నేను ఎప్పుడో ఒక్కసారి చూస్తే చాలు గుర్తు పెట్టుకుని, మళ్లీ ఆ ఇంటికి, రెండో సారి ,చక చక బండి నడుపుకుంటూ వెళ్లి పోగలను, నేనే నడపాలి స్కూటర్ అయిన కార్ అయినా.అంటే ఏవో కొండ గుర్తులు పెట్టుకుంటాను, ఇదిగో ఇక్కడ ఓ కొట్టుంది,ఇక్కడ ఓ ఇస్త్రి బండి ఉంది, ఈ మూల ఈ గుడి ఉంది..ఇలా అన్న మాట. అదిగో పక్క నుంచి ఏవో అభ్యంతర కేకలు వినబడుతున్నాయి. మొన్న యేర్పాల్ లో మా మావయ్య కొడుకు ఇంటికి ఇలాగే అన్నావు, అర గంట తిరిగాం అక్కడికి అక్కడే, సరే నేనేం చెయ్యను, అది ఒక కొత్తగా వస్తున్నా కాలనీ, అన్ని కొండ గుర్తులు మారి పోయాయి మరి.
అదే ఎవరో నడుపుతూంటే పక్కన కూర్చుని, గుర్తులు చెప్పమంటే, అంటే..నా పక్కన కూర్చునేది తరచుగా ఒక్కరే, పద, పద, ఇదే రోడ్ ,చక్కగా వచ్చాం ఇక్కడి వరకు,ఇంక ఒక సందు లోకి తిరగాలి, ఇటు తిరుగు, ఇటు, ఇటు, అంటూ ఉండగానే,అటు తిప్పేసాడు...అయ్యో అయ్యయ్యో, ఇటు కాదు అటు, అన్నానా?అని కెవ్వు కెవ్వు అని కేకలు.
నేను రోడ్ చూస్తూ నడుపుతున్ననా కార్, నువ్వు ఇటు అంటే నాకేం తెలుస్తుంది,లెఫ్ట్, రైట్ ,చెప్పవచ్చు కదా..అదిగో మరి అక్కడే వస్తుంది తంటా..నాకు లెఫ్ట్ అంటే వాచ్ పెట్టుకునే చెయ్యి,ఇంకోటి కుడి.అది కూడా పూర్తిగా నా కళ్ళ ముందు పెట్టుకుని చెయ్యి,వాచ్ చూసుకుని, లెఫ్ట్ అని ధ్రువీకరించుకుని ..హు ..అప్పుడే చెప్పగలను లెఫ్ట్ ..లెఫ్ట్ అని,ఇదంతా కనీసం క్షణం లో వెయ్యో వంతులో జరగ దానికి నేనేమి ,యండమూరి నవల లో హీరో ని కాదు కదా..అందుకే నేను, ఒక సంకేత భాష కని పెట్టేసా...నాకు దగ్గరగా ,నా వేపు ఉండే మలుపు, "ఇటు" ,మరో వేపు ఉన్న మలుపే, "అటు."..
ఇంత చిన్న విషయం అర్ధం చేసుకోరూ, ఈ మగవాళ్ళు. అన్నిటికి ఒకటే నస..
కాని, నేను ఎప్పుడు మర్చి పోను.,ఒకసారి చూసిన ఇల్లు...మరి..సరిగ్గా ఫాలో అవాలి ,నా సంకేతాల భాష,
ఇంక హైదరాబాద్ లో, మనకి కావాల్సిన వారు ,ఒకరు, విజయవాడ కి కూసింత దూరం లో ఉంటే, ఇంకొకరు, బెంగుళూరు కో,ముంబై కో వెల్ల వలసిన దారి లో ఎక్కడో ఉంటారు. సరే ,మరి ఉన్న నాలుగు రోజుల్లో అందరిని చూసి, పలకరించి రావాలి కదా, ఈ కాల్ టాక్సీ లు వచ్చాక ,భలే సులువు అయింది.
సరే, అంబర్ పేట్ నుంచి అత్తా పూర్ వెళ్ళాలి. టాక్సీ కి ఫోన్ చేస్తాను.
అంబర్పేట్ నుంచి ..భయ్యా..ఇదొకటి నేర్చుకున్నాను...సరే, ఎక్కడ, అదే, పెట్రోల్ బంక్ పక్కనే, అపార్ట్ మెంట్స్..సరే, లేఫ్ట? రైట్ ఆ ..ఏమిటి లెఫ్ట్? అదే రోడ్ కి,
ఊ, శ్రీ రమణ దగ్గర తిరిగేయాలి..నేను..అదే లెఫ్ట్ ఆ? రైట్ కా?
హు..హు..పెట్రోల్ బంక్ అని చెప్పాను కదా..
నువ్వు ఎటు నించి వస్తావు భయ్యా??
ఎలాగో ఒకలాగా టాపిక్ మార్చేయాలి, పోలిస్ లైన్స్ ఉన్నాయా? అక్కడే
అదే. లెఫ్ట్ ఆ.. రైట్ కా??
అబ్బ..బ్రహ్మానందం కామెడి లాగుందే..అన్నిటికి ఒక్కటే ప్రశ్నే అడుగుతాడేమిటి??ఈ భయ్యా..ఇలా లాభం లేదని, తమిళనాడు లో మనం ఎలా చదువు రాని వాళ్ళ లాగ, పక్కనే ఉన్న తంబి ని ఈ బస్సు ఎక్కడికి వెళుతుంది?అని అడుగుతామో ----అన్ని తమిళం లో రాసి ఉంటాయి మరి----పక్కనే ఉన్న వారికి ఫోన్ ఇచ్చేసి,నువ్వే చెప్పు అని, భయ్యా కి ఇంకా నా అటు-ఇటు సంకేతాల భాష రాదు కదా.
ఇంక అత్తాపూర్ వెళ్ళాలి, ఎలా రావాలే అంటే, 143 పిల్లర్ దగ్గర తిరిగి,అక్కడినుంచి, లోపలి వచ్చి,రైట్ కి తిరగాలి,అలా కాదే,అక్కడ ఉన్న షాప్స్ చెప్పు, కొండ గుర్తులు చెప్పు, ఊ ,అయితే, నారాయణ కాలేజ్ దగ్గర ప్లేసేంట్ పార్క్ బోర్డ్ ఉంటుంది, లోపలి వస్తే, ఒక పార్క్ ఉంటుంది, ఇలా చెపితే ఏముంది, నేల మీద కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు ,మీ ఇంటికి ఓ గంటలో వచ్చేస్తాను.
సరే, నిశ్చింతగా కూర్చున్నాను టాక్సీ లో, అదిగో లోపలి వచ్చేసాం, భయ్యా..ఎటు వెళ్ళాలి మాడం? అటు కాదు ఇటు,అని నాలుక కరచుకుని, లెఫ్ట్ ,రైట్ చెప్పాల్సిందే అనుకుంటూ, చెయ్యి చూసుకున్నాను...రెండు చేతులకి గాజులు. ఎంతో ఇష్ట పడి కొనుక్కున్నాను కదా అని రెండు చేతులకి తలో అర డజాను మాచింగ్ గాజులు ఎక్కించాను..ఇంక చెప్పాల్సింది, ఏముంది, అన్నం తినే ఏక్షన్ రిప్లే చేసుకుని, చేతికి .అది రైట్ ,మరోటి .లెఫ్ట్..అని ధ్రువీకరించి, లెఫ్ట్ తిరుగు అని చెప్ప దానికి, సెకన్లలో, వెయ్యో వంతు కాదు, వెయ్యి సెకన్లు అయినట్టుంది.సరిగ్గా గంటన్నర కి చేరాం.. మరి.
ఇంకొకటి గమనించాను,నేను, ఈ ఆటో భయ్యాలు, ఎటు పక్క ,తిరుగుతారో, ఆ దేముడు కే తెలియాలి,సడన్ గా "అటు" తిప్పేస్తారు..సీదా గా వెలుతున్నవాళ్ళు. ఏమిటి? సిగ్నల్ చూపించవా? అని వెనక నుంచి ఎవరో అరుస్తాడు.ఆటో భయ్యా ఒక చిన్న చిటికెన వేలు, బయట పెట్టాడు. అంటే ....అటు తిరుగు తున్నానే కదా అర్ధం. వీళ్ళ సంకేతాల భాష ఇది అన్న మాట.
ఇంతకీ..ఇదంతా ,నా ఒక్కర్దానికేనేమో అనుకునే దాన్ని.
ఈ మధ్య హిందూ పేపర్ లో చదివాను. ఈ అవస్థ కు directionally challenged అని ఒక పేరు కూడా ఉందిట.
అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాల మంది ఉన్నారన్నమాట.
పోనీలే చిన్న గా తీరిపోయింది, అసలు పెద్ద మెదడు షేమమే లెండి.
నా లాంటి వారు ,ఇంకా ఎవరైనా ఉంటే, వారందిరికి అంకితం..అటు-ఇటు అనే భాష తెల్సిన వాళ్ళందరం ఏకం అవుదాం..ఇటు రండి..ఇటు..ఇటు..అటు కాదు.

కుడి ఎడమైతే పొరపాటు లేదొయ్ ఓడిపోలేదోయ్. ;)
రిప్లయితొలగించండిఅవును అదే ధైర్యం తో..ఉన్నాను నేను కూడా..చాతకం గారికి థాంక్స్.
రిప్లయితొలగించండివసంతం.