శుభ రాత్రి ..
అని ఒక స్టేటస్ మెసేజ్ ,టైపు చేసి, వసుధ..హమ్మయ్య..ఈ రోజు అయింది ,అని నిట్టూర్చి ..వంటింట్లో మిగిలిన పనులు చేసుకోవడానికి లేచింది.
ఏమిటో? ఇది ఒక అలవాటో? లేక దుర్వ్యసనమో? ఏమో?
పేస్ బుక్ లో సభ్యురాలు కాక మునుపు, ఏం చేసే దాన్నా? అని ఆలోచిస్తూ ,సింక్ లో పళ్ళాలు, గిన్నెలు కడుగుతూ ఆలోచిస్తోంది.
ఏమో? టీ వి.చూసేది, లేదా పుస్తకాలు చదివేది, లేక పోతే మధ్యాన్నం ,భోజనం చేసి నిద్ర పోయేది.
ఈయన, ఉదయం ఎనిమిది గంటలకి ,డబ్బా లో కొంచం టిఫిన్, పెట్టుకుని ఇంట్లోంచి బయట పడితే వచ్చేది ,వచ్చేది రాత్రి ఎనిమిది కే, ప్రభుత్వ రంగం లో పని, ఆఫీసు లో పని తక్కువ, మాటలు, అదే సెమినార్లు ఎక్కువ..సగం రోజులు భోజనాలు ,అక్కడే అయిపోతాయి.
పిల్లలు, ఇద్దరూ తలో చోట ఉన్నారు.. ఇంకా నాకేం పని ఉంటుంది?
ఈ పేస్ బుక్ లో సభ్యురాలు అయాక, సమయం ఎలా గడిచి పోతున్నదో ,తెలియటం లేదు.
ఈ మధ్య ,కొంత మంది, మరీ దగ్గర అయిపోయేరు.
అందులో సమత ఒకరు. పిచ్చి పిల్ల..నాకు ఇద్దరూ కొడుకులు అవడం తో ,నా కూతురు లాగా అయిపొయింది.
ఇంజినేరింగ్ చదువు తోంది..ఆఖరి సంవత్సరం ..లోకి వచ్చేసింది.సమత రెండో ఏడాది చదువు లో పరిచయం..అయింది.
నేను పెట్టే చక్కని మెసేజ్ లకి వెంటనే లైక్ లు పడేవి, అలాగా మొదలు అయింది. మా స్నేహం..
ఒకరికి ఒకరు మా మెయిల్ ఐ డి లు కూడా ఇచ్చి పుచ్చుకోవడం తో ఇంకా దగ్గర అయ్యాం.
మధ్యలో పరీక్షలు అనో, స్నేహితుల తో బిజీ అనో, కొన్ని రోజులు ఎలాంటి స్టేటస్ మెసేజ్ లు ఉండేవి కాదు, దానితో ,నేను, చాల బాధ పడి పోతూ ,అయ్యో ఏమయింది? ఎందుకు? రాలేదు పేస్ బుక్ లోకి అని ప్రతి పది నిముషాలకి ,పని చేసుకుంటూ వచ్చి చూడడం ..ఇది ఒక విచిత్రమయిన బాధ..
నేను ఇక్కడ ఈ విశాఖపట్నం లో , తను, హైదరాబాద్ లో, నాకు ఎందుకు బాధ ? అంటే, ఏమో? దూర మయిన పిల్లల స్థానం ,ఇలా భర్తీ చేసుకున్నానేమో ? అనిపించేది.
మా ఇద్దరికీ ఉన్న వయసు వ్యత్యాసం..ఎప్పుడూ అడ్డం కాలేదు, మా స్నేహానికి. నేను ఉద్యోగం అంటూ ఏమి చేయక పోయినా..ఉదయం అయిందంటే, ఒక గంట, రెండు వార్త పత్రికలూ చదివితే కాని, అదీ ,కాఫీ తాగుతూ, ఇంక ఏ పని మొదలు పెట్టను. ఎప్పుడూ ,ఈ సమాజం ఎందుకు ,ఇలా ఉంది అని ఏవో ఆలోచనలు, వయసు తో సంబంధం లేకుండా, నిత్య నూతనం గా ఉండడానికే తపిస్తాను.
అందుకేనేమో, ఈ అమ్మాయి సమత నన్ను తన స్నేహితురాలిగా ,ఆప్తురాలిగా భావించి, తన మనసు లో మాటలు, భావాలు అన్ని నాతో పంచుకునేది..
ఎందుకో, ఈ కాలం అమ్మాయిల లాగ కాదు, చాల కుదురైన అమ్మాయి , ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయి తో, నీకు ఈ బంధాలు ఏమిటి? అని మా ఆయన, అప్పుడప్పడు విసుక్కునేవారు..
ఇంట్లో వారు నాకు పెట్టిన పేరు, సెంటిమెంటల్ ఫూల్..అని..ఏదో చిన్న వస్తువు అయినా సరే, అవసరం లేదు ,పడేద్దాం, అంటే ..అమ్మో, చాల సెంటిమెంట్ ,అది కొన్న రోజు, మనం ఇలా అనుకున్నాం..అంటూ ఆ సంభాషణలు అన్ని తిరగ తోడేస్తూ ఉంటాను..
అవేమి, ప్రత్యేకం కావే?? ఎప్పుడూ మనం అనుకునే, మాటలే కదా..అంటే వెంటనే నాకు కళ్ళలలో నీళ్ళు వచ్చేస్తాయి..
ఏమిటో ఈ భావోద్వేగం? నాకు ఒక్కర్తి కేనా? మా సంసారం లో,ప్రతి చిన్న వస్తువు, మేం ఇద్దరం అనుకుని, సంప్రదించుకుని, కూడబలుక్కుని,కూడబెట్టి ఎంతో శ్రమ తో,ఇష్టం మరియు కష్టం తో కూడిన అనుబంధం తో కొనుక్కున్నవి ..అని నా భావన.అందుకే ఏదయినా ,ఇంక పడేసి, వేరొకటి కొనుక్కుందాం అంటే, ముందు వచ్చేవి, కళ్ళల్లో నీళ్ళు.
అమ్మా ! ఇంత సెంటిమెంట్ ..హుహ్..కష్టం అమ్మా..ఇలా ఉంటే..రోజులు మారిపోతున్నాయి, కొత్త నీరు వస్తుంది, అంటూ నాకే ..ఈ పిల్లలు, పాఠాలు.చెప్పడం.అందుకే అన్నారు కదా, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించింది అని.
పడుకునే ముందు..దూరం గా అమెరికా లో ఉన్న నా పిల్లల గురించి, కాదు, పక్కనే ఆదమరిచి నిదురుస్తున్న మా ఆయన గురించి కాదు..నా మానస పుత్రిక సమత గురించే ఆలోచిస్తూ..పడుకున్నాను.
ఉదయం అయింది....ప్రతి రోజు..ఒక కానుకే నాకు అని నమ్ముతాను, ఉదయించే సూర్యుడిని చూస్తే,చాలు..అన్ని సమస్యలు, ఆలోచనలు ,వేడి తగిలిన మంచు లా కరిగి పోతాయి, రాత్రి కే మళ్లీ, అన్ని చీకటి తో ,దొంగల్లగా మనసులోకి ప్రవేసిస్తాయి..ఇలాగ ఏవో సిద్ధాంతాలు నాకు.
ఇంటి పనులు, వంట పనులు, అన్నీ అయి మధ్యాన్నం రెండయింది, పేస్ బుక్ తెరిచేసరికి..
ఇవాళ కూడ లేదు సమత నించి ఎటువంటి సందేశం..పేస్ బుక్ లో, జవాబు లేదు నా ఇన్ బాక్స్ లో..
నాకు ఎందుకో మనసంతా దిగులు ఆవరించింది.
అలాగే, ఒక నెల రోజులు గడిచి పోయాయి.
నేను నెమ్మదిగా ఫేస్ బుక్ లోకి వెళ్ళడం కూడ తగ్గించేసాను.
ప్రతి ఉదయం ,బద్దకించకుండా, ఉదయించే సూర్యుడు కూడా ఎందుకో ,ఈ సారి నాకు నా మనసులో ఉన్న ఏదో దిగులు ,చింత చీకట్లను దూరం చేయ లేక పోతున్నాడు.
ఇంక నువ్వు మర్చిపో , నీ ఫేస్ బుక్ కూతురు, పెళ్లి చేసుకుని ఏ అమెరికాకో వెళ్లి పోయి ఉంటుంది, తన భర్త తో హాయిగా ,ఉండి ఉంటుంది...ఇంక నువ్వు, ఇంకో ఫ్రెండ్ ని వెతుక్కో, వసుధా..అన్నారు ..ఈయన.
నాకు ఎందుకో , నమ్మాలనిపించ లేదు, అమెరికా లో ఉంటే ఏం? ఒక్క సందేశం పెట్ట వచ్చు కదా ఫేస్ బుక్ లో..ఇదే రోజూ ,నా మనసులో ఆలోచన.
సమత..ఏమయిందో? ఏమయి ఉంటుంది..??
ఇవే ఆలోచనలు..
ఇంక విసుగు వచ్చి మెల్లిగా ,మర్చి పోవడానికే ప్రయత్నిస్తోంది.
ఆ రోజు..సమత ..వి మిస్ యు ..అన్న ఒక మెసేజ్ కనిపించింది.
సమత ఫ్రెండ్ ఒక అమ్మాయి గీత పెట్టింది ..ఆ మెసేజ్.
నాకు గుండె ఆగిపోయింది..
ఎందుకు మిస్ అవుతోంది తను.
గీత కి మెసేజ్ పెట్టెను, సమత ఎలా ఉందో నాకు చెప్పమని, వెంటనే.
గీత వెంటనే మెసేజ్ పెట్టింది..సమత ఇస్ నో మోర్ అని..
నాకు వెంటనే చెమటలు పట్టి, కళ్ళు తిరిగినట్టు అయిపొయింది..
ఎప్పుడూ ఆఫీసు కి ఫోన్ చేయని నేను ఫోన్ చేసాను, వెంటనే ఇంటికి రమ్మని..
ఆనంద్ ఇంటికి వచ్చి, నా పరిస్థితి చూసి, కంగారు పడి, ఏమయింది? ఏమయింది? వసుధా అంటూ డాక్టర్ కి ఫోన్ చేసి, రమ్మన్నాడు.
నాకు ఏమీ కాలేదు. ఫరవాలేదు, ఇలా కూర్చో ..
సమత ఇంక లేదు ట..అంటూ భోరున ఏడ్చేసాను.
ఆనంద్ నన్ను ఊరుకో బెడుతూ, చాల బాధ పడ్డాడు తను కూడ..
నేను ఆ అమ్మాయి కబుర్లు అన్నీ ,తన కి చెప్పేదాన్ని.
నేను ఇంక ఫేస్ బుక్ విషయమే మర్చి పోయాను. కాని, పిల్లలు ఇద్దరూ సెలవుల్లో వచ్చి, అమ్మా..నువ్వు, ఒక్క సంఘటనే కే ఇలా అయిపోతే ఎలా? అమ్మా..నీకు ఎంతో మంచి పేరు, ఫేస్ బుక్, లో, మేం నీ మెసేజ్ లు మిస్ అవుతున్నాం అమ్మా..అంటూ..నన్ను మరి, మరి అడిగేసరికి,
సుమారు ఆరు నెలల తరువాత నా ఎకౌంటు లోకి లాగ్ ఇన్ అయాను.
చాల మెసేజ్లు , ఫ్రెండ్షిప్ కోసం పంపిన మెసేజ్ లు చాల ఉన్నాయి.
ఒక్కొక్కటి చూస్తున్నాను.
మెసేజ్ లో ఒకటి గీత నించి.
మేడెం, మీరు మా సమత ఫ్రెండ్ అని తెలుసు, తను మీ గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేది.
తను చాలా మంచి స్టూడెంట్, చదువు తప్ప ఇంకొకటి తెలీదు, చాల పాత కాలం అమ్మాయి, అని అందరం అనే వాళ్ళం.
అలాంటి అమ్మాయి ని ప్రేమ అంటూ ఇద్దరు అబ్బాయిలు, వెంట పడి ప్రేమిస్తున్నాం అంటూ చాల హింసించేరు, మేం అందరం చెప్పేం, అలాంటివి మామూలు ,ఈ కాలేజ్ లలో, పట్టించుకోకు అంటూ.
ఆ రోజు పరీక్షకి వస్తోంది, తను, మేం కొంచం వెనక గా నడుస్తున్నాం, ఆ రమేష్, అదే ప్రేమిస్తున్నాను అని వెంట పడ్డ అబ్బాయి, వచ్చి, కత్తి తో పొడిచేసాడు, మేం అందరం చూస్తూనే ఉన్నాం, కొన్ని అడుగుల దూరం లో..
అందరం ఘోల్లున అరిచేం..
పోలీసులు పారిపోతున్న అతని ని పట్టుకున్నారు.
హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు..రెండు రోజులు పోరాడి, కను మూసింది, మేం అందరం షాక్ అయ్యాం..మా తల్లితండ్రులు అయితే రోజూ మమ్మలిని కాలేజ్ వద్ద దింపడం మొదలు పెట్టేరు.
ఇంక ముందు చదవ లేక పోయాను.
నా మనసు అంతా ఎవరో పిండేస్తున్నట్టు బాధ, రాక్షసులు అంటే వీరేనా? ఎవరు ఇచ్చారు వీళ్ళకి. ఒక ప్రాణం తీసే అధికారం..చక్కటి, కుసుమం ని కాళ్ళ కింద నలిపేసే కాఠిన్యం, ఎలా ఉంటుంది ఒక మనిషి?
ఎవరి కి పుట్టిన వారు? వీళ్ళు ,ఈ రాక్షసులు..
ఎవరిని నిందించాలి, ఈ విలువలు దిగజారుతున్న విద్య నా? మొత్తం సమాజమే ఇలా తగలడిందా...
నేను నా ఇల్లు, నా పిల్లలు, నా ప్రపంచం ఇవి క్షేమం .అంతే చాలు అనుకునే నా లాంటి వారి వల్లా? నేను ఏమీ నష్టం చేయ లేదే ?
నా పిల్లలని నేను బాగానే పెంచానే ..ఇంక నేను ఏం చెయ్యగలను నేను ఇంత కన్నా.?? ఇంతేనా? నేను ఇంకేం చేయలేనా?
అన్యమస్కం గా ఫ్రెండ్ షిప్ కోసం పంపిన వారి పేర్లు..
చూస్తూంటే..గీత, సమత ఫ్రెండ్..అని కనిపించింది..
తను సమత ..మెసేజ్ కిందే నాకు పెట్టింది, గీత ...
హ్మం..ఆలోచించాలి, మళ్లీ ఇంకో సమత లాగా దూరం అవుతే ,అంటే పెళ్లి, అయో, పై చదువులకో వెళ్లి పోతే..అయినా..నేను..తనకి అవసరం అవుతానా? అవసరం ఒక్కటేనే..ఫ్రెండ్షిప్ చాలదా. తేలికగా తీసుకోవాలా ? నేను కూడా ఈ స్నేహాలు.. ఈ అదృశ్య స్నేహాలు? ఇంతేనా?
తనకి, ఈ నవతరానికి ,నా ఉపయోగం ఇంకా ఉందా?
ఇంకా కిందకి వెళ్ళాను, ఆనంద్ ..ఆనంద్..నించి ఫ్రెండ్షిప్.మెసేజ్..ఎప్పుడూ ,ఏమిటో ఇవన్ని పని లేని ఆడ వారు కల్పించుకున్న అదృశ్య స్నేహితుల పేజ్ ..పోనీలే ,నన్ను ఎక్కువ షంటడం లేదు అంటూ.. నన్ను ఏడిపించే ఆనంద్ నించి నాకు ఫ్రెండ్షిప్ మెసేజ్.
హ్మం..ఇంకా ఈ ఫ్రెండ్షిప్ పేజ్, ఈ ఫేస్ బుక్, నా జీవితాతం ,నాతో నే ఉండే పేజ్..నా పేజ్..నా వ్యక్తిత్వం, నా అస్తిత్వం..ఈ పేజ్..
అనుకుంటూ. ఇద్దరి స్నేహ హస్తాలు.. గీత, ఆనంద్ ,లకి క్లిక్ చేస్తూ..ఇవాల్టి ఫేస్ బుక్ కి శుభం పలికాను..

"నేను ఏం చెయ్యగలను నేను ఇంత కన్నా.?? ఇంతేనా? నేను ఇంకేం చేయలేనా?"...ఆలోచించాల్సిన విషయమే..
రిప్లయితొలగించండిఅవునండి జ్యోతిర్మయి గారు, ఇంతేనా? ఇంకేం చేయగలం..అని ఆలోచిస్తే, మార్గాలు కనిపిస్తాయి.
తొలగించండిమనం తలుపులు మూసుకుని కూర్చున్నాం..తెరవాలి మరి.
వసంతం..
బాగా కదిలించేలా రాసారు... చదువుతుంటే చాలా బాధ వెసింది.!!!!!!
రిప్లయితొలగించండికొన్ని బంధాలు అంతే..పెనవేసుకు పోతే పెకలించలేము...!!
కొన్ని సార్లు ఎవరయినా స్నెహితులు పని లో ఉండి మట్లాడలేదు అంటే చాలా చాలా బధ గా ఉంటుంది.!!1
సీతా.
తొలగించండిమన లాంటి సున్నితమయిన మనసులు చాల మందే ఉన్నారు అని తలచుకుంటే అది ఒక తృప్తి.
అన్నీ బంధాల కన్నా ,స్నేహం కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను నేను కూడా, ఏ బాంధవ్యం అయినా
స్నేహం అనే పరిమళం కూడా అద్దితే, మరింత హృద్యం గా ఉంటుంది, ఈ ఫేసు బుక్ స్నేహాలు,
ఎంత పటిష్టమయినవో ,కాలమే నిర్ణయిస్తుంది.
నా కథ చదివి, అభిప్రాయం కూడా ఓపిక గా రాసినందుకు ధన్యవాదాలు.
వసంతం.
అవునండీ ఇది ఒక వ్యసనమే (ఫేసుబుక్)......
రిప్లయితొలగించండిఇప్పుడు దాని నుంచి బయట పడ్డాను కానీ ఒకప్పుడు నేను కూదా గంటకి ఒకసారి అప్డేట్స్ చూస్తూ ఉండేదాన్ని....
మాధవి,
రిప్లయితొలగించండివ్యసనం అయినా కొంచం అదుపులో ఉంచుకుంటే, మంచి స్నేహితులు ,మంచి మాటలు చెప్పే ఒక విండో ఇది.
మీరు కామెంట్ రాసేరు..ధన్యవాదాలు.
వసంతం.