"పొట్టి ! పొట్టి " ఎవరో గట్టిగ పిలుస్తున్నారు. చంద్ర కళ కి సిగ్గుగా ,చికాకు గా ఉంది..ఎన్ని సార్లు ,తన పేరు చెప్పినా ,ఇలాగే పిలుస్తారు.
తను గట్టిగ సమాధానం ఇవ్వ లేక కాదు..ఎందుకులే గొడవ ? అని..
" నేను ఇంటికి వెళ్ళాలి" అని అరిచింది, వెనక్కి తిరిగి చూసి.
"సారు పిలుస్తున్నారు.."..ఉమ అరిచింది.
ఇంక తప్పదు..అని వెను తిరిగింది.చంద్ర కళ.
రమేష్ సార్..అంటే మా పైన అధికారి.
ఇంటికి త్వరగా వెళ్ళాలి, అయ్య ని ఆసుపత్రి కి తీసుకు వెళ్ళాలి, ఇంకా.ఎన్నో పనులు. వారానికి ఒక్క రోజు సెలవు, ఇలా ఎప్పుడయినా పని, త్వరగా చేసుకుని వెళ్ళాలి అనుకుంటే ఎన్ని ఆటంకాలో ..
మేమందరం brandix అనే బట్టలు కుట్టే ,కంపనీ లో పని చేస్తున్నాం. రెడీ మేడ్ బట్టలు,ఇక్కడ కుట్టించి, పై దేశాలకు ఎగుమతి చేస్తారు.
వందల మంది, చుట్టూ పక్కల ఊరుల నించి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. నాకు నయం, ఊరికి దగ్గరే, అమ్మ ,అయ్యా ఇంట్లో ఉంటారు. తమ్ముడు ప్రభుత్వ బడి లో చదువుతున్నాడు.
వాడినయినా,బాగా చదివించాలని, మా ఇంట్లో ప్రయత్నం..
నేను ఎనిమిది వరకూ చదివాను, ఇదిగో, ఈ పని లో చేరాను. వారానికి రెండు వందలు, వస్తాయి. అవే పది వేలు, మాకు.
అద్దం లో చూసుకుంటే, నాకు నేను అందం గానే కనిపిస్తాను, కాని, పొట్టి గా ఉంటానని అందరూ పొట్టి, పొట్టి ,అని పిలవడం మొదలు పెట్టేరు.
నాకు గట్టిగా అరచి చెప్పాలని ఉంటుంది..నేను పొట్టి కాదు, నా పేరు చంద్రకళ అని..
అమ్మో, ఆ రామలక్ష్మి, నోరు ఎంత పెద్ద దో? తనకే మహా ఎక్కువ అనుభవం ఉంది ,అని..
రమేష్ సారు..పక్క నిలుచుని, ఎందుకు పిలిచారు? అన్నట్టు..కళ్ళెత్తి ప్రశ్నిస్తూ ,"మీకందరికీ ఊరులోకి వెళ్ళడానికి బస్సు వేసాం, మినీ బస్సు...
కాసేపాగితే..అందరి తో వెళ్లోచ్చని."
యునియన్ ఏవో అడిగింది ,అని తెలుసు, మాకేమి పట్టదు..మా పనేమిటో ..అంతే ..మాకు ఎక్కువ కోరికలు లేవు.కాని, ఒక్కోసారి, కుట్టిందే కుట్టి, ఆ మషీన్ మీద ,నాకయితే..విసుగు వస్తుంది..ఇంకా ఏవో కొత్త రకం గా కుట్ట వచ్చని ,ఏవో ఊహలు ఉంటాయి..కాని, మా పై అధికారి రత్నం అక్క,ఆవిడ అంటే అందరికి భయమే..పావు గంట కి ఓ సారి అరుస్తూ ఉంటుంది..
"అమ్మాయిలూ, పని చేయండి..పని..మాటలు వద్దు" అంటూ.
నేను అసలే మెతక..హు..పొట్టి..అనే పేరు..ఎవరు వింటారు ..నా కొత్త ఆలోచనలు, ఊహలు.
నేను ఇవాల్టికి వెళతాను,రేపటి నిండి బస్సు అంటూ గొణిగి ,నెమ్మదిగా బయట పడ్డాను.
రెడీ, రెడీ, అంటూ ఇంతలో ఓ మినీ బస్సు వచ్చి ,బయట ఆగింది..
అమ్మాయి గారు ..ఎక్కండి..ఎక్కండి..అచ్యుతాపురం..ఎలామంచాలి ..చల్ చల్ ,మీకోసమే అమ్మాయి గారూ..మినీ బస్సు..ఎక్కండి..
అంటూ సందడి చేస్తున్నాడు..
హు..అమ్మాయిగారు.. నేను?
డ్రయివరు నేనే, మూడు ట్రిప్పులు వేస్తాం..రండి..రండి..మీరే నా మొదటి కష్టమారు. రండి, రండి..అంటూ అతి చనువు..
సన్నగా, రివట లాగ,ఉన్నాడు, కుర్రాడు, చురుకే..చంద్రం అమ్మాయిగారు..నా పేరు..
అరే..నా పేరు చంద్రకళ అన్నాను..అప్రయత్నం గా..
భలే, భలే, మంచి పేరు..చంద్రుడి కళ ..అంటూ..నాలుక కరుచు కున్నాడు..
నాకేమిటో, ఒక్కసారి సిగ్గు ముంచుకు వచ్చింది.
నాకివాళ పని ఉంది, నేను నడిచి వెళ్లి పోతాను దగ్గరే..అంటూ దడ దడ లాడే గుండెతో..నడవడం మొదలు పెట్టాను..
రేపటినిండి ..ఎక్క వచ్చు..ఈ బస్సు..అని
చూస్తూండగానే..ఒక వారం గడిచింది.
బిల బిల మంటూ, మేం అందరం బస్సు ఎక్కి మాటలు..
చంద్రం హుషారుగా బండి నడుపుతూంటే, చాల మంది అమ్మాయిల గుండెలు రెప రెప లాడేవి, నాకు తెలుసు.
రైట్ ,రైట్..అంటూ చంద్రం బస్సు తెచ్చి ,కంపనీ ముందు ఆపేవాడు..
ఓ రోజు, నేను బయటకి రావడం ఆలస్యం అయింది..పద పద.అని అందరూ తొందర పెడుతున్నారు..
ఉండండి, ఉండండి..చంద్ర కళ అమ్మాయి గోరు రావాల అన్నాడు ట..
అందరూ పొట్టి, పొట్టి..అని అరిచేసారు..
చంద్రం విని నిర్ఘాంత పోయాడు ట.
చాస్..చంద్ర కళ..అన్నాడు ట మళ్లీ..ఒకటే నవ్వులు..అదే పొట్టి..అన్నారు ట..
చంద్రం చాల బాధపడి పోయి, ఏంటండి? అది..శుబ్రమయిన పేరు ఉండగా? అని గొనుక్కున్నాట్ట..
నా తోటి అమ్మాయి, శోభ చెప్పింది.
బస్సు దిగి, ఇద్దరం నడుస్తూంటే, మా ఇల్లు ఒక్క వీధి లోనే, పొట్టి, ఆ డ్రైవరు కి నువ్వు అంటే ఇష్టమే..అంది..
నేను తల దించుకుని..చ అదేమిటే? తప్పు..ఇలా మాట్లాడకు.. అని అన్నానే, కాని, మనసులో గులాబీలు పూసినట్టు అనిపించింది.
నెల, రెండు నెలలు గడిచి పోయాయి..
రోజూ చేసే పనులే, ఇప్పుడు ఉత్సాహం గా చేస్తున్నాను..
చంద్రం..ఒక రోజు, బస్సు లో నేను ఒక్కర్తిని కూర్చుని ఉన్నప్పుడు, ఈ మధ్య ,ఇలాగే అవుతోంది, నేను గబా గబా నడుచుకుని వచ్చి , ముందే కూర్చుంటాను బస్సు లో, అందరి కన్నా.
"పొట్టి, పొట్టి, అంటూంటే మీరు ఎందుకు ఊరుకుంటారు? మంచి పేరు ఉంది కదా ..మీరు చెప్పండి..ఊరుకోకండి.."
అన్నాడు.." నా కేమిటో..భయం ..చమటలు పడతాయి, ఎదిరించి మాట్లాడాలి అంటే.." గట్టిగా ఊపిరి పీల్చి "నా పేరు అంటే నాకెంత ఇష్టమో? "
"ఇంకేమిటి? ఇవాళ నించి, నన్ను అలా పిలవకండి.. అని చెప్పండి.."
ఇంతలో, అందరూ వచ్చేసారు ..మా మాటలు ..ఆగిపోయాయి..
ఇలాగే, నన్ను పలకరించి, ఏదో ఒక మాట చెపుతూ ఉండే వాడు.
ఆరు నెలలు ఇట్టే,గడిచి పోయాయి..
ఆ రోజు, మా పెద్ద ఓనర్ కొడుకు, చిన్న ఆయన అచ్యుత్ ట పేరు, విదేశాల లో పెద్ద చదువులు చదివి వచ్చాట్ట.
ఆయన వస్తున్నాడు, మా పనులు అన్ని చూడడానికి..
ఇంకా పెద్దది చేస్తారు ట కంపనీ. ఇంకా పెద్ద ఆర్డర్లు రావాలి అని కోరుకోండి,మీకు జీతాలు కూడా పెరుగుతాయి..అని రమేష్ సారు..మా అందరికి ముందు రోజు నించి ,చెపుతూ ఉన్నారు.
అందరం మంచి బట్టలు వేసుకుని, బాగా తయారు అయ్యి వచ్చాం.
చిన్న ఓనర్ గారి ని మెప్పించాలని..అందరికి ఏదో ఆశ.
నేనూ అలాగే తయారు అయ్యాను మరి, అందరి లాగే.
ఉదయం .పది అయింది..మషిన్లు అన్ని..టక టక మని నిర్విరామం గా పని చేస్తున్నాయి. మాకందరికీ తానులు బట్ట ఇస్తారు, ఒక మోడల్ గవును ఉంటుంది, చిన్న పిల్లలకి డ్రెస్సులు, మేం కుట్టేవి..
అవి, అలాగే కుడతాం..అందరం అదే పని కాదు, ఒక వరస కట్ చేస్తారు, మరి కొంత మంది, కుడతారు..మరి కొంత మంది, గుండీలు, చిన్న ,చిన్న పువ్వులు అతికించడం చేస్తారు..విదేశాల లో పిల్లలు కదా..అన్ని చాల బాగా కుదరాలి, ఏదయినా తేడా వస్తే, అక్కడ ఊరుకోరు ట.
అందుకే నాణ్యమయిన బట్ట..అంత సరిగ్గా అమరాలి, ఏ తేడా లేకుండా..
మా ఊరులో ,వెలిసి పోయి, గుండీలు ఊడి పోయి, ఓ పిన్నీసు పెట్టుకుని ,గవును లు వేసుకుని తిరిగే పిల్లలు గుర్తు వస్తారు నాకు, అప్పుడప్పుడు. మన దేశం లో పిల్లలికి నాణ్యత అక్కర లేదా? అని ఒక్కోసారి అనుకుంటాను ,నాలో నేను.
నేను ఇలాగే ఏవో ఆలోచనలో పడి పోతూంటాను..తల కిందకి వంచి ,గవును కుడుతున్నాను..
మాటల అలికిడి..తల పై కెత్తాను..
రమేష్ సారు ,వెనక ఇంకా నడుస్తున్నారు.. అచ్యుత్ సారు, నా ముందే నిలుచుని ఉన్నారు.
నా మషీన్ పక్కనే .బల్ల మీద ,నేను మిగిలిన బట్ట ముక్కల తో కుట్టిన చిన్న గవును ఉంది, అది అతని చేతిలో ఉంది.
అమ్మో, తప్పు చేసేనా? మేం బయటకి ఒక్క సూది అయినా తీసుకు వెళ్ల కూడదు, అందుకే ,నేను ఖాళీ సమయం లో, నా ఊహ తో, ఈ డిసైన్ తో ,ఒక చక్కని గవును కుట్టాను ..
కాని, ఎవరికీ చూపించాను..?ఊరికే నా బల్ల మీద పడి ఉంది.
ఆహా ! ఎంత బాగుంది? ఎంత కొత్త దనం? ఒక్కటే రంగు, ఒక్కటే నమూనా..పిల్లలికి విసుగు రాదూ..
రమేష్, ఈ అమ్మాయి ఎవరు? అంటూ నా వేపు చూసి,
"నువ్వే కుట్టవా? నీ పేరేమిటి?"
అని అడిగేరు..
నేను స్మభ్రమం తో.."చంద్ర కళ" అమి చెప్పేను..
అచ్యుత్ గారు, భలే బాగుంది అమ్మా..అని మెచ్చుకుని ,నా భుజం తట్టి..
రమేష్..నీతో మాట్లాడాలి.. అంటూ నడిచేరు ముందుకి.
ఆకాశం అందుకున్నట్టే ఉంది..నా భుజం తట్టేరు .అంత మందిలో ..నా పేరు అడిగేరు.
ఒక వారం రోజుల లో, నాకు ఒక గది, విడిగా, అందులో నా పని కొత్త నమూనాలు తయారు చేయడం..అక్కడ చదువుకున్న అమ్మాయిలు ,ఉన్నా,నా అభిప్రాయం కూడా అడుగుతున్నారు..మరి ఓనర్ గారే మెచ్చుకున్నారు కదా..
ఎన్నో రోజుల నించి, నా మనసులో ఉన్న కొత్త ,కొత్త ఊహల కి రూపం వస్తోంది. నా కే నమ్మశక్యం గా లేదు.
బస్సు ఎక్కుతున్నాను..పొట్టి ..ఎవరో..పిలుస్తున్నారు..
చంద్ర కళ ,అలాగే పిలవండి.. అని ద్రుడం గా చెప్పేను..నేనే నా??
చంద్ర ,డ్రైవర్ కి ఎవరో చెప్పేరు, నన్ను ఇంకా ఆరాధన గా చూస్తున్నాడు ఇప్పుడు.
డ్రైవర్ లకి యునిఫోరం ఇస్తున్నారు..సంతకం పెట్టి ఇమ్మన్నారు ..ఫోరం..
చంద్ర సిగ్గు పడుతూ ,నా ముందు తల ఒంచుకుని, నాకు అక్షరం ముక్క రాదు, మీరే నింపండి..అన్నాడు..
నేను నిర్ఘాంత పోయాను..నాకు నా పేరు చంద్ర కళ అని గుర్తు చేసిన ఈ చంద్రానికి ,చదువే రాదు.
"నువ్వు, చదువుకోవాలి, చంద్రం..నా దగ్గరికి రా.. సెలవు రోజుల్లో చెపుతాను, సంతకం పెట్టడం రావాలి, లైసెన్సు ఎలా వచ్చింది నీకు? రోడ్ మీద బోర్డులు చదవాలి కదా..చాల అపాయం.."
ఒళ్ళు జలదరించింది..దారిలో అపాయం తలచుకుని..
నా మొహం లోకి ఒక్కసారి.చూసి," నాకు ఇప్పుడు చదువు వస్తుందా? ఆ అదే వస్తుంది, మీరు చెబితే, మా చంద్ర కళ టీచరమ్మ చెబితే?
అంటూ నవ్వేడు కళ్ళ తో..
మా కళ్ళు ఒక్కసారి కలుస్కుని విడి పోయాయి..
చంద్ర కళ ని నేను, ఇప్పుడు, నా పేరు చంద్ర కళా అనే పిలుస్తున్నారు అందరూ, అంతే చాలు నాకు..
ఎక్కడో , ఎప్పుడో చదివిన ఒక ఆంగ్ల కథ ఆధారం గా, నేను కల్పించిన కథ ఇది.

చాలా బాగుంది...
రిప్లయితొలగించండిధన్యవాదాలు మాధవి..
రిప్లయితొలగించండివసంతం.
బాగుంది .
రిప్లయితొలగించండి'చంద్ర'కళ ఇద్దరు భలే బాగున్నారు, కథ బాగుందండి😍
రిప్లయితొలగించండి