"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

27 మార్చి, 2013

నిరంతరం పయనం .. నాది ..

మెత్తగా సీతాకోక చిలక నాపై 
వాలింది, నేను చాలా ఏళ్ల నించి 
ఇలాగే ,కదలక, మెదలక 
కొమ్మలు వేస్తూ, ఆకులు రాలుస్తూ 
తల పై ఆలోచనల పూలు పుష్పిస్తూ.. 

నా చుట్టూ , ఎండాకాలం వేడి 
నా చుట్టూ భుగ భుగ మంటలు 
నా చుట్టూ సముద్రపు వెర్రి అలలు 
నా చుట్టూ అశాంతి ,అలజడి . 

నా మనసు మటుకు మానస సరోవరం లా 
స్థిరం గా అలలు కలలు కంటూ 
నిరంతరం సరిహద్దుల 
చెలియలి గట్టు కి తల ఒగ్గి 
పైకి ప్రశాంత తటాకం మరిపిస్తుంది . 

నా లోపల కమలాలు ,
నా లోపల తామర పూలు 
నా మనసు తటాకం లో 
పైకి మటుకు కాక్టస్ మొహం 

సముద్రాల వైశాల్యం ,లోతు 
కోసం తపిస్తాను, నాలుగు 
వేపులా బంధించిన చిన్న 
మడుగు , నా మనసు ..ఎలా ?

మనసు చేసే గారడి తో 
ప్రతి క్షణం ఆకాశం అంత ఎత్తు 
ఎగిరి , పాతాళం అంత లోతు 
కి పడిపోతూ , త్రిశంకు స్వర్గం 
మధ్యే మార్గం గా మజిలి నాది . 

మనసు అంటే అదేమీ పదార్ధమా ?
కానే కాదు, కొన్ని జీవించే క్షణాల 
స్పర్శ , కొన్ని క్షణాల విలవిల లు 
మరి కొన్ని విరామ చిహ్నాల 
కలగలపు రంగుల కాన్వాస్ ..అది . 

నేను శ్వాసించే ,ఊహించే 
మనసు మజిలి వేపు 
నిరంతరం పయనం నాది . 
నిరంతరం శోధన నాది. 

















4 కామెంట్‌లు:

  1. ముందు చెట్టు యొక్క స్వగతం అనుకున్నా,, మనసు చేసే ఆలోచనలను చక్కగా కవితీకరించారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కూచిపూడి షర్మిల
      ధన్యవాదాలు ..నా లోపల కలిగే నిత్య సంఘర్షణే ..ఈ కవితీకరణ.. మంచి పదం వాడారు, కవితీకరణ అని ..బాగుంది..నచ్చింది.
      వసంతం

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ప్రేరణ !!

      ప్రేరణ పేరు లోనే అందం ఉంది.
      ధన్యవాదాలు.
      నా కవిత మీకు నచ్చినందుకు.
      మనసు లో అతలాకుతలం కి ఒక రూపం పొదిగాను మాటల్లో ,
      ఎంత ,ఎన్ని రకాల గట్టులో కదా మనకి అని తలపోస్తూ .
      నాకూ సంతోషం ..
      వసంతం.

      తొలగించండి