రక్షించు నా దేశాన్ని ..
పదివి అంటే ఆస్తులు పదిల పరుచుకోవడమే, తర తరాలకు సరిపడా ధన రాసి ని వెనక వేసుకోవడమే, అనే ఉద్యోగస్తు ల నుండి,
ఎం ఎల్ ఏ అంటే, ప్రతి పని లోను కమీషను, అయిదు ఏళ్ల లలో వీలైననంత ఆస్తులు, కావాల్సిన వారికి ఉద్యోగాలు, వేయించుకునే రాజకీయ వ్యాపారస్తులనుండి,
ఎంపి అంటే ఇంకా ఎక్కువ ఆస్తులు, సమాజాన్ని, ముక్కలు ముక్కలు గా విభజించడం, తమ కులమో, వర్గమో, వారికే సకల సంపదలూ, సకల సదుపాయాలూ, సమకూర్చే ఒక ఉన్నత స్థానం అనుకునే వారి నుండి,
ముఖ్య మంత్రి అంటే- తమ తమ పిల్లలకు, వారసత్వం గా అందించ డానికి, తయారు చేస్తున్న వారసత్వపు కుర్చీ , రాష్ట్రం లో ఎక్కడ ఖనిజ సంపద ఉన్న ,తమ వారికే అప్పగించడానికి, ఒక అధికారం, అనో, లేదా, రాష్ట్ర ఆస్తుల ను, తమ అత్తగారి ఆస్తులు గా కానుక లేచ్చే వారు, లేదా ఉచితం గా కొన్ని కానుకలు పంచి, మందు రూపం లో తిరిగి ఖజానా కి ఆ ధనం వెనక్కి తీసుకునేవారు, ముందు చీప్ లికౌర్ అలవాటు చేసి, తరువాత ఆ జబ్బులకి ఆరోగ్య శ్రీ అని ప్రైవేట్ ఆసుపత్రి లకి కొన్ని కోట్లు జమ చేసే వారు, విద్య ను వ్యాపారం చేసి అమ్ముకునే వారు, భగవాన్ ఈ ముఖ్య మంత్రి ల నుండి,
ఒక చెయ్యి వెనక్కి కట్టుకుని, ఒంటి చేతి తో ఈ భారత్ దేశ రథాన్ని , అసహాయం గా చూస్తూ, వెనక వెనక్కి, ముందుకు నడిపే మన ప్రధాన చోదకుడు, లక్ష ల కోట్లు నష్తం తెచ్చిన ఓ మంత్రి ని తీసేయలేని రాజకీయ కూటమి తో నడిపిస్తున్నారు ఈ దేశాన్ని..
హే భగవాన్, వీరి నుండి రక్షించు నా దేశాన్ని..
మన దేశం కి వచ్చి కొన్ని వేల ఉద్యోగాలు, కొన్ని కోట్ల వ్యాపారాలు, మరి కొన్ని అణు ఒప్పందాలు చేసుకుని ఆనందం గా నాట్యం చేసిన ఒబామా దంపతులని చూసి,
ఒక్కసారి, కుర్చీ లతో కొట్టుకోకుండా, తలలు బద్దలు కొట్టుకోకుండా, కూర్చోండి, దయచేసి కూర్చోండి అంటూ, మున్సిపల్ బడి లో టీచెర్ లాగ గొంతు చించు కోకుండా మన స్పీకెర్ మహిళ కి శ్రమ తప్పించిన ,ఒబామా స్పీచ్ , మనని ఎంత ఉద్వేగ పరిచిందో,
ఎంత గా కదిలించిందో, ఎంత దేశ భక్తీ ని రగిలించిందో, జై హింద్ అంటూ మన ఒళ్ళు గగుర్చేలా ఎలా నినాదం ఇచ్చారో,
నవ యువత కి చదవండి, ఎదగండి, మీదే ప్రపంచం , మీరే నేతలు, మీరే అసామాన్యులు, మీరే రేపటి ప్రపంచ పఉరులు,
కులాలు, మతాలూ, అంటూ విభజించే మన నేతల మాటలు విని చెవులు గళ్ళు పడి పోయిన మన పిల్లలికి ఒక మేలుకొలుపు లాంటి స్పీచ్,
అందుకే నేను అనుకున్నాను, ఒబామా,
మా దేశానికి దేశభక్తి, ఒక సందేశం ఇచ్చే మహత్తర కార్యం ను, మేం మీకు అవుట్ సోర్సింగ్ చేస్తున్నాం..
హే భగవాన్, రక్షించు నా దేశాన్ని, రక్షించు నా దేశాన్ని..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి