించి బయట పడాలని ,ఊపిరి పీల్చుకోవాలని , స్వచ్చమైన ఆరు బయల గాలి పీల్చాలని ఒక్క కోరిక కోరింది ..ఆ కాబోయే భర్త ని ..
మనకి ఇది సేఫ్ కాదు , ఇలా మనం రాకూడదు ,మనం వెనక్కి వెళిపోదాం అనే మగడు ..మగవాడు ..ఆమె కి ఇంక ముందు ముందు రక్షణ ఇచ్చే మగవాడు ..
ఒక్కసారి ,ఇంకొంచం దూరం అంటూ గుండెల నిండా స్వేచా వాయువలు పీల్చుకోవాలని , నవ వధువు గా ,మరు రోజు మారిపోయే ఆమె ..గుండె ల చప్పుడు ఎంత మంది మగ వారు విన గలిగారు ? మనసుతో ??
పిచ్చ్హా ? పొగరా ? తిరుగు బాట ? అంటూ కంగారు పడని మగ వారు ఎంత మంది ?
తను పుట్టి ,పెరిగిన ఇల్లు, తన వారు ,తన స్నేహితులు ,తన పుస్తకాలు ,తన ఇంటి పేరు ,తన గతం అన్నీ వదులు కుని ,నీ చిటికెన వేలు పట్టుకుని ఏ ధైర్యం తో ఆమె వస్తోంది ,నీ వెంట ?
ఆలోచించారా మగ వారూ ?? నవ వరులూ ??
మొరటు భాష ,వేషం , అను క్షణం ఎవరో వెనక వచ్చి పట్టుకుంటారు అని భయం ,తొట్రు పాటు , వేట లో వేటాడ బడుతున్న అనాగరిక వాంచలు , ప్రాణాలు అర చేతిలో పట్టుకుని ,పరుగులు ,ఆ ప్రాణాలు కి విలువెంత ? ఆ ప్రాణి అసలు ఈ భూమి మీద ఏ మూల బ్రతుకుతున్నాడు ? ఇన్నాళ్ళూ ? ఈ దేశం లో ఒక మనిషేనా ?
ఐతే అంత క్రోధం ఎందుకు ? అంత తెగింపు ఎందుకు ? ఎక్కడకీ ఆ రోడ్డు ప్రయాణం ?
ఏ అంచు లకి ? దేశ సరిహద్దులు లేని ..కొత్త ప్రపంచాని కా ?
దేశం ,అధికారం తొంగి చూడని సరిహద్దు ఉంటుందా ?
ఎన్ని హిమ మయ కొండలు ,ఎన్ని నదులు , ఎన్ని లోయలు దాటినా ,గొప్ప వారి చేతిలొ రక్షక బంటులు లేని దేశం ఉంటుందా ?
ఏదీ ఆ కలల ప్రపంచం ?? ఆ కొండ పై ,నాకొక ఇల్లు ,నా భర్త కి వండి పెట్టుకుని ,ఇంటి పనులు చేసుకుంటూ , ఇలాంటి కలలు ఒక గొప్పింటి అమ్మాయి ఎందుకు ? కంటొంది ?
మరీ మన చెవిలో పువ్వులు పెట్టి శుద్ధ్ రొమాంటిక్ , మాది వేరు అనే ప్రేమ కథ ఏనా ? ఏమిటి ? అని మధ్యలో ..కాస్త తొందరింత ..
కాదు ,సుమా కాదు ..
ఒక అమ్మాయి మది లో వెలిగే కలలు కి ఎన్నెన్ని రంగులు ,రూపాలో ?
ఎవరో ఒకరితో ముడి వేసి ,ఇంక అతని తో బ్రతుకు అంటె ..ఆ కలలు ఎలా చిద్రం అయిపోతాయో ? మీకు తెలుసా అసలు పెద్దలు ??
సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ , బాంక్ అకౌంట్ , ఫ్లాట్ ,కారు ...ఇవి కాకుండా ఇంకా ఏం కావాలి ? మిగిలినవన్నీ ఉత్త సిల్లి కలల ప్రపంచం ..అమ్మాయి కలలన్ని పెల్ళి అవగానే మూట కట్టి అటక మీదకో ,సముద్రం లోకో విసిరేయాలి ,పలక మీద కొత్త అక్షరాలు రాయాలి ,పాత వన్నీ ఉమ్ము వేసి తుడిచేయ్ అమ్మాయ్ ..తుడిచేయ్ ..
అలియా భట్ నీకు నా అభినందన్లు ..
ఎందరి వో కలలు మూట కట్టి ,నీ తో ఆ చల్లని కొండల మీద ఎగరేసావు ..గాలిలో పూల రె్క్క లా ఎగిరాయి ,ఆ కల లు ..వచ్చి సీతాకోక చిలక ల్లాగా ,వచ్చి కూర్చుంటాయి ..అమ్మాయిల భుజాల పై ..
ఆ హైవే మలుపులు ,తిరుగుతూ ,గుప్పెళ్ళ ల్లో ఆకు పచ్చదనంం , నదుల ఉధృతి , మేక ల మెల్ల ని నడక లు , ఎత్తు గా మరింత ఎత్తుగా పెరిగిన ఆ తెల్లని ని హిమాలయాల అంచున ఒదిగి పోయిన దారులు , దారి పక్కన కబుర్లు చెప్పే చెట్టు మోడు , తెల్లని పూలాల తో సంభాషించే మొక్క లు ,దారి ప్ర క్క , చాయ్ దుకాణాలు వారి పాటలు అవి కూడా సిన్మా లో పాత్రలే ..
ఆ ముఖం లేని , దుండగులు గురించి మనం ఎందుకు ఒక కన్నీటి బొట్టు రాలుస్తాం ?
అదీ హైవే ..తప్పక చూడండి ..అది ఒక అనుభవం ..