"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

24 ఆగ, 2011

అమ్మ కి వందనం తో..

అమ్మా !! ఆకలి!!! ఇదిగో టూ మినిట్స్ ..అంటూ మాగ్గి నూడ్లేస్ వండే అమ్మ..అమ్మా ... దాహం అంటే ఫ్రిడ్జ్ లోంచి కూల్ డ్రింక్ ఇచ్చే అమ్మ,స్కూల్ లో పోటీ పడుతూ చదవ డానికి ఇంకేదో డ్రింక్ కలిపే  అమ్మలు, మనం  టీ వి లో చూస్తున్నాం రోజూ..మా చిన్నప్పుడి రోజులు గుర్తు వచ్చేయి..

మూడు పూటలా అన్నం తినే బడికి  కాని కాలేజ్కి కాని ,వెళ్ళే వాళ్ళం.అమ్మ ఇంట్లో ఒకటో కృష్ణుడు,మూడో కృష్ణుడు, లాగ నాలుగు అయిదు అన్నాలు వండి వార్చి,వేడి వేడి గా అందరికి పెట్టేది.ముందు ఉదయాన్నే గ్లాస్సుడు కాఫీ తాగి, చదువుకుని లేచి, బడికి వెళ్ళే  వేళ కి,ఒకటో అన్నం రెడీ అయేది.అందులో కి ఒక కొత్తిమీర కారం లాంటి రుచికర మైన appetiserlu ఉండేవి,ఇంక బడి కి  ఒక పెద్ద కారేజి వచ్చేది.అందులో నలుగురం ..మా అక్క చెల్లెళ్ళకు ..సరి పడ అన్నాలు,కూరలు,చిన్న గిన్నె లో నెయ్యి తో సహా నాలుగు కంచాలు ,సమస్తం..ఉండేవి.ఇంటికి చేరేసరికి మళ్లీ గ్లాస్సుడు కాఫీ,మళ్లీ ఏదో టిఫిన్ ,మళ్లీ రాత్రి కి అన్నం..మొత్తానికి అన్న ప్రాణులం మేం.. మా ఏలూరు అక్క చెల్లెళ్ళం ..అందుకే,మొదట్లో ఎవరైనా భోజనం లో చపాతీలో ,పూరిలో పెడితే, శుభ్రం గా కడుపు నిండి పోయినా ఏక కంఠం తో ,ఇంక ఏమిటి కావాలి అంటే, అన్నం అని ముక్త కంఠం తో అరిచే వాళ్ళం.అన్నం ప్రాణులం..ఇప్పుడు,బరువు తగ్గాలని,ఆరోగ్యం అని,ఒకటో రెండో పుల్కాలు,హుహ్,ఒక్క చుక్క నూనె చుక్క కూడా అంటని కాల్చిన పుల్కాలు, ఇంక ఏదో గడ్డి ..ఆకులూ అలమలు..హుహ్..ఏమిటో ఈ కర్మ..ఇప్పుడు పిల్లలు తినే పిడ్జాలు, బర్గేర్లు, మాగ్గి నూడ్లేస్, తాగే కూల్ డ్రింకులు చూస్తోంటే,రేపు వీళ్ళు ఏం తింటారు? మనమే ఇలా బరువు అనుకుంటూ అవస్థ పడుతున్నాం కదా..వీళ్ళ గతి ఏమిటి?

అన్ని ఫాస్ట్ ..ఫుడ్ కూడా ఫాస్ట్ ఏనట ? ఫ్రిజ్ లో నుంచి తీయడం ,వేడి చేయడం..ఇంక మన జంతికలు,చేగోడీలు, పప్పుండలు, పకోడీలు, బొబ్బట్లు,బూరెలు, పులిహోరలు, చక్ర పొంగళ్ళు,ఏమి పోతాయి?అన్నట్టు మా ఇంట్లో నాలుగు రకాల జంతికల గొట్టాలు ఉన్నాయి, కాని, ఏదీ ఇప్పటివరకు వాడ లేదు,మరి మాలతి చందూర్ అన్ని కేజీ లెక్కన కొలతలు ఇచ్చారు, అంత తినే వాళ్ళు మన ఇంట్లో లేరు, అమ్మో చెయ్యి నొప్పి పెట్టదూ , అని ఇంకో కారణం వెతికి ఇప్పటి వరకూ ,ఈ స్వగృహ నో,బెజవాడ వారినో,నమ్ము కున్నాను. మా పిల్లలికి కనీసం ఆ రుచులు తెలుసు, కాని ముందు ముందు..ఎలాగో?
జంతికలు, చేగోడీలు కిఎవరైనా పేటెంట్ తీసు కున్నారా?లేక పోతే ఉండండి ఉండండి.. నేను లైన్ లో ఉన్నాను.

కొన్ని లక్షల అన్నాలు వండిన అమ్మకి జోహార్..అన్నం కి సరి మరి ఇంకేది రాదు..భుక్తాయాసం వచ్చే పెళ్లి భోయనం చేసినా సరే, ఇంట్లో పెరుగు వేసిన ,ఆవ కాయో ,మాగాయో నంచుకుని తినే అన్నం రుచే వేరు.
 సమస్త అన్నం ప్రానుల్లారా ఏకం కండి,పోయేదేమీ లేదు మన కి, వచ్చేది,ఓ చిన్న బోజ్జే..
అమ్మ కి వందనం తో..అన్నం రుచి మప్పిన అమ్మకి వందనం ..తో..శిరస్సు వంచి..(పొట్ట వల్ల నడుం వంగదు కాని,తల వంచగలను) ..

3 కామెంట్‌లు:

  1. అసలు సమస్య అన్నానిది కాదనుకుంటాను. వ్యాయామం లేకపేవడమే అనిపిస్తుంది. బడికి, వేరే క్లాసులకి ఎవ్వరూ నడిచి వెల్ళ్ళత్లేదు. చాలా బాగుంది మీ టపా. మా అన్నాలు, టిఫిన్లు కూడా గుర్తుకొచ్చాయి.

    మాధురి.

    రిప్లయితొలగించండి
  2. ధన్య వాదాలు ..నా అన్నం టపా చదివినందుకు, నచ్చి, మీ అభిప్రాయం రాసినందుకు, మాధురి గారు. నిజమే, మీరు చెప్పినది, చపాతీ ఏమిటే టిఫిన్ లాగ అని, రెండు పూటలా అన్నం తింటూ, నెయ్యి -నూనె లు అన్నం లో వేసు కుని మరి, చక్కగా తన పనులు తను చేసుకుంటూ, ఇప్పటికి, ఇల్లు ఒక అన్నపూర్ణ నిలయం లాగ ,వచ్చిన అతిథులకు,బంధువులకు, కాఫీ ఇచ్చి,మన లాగ, పంపించకుండా,ఆకలి ఎరిగి ,అన్నం పెట్టే మా అమ్మ ,నిజం గానే అన్నపూర్ణ గారి కోడలు..అన్నపూర్ణే..మా మామ్మ పేరు అన్నపూర్ణ.

    వసంతం.

    రిప్లయితొలగించండి