స్త్రీలను అసభ్యం గా చూపించే దృశ్యాలు ఆప గలమా? ఐటెం పాటలు అంటూ అంగ అంగ విన్యాసాలు చేసే సినిమాల దృశ్యాలు ,అదే పని గా టీవీ ల లో చూపడం ఆప గలమా? ఎక్కడ ఉంది ఈ ఘోరాలకు మూలం?
స్త్రీ ని పూజించే సంస్కారం మనది అంటారు. పూజ కాదు కదా, ఒక మనిషి లాగ, ఒక వ్యక్తీ లాగ చూడ లేక పోతున్నారు. ఒక శరీరం ,ఇది, మన విపరీత కోరికలు తీర్చే ఒక ఆడ శరీరం ఇది అని ఒక మగ వాడు, తన హక్కు లాగ ,బలవంతం గా అనుభవిస్తూంటే, ఈ సమాజం సిగ్గు తో తల వంచు కున్తోందా ? లేదు, టీవీ ల లో మళ్లీ మళ్లీ అవే సన్నివేశాలు, చూపడం, ఒక సున్నితత్వం, ఒక మర్యాద లేకుండా ,ఒక ఉత్సుకత రేపే వార్తా విషయం గా చూపడం , ఎక్కడా ఒక బాధ్యత కలిగిన సభ్య సమాజ స్వరూపం కని పించటం లేదు.
ఈ మధ్యనే, ఒక మాటల సందర్భం లో, ఇక్కడ స్త్రీలకి రక్షణ లేదు అన్నవిషయం చెబుతూ, ఈ మధ్యనే జరిగిన ఒక అత్యాచారం గురించి చెబుతూ, ఆమె ను మూడు రోజుల తరువాత వదిలి పెట్టారు, ఆమె ఆత్మ హత్య చేసుకుంది అని చాల మామూలు విషయం గా మాట్లాడారు. ఇంతేనా మన సభ్య సమాజం నుంచి ఆశించేది.
ఈ సమాజం గవురం కాపాడడానికి ఆమె తన ప్రాణం ఇవ్వడం ఒక ధర్మం అన్నట్టు మాట్లాడితే, ఎన్నేళ్ళు అయినా మనం మన స్త్రీలకి సరి అయిన స్థానం కల్పించాలేమా ? ఈ సమాజం కదా తల దించు కోవాలి?
మనం సరి అయిన వస్త్ర ధారణ చేసుకోవాలి, రెచ్చ కొట్టే దుస్తులు వేసుకో కూడదు, ఒంటరి గా రాత్రి వేళ తిరగ కూడదు, ఎప్పుడు ఒక మగవాని సంరక్షణ లో ఉండాలి, ఏ పశువు ఎప్పుడు కట్టలు తెంచు కుని ,వీధి మీద పడు తుందో అని, ఒక స్త్రీ, అనుక్షణం పుట్టిన దగ్గరి నించి, మెలకువ గా, తన స్త్రీతత్వం గురించి ఒక మెలకువ తో, ఒక జాగురకత తో, మెలగాలి ట. ఇది మనకి ఈ సమాజం ఇచ్చే సందేశం.. పుట్టినప్పట్నించి.
వెయ్యి మంది మగ వారికి ఎనిమిది వందల మందే ఆడ పిల్లలు ఉన్నారు ట ఇప్పుడు, పుట్ట కుండానే చంపేస్తున్నారు. పుట్టుక తోనే మొదలు అవుతుంది ,అన్నమాట ఈ ఉనికి కోసం యత్నం.
రేపటి తరం లో ఇంక మగ పిల్లలు , ఇంకా ఎన్ని అకృత్యాలు చేయ డానికి సిద్ధపడతారో, ఈ సమాజం ఏ దిగ జారుడు మెట్లు వేపు మల్లు తోందో, ఆలోచించ వలసిన సమయం విరుచుకు పడుతోంది.
అడవి లో పులుల్ని కాపాడమని సంతకాలు పెట్ట మంటున్నారు, ఇక్కడ ఇప్ప్పుడే ఆడ పిల్లల మనుగడ ,రక్షణ, ఉనికే, ముప్పు లో ఉన్నాయి.
ఎవరు ఎలుగెత్తి ఈ పిలుపు నిస్తారు, మనకి మనమే..
మనమే, మన ఉనికి ని కాపు కోవాలి, సమాజం అంటే మనం కూడా కదా..
.
I agree with you. The West is known for this. But here, most women do it out of their choice (societal compulsion sure is a factor). In India, I think values in the society are very low, in spite of all the greatness we attribute to our culture.
రిప్లయితొలగించండిWe just need to remind ourselves that we are imperfect human beings in an imperfect world. I feel guilty, for not feeling guilty (most of the time) while enjoying things that most in the world are denied.
We just need to count our blessing constantly, pick a social issue that we are passionate about, and do something to make a positive difference. I realized that I complain too much and act little.
True,Gopa, we are just reacting but are not acting proactively, as you said, I think, at least let the thought process begin, may be some action will follow after the thought process.. wishful thinking..Thanks any how, for reading and reacting..
రిప్లయితొలగించండిsisira..
రిప్లయితొలగించండిThanks for reading and posting your comment.. I read your introduction in your info page and found them so close to my interests too..
Love for telugu, old songs, history, politics, any thing related to society and its concerns..Nice meeting you, please read my previous blogs too, when you are free.. and give your feedback.vasantham..