"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 మార్చి, 2012

"నీకేం తక్కువ చేసేను?"

"నీకేం తక్కువ చేసేను?"
మళ్లీ రెట్టించాడు..మహేష్.
అన్ని ఎక్కువే..అని మనసులో అనుకున్నాను..


పైకి మటుకు ఏమీ మాట్లాడ కుండా ,నా పని నేను చేసుకుంటున్నాను. ఎలా చెప్పను? ఏం చెప్పను? ఈ మనిషికి.
దోసెలు   పోస్తున్నాను..కొబ్బరి చట్ని అయింది, టమాట పచ్చడి ఉంది, కారప్పొడి ఉంది, తల తుడుచు కుంటూ ,స్నానం చేసి వచ్చి, టిఫిన్ కి ఏం చేసానో చూస్తూ, "సాంబార్ లేదా?" అన్నాడు.


నిన్నటి నించి ,విపరీత మయిన తల నొప్పి..ఈ మిగ్రెయిన్ తల నొప్పి, నాకు వస్తే, అమ్మ ఇంట్లో అయితే ఎన్ని సేవలు చేసేదో? గుర్తు వచ్చి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


మహేష్ కంట పడ్డాయి ..హ్మం....కలకంటి కంట నీరు చూడలేరు కదా ఈ మగ వాళ్ళు? 


" ఏమిటో పెద్ద కష్ట   పడి పోతున్నట్టు..పిండి రుబ్బడానికి మషిన్..ఉంది, పచ్చళ్ళు చేయడానికి ఇంకోటి..కుకర్   లు ఉన్నాయి, ఇంట్లో సమస్తం అమర్చి పెట్టెను, అయినా రుచి గా  చేసి పెడతావు అనే కదా..పెళ్లి చేసుకున్నాను,లేక పోతే, నేను ఒక్కడిని  , హాయిగా ఉండేవాడిని"..


ఈ మాటలు ఏదో నవ్వులాట గా ,అంటూ, నాకు ఏదో చేయి సాయం చేయడానికి వచ్చి ఉంటే..ఈయన, నాకు ఇలాగ పొద్దున్నే కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఉండేవి కావు.


అయిదు గంటలకే లేచి ,కాఫీ డికాషన్ తీయాలి, కాఫీ ఫ్రెష్ గా ,మంచి కాఫీ వాసన వస్తూ ఉండాలిట..ఇడ్లీ పిండి కూడా ఒక్క రోజు కన్నా వాడ కూడదు..అచ్చం దసపల్ల హోటల్ లాగ, రోజూ ,టిఫిన్ లోకి, మూడు రకాల పచ్చళ్ళు , వీలయితే సాంబారు ఉండాలిట, ఇడ్లీ లు, మెత్తగా ,పువ్వులాగా ,నోట్లో వేసుకుంటే కరిగి పోయేలా ఉండాలిట.


మహేష్ కోరికలు ఇవి..ఇలా లేక పోతే , అయిష్టం ,మొహం లోనే కాదు ,మాటల్లో కూడా చెప్పడానికి మొహమాట పడడు..


అబ్బ, అబ్బాయి అయితే, చాలా,ఇన్ని కోరికలు తీర్చు కోవచ్చా?? నా కోరికలు ఏమిటో ,నన్ను ఒక్క రోజు అడగలేదు, చెప్పనివ్వ లేదు..


ఇడ్లీ లు అలాగే ఉండేవి, అమ్మ చేసేవి.అయిన నేను ఎప్పుడు వెళ్లి చూసేను, వంటింట్లోకి .ఎలా చేస్తారో?.


ఎప్పుడూ చదువు, లేకపోతే స్నేహితురాళ్ళ తో, సినిమాలు, షికార్లు, నాన్న ముద్దు, ఆడ పిల్ల .ఏమీ అనకు..మా అమ్మే అది, అంటూ..ఎంత ముద్దు చేసే వారో?


అలాంటిది, ఈ పెళ్లి ఎలా జరిగింది?? 


అయినా నాది తప్పే, సివిల్ ఇంజేనీరింగ్ చదివింది ,కాని, ఉద్యోగ ప్రయత్నాలు ,పెద్దగా చేయలేదు, అమ్మయ్య చదువు అయింది అంటూ, హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంది..


అయినా , ఏమంత శ్రద్ధ గా చదివింది ? ఆ చదువు కూడా..ఎప్పుడూ, ఫ్రెండ్స్ ,కబుర్లు, ఎలాగో, ఫస్ట్ క్లాసు అనిపించు కుంది..చదువు అయ్యాక ,అనిపించింది, స్కూల్ లో బాగానే చదివేది కదా, ఎందుకని ,ఇంకా కష్టపడి చదవ లేదు, ఈ ఇంజనీరింగ్? 


ఏమిటో? అంతా ఒక కల లాగ గడిచి పోయింది, కాలేజ్ బస్సు లో ,ఒక గంట ప్రయాణం, ఆడ పిల్లలు, మగ పిల్లలు, కలిసి ప్రయాణం..ఇంక, ఆ కబుర్లు, సరదా ,సందడి..ఏదో పిక్నిక్ కి వెళుతున్నట్టు..ఎంత హాయిగా గడిచి పోయాయి, ఆ నాలుగేళ్ళు?


డిగ్రీ అవగానే, నాన్న అడిగేరు, ఏం చేస్తావు అమ్మా సుధా ?అని..


ఏమిటో? తను ఏమీ సరి అయిన జవాబు ఇవ్వలేదు, గమ్యం లేని చదువు చదివి ,అలసి పోయెను. ఇప్పుడిప్పుడే, ఇంక కొంచం శ్రద్ధ గా చదివి ఉంటే బాగుండేది అనిపిస్తోంది.


అమ్మ అప్పటికి చెపుతూ ఉండేది, సుధా..చదువు చాల ముఖ్యం అమ్మా..అని,నాకేమిటో..అమ్మ చాదస్తం గా చెపుతుంది అనిపించింది.


ఇంతలో, నాన్న గారి ,ఫ్రెండ్, ఈ సంబంధం తెచ్చేరు.


మహేష్ పేరు, ఒడ్డు, పొడుగు, నా కన్నా ఎక్కువే, సాఫ్ట్ వేర్ ఇంజినీర్, హైదరాబాద్ లో ఉద్యోగం, ఒక్క చెల్లి, పెళ్లి అయిపొయింది, తల్లి తండ్రులు ఏలూరు లో ఉంటారు, వారికీ అక్కడ ఇల్లు అవీ ఉన్నాయి, పెద్దగా ఏమీ బాధ్యతలు లేవు, అన్ని విధాల , వంక లేని సంబంధం.


నాకు కాదు అనడానికి..ఏమీ కారణం కనిపించలేదు..


పెళ్లి అనగానే, ఎక్కడలేని, హుషారు వచ్చింది.


హమ్మయ్య ..నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు తీర్చి దిద్దుకుంటాను, షికారులు తిరుగుతాం, ప్రేమించుకుంటాం..పెళ్లి తరువాతే ప్రేమ..అని నా మనసు లో ఎప్పుడో నిర్ణయం అయిపొయింది..మా క్లాస్ లో ఇద్దరు, ముగ్గురు, ప్రేమించి, పెళ్లి, కి తయారు యేరు ,కాని నాకు ఎప్పుడూ ఆ ఆలోచనే లేదు.


పెళ్లి డేట్ ,కుదరగానే, ఇంక అమ్మ నేను, ఎంత షాపింగ్ చేసేమో, పట్టు చీరలు, మామూలు చీరలు, డ్రెస్సులు, మాచింగ్ చెప్పులు, స్టికేర్ దగ్గర నించి అన్ని, మాచింగ్ వి కొనడానికి ,ఎన్ని షాపింగ్ లు చేసేమో?


నాకయితే, షాపింగ్ అంటేనే విరక్తి, తల నొప్పి వచ్చింది, అంతలా తిరిగేం..ఇంక తరువాత పెళ్లి కార్డ్లు ల ఎంపిక..నాకు నచ్చింది..అమ్మ కి నచ్చదు, నాన్నకి నచ్చింది, నాకు నచ్చదు..ముగ్గురికి నచ్చింది, కుదరడానికి ,వారం రోజులు పట్టింది.


హ్మం..మహేష్ ..నా జీవితానికి ..ఇంక జీవితాంతం తోడూ..అతని ఎన్నిక లో ఎందుకు తొందర పడ్డామో?


అయినా ,అమ్మ ,నాన్న గారలది..పెద్దలు కుదిర్చిన సంబంధమే..ఏమిటో ఎక్కడ తప్పిందో మాచింగ్..??


పెళ్లి లోనే తెలిసింది, నా ఫ్రెండ్స్ వేసే జోక్స్ కి విసుగ్గా పెట్టేడు మొహం..అతనికి అన్నీ పధ్ధతి గా ఉండాలి అమ్మా..నేను చేసేవి కూడా నచ్చేవి కావు, ఏమిటమ్మా ,ఇలా చేసేవు? అనేవాడు..చిన్నప్పుడు కూడా ,అని మురిపం గా చెప్పేరు మా అత్తగారు.


"నీ భార్య వచ్చాక ,నీకు ఇష్టమయినట్టు ,చేయించు కో రా మహేశు ..ఇంత కన్నా నేను చేసి పెట్టలేను నీకు "అనే దాన్ని.


నాకు గుండె గొంతు లోకి వచ్చింది.


నేను ఇప్పుడు ,అన్నీ పద్దతిగా, చక్కగా వంటలు అవీ వండి పెట్టి, ఇల్లు సద్ది, మంచి పేరు సంపాదించు కోవాలా?
అయ్యో, చక్కగా చదివి, ఉద్యోగం ఎందుకు చేయలేదు? అదే తేలిక గా ఉండేదే?


అయినా ,నేను, ఇంటర్ నెట్ నించి, వంటలు అన్నీ నేర్చుకుని, ఒక్క ఆరు నెల లో, ఫైవ్ స్టార్ చెఫ్ ,కాక పోయినా, బాగానే నేర్చు కున్నాను.


అయినా ఎప్పుడూ వంకలు పెట్టడమే ..వంకాయ కారం పెట్టి కూర చేస్తే, ఇంత పొడి, పొడి, గా ఉందేమిటి? నూనె పొయ్యాలి ఇంకాస్త, ఇదేమిటి? ఇప్పుడు అందరూ నూనెలు అవీ తగ్గించ మంటున్నారు కదా, అని నేను ఎంతో జాగ్రత్తగా ,చేసేను, రుచి ఏమీ తగ్గలేదు..నాయితే, ఎంత కమ్మ గా ఉందొ? 


ఏమిటి ఈ మనిషి..


అయినా ఇలా వంటలు చేసుకుంటూ, నేనేమిటి ఇలా కూర్చున్నాను, ఇంతేనా జీవితం అనుకుని, ఒక రోజు, నేను ఉద్యోగం చేస్తాను ..అని ప్రకటించెను.


నీ ఇష్టం..నేను ఇంటికి వచ్చేసరికి ,నువ్వు ఇంట్లో ఉండాలి, అలా మూసి ఉన్న తలుపులు ,తెరుచుకుని, ఇంట్లో కి రావడం ,నాకు అస్సలు ఇష్టం లేదు.


నాకు రుచులు, ఎక్కువ, నీకు తెలుసు కదా..నాకు ఏమీ లోటు ఉండకూడదు.నేను అందరి లాంటి వాడిని కాదు..


నేను అయినా ,నిన్ను ఏం బాధ పెడుతున్నాను? నువ్వు అడక్కుండానే ,అన్నీ కొని పెడుతున్నాను, సొంత ఇల్లు ఉంది, ఇదిగో వచ్చే నెల కార్ కూడా కొంటున్నాను..


నాకు తెలియకుండానే, నన్ను అడగ కుండానే, నా ఇష్టం తో పని లేకుండా ,అన్నీ జరిగి పోతాయి..


ఏమిటో, నేను ఒక పెద్ద తప్పు చేసేను..అని అర్ధం అయింది, నా జీవితం గురించి ,ఎంత తేలికగా ,నిర్ణయం తీసుకున్నానో?
నా ప్రమేయం లేని ,నా జీవితం..ఇది.


నలుచదరం గా ఉన్న దాన్ని ,గుండ్రం గా ఉన్న దాంట్లో పెట్టడానికి ,ప్రయత్నిస్తే, అది ఒక వస్తువు అయినా, దానికి గాయం తప్పదు, అలాంటిది, నా మనసు , నా వ్యక్తిత్వం..విషయం..లో జరుగుతోంది.


నేను ,అనే నేను చివరికి మిగులుతానా? ఈ జీవితం జీవిన్చేసరికి..మహేష్ భార్య గా నేను ,జీవించ డానికి..నేను ఎన్ని కోల్పోవాలో?


ఇంత కోలోపోవాలా నేను? లేదా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా?


ఇంక రేపొద్దున్న ఒక పిల్లాడు, అమ్మో ఒక పిల్ల పుడితే ఎలా ఉంటుంది?
ఏదుచు కుంటూ పుట్టిల్లు చేరుకునే ఉద్దేశం లేదు నాకు.


ఈ ఉద్యోగం మాట ,ఎత్తినప్పట్నించి. ..మరీ దుర్భాలం గా ఉంది..


అందుకే ఈ తల నొప్పి, మనసు గాయపడితే, శరీరం కూడా నలిగి పోతుంది కదా..


మహేష్ ..టిఫిన్ రెడి ఏనా??


ఆ ఒక్క నిముషం..నేను ఒక ప్లేట్ లో ..


రెండు దోసెలు, రెండు పచ్చళ్ళు, ఒక కారప్పొడి, మీద నెయ్యి వేసి, ఇంకో చేత్తో గ్లాస్ లో నీళ్ళు .తెచ్చి టేబిల్ మీద పెట్టి.


" నేను ఉద్యోగం చేయక తప్పదు అండీ, నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తాను, కనీసం పిల్లలకి టీచెర్ గా ..మీకు ఇష్టం ఉన్నా..లేక పోయినా సరే, లేక పోతే నాకు పిచ్చి ఎక్కుతుంది, నేను ఇలాగ వంటలు వండుతూ ,ఇంట్లో కూర్చో లేను, మీరు చెప్పినవన్నీ వండి పెడుతూ , ఇంట్లో కూర్చోడానికి నేను ,ఏమీ చదువు లేని, ఆలోచన లేని మొద్దు ని కాదండి..ఒక ఆలోచన, మనసు ఉన్నస్త్రీ నండి..మీకు ఒక వంటలు చేసే వంటలక్క ఒక్కటే కాదు, మిమ్మలిని ప్రేమించే ,గవురవించే భార్య మీకు కావలి అనుకుంటే, ఒప్పుకొంది, లేదా నేను ఇంక ఇక్కడ ఉండలేను"


అని మనసు లో మాట చెప్పి, నా గది లోకి వెళ్లి పడుకున్నాను..


ఈ తల నొప్పి తగ్గాలంటే, నిద్ర ఒక్కటే మందు,
నా మనసు లో గాయం కి మందు, మటుకు మందు  మెలకువే..
నా ..అన్న వేకువ లోకి మెలకువ.


ఇంక నిర్ణయం అతనిదే.." నాకేం తక్కువో"
అర్ధం అయితే, ఒప్పుకుంటాడు..అన్న ఆలోచన ..ఆఖరి ఆలోచన ,సుధ నిద్ర లోకి జారుకుంది..





















4 కామెంట్‌లు:

  1. baagundi... veelunte penchandi.. this is the status of todays woman.. " poddunne vedi vedi ga break fast thinataniki maathrame pelli chesukunna.." anna H1B abbayilu yentho mandi telusu naku..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును పద్మ..అమ్మాయిలు, చదువు కుంటున్నారు, కానీ, ఏం కావాలో తేల్చుకోలేక పోతున్నారు.
      అబ్బాయిలకి కావాల్సిన వి, పొద్దున్నే టిఫిన్లు, మధ్యాన్నం భోజనం..ఇంక..
      అడక్కు..ఒకరి కి ఒకరు అంటూ సహచర్యం ..ప్రేమ గా..పరస్పరం గవురం
      గా గడిపే సహచర్యం..జంటలు అరుదై పోయారు..దివోర్సు కసేస్ ఎక్కువై పోయాయి..
      అవును ..ఇంకా పెంచ వచ్చు కానీ, నాకు కొంచం తొందర, బాధకం..

      వసంతం.

      తొలగించండి
  2. నేను ముందు కామెంటుతో ఏకీభవిస్తాను...
    ఇలాంటి వారెందరో.... ఏమిటో మనకే ఎందుకిన్ని కష్టాలో...

    ***********

    చాలానే రాసినట్టు ఉన్నారు.... ఒక్కసారి కలియతిరిగి టక టక చదివేసి వస్తాను...

    రిప్లయితొలగించండి
  3. మాధవి..నెమ్మదిగా చదివి, టక టక మని ఇంకో కామెంట్ రాసి పెట్టేసేయ్..
    నాకు ఎంత ఆనందమో..ఒక్క మనసు చేరినా..
    వసంతం.

    రిప్లయితొలగించండి