"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

23 నవం, 2010

అందుకే ఇంకా ఎంతో కాలం బతకాలి. .. నేను

గుండె ఘల్లుమంది, ఒక నిముషమో, సెకాన్లో, గుండె కొట్టుకోవడం ఆగి పోయిందేమో అని పించింది. ఇవాళ పొద్దున్నే ఫేసు బుక్ పేజ్ లో ఎవరో పెట్టారు, మనం తప్పక ఈ జీవిత కాలం లో చదవ వలసిన వంద పుస్తకాల (ఇంగ్లీష్ ) లిస్టు.. లెక్క చూసుకుంటే, చాలా తక్కువే ఉన్నాయి. నేను చదివినవి. 
కొన్ని ఎప్పుడో, నేను చిన్నప్పుడు చదివినవి. పేర్లు చూస్తే చదివి  నట్టే ఉన్నాయి కాని, ఏమి గుర్తు రావటం లేదు, ఈ మధ్య చదివినవి ఏవో కొన్ని గుర్తు ఉన్నాయి. చేతిలో ఒక పుస్తకం తో పుట్టేనేమో అన్నట్టు, ఎప్పుడూ పుస్తకం చదివే నేను ఏమిటో, ఈ దేశం కీ వచ్చాక, కొత్త కొత్త పనులు చేస్తున్నాను. అందులో విజ్రుమ్భించి, వీర లెవెల్ లో వంటింట్లో కీ వెళ్ళి, వంటలు, పిండి వంటలు చేసి పడేస్తున్నాను, తినే వాళ్ళు ఎవరు? అని ఒక పక్క మొత్తుకున్నా  విని పించుకోకుండా . .  . .
ఇది కాక ఇంకో లిస్టు కూడా ఉంది, మనం ఈ జీవిత కాలం లో చూడ వలసిన సినిమా ల లిస్టు అని. 
ఒక పుస్తకం చేతిలో పట్టుకుని, మంచం మీద పడుకునో, సోఫా లో జారబాడో,ఒక ప్లేట్ లో   జంతికలో, మిక్సారో పోసుకుని,  వెలుతురు తగ్గిపోయినా లైట్ వేసు కోవాలని ధ్యాస కూడా లేకుండా ,ఇప్పుడు ఈ పుస్తకం ఆఖరి బైండు పేజీ వరకు చదవక పోతే, ఏదో కొంపలు మునిగి పోతాయేమో అన్నట్టు  పుస్తకం చదివి ఎన్ని రోజులు అయింది. అమ్మా ఆకలి, ఇదిగో, పిల్లలు ఆకలి అంటున్నారు, అతనికి లేనట్టు,  అని ఏవో మాటలు ఇంకేదో లోకం నుంచి వినబడినా వినబడ నట్టు, ఊ.. ఉండు.. లాంటి ఏదో భాష లో సమాధానం ఊ భాష లో ఇవ్వడం, చివర  పేజీ లో అంతా కలుసుకునో, ఏదో ఒక అంతం అయేసరికి, కడుపులో ఏదో ఉండ కట్టినట్టు, ఆకలి బాధ, తెలియడం, అమ్మో, ఇంకా అన్నం అయిన పడేయలేదు, అని లేచి, ఇలా పుస్తకాలు చదువు కునే వాళ్ళ కోసం ,ఎవరైనా భోజనాల సదుపాయం ఎందుకు పెట్టలేదు, అయినా అంతా గొప్ప పుస్తకం చదివాక కూడా ఇలా ఆకలి దప్పులు ,ఈ బాధలు ఏమిటి అసహ్యం గా.. అని నిట్టూర్చి, ఆ రోజంతా ఆ పుస్తకం చదివిన మాయలో కూరుకు పోయి, మొహం ఒక వింత కాంతి లో మెరిసి పోవడం, నాకు కనిపించదు లెండి, ఎవరో చెప్పడమే
ఆహా ఎంత గొప్ప రోజులు అవి.. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇంకా చదవ వలసినవి.  హర్రి పోట్టర్ అయితే చదివేసాను పిల్లలతో పోటి పడి, కాని  , లార్డ్  ఆఫ్ ది రింగ్స్ అని తల కింద దిండు లాగ పనికి వచ్చేంత  లావు పుస్తకం, వేరే ఏదో కొత్త భాష కూడా కని పెట్టారు ఆ రచయిత, ఇది ఎప్పుడు చదవడం?  ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఆ లిస్టు లో. 
మన తెలుగు లో కూడా ఎన్నో, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పుస్తకాలు అన్నీ కోని పెట్టు కున్నాను, ఏవో కొన్నే చదివాను,  మళ్లీ, మళ్లీ, చదవాల్సినవి కొన్ని, వేయి పడగలు సగమే చదవాను, తిరుమల రామచంద్ర ఆత్మ కథ కూడా అంతే, పూర్తి గా చదవ లేదు. 
ఇప్పుడు, చాట భారతం లా రాస్తే చదవ లేరు అని, చేతన్ భగత్ లాంటి వాళ్ళు ,చక్కగా, చిన్న గా ఒక్క పూటలోనో, ఒక ప్రయాణం లోనో చదివేంత, పల్చని పుస్తకాలు, వంద రూపాయలి కే,  జేబు కీ భారం కాకుండా రాసి పడేస్తున్నారు. 
ఇన్ని పుస్తకాలు చదివేను కదా అని, నేనూ రాయడం మొదలు పెట్టాను, ఒక నవల. అబ్బ ఎంత కష్తమో, ఆలోచించి ,ఆ భావాలను , భాష లోకి అనువదించడం ,పాత్రల మధ్య సంభాషణ లు నడి పించడం, అన్నిటిని కల గలిపి ఒక  సమన్వయం , ఒక అర్ధం, ఒక పరమార్ధం.. అమ్మో .. ఇది చాల కష్టమైన పనే.. 
అందుకే.. నాకిష్టమైన పని చదవడమే నేను చేయాల్సిన పని.  ఈ లిస్టు లోని పుస్తకాలు ఈ జీవిత  కాలం లో చదవాలి అంటే.. అమ్మో, ఇంకా ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. 
అందుకే ఒక్క నిముషం నా గుండె ఆగిపోయింది.. నా జీవిత పర మార్ధం అర్ధం అయింది, పుస్తకం చేతిలో పట్టుకుని ఆఖరి రోజు  వరకు గడి పేయ గల్గడమే నా జీవిత లక్ష్యం ..పుస్తకం,అంటే మంచి పుస్తకం కోని చదవండి...
ఆబిడ్స్  లో ఆదివారం పేవేమేంట్    మీద ఎన్ని పుస్తకాలు దొరుకు తాయో.. అదే కదా షాపింగ్ అంటే..పుస్తకాల ఎక్షిబిశన్ అంటే ప్రాణం లేచి వస్తుంది. పుస్తకాలు  పెట్టుకోవడానికి అరలు ఖాళీ లేదు అంటే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకున్దామా? అనిపిస్తుంది.
కొత్త పుస్తకం పేజీల రెపరెపలు, అందు లోంచి వచ్చే , ప్రింట్ వాసన, కొత్త పుస్తకం మనది అని పేరు రాసుకున్న క్షణం.. అన్నీ ఎంత బాగుంటాయి.
అందుకే, ఈ లిస్టు లో నేను చదవాల్సిన పుస్తకాల సంఖ్యా చూసి, నా గుండె ఆగిపోయింది ఒక క్షణం.. 
ఇంకా ఎన్నో పుస్తకాలు చదవాలి, 
అందుకే ఇంకా ఎంతో కాలం బతకాలి. .. నేను.


This is the list....

1 Pride and Prejudice - Jane Austen

2 The Lord of the Rings - JRR Tolkien

3 Jane Eyre - Charlotte Bronte

4 Harry Potter series - JK Rowling

5 To Kill a Mockingbird - Harper Lee

6 The Bible 

7 Wuthering Heights - Emily Bronte 

8 Nineteen Eighty Four - George Orwell 

9 His Dark Materials -  Philip Pullman  

10 Great Expectations - Charles Dicken 

11 Little Women - Louisa M Alcott 

12 Tess of the D’Urbervilles - Thomas Hardy 

13 Catch 22 - Joseph Heller 

14 Complete Works of Shakespeare 

15 Rebecca - Daphne Du Maurier 

16 The Hobbit - JRR Tolkien

17 Birdsong - Sebastian Faulk 

18 Catcher in the Rye - JD Salinger

19 The Time Traveler’s Wife - Audrey Niffenegger 

20 Middlemarch - George Eliot 

21 Gone With The Wind - Margaret Mitchell

22 The Great Gatsby - F Scott Fitzgerald

24 War and Peace - Leo Tolstoy 

25 The Hitch Hiker’s Guide to the Galaxy - Douglas Adams

27 Crime and Punishment - Fyodor Dostoyevsky   

28 Grapes of Wrath - John Steinbeck

29 Alice in Wonderland - Lewis Carroll 

30 The Wind in the Willows - Kenneth Grahame

31 Anna Karenina - Leo Tolstoy

32 David Copperfield - Charles Dickens

33 Chronicles of Narnia - CS Lewis 

34 Emma -Jane Austen

35 Persuasion - Jane Austen

36 The Lion, The Witch and the Wardrobe - CS Lewis

37 The Kite Runner - Khaled Hosseini

38 Captain Corelli’s Mandolin - Louis De Bernieres

39 Memoirs of a Geisha - Arthur Golden

40 Winnie the Pooh - A.A. Milne

41 Animal Farm - George Orwell

42 The Da Vinci Code - Dan Brown

43 One Hundred Years of Solitude - Gabriel Garcia Marquez 

44 A Prayer for Owen Meaney - John Irving

45 The Woman in White - Wilkie Collins

46 Anne of Green Gables - LM Montgomery 

47 Far From The Madding Crowd - Thomas Hardy 

48 The Handmaid’s Tale - Margaret Atwood

49 Lord of the Flies - William Golding

50 Atonement - Ian McEwan

51 Life of Pi - Yann Martel

52 Dune - Frank Herbert

53 Cold Comfort Farm - Stella Gibbons

54 Sense and Sensibility - Jane Austen

55 A Suitable Boy - Vikram Seth

56 The Shadow of the Wind - Carlos Ruiz Zafon

57 A Tale Of Two Cities - Charles Dickens

58 Brave New World - Aldous Huxley 

59 The Curious Incident of the Dog in the Night-time - Mark Haddon (amazing) 

60 Love In The Time Of Cholera - Gabriel Garcia Marquez

61 Of Mice and Men - John Steinbeck

62 Lolita - Vladimir Nabokov

63 The Secret History - Donna Tartt

64 The Lovely Bones - Alice Sebold

65 Count of Monte Cristo - Alexandre Dumas

66 On The Road - Jack Kerouac

67 Jude the Obscure - Thomas Hardy

68 Bridget Jones’s Diary - Helen Fielding

69 Midnight’s Children - Salman Rushdie

70 Moby Dick - Herman Melville

71 Oliver Twist - Charles Dickens

72 Dracula - Bram Stoker

73 The Secret Garden - Frances Hodgson Burnett

74 Notes From A Small Island - Bill Bryson

75 Ulysses - James Joyce

76 The Inferno - Dante

77 Swallows and Amazons - Arthur Ransome

78 Germinal - Emile Zola

79 Vanity Fair - William Makepeace Thackeray 

80 Possession - AS Byatt

81 A Christmas Carol - Charles Dickens 

82 Cloud Atlas - David Mitchell

83 The Color Purple - Alice Walker

84 The Remains of the Day - Kazuo Ishiguro

85 Madame Bovary - Gustave Flaubert

86 A Fine Balance - Rohinton Mistry

87 Charlotte’s Web - E.B. White

88 The Five People You Meet In Heaven - Mitch Albom

89 Adventures of Sherlock Holmes - Sir Arthur Conan Doyle 

90 The Faraway Tree Collection - Enid Blyton

91 Heart of Darkness - Joseph Conrad 

92 The Little Prince - Antoine De Saint-Exupery (in French and in English)

 93 The Wasp Factory - Iain Banks

94 Watership Down - Richard Adams

95 A Confederacy of Dunces - John Kennedy Toole 

96 A Town Like Alice - Nevil Shute

97 The Three Musketeers - Alexandre Dumas

98 Hamlet - William Shakespeare

99 Charlie and the Chocolate Factory - Roald Dahl

100 Les Miserables - Victor Hugo










10 కామెంట్‌లు:

  1. ఆ లిస్తేంతో మాక్కూడా చెప్తే మాకూ వెతుక్కొనే పని తప్పేది గదండి. బాగుంది మీ పోస్ట్ ఇంతకీ మీరు మొదలు పెట్టిన నవల అయ్యిందా. అటుకేక్కిండా మీరు చెప్పలేదు :))

    రిప్లయితొలగించండి
  2. naaku pitchekindi mee list chusi vasantha gaaru.even my life time wont be sufficient to read all d books.

    రిప్లయితొలగించండి
  3. ఇవన్నీ వెతుక్కొనే వరకే జీవిత కాలం సరిపోతుందేమో . ఇక చదివేదేప్పుదంటారు

    రిప్లయితొలగించండి
  4. భాను గారు, శ్రీనివాస్ గారు, థాంక్స్..
    కంగారు లేదు, హైదరాబాద్ ఆబిడ్స్ లో, ఆదివారం సెకండ్ హ్యాండ్ పుస్తకాలు, లైబ్రరీలు, చాల తక్కువే మనకి, నా లాంటి పుస్తక ప్రియుల ఇల్లు, ఇంకా నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడం, ఇలాంటి ఎన్నో ..బెగ్ బోరో ఆర్ స్టీల్ అన్నారు, ఏదో చేసి, పుస్తకాలు మటుకు చదవాల్సిందే. ఇలాంటి లిస్టు ఒకటి ఎవరైనా తెలుగు పుస్తకాలకి కూడా తయారు చేస్తున్నారా? అన్నీ పనులు మానేసి, ఈ లిస్టు లో పుస్తకాలు చదువుతూ కూర్చో వాలి అని పిస్తోంది కదా..

    రిప్లయితొలగించండి
  5. హమ్మ్, బానే ఉంది లిస్టు. ఈ లిస్టు తయారు చేసిన వారెవరికో తలగడలకి బదులు పుస్తకాలు పెట్టుకోవడం ఇష్టమేమో! లావుపాటి పుస్తకాలు చాలానే ఉన్నాయి. కొంచెం బేలెన్సుకోసం సన్నపాటి పుస్తకాలు కూడా ఉన్నాయనుకోండి. ఐనా ఈ లిస్టుదేముంది గాని, ఒక్కోసారి మనకి నచ్చిన పుస్తకం లేదా చదువుతూ చదువుతూ మధ్యలో ఆగిన పుస్తకమే కూర్చుని చదివేసేందుకు ఖాళీ దొరకదు చూశారూ, అప్పుడెక్కుతుంది పిచ్చి.
    బైదవే - 2000 సంవత్సరం ప్రాంతంలో కొందరు అమెరికా తెలుగు ఔత్సాహికులు తెలుగు 100 పుస్తకాల లిస్టొహటి చేశారు. ఈమాట జాలపత్రికలో ఉండచ్చు. పుస్తకం వారి సైటులో కూడా ఉండొచ్చు.

    రిప్లయితొలగించండి
  6. కొత్త పాళీ గారికి,
    ధన్యవాదాలు, మంచి లిస్టు ఒకటి చూపినందుకు. ఈ-బ్లాగ్ లో- లిస్టు ను చూసి ఇంస్పిర్ అయి, నేను కూడా ఒక లిస్టు తయారు చేయడం మొదలు పెట్టాను. గూగల్ లో దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను, అందరు తల ఒక చేయి వేయండి, ఇప్పటి కాలానికి మరి ఒక లిస్టు అవసరం ఉందేమో అని పించింది. లిస్టు లో ఉన్నాయని కాదు కాని, ఈ లిస్టు , సంఖ్య చూసినప్పుడు, మనం ఎంత (అంటే నేను)ఇంకా ఎన్ని పుస్తకాలు చదవాలో ,ఎంత సమయం వృధా అవుతున్నాదో అని తోచింది.
    పుస్తకం.. హస్త భూషణం ..మస్త భూషణం కూడా కదా..మంచి పుస్తకం చదివి, జీర్ణించుకున్న ,క్షణం, ఆ రచయిత ఎంత సంతోషిస్తాడో, రచయిత మనసు తో మమేకం అయి , అనుభవించడం కూడా ఒక రసస్వాదనే.. ఆ అనుభూతి ని నిత్యం అనుభవించే అవకాశం ,సమయం నాకు లభించాలని కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు, పుస్తకం చదువుతూ, నా బద్దకాన్ని కప్పి పుచ్చు కుంటున్నానా అని అనుమానం వస్తూంటుంది. దీనిపై అభిప్రాయం ఇంట్లో అధిష్థానం అంటే .. .ఎవరో తెలుసు కదా చెప్పాలి.
    https://docs0.google.com/document/d/1cXAVBH44i8g71cHhwBZwfWjYpoovN4ysJE40xz4uwq4/edit#
    లత చాల సంతోషం.. మీ బ్లాగ్ పోస్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  7. Hello Ms. Vasantham,
    I really liked your opinion on reading, books and love your reading list! most of my favorites are on the list.

    రిప్లయితొలగించండి
  8. Thanks Pravi garu..

    You have made my day..Thanks for the readers of my blogs.. these comments are surely acting like a tonic for me..Thanks.. a lot everybody..

    రిప్లయితొలగించండి