ఇవాళే కూడలి లో ఈ విషయం విన్నాను. చిన్నారి గీత ప్రియ. ,ఎడబాటు తట్టుకోలేక, పాప తల్లి తండ్రులు, ఆదిలక్ష్మి-లెనిన్ గార్లు ఆత్మ హత్య ప్రయత్నం చేసారు అని,ఇది ,నిజం గా గుండెలు పిండేసే సత్యం.
లెనిన్ గారు పోయారని, ఆది లక్ష్మి గారు కోలుకుంటున్నారు అని. ఒక స్కూల్ కూడా నడిపే వీరు,ఈ కార్పోరేట్ కాలేజ్ లో ఎందుకు జాయిన్ చేసారు మీ పాపని.? ఈ కాలేజ్ లు వల్ల జరిగే నష్టాలు ,మనం చూస్తూనే ఉన్నాం. వారికి చదువు కన్నా ముందు ఒక పోటి తత్త్వం మప్పుతారు. మొదటి నెల లోనే, పరీక్సలు పెట్టి, వందకి వంద మార్కులు వచ్చిన వారి నందరిని, ఒక సేక్షున్ లో వేస్తారు.ఇంక వారికే బాగా చెప్పే మాస్టర్లు,మిగిలిన వారిని పరీక్షలు పెట్టి, మార్కులు చూపించి, మీరు ఎందుకు పనికి రారు అని వారిలో ఆత్మ న్యూనత పెరిగేలా,ఆత్మ విశ్వాసం కోల్పోయేలా ,పదే పదే ,ఒకే విషయాన్ని చెపుతూ, ఎవరేజ్ గా చదివే పిల్లలిని బాగా చదివిస్తారనే కదా ,ఈ కాలేజ్ లలో ,వేలకి వేలు ఫీజు కట్టి జాయిన్ చేస్తారు.
వీల్లందిరిని విడిగా ఒక సేక్షున్ లో పడేసి, చదువు చెప్పడం మానేసి, పరీక్షలు తో చంపుతారు. అని తెలుసు,కాని, ఇలా నిజం గా చంపేస్తారా ? నాకు కళ్ళ లలో నుంచి నీళ్ళు కారి పోతున్నాయి.
విద్య ని అందించ వలసిన ప్రభుత్వాలు ఇలా ,చదువు కొట్లు, అంగడి లు, ఖరీదు కు కొనే చదువు కొట్టాలు పెట్టడానికి అనుమతులు ఎందుకు ఇస్తారు? విద్య ప్రాధమిక హక్కు, అనేది కేవలం కాగితం మీద రాత లేన?
మధ్య తరగతి పిల్లలికి, చదువే ఆధారం..ఒక ఆధారం ఇచ్చే చదువు, ఒక ఇంజినీరింగ్ చదువే అన్నం పెడుతుందని, లక్షల్లో జీతాలు వస్తాయి అని, విదేశాల్లో ఉన్నత విద్య చదివి, ఇంకా బాగా పైకి రాగలం అని నమ్మి, ఎన్నో ఆశలతో ,ఈ కార్పోరేట్ కాలేజ్ లో జాయిన్ అవుతారు.
వారిని అనలేం,పిల్లలు బాగా పైకి రావాలని ,వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు.
ఈ కార్పోరేట్ దగా నించి విముక్తి లేదా? ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లు ఎందుకు సరి పదా లేవు? ఎందుకు ,మంచి మాస్టర్లు ని వేసు కోరు? విద్య లోనే ఇంత అవినీతి.
చీడ పట్టేసింది, ఈ విద్య వృక్షం కి, ఈ విష ఫలాలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం,
బలవంత మరణాలు, తల్లి తండ్రులకి పుత్ర శోకం మిగల్చడం, లేదా, బుర్రలు వేడి ఎక్కే బలవంతపు చదువు ల నుండి విరామం కోసం, బైకుల మీద ,అతి వేగం తో నడిపి, ప్రాణాలు కోల్పోడం, లేదా కాళ్లు చేతులు విరగూట్టుకోవడం, లేదా పనికి మాలిన నెట్ విషాని ,తలకి ఎక్కించుకుని, అమ్మాయిలను ఏడిపించడం లాంటి రాక్షస ప్రవ్రుత్తి తో, ఒక పనికి మాలిన జాతి ని తయారు చేసే వికృత కోర్ప్రేట్ సంస్థలు కి ఎవరు చరమ గీతం..పాడుతారో?
ఎవరి బాధ్యతో?? ప్రభుత్వం.. ఒక నిద్ర పోతున్న ఎద్దు..దానిని ఎవరు అంకుశం తో పోడుస్తారో?
ఎవరికీ వారు, ఇలా చేతులు ముడుచు కుని, దేవుడా? అని ఇలా ప్రాణాలు పోతున్న గీత ప్రియ లను, వారి అమ్మ నాన్న లని చూస్తూ , చేతులు ముడుచుకుని, కళ్ళు మూసుకుని, మనం ఇలా సిగ్గు లేకుండా గడపాల్సిందే..
యథా రాజా తదా ప్రజా..
లెనిన్, గీత ప్రియ ఆత్మ లకి శాంతి కలగాలని,
చదువు ఒక నరకం కాదు, అని వెలుగు నిచ్చే చదువు ఒకటి ఉన్నదని ,ఆ లోకం లోనైనా తెలుస్తుందని, భార మైన మనసు తో, ఈ టపా ఆమె కి అంకితం.