ఎక్కడ స్త్రీ పూజింప బడుతుందో.
ఎక్కడ స్త్రీ కన్నీళ్ళు కార్చదో.
ఎక్కడ స్త్రీ , అందం గా, ఆనందం గా,
తన జీవితం మలుచు కుంటుందో,
ఆ పుడమి మీదకి, ఆ స్వర్గం లోకి,
దేవుడా..స్త్రీ కి జన్మ నివ్వు..
దేవుడు కూడా మగ వాడేనా?
అందుకేనా పురిటి నొప్పులు
నవ జాత శిశువు ఆకలి
భారం ,అమ్మ కి ఇచ్చి,
అంతులేని సుఖం మటుకు
మగవాడికి ఇచ్చేవు?
చెప్పులు వేసుకుని ,ఇంటి
గడప దాటాలంటే, ఎన్ని గడపలు
పెట్టేరు? ప్రకృతి లో పువ్వు తో
పోలిక పెట్టేరు, ముళ్ళు లాంటి
మగ వారే ,ఆమె కి రక్షణ
పెట్టేరు, పిల్లలే ఆమె కాళ్ళకి
బంధాలు యేరు, ఆమె లేని
ఒక్క రోజు కూడా ,ఇల్లు గడవదు.
కానీ, సంపాదన మీద అధికారం
ఆమె ది కాదు, నువ్వు, షోకులు
సింగారాలు చేస్తావు, అని వెక్కిరించి,
ఏమిటలా మసి గుడ్డ లాగా ,అలా ఉన్నావు?
అని వెక్కిరించే ,మగ వారె, ఆమెకి,
ఇంట అండ..ఉద్యోగాల లో రాణిస్తే.
నువ్వు స్త్రీ వి కదా, అని వెటకారం..
అతను సృష్టించిన అడవిని ఆమె
జయిస్తే, అది కూడా ఒక అవకాశమే,
అందాల ప్రదర్శనే..అని చేత్కారం.
అందుకే స్త్రీ కంట నీరు చిందని
ఆ రోజే, మన వొమన్ డే ,,
కానీ, ఈ ఎనిమిదో తారీఖునే
కాదు, స్త్రీ అంటే, పుడమే,
నిన్ను మోసే అమ్మే,
నీ ఆకలి తీర్చే అమ్మే..
ఆమె ని గౌరవించడం
నీకు ఒక అలవాటు, ఒక సాధన
కావాలి, స్త్రీ కంట కన్నీరు కు
నువ్వు ఎప్పటికి కారణం కాకు..
అప్పుడే, అప్పుడే,
జనని, అవని, అన్నపూర్ణ,
లక్ష పేర్లతో కొలవడం కాదు
ముఖ్యం, నీ మనసుని
శుద్ధి చేసుకో, పాత..భావ
జాలం నించి, బయట పడి,
ఆడ పిల్లని ఆహ్వానించు
నీ ఇంటి లోకి, నీ మది లోకి..
వొమన్'స డే..కోసం..అందరికి..
Good one...
రిప్లయితొలగించండిThanks Padmarpita ..Thank you so much..
రిప్లయితొలగించండి