అన్నాచెల్లెళ్ళు,పెళ్లి పందిరి, కన్య దానం, చంద్ర ముఖి, ఈ పేరులు వింటే మనకి ఏవో పాత సినిమా పేర్లు గుర్తు వస్తాయి. ఈ పేరుల మీద ఇప్పుడు వస్తున్న టీ వి సీరియల్ సు చూస్తే..మనం ఎక్కడికి వెళుతున్నాం? ముందుకా? ఇంకో యుగం వెనక్కా అని అనుమానం వస్తుంది.
చిన్న పిల్లలికి పెళ్లి చేయడం, ఆ సమస్యలు, ఇప్పుడు అవి అవసరమా? మనకి. ఎప్పుడో వందేళ్ళ క్రితమే, వీరేశలింగం గారి దయ వల్ల, ఆడపిల్లలు కి ఇప్పుడు, కనీసం ఇరవై ఏళ్ళ వరకు చదువులు చెప్పిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ,వెనక్కి వెళ్లి చిన్నారి పెళ్లి కూతురు అని, కడవల కొద్ది, ఏడుపులు కన్నీళ్లు, ఇవి సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని ఆలోచించరా? ఎప్పుడో, నాలుగు వందల ఎపిసోడెస్ తరువాత ,ఎవరో మారుతారు, ఈ లోపల ,జరగవలసిన హాని జరగదా??
ఈ సీరియల్స్ లో విలన్లు అన్నిట్లో ఆడవారే..ఇంతింత బొట్టులు పెట్టుకుని, చూడ డానికే,భయంకరం గా ఉంటారు. స్త్రీలని కించ పరిచేలా ఉన్నాయి. ఈ పాత్రలు. వారికి ఇంకేమి పని లేనట్లు, ఎప్పుడూ ఏవో కుట్రలు ,కుతంత్రాలు రచిస్తూ ఉంటారు. నిజ జీవితం లో,ఎవరైనా మనకి ఇలా కనిపించారా? ఎక్కడైనా?
ప్రతి మనిషి లోనూ, మంచి- చెడు, పడుగు పేకల్లగా కలిపి ఉంటాయి. అందరి లో నూ ఏవో బలహీనతలు ఉంటాయి.ఈ రోజుల్లో స్త్రీలు, ఇంట, బయట,భర్త కి చేదోడు వాదోడుగా ,సహకరిస్తూ, పిల్లల చదువులు, వారి పెంపకం, అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు, స్నేహితులు, చేతికి వచ్చే జీతాలకి, నెలకి అయ్యే ఖర్చులు కి సమన్వయము చేస్తూ, అనారోగ్య సమస్యలు వస్తే, వాటికి సమయం వెచ్చిస్తూ, కుటుంబం లో ఎవరికీ బాగో లేక పోయినా, తల్ల డిల్లి పోయి, డాక్టర్ ల చుట్టూ తిరుగుతూ, సవ్య సాచి లాగ, కుటుంబానికి ఒక ముఖ్య కేంద్రం గా, అంతా తానై, నడిపిస్తున్నారు.
అలాంటి స్త్రీలని కించ పరిచేలా ,ఉంటునాయి ..ఈ పాత్రలు. ఎంత సేపు, ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళను ,కుట్రలు కుతంత్రాలు తో ,రాచి రంపాన పెట్టడం, ఇంట్లో నే ఇన్నేసి నగలు దింపేసుకుని, ఫుల్ మేకప్ తో, పట్టు చీరలు తో, రాత్రి కూడా అదే వేషం, ఒక అర్ధం, ఒక పరమార్ధం లేని ఈ సీరియల్స్ ని ఎలా ,ఎందుకు చూస్తున్నారో, నాకైతే అర్ధం కావటం లేదు.
చిన్నప్పుడు, అదే, కాలేజే లో అందరికి స్నేహాలు ఉంటాయి. ప్రేమలు, పెళ్లి వరకు అనుకోవడాలు ఉంటాయి.కాని, అనుకున్నవన్నీ జరగవు కదా, ఏ పదేళ్ళ తరువాతో కలుసుకుంటారు, ఇదిగో మా ఆయన, నా పిల్లలు, మీ ఆవిడా ఏది? అని పరిచయాలు చేసుకుంటారు. సరదా గా కాసేపు మాట్లాడుకుంటారు. ఇవన్ని ఎ ఎక్ష్హిబిశున్ లోనో జరుగుతాయి..మర్నాడే పిల్లాడి పరీక్ష సంగతి గుర్తు వస్తుంది..తరువాత కలుసుకుందాం, అని ఫోన్ నమ్బెర్లు పుచ్చుకుని, ఎవరి దారిన వారు చక్కా పోతారు.
ఇదే టీ వి సీరియల్ లో అయితే లాగి, లాగి, చాంతాడంత, ఏళ్ళు, ఏళ్ళు, నడిపిస్తారు, ఇంకా వివాహేతర సంబంధాలు, కుట్రలు, హత్యలు వరకు వెళ్ళిపోతుంది...నిజ జీవితం లో ఎప్పటికి ఇలా జరగవు అని నా నమ్మకం.
సమాజం లో చాల మంచే ఉంది. కొద్దిగా చెడు కూడా ఉంటుంది, కాని, దానినే పట్టుకుని, పెద్దది, చేసి, చూపిస్తోంటే, ఇదే నిజామా? మన లాగ మంచి వారికి చోటే లేదా ? అని అనుమానం తో అసహనం పెరిగి పోతుంది.
ఉడాన్,హమ్ లాగ్, బునియాద్, అమ్ముమ్మ . కం లాంటి మంచి సీరియల్స్ చూసి ఎంత హాయిగా ఆనందించాం,ఒకప్పుడు. ఎన్ని కథలు లేవు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కథలు ఒక స్క్రీన్ ప్లే అవసరం లేని దృశ్య కావ్యాలు.అమరావతి కథలు, టీ వి లో వచ్చాయి.,మళ్లీ ,మళ్లీ చూడాలని పిస్తుంది.
చలం , కొడవటిగంటి, బినా దేవి, మాలతీ చందూర్ లాంటి, మహా మహులు ఎందఱో రాసిన కథలు, నవలలు ఉన్నాయి. జనం చూస్తున్నారు, అంటే, ఎప్పుడు, చెడే ఆకర్షనీయం గా ఉంటుంది.
మన ప్రభుత్వమే, సారా తాగండి అంటూ సబ్సిడీలు ఇచ్చి మరి తాగిస్తున్నారు.మరి ఇంక మీడియా ,ఒక వ్యాపార సంస్థ అయిపొయింది.ప్రజల, మంచి, క్షేమం, వాటికి అక్కర లేదు.
పోటీ తత్త్వం పెరిగి, ఒకరిని మించి మరి ఒకరు, కనీ విని ఎరుగని కథలని కల్పించి, వీక్షకుల తెలివి ని అపహాస్యం చేస్తున్నారు.ఇంక ..
ఈ రియాలిటీ షో ల గురించి ఎంత తక్కువ చెపితే అంతా మేలు.
సభ్య సమాజం ని ,తల కిందలు చేసి, పిల్లలని, టీ వి తెర పైకి లాగి, ఒక హద్దు- పద్దు లేని దృశ్య సమాహారాన్ని, మన కళ్ళ ముందే ఆవిష్కరిస్తూ ఉంటె,మనం శాబాష్ అని చప్పట్లు కొడుతున్నాం.ఇంత కంటే ఎం రాసినా , నేను నా పరిమితులు దాటినట్టు అవుతుంది.
ఇంక అర్ధ రాత్రి వచ్చే మాంత్రికుల, నాగ దేవత మహిమలు అంటూ వచ్చే ఈ సీరియల్స్ ప్రజల లో ఎన్ని మూఢ నమ్మకాలు ,పెంచి పోషిస్తున్నాయో, ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇప్పటికి, పల్లెటూర్ల లో, సరి అయిన ఆరోగ్య వసతులు లేక ,అనారోగ్యం చేస్తే, పూజలు, పూనకాలు, మందు పెట్టడాలు అంటూ, చిల్లర మోస గాళ్ళకి బలి అవుతున్నారు. ఈ మధ్యే ,అనుమానం తో కొట్టి చంపేసిన వార్తలు వింటున్నాం.
ఇవే వార్తలని మళ్లీ, అర్ధ రాత్రి, నేరాలు, ఘోరాలు అని చూపిస్తారు. మూఢ నమ్మకాలు,ఒక చెడు గాలి లాగా వ్యాపిస్తున్నాయి. టీ వి. ఒక పవర్ ఫుల్ మీడియా.
చూస్తున్నారు కాబట్టి, చూపిస్తున్నాం, అంటూ, నెపాలు వెతుక్కోవడం కాదు.
స్త్రీలు..మీరు .ఈ సీరియల్ కి బానిసలు కాకండి.మాకు ఇలాంటి విష సంస్కృతీ వద్దు అని చెప్పండి.
అందం,హుందాతనం,దయ,నేర్పరితనం,చదువు-సంస్కారం,స్నేహం, ప్రేమ , అన్నిటి చక్కని మిశ్రమం ..స్త్రీ.
కుళ్ళు,కుట్ర,కుతంత్రం,ఈర్ష్య, ద్వేషం, కఠినం, కుసంస్కారం...ఇవి మేం కాదు..అని
నిరూపించేలా మంచి కథ ,మంచి విలువలు ఉన్న సీరియల్స్ నే తీయమని చెప్పండి.
ఇంక ఏ వి చూపించినా, రిమోట్ మీ చేతిలోకి తీసుకోండి...
సమస్త ప్రపంచం కి చిన్న బిందువు అయిన మీ కుటుంబం కి కేంద్రం మీరే. మీ చేతిలోనే రిమోట్ ఉందని ఇంక నిరూపించండి మరి.
కొస మెరుపు.
యాద్రుచికం గా ఇప్పుడే,కూడలి లో ఒక పోస్ట్ చదివాను.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో పాత్రలు ,పరిచయం చేస్తూ, ఆమె రాసిన దానిని బట్టి, పేరు లో ఉన్న ట్టు మరి అంత మూర్ఖం గా లేదని ,బాగుందని ,రాసారు.
అది ఒక్కటి ,మినహాయింపు. చాల సీరియల్స్ చాల దారుణం గా ఉంటున్నయనే నా నమ్మకం.
యాద్రుచికం గా ఇప్పుడే,కూడలి లో ఒక పోస్ట్ చదివాను.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో పాత్రలు ,పరిచయం చేస్తూ, ఆమె రాసిన దానిని బట్టి, పేరు లో ఉన్న ట్టు మరి అంత మూర్ఖం గా లేదని ,బాగుందని ,రాసారు.
అది ఒక్కటి ,మినహాయింపు. చాల సీరియల్స్ చాల దారుణం గా ఉంటున్నయనే నా నమ్మకం.
అన్నా హజారే మరో ఉద్యమం తెవాలేమో ఈ మీడియా పోకడల మీద.. ఏమైనా అంటే "పత్రికా స్వేచ్చపై దాడి" అంటారు..
రిప్లయితొలగించండిటూముచ్ అండి.. "నిన్నే పెళ్ళాడత" అని ఒక సీరియల్ లో 4 బార్యలు .ఏ ఆడది ఐన సహిస్తుందా?? ,తీసే వాడికి బుద్ది లేదు చూసేవాళ్ళకి అసలు బ్రెయిన్ లేదు .నాలుగు సంవత్సరాలు వరకు వేసారట !! పగ ,ప్రతీకారం, ఏడుపు ఇవే ఎలెమెంట్స్ .
రిప్లయితొలగించండినమస్తే శ్రీనివాస్ గారు, సాయి గారు.
రిప్లయితొలగించండిఇందాకే చూసాను జీ టీ వి లో పసుపు- కుంకుమ అనే ఆడ్..నా నుదుటన కుంకుం పెట్టు ,అంటూ దీనం గా ఒక అమ్మాయి, ఎదురు చూస్తోంది, అతని చేతిలో ఒక కుంకుం భరిణ..
స్కేల్ తో అతని చేతి మీద రెండు దెబ్బలు వేసి,ఏమిటి ,ఆలస్యం..పెట్టు ..అని గదమాయిన్చాలనుంది..అయినా ఎన్ని స్తికెర్ బొట్లు దొరుకుతున్నాయి,ఒకటి కొని పెట్టు కోవచ్చుగా.మిగిలిన జీవితానికి, తోడూ- నీడ కావాలె అంటే చేసుకోవాలి, ధైర్యం గా పెళ్లి, అంతే గాని, ఇలా పసుపు కుమకుమ ల కోసం కాదు.
స్త్రీలు కూడా అందరిని సమానం గా చూడండి, బొట్టు మనకి ఒక అలంకారం..అంతే కాని, ఏదో ఒక లోటు ని సూచించేది కాదు.
మీకు ధన్యవాదాలు చెపుతామని మొదలు పెట్టి, మళ్లీ ఇంకో బ్లాగ్ కి సరి పద రాసేస్తున్నాను.
నా బ్లాగ్స్ చదువు తున్ననదుకు మరి ఒక సరి థాంక్స్.
పాత కాలంలో దూరదర్శన్ వారు పదమూడు భాగాలే ధారావాహికకు వెయ్యనిచ్చేవారు. ఇప్పటి లాగ ఇనప రేకులు ధారావాహిక యుగాల పాటు లేదు. మళ్ళి ప్రభుత్వం పూనుకుని ఈ చెత్త డైలీ సీరియళ్ళ బారి నుండి సమాజాన్ని కాపాడటానికి అటువంటి నిబంధన పెట్టాలి.
రిప్లయితొలగించండిఈ డైలీ సీరియల్ పొరబాటున ఏ ఒక్కటైనా చూస్తే, ఒక్క మాట వాళ్ళు మాట్లాడేది వింటే ఒంటిమీద కాళ్ళ జెర్రి పాకినట్టు గగుర్పాటు కలుగుతుంది. రోజులకు రోజులు ఈ చెత్తని ఎలా చూస్తున్నారో కదా చూసే వాళ్ళు
అందరికీ ముఖ్యంగా మహిళలకు మనవి, విన్నపం-ఈ డైలీ సీరియళ్ళు చూడటం మాని మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆ టైములో హాయిగా నిద్రపొండి పరవాలేదు
వసంతం గారు మీ పోస్ట్ లో రాసినవన్నీ నూరుపాళ్ళూ నిజం
రిప్లయితొలగించండిఇక నేను చెప్పానని కాకుండా మీరు చూసి ఒక అభిప్రాయానికి రండి . మీకు నచ్చకపోయినా ఇంతటి అసహ్యం అయితే కలగదు
ఈ వారం ఆధ్ర భూమి లో వ్యసనం అని కథ వచ్చింది. సీరియల్స్ వ్యసనం నుంచీ స్త్రీలను తప్పించాలని ప్రయత్నిస్తూ తనే ఆ పిచ్చిలో పడిపోతుంది . అలా అవుతుందేమో మన పరిస్తితి :))
లలిత గారు, శివరామ ప్రసాద్ గారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పింది,అక్షరాల నిజం, మొత్తం ఎపిసోడ్ చూడకపోయినా,అక్క డక్కడ కొన్ని సన్నివేశాలు ,చూస్తే నే, నాకు విరక్తి కలిగింది. ఇంతేనా? ఇదేనా మన సంస్కృతి? ఒక అర్ధం పరమార్ధం లేని కథ తో, సాగ దీయడం ఒక్కటే ,వారి ధ్యేయం గా నడుస్తున్నాయి. మన ప్రభుత్వం దేనినైనా నియంత్రించడం ఇప్పట్లో జరిగే పని లా లేదు
లలిత..లేదు,నేను ఇప్పుడు చూసినా ,నాకు అంత గా నచ్చదేమో? సేరియాల్ ఒక్కటి కూడా నేను చూడడం లేదు...వ్యసనం..ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేం..థాంక్స్ లలిత..మీ సమాధానానికి.
మీ బ్లాగ్స్ చదివాను.కొన్ని, చక్కగా రాస్తున్నారు. మిమలిని ఇలా కలిసినందుకు సంతోషం.
మరి ఒకసారి, ఇరువారికి ధన్య వాదాలు. బ్లాగ్ చదివి మీ అభిప్రాయం కూడా రాసినందుకు.
పిచ్చి పిచ్చి సీరియల్స్, పాటల పోటీలు(దీనవల్ల యంత పోటీతత్వం పెరిగిపోతోందో),6 ఏళ్ళు నిండని పిల్లలతో ఐట౦ డాన్సులు.
రిప్లయితొలగించండిహ..హ..హ.. ఈ హింస భరించ లేక సంవత్సర౦ క్రితమే తెలుగు చానల్స్ తీయి౦చేశా౦. ఇప్పుడు హాయిగా బుచ్చిబాబు, కొడవటిగంటి,శ్రీ పాద, శ్రీ రమణ ఇలా చాలా మందితో పరిచయం పెంచుకుంటున్నాం లెండి.