అర్పణ భారత దేశానికి బయలు దేరే విమానం లో కూర్చుని..
ఎప్పుడెప్పుడా ? ఇరవై సంవత్సరాల క్రితం దూర మయిన తన మాతృ దేశం ఎప్పుడెప్పుడు చూస్తానా? అని గంటలు, నిముషాలు లెక్క పెట్టు కుంటోంది.
అమ్మ ఎందుకో తన దేశం గురించి ఎప్పుడూ చెప్పదు..అమ్మా..ఇండియా కి వెళదామా? అంటే..సెలవులలో, ఫ్లోరిడా బీచ్ అంటుంది, లేక పోతే లండన్ బ్రిడ్జ్ అంటుంది..
ప్రపంచం లో అన్ని దేశాలు తిరిగినట్టే ఉంది..ఒక్క ఇండియా తప్ప.నాన్న..హు..నాన్న ఒక ముని..మాట్లాడడు..వైద్యాలు చేస్తారు అందరికి,కాని, మా ఇంటికి మటుకు ఎప్పుడూ అశాంతి రోగం..
ఒక పెద్ద భవనం కట్టేరు, అన్న చైనా కి వెళ్లి పోయాడు..ఏదో నేర్చు కుంటాను అని వంక పెట్టి, నా డిగ్రీ కూడా అయింది..ఇంక ఉద్యోగం లో చేరాలి.
మూడు నెలల గడువు తీసుకుని, నా దేశం చూసి రావాలని ప్రయాణం అయాను.ఆఖరి నిముషం లో చెప్పేను, అమ్మ కి. ఫలానా హెల్ప్ గ్రూప్ లో, పల్లెటూర్ల లో సేఫ్ వాటర్ ప్రాజెక్ట్ లో ఫీల్డ్ వర్క్ చేసి ,వివరాలు సేకరించాలని.
మాకు చిన్నప్పటి నించి, సంఘ సేవ చేయడం అలవాటే..మా స్కూల్స్ లోవాటికి మార్కులు కూడా ఇస్తారు.
అమ్మ కోపం గా చూసి, నాకు చెప్ప లేదేం? అంది.
నువ్వు వద్దు అంటావు కదా అమ్మ..గొడవ ఎందుకు ? అని..
నాన్న కి తెలుసా? ఊ ..అని అస్పష్టం గా పలికి ,నాన్నకి ముందు నించి తెలుసు అంటే, ఎంత గొడవో?
అయినా ,ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇద్దరి మధ్య మాటలు లేవు. అమెరికా లో అయితే ,ఇంత పడక పోతే విడి పోతారు.
చిన్న తనం లో ,స్నేహితులు ,స్కూల్, సెలవులు , వడి వడి గా నడిచే జీవితం లో లోటు తెలియ లేదు.
కాలేజ్ కి వెళ్ళేను..సెలవుల్లో ఇంటికి రావాలంటే..ఎంత బాధో?
శూన్యం గా ఇల్లు..మాటలు లేని ఇల్లు..మాకు ఎవరూ చుట్టాలు, బంధువు లు లేరా? ఎవరూ రారేమిటి? ఒక ఫోన్ అయినా చేయ రేమిటి?
అమ్మమ్మ పోయిందని ఒక వార్త ఎప్పుడో వచ్చింది..
అంతే..తాతగార్లు ముందే లేరు.
నాన్న గది లోకి .వెళ్లి తలుపు వేసుకుని, ఎందుకు బాధ పడతాడు?
అన్నీ ప్రశ్నలే..
"మా కోసమేనా? కల్సి ఉన్నారు" అంటే..
"ఊహు..మీ అమ్మ నన్ను ఇష్ట పడి చేసుకుంది.."
"నేను వదలలేను..ఆమె ని.".నాన్న సమాధానం.
ఆలోచనల మధ్య, నిద్ర పోయి లేచేసరికి ,విమానం ఢిల్లీ లో ఆగింది.
ఆలోచనల మధ్య, నిద్ర పోయి లేచేసరికి ,విమానం ఢిల్లీ లో ఆగింది.
ఢిల్లీ లో విమానం మారి అక్కడ నించి హైదరాబాద్ విమాన శ్రయం లో దిగేను..
తన ప్రాజెక్ట్ గ్రూప్ , నించి ఒకరు వచ్చి స్వాగతం పలికేరు.
ప్యాంటు ,షర్టు , ఏమయినా ఇబ్బందా? అనుకుంది కాని, చాల మంది అమ్మాయిలే జీన్స్ ,టీ షర్టు లో కనిపించేరు.
ముందే ఒక కుటుంబం తో ఒప్పందం చేసుకుంది, నెట్ ద్వారా..వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండ డానికి.
ఇద్దరే ఉంటారుట.వారి సొంత ఇంట్లో .శాంత, నరసింహం గారు ..పిల్లలు అమెరికా లో ఉన్నారు..వారు ఇలా విదేశీ అతిథులకి ఆతిథ్యం ఇవ్వడానికి ,తమ పేర్లు నెట్ లో పెట్టేరు.
అలా, నాకు తెలిసి, విద్యా నగర్ లో ఉన్న వారింటికి వచ్చేను.
చాలా ఆప్యాయం గా ఆహ్వానం పలికి, అర్పణ..తెలుగు లో మాట్లాడ గల వా? అని అడిగేరు.
చక్కగా కాదు ,కానీ, కొంచం, కొంచం మాట్లాడుతాను, ఇంట్లో తెలుగే మాట్లాడుతాను, ఈ మధ్య అలవాటు పోయింది ,త్వరగానే మళ్లీ నేర్చు కుంటాను..అని సమాధానం చెప్పేసరికి..చాల సంతోషించేరు.
రెండు రోజులు ,హైదరాబాద్ లో విశ్రామం..తరువాత నల్గొండ చుట్టూ పక్కల ఊర్లు, పల్లెటూర్లు తిరిగి, అక్కడ మంచి నీటి లో ఫ్లౌరిడ్ ఎక్కువ శాతం ఉన్నట్టు తెలిసింది, వాటి వివరాలు సేకరించాలి.
అక్కడ అవసరాలని గుర్తించి, ,ప్రపంచం అంతా మంచి నీరు కోసం పాటు పడే ఒక అమెరికా సంస్థ కి నేను రిపోర్ట్ చేయాలి.
ఆ పైన వారు ,తగిన సాయం చేయడానికి నిధులు విడుదల చేస్తారు.
"ఎంత దూరం నించి వచ్చావు అర్పణ ! ..ఎంత మంచి మనసు నీది..పక్కనే ఉన్న మా రాష్ట్రం ఊరి లో కష్టాలు ,ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు."
"ఎక్కడో అమెరికా లో ఉన్న వారికీ మన దేశ ప్రజల మీద ఎందుకు అంత ప్రేమ?" శాంతమ్మ గారు ఆశ్చర్యం గా అడిగేరు.
నాకు ,ఎక్కడి నించి మొదలు పెట్టి చెప్పాలో తెలియలేదు," అమెరికా ఒక రిచ్ ..గొప్ప దేశం, అక్కడా పేద వాళ్ళుంటారు, ముఖ్యం గా నల్ల వారు."
"అక్కడ అవకాశాలు ఉపయోగించుకుని, అంతు లేని సంపదలు సంపాదించిన కొంత మంది , ఏదో చేయాలని, ప్రపంచం లో పేదరికం రూపుమాపాలని ,ఏవో ఉద్దేశాలు తో ,కొన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు. బిల్ అండ్ మెల్లి గేట్స్,వార్రెన్ బుఫ్ఫే ,ఇలాంటి వాళ్ళే. అలాగే కొంత మంది ,తమ పేర్లు బయటకి రాకపోయినా , ప్రచార ఆర్భాటాలు లేకుండానే ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తూంటారు. మన భారతీయులు కూడా ఉన్నారు ,మీరు నమ్ముతారా?"
"నేను ఉద్యోగం చేయబోయేది, అలాంటి ఒక మంచి పని చేసే ఒక ట్రస్ట్ లో"
అని చెప్పేసరికి ,శాంత గారు చాలా సంతోషించేరు..
"నీకు అంతా మంచే జరుగుతుంది అర్పణ ..నువ్వు చాలా మంచి పిల్లవి..అని నిండు మనసు తో నన్ను ఆశీర్వదించేరు."
ఇక్కడికి రావడానికి ఒక కారణం..నా ఉద్యోగానికి ఇది ఒక అనుభవం గా ఉపయోగ పడుతుందని..ఇంకొక ముఖ్య మైన..ఎవరికీ చెప్పని విషయం..నా వాళ్ళు, అంటే మా బంధువులని వెతకాలని..

రెండు వారాలు నల్గొండ చుట్టూ పక్కల అంత తిరిగేం., నా ప్రాజెక్ట్ కి ఇక్కడ ,హైదరాబాద్ లో ఒక ఆఫీసు ఉంది, ఇద్దరు అబ్బాయిలు ,నాకు తోడూ గా వచ్చేరు, ఒక జీప్ ఇచ్చేరు.
వాళ్ళకి కూడా నేను అమెరికా నించి ఇక్కడికి రావడం..ఒక పెద్ద ఆశ్చర్యం.
పరిస్థితులు చాలా దారుణం గా ఉన్నాయి, మంచి నీళ్ళు అందించడం సరే, ముందు గా ,ఆ నీరు తాగి ,కాళ్ళు వంకర అయిపోయిన వారి కి ,సాయం అందాలి, అని అది కూడా రిపోర్ట్ లో రాసేను.
ఫోటోలు తీసేం, వివరాలు సేకరించెం ..మమ్మలిని చూసి, ఏదైనా ధన సహాయం చేస్తారా? అని అడిగేరు కొందరు. నాకు ఏం జవాబు ఇవ్వాలో అర్ధం అవలేదు.
హైదరాబాద్ లో చూడవలసిన ప్రదేశాలు ,అన్నీ చూపించేరు. శాంత గారు.
నేను వైజాగ్ వెళ్ళాలి అండి..అన్నాను..
"ఒక్కర్తివి? నీకు భయం లేదా?"
" అదేం లేదు, నాకు అలవాటే..ఆఫ్రికా అవి చూసి వచ్చేను సెలవులకి, ఒక్కర్తిని",అనేసరికి, ఎంత ఆత్మ విశ్వాసం తో ఉంటారో ,అక్కడి పిల్లలు..అని మెచ్చుకున్నారు.
" అదేం లేదు, నాకు అలవాటే..ఆఫ్రికా అవి చూసి వచ్చేను సెలవులకి, ఒక్కర్తిని",అనేసరికి, ఎంత ఆత్మ విశ్వాసం తో ఉంటారో ,అక్కడి పిల్లలు..అని మెచ్చుకున్నారు.
ఏమో మరి, మాకు జాగ్రత్తలు చెపుతారు ,కాని భయాలు తెలియవు.
నాన్న కి మెయిల్ రాసి, నాన్న ఇంటి అడ్రస్ వైజాగ్ లో తెలుసు కున్నాను.
అప్పుడే ఒక విషయం రాసేరు ..అప్పూ..నీకు ఒక అత్త ఉంది, అంటే తెలుసు గా, నా సొంత చెల్లెలు.
ఒకసారి ,ఎలా ఉన్నారో చూసి రా..అని..
ఇంక ఒక్క నిముషం కూడా ఆగలేను అనిపించింది.
శాంత గారు జాగ్రత్తలు చెప్పేరు, విమానం లో ఎగిరి, వైజాగ్ లో వాలేను, టాక్సీ మాట్లాడుకుని, నాన్న చెప్పిన సీతమ్మ దార లో ఎనిమిదో వీధి లో, నాలుగో ఇల్లు..అక్కడ అన్నీ అపార్ట్మెంట్స్ కనిపించాయి.
అయినా ఆశ చావక, మెల్లిగా నడపమని, ఒక్కో ఇల్లు చూస్తూ వెళుతున్నాను..
నా కళ్ళకి, ఒక సంభ్రమం.. అర్పణ టవర్స్ అని పెద్ద ,పెద్ద అక్షరాలతో.నాకు ఎదురుగానే ఒక అయిదు అంతస్తుల భవనం..
అర్పణ ..నా పేరే..తప్పకుండా ఇది నా ఆత్మీయుల, బంధువుల కి సంబంధించినదే అయి ఉంటుంది.
ఉద్వేగం తో,నాతో తెచ్చుకున్న ఒకే ఒక బ్యాక్ ప్యాక్, భుజాన వేసుకుని, టాక్సీ దిగేను.
మా ఇంటి పేరు చెప్పేను, ఎవరు కావాలమ్మ? అన్న వాచ్ మాన్ కి
అత్త పేరేమిటి? ఊ..గుర్తు వచ్చింది.
శ్యామల ..శ్యామల గారు..అంటూ సందేహం గా అనేసరికి..
మాడం గారా? పెంట్ హౌస్ లో ఉంటారు అమ్మ..
పదండి నేను తీసుకు వెళతాను, బాగ్ ఇవ్వండి అన్నాడు.
ఫర్వాలేదు, నాకు అలవాటే..అని చనువు గా బాగ్ భుజాన్ వేసుకుని ముందుకు నడిచేను.
వాచ్ మాన్ ని ఏం అడగను? ఎవరెవరు ఉంటారు? నన్ను ఎలా ఆహ్వానిస్తారు? ఇన్నేళ్ళ ,తరువాత, నన్ను నేను ఎలా పరిచయం చేసు కోవాలి? లిఫ్ట్ ఐదో అంతస్తు చేరే లోపల, ఎన్నో రకాల ఆలోచనల తో, నాకు ఒక్క సారి,కళ్ళ లలో నీళ్ళు తిరిగేయి.
ఐదో అంతస్తు తరువాత, ఒక పది మెట్లు..అవి ఎక్కి ఒక చిన్న వరండా , అందమయిన గ్రిల్ తలుపు. తలుపు పైకి అందం గా ఒక మనీ ప్లాంట్ పాకి ఉంది.
నాన్న..నాన్న కి ఎంత ప్రాణమో? మొక్కలు అంటే, ఇంటి నిండా పెంచుతున్న మొక్కలు, నాన్న చేతి చలవే..
వాచ్ మాన్ బెల్ నొక్కి, వినయం గా నిల్చున్నాడు.
మాకు ఇలాంటి మర్యాదలు ,అలవాటు లేదు..ఎవరి తాళం, వాళ్ళు తీసుకుని ,ఇంట్లో కి వెళ్ళడమే ఎవరి బరువు, సంచీలయినా ,సూట్ కేస్ లు అయినా ,ఎవరిదీ వారు మోసుకోవడమే.
ఇక్కడ ఎంత మర్యాద గా ఉన్నారో? అనుకున్నాను..
ఇంతలో..ఎవరూ అంటూ.. ఒక స్త్రీ ,సింపుల్ గా ఎంత బాగున్నారో?
ఈవిడేనా? నా అత్త.
అమ్మా ! ఈ అమ్మగారు మీకోసం వచ్చేరు..అని, తన పని అయిపోయిందని, కిందకి వెళ్ళిపోయాడు.
థాంక్స్ ..అని చెప్పేను..నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
నువ్వు..మీరు..అంటూ, తలుపు తెరిచి, నేను అత్తా, అర్పణ, అంటూ ,కళ్ళ లోంచి కారుతున్న నీళ్ళు ని తుడుచు కున్నాను, చేత్తో.
ఆ ..ఆశ్చర్యం తో మొహం విప్పారింది అత్త కి.నేను నమ్మలేక పోతున్నాను..
అంటూ, ఆప్యాయం గా దగ్గరికి తీసుకుని, బుగ్గ మీద ,చుంబించింది.
ఎంత హాయిగా ఉంది? ఆ స్పర్శే..
లోపలి వెళ్ళాం..నన్ను అలా చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకువెళ్ళి, అమ్మా! ఎవరు వచ్చేరో? చూడు..
ఆ..ఈ సారి నా మొహం విప్పారింది ఆనందం తో, నాయనమ్మ ఉన్నారా? నాన్న ఎందుకు ఎప్పుడూ చెప్పలేదు.
ఇంకా ఆ తరవాత రెండు గంటలు, నా జీవితం లో మర్చి పోలేని, మధుర మయిన గంటలు.
బంధువులు, ఆత్మీయులు కోసం పరి తపిస్తున్న నా మనసు లో మల్లెలు ,గులాబీలు ఒక్కసారే పూసినట్టు .వింత హాయి, శాంతి.
ఎన్నో ప్రశ్నలు..నేను వాళ్ళని అడగడం, వాళ్ళు నన్ను అడగడం..
ఎప్పుడో ఆరేళ్ళ ప్పుడు చూసారుట,నన్ను.
మళ్లీ, ఇన్నేళ్ళకి.
వద్దనా వినిపించు కోకుండా ,ముద్దలు కలిపి పెట్టేరు, అత్త ,నాయనమ్మ కలిసి..
రాత్రి అయేసరికి, నాకు ఒక బావ ఉన్నట్టు, బెంగుళూర్ లో ఉద్యోగం చేస్తున్నట్టు, పేరు గోపాల్ అని, ఒక మరదలు కూడా ఉంది, పెళ్లి అయిందని ,ఈ మధ్యే, నా కన్నా ఒక్క ఏడాదే పెద్ద. ఆమె పేరు రత్న అని మావయ్య ,ఒక కాలేజ్ నడుపుతున్నారని, అత్త కూడా అదే కాలేజ్ లో పని చేస్తోందని ,తెలిసింది.
నా వివరాలు అన్ని కూడా, మళ్లీ ,మళ్లీ, అడిగి తెలుసు కున్నారు.
నా బ్యాక్ ప్యాక్ ఒక గది లో పెట్టేరు, ఇల్లు ఎంత నీట్ గా ,చాలా హాయిగా ఉంది, సొంత ఇంటికి వచ్చినట్టు.
రాత్రి హాయిగా పడుకున్నాను.
మర్నాడే , మళ్లీ కబుర్లు..దోశలు వేస్తూంటే..అత్త..అసలు ఎందుకు, మా నాన్న ..మీతో..అంటే, హుష్ ,అని నోటి మీద వేలు పెట్టి, తరవాత అంది.
మధ్యాన్నం భోజనం కూడా అయిపొయింది..
ఇంక నేను ఆగ లేక పోయాను.
నా గది లోకి లాక్కు వెళ్లి,
ఇప్పుడు చెప్పాల్సిందే.అత్తా..అంటే,
అత్త..ఎందుకురా..ఇప్పుడు,అని, సరే, నీకు చెప్పాల్సిందే ఎలాగయినా..నా బాధ్యతా కూడా తీరి పోతుంది.

నీ బాధ్యతా? అని ప్రశ్నార్ధకం నా మొహం లో.
బీరువా తెరిచి, నా చేతిలో ఏవో కాగితాలు పెట్టింది.
నాకు వివరం గా చెప్పు, ఇవన్ని నాకు తెలియదు, అని తిరిగి ఆ కాగితాలు ఆమె చేతికే ఇచ్చేశాను.
ఇవి, నీ పేరు మీద, నీ అన్న అపూర్వ్ పేరు మీద ఫ్లాట్ ఓనర్ లు గా పేపర్లు. షుమారు ఇరవై ఏళ్ళ, క్రితం, మేం చాలా కష్ట మైన పరిస్థితులు ఎదురుకుంటున్న సమయం లో, మీ నాన్న ఒక్కడూ ముందు ,వచ్చేడు, నాకు అమెరికా లో ఒక ఇల్లు ఉంది, నాకు ఇక్కడ ఇంటి తో పనేమీ ఉంటుంది, ఎలాగు అమ్మా నీ దగ్గరే ఉంది, మా దగ్గరికి రానంటోంది, నా వాటా, కూడా, ఈ ఇంటిలో ,నీ పేరు మీద రాసేస్తున్నాను, నువ్వు లోన్ తీసుకుని, మీ కాలేజ్ బాగుపడే వరకూ , ఇబ్బంది పడకుండా గడపండి..అనేసి, వద్దు అన్నా విన కుండా నా పేరు మీద ఈ ఇల్లు ,ఒకప్పుడు ,ఇది ఒక చిన్న ఇల్లు, చుట్టూ పెద్ద స్థలం, రాసి ఇచ్చేసాడు అన్నయ్య.
అంటే పవర్ పట్టా ,రాసి ఇచ్చేసాడు, నా పేరు మీద.
మాకు అప్పుడు చాల అవసరం ,మీ మావయ్య ఏ కాలేజ్ లోనూ పని చేయలేక, తనే సొంతం గా కాలేజ్ పెట్టుకోవాలనే ఆలోచన లో ఉన్నారు. ఆ ఆస్థి పేపర్లు తనఖా పెట్టి, మేం ఒక చిన్న భవనం అద్దెకి తీసుకుని, సొంతం గా జూనియర్ కాలేజ్ మొదలు పెట్టేం.

అ అ ..అంటే AA A square అంటారు అందరూ, అదే మా కాలేజ్ పేరు. మీ పేరుల మీదే..
ఏమయిందో ,తెలియదు, మీ అమ్మకి నచ్చలేదు..ఇలా ఇల్లు రాసి ఇచ్చేయడం అని తెలిసింది. ఏం గొడవలు పడ్డారో తెలీదు.
మీ నాన్న దగ్గర నించి ఫోన్ లు రావడం తగ్గి పోయాయి. మేం చేద్దాం అంటే,మీ ఫోన్ నంబెర్ లు మారిపోయాయి, అనుకుంటాను.
మీ నాయనమ్మ కోసమయినా వస్తారేమో ,అని ఎదురు చూసాం..
మా కాలేజ్ కి మంచి పేరు వచ్చింది, కోచింగ్ కూడా మొదలు పెట్టం. ఎంసెట్ కి. ఇంకా తిరుగు లేకుండా.. ఈ ఊరు లోనే రెండు కాంపస్ లు నడుపుతున్నాం.
ఆ చిన్న ఇల్లు, ఎందుకని ఫ్లాట్స్ కట్ట డానికి ఇచ్చేసాం. మొత్తం ఇరవై ఫ్లాట్స్,అందులో రెండు ఫ్లాట్స్ మీ పిల్లల పేర్లు మీదే ఉన్నాయి, ఇదిగో ఈ పెంట్ హౌస్ కూడా,మీ నాన్న దే.
అంటే ,మీ నాయనమ్మ తన కొడుకు ఇంట్లో నే ఉంటోంది. మాకు రెండు ఫ్లాట్స్ వచ్చాయి.
అన్ని అద్దెకి ఇచ్చేసాం. మీ ఫ్లాట్స్ కి వచ్చిన అద్దెలు అన్ని, ఈ రెండు అకౌంట్స్ లో ఉన్నాయి, నా పేరు తో కలిసి ఉంటాయి..
పాస్ బుక్స్ ,నా చేతిలో పెట్టింది, చూడు అంటే, తెరిచి చూసేను, రెండిట్లో కలిపి యాభై లక్షలు వరకు ఉన్నాయి.
అమ్మో..నా చేతులు గుండెల మీదకి వెళ్ళాయి..అప్రయత్నం గా..
ఇంత డబ్బు నేనేం చేసుకోను?
నీ దగ్గరే ఉంచు అత్తా..
అని వెనక్కి ఇచ్చేసి, నాన్న కి మెయిల్ రాద్దామని, మెయిల్ తెరిచాను.
ఆశ్చర్యం..నాన్న దగ్గర నించే మెయిల్.
నీకు ఒక మంచి ,హ్యాపీ న్యూస్..అప్పు..
మీ అమ్మ నేను మళ్లీ,ఇన్నాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోయాం. నాదే తప్పు, అని నేను ఒప్పుకున్నాను, కాదు ,నాదే తప్పు అని మీ అమ్మ అంది..
తప్పు లేమిటో..మా ఇద్దరికే తెలుసు.
ఇరవై ఏళ్ళు పట్టింది, ఈ మాట మేం బయటకి చెప్పు కోవడానికి..మా ఇద్దరి ఎగో లు అడ్డం అయాయి.
మీ పిల్లలు ,అనవసరం గా బాధ పడ్డారు, మా మొండి తనం తో. మేమిద్దరం కలిసి ఇండియా రావాలని కూడా అను కుంటున్నాం..ఇంకో పది రోజుల్లో..
మా ఇద్దరి మధ్య గొడవల కారణం అయిన ఒక విషయం గా, నేను మా అమ్మ ,నా తోబుట్టువు అందరికి దూరం అయిపోయాను. అదంతా ఒక పెద్ద కథ. నేను నిన్ను కలిసినప్పుడు వివరం గా చెప్పుతాను ..
..నువ్వు ఎక్కడ ఉన్నావు?
నీ సంఘ సేవ అయిందా? అత్త ని కలిసావా?
అన్ని వివరం గా రాయి. నాన్న .
నాకు సంతోషం తో ఒక్కసారి గట్టిగా అరవాలని అని పించింది.ఏమిటి ?ఒక్కసారే ఇన్ని మంచి వార్తలు.
అత్తా..అని అరుస్తూ..ఈ వార్త చెప్పేసరికి, అందరం ఒక్క సారి ,సంతోష సాగరం లో మునిగి పోయాం..హ్మం. జీవితం లో ఇంత కన్నా గొప్ప రోజు ఇంకొకటి లేదు, అనుకున్నాను.
అమ్మ ,నాన్న కలవడం మాట్లాడు కోవడం, మంచి రోజులన్నీ నావే, శాంత గారు దీవించడం గుర్తు వచ్చింది, వెంటనే ఆవిడతో కూడా నా సంతోషం పంచుకున్నాను.
హైదరాబాద్ వెళ్ళిన మావయ్య గారు కూడా వెనక్కి వచ్చేరు, వైజాగ్ కి, అందరం కల్సి ,వైజాగ్ అంత తిరిగి చూసేం.
ఇది నా డబ్బు ,అంటారు నాన్న కూడా, నాకు ఒక ఆలోచన వచ్చింది, అత్త ,మావయ్య లతో సంప్రదిన్చేను, నాన్న తో ఒక మాట చెప్పి, ఈ డబ్బు తో, నేను చూసిన ఆ కాళ్ళు ఒంగి పోయిన పిల్లల కోసం, ఒక ట్రస్ట్ పెట్టి, ఏదయినా సాయం చేస్తాను.
నేను చేస్తున్న ఉద్యోగం కూడా ఇలాంటిదే కదా..మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలి, కదా..నా వంతు గా ,నా దేశం కోసం ఈ చిన్న ప్రయత్నం మొదలు పెడతాను.
మళ్లీ, నల్గొండ వెళ్ళాలి, ఇంకా కొన్ని వివరాలు సేకరించాలి, సహాయం అవసరం అయ్యే పిల్లల వివరాలు ,నేను కూడా సేకరించి, ఈ ట్రస్ట్ ద్వారా, వారికి సాయం చేస్తాను.
అవసరం అయితే వైద్యం, చదువు కి, వ్హీల్ చైర్ ల కి, సహాయం అందించాలి చాల పనులు కనిపిస్తున్నాయి.
అమ్మ ,నాన్న ఇంకో పది రోజుల్లో వస్తారు, తాజ్ మహల్ ,నేను ఒక్కర్తిని వెళ్లి చూడాలి అనుకున్నాను.. మన దేశం లో ఉన్న అద్భుతం కదా, ఇప్పుడు మేం ముగ్గురం కలిసి చూడ వచ్చు, వీలయితే అన్నయ్య ని కూడా ఇక్కడికే రమ్మని చెప్పాలి, అవును..చెప్పాలి..
మేం నలుగురం ఊహు..అత్త,మావయ్య ,నాయనమ్మ ..నా కుటుంబం ఎంత పెద్దది అయిపోయిందో..ఒక్కసారి గా..ఈ మాతృ దేశ ప్రయాణం ,ఎంత సంతోష కరం గా మారింది..అని ఆలోచిస్తూ, ఆ రాత్రి తృప్తి గా నిదుర పోయింది అర్పణ.
కలలు నిజం అయిన వేళ ..ఆ రాత్రి.
Superb, Natural and Heart Touching. ..
రిప్లయితొలగించండిధన్యవాదాలు రాజేష్ మారం గారు, కొంచం పెద్ద కథ రాయాలని ,ప్రయత్నించాను.మీకు నచ్చినందుకు..
రిప్లయితొలగించండిచాల సంతోషం. ఇంకా..ఇంకా బాగా రాయాలని..నా ప్రయత్నాలకి ,మీ లాంటి వారి నించి ఒక్క అభిననందన చాలు..
వసంతం.
చాలా చాలా బాగుంది....
రిప్లయితొలగించండిహృదయాన్ని కదిలించే విధంగా ఉంది మీ రచనా శైలి....
థాంక్స్ మాధవి, మీరు నా కథలు తప్పకుండా చదివి, మీ అభిప్రాయం కూడా రాసి పెడుతున్నారు.
రిప్లయితొలగించండిఅది నాకు ఎంత సంతోషం ఇస్తుందో చెప్పలేను, పదాలు తో మీకు ఒక వంతెన వేసాను.
నా కథ ఒక్కరిని ని కదిలించినా అది నాకు ఒక పెద్ద అవార్డు. మరో కథ రాయడానికి ,ఈ ప్రశంసలు
ఎంత ఉపయోగ పడుతాయో..చెప్పలేను మాటల్లో.
వసంతం.
నిజంగా జరిగింది అనుకున్నాను. కదిలించే విధంగా ఉంది . చివరకు కామెంట్స్ లో చూసి కథానా అని కొంత నిరాశ చెందను. నిజం అయితే ఎంత బాగుండు అనిపించింది . కథ అయినా ఇలాంటి ఆలోచన మీలో ఇలాంటి ఆలోచనలు ఉన్నందుకు అభినందనలు
రిప్లయితొలగించండినమస్కారం మురళి గారు, అవును నిజం గానే ఉన్నారు..ఇలా ఆలోచించి ,మన దేశానికి వచ్చి, సేవ చేసేవారు.అక్కడక్కడ చదివిన విషయాలు, తెలిసిన వారు, అందరిని గమనించి ఒక కథ గా అల్లేను. అవును ,నిజం అయితే బాగుంటుంది కదా..ఈ ఊహ కదిలించేను..అంటే ..నాకు తృప్తి గానే ఉంది, ధన్యవాదాలు అండి, మీ అభిప్రాయం రాసినందుకు .
రిప్లయితొలగించండివసంతం.
poetically justified
రిప్లయితొలగించండిThanks andi Puranapandaphani garu.. mee comment raasi pettinanduku.
రిప్లయితొలగించండిvasantham.