"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

11 అక్టో, 2010

వంద కోట్ల భారత్ లో, ఒలీమ్పిక్ బంగారు పతకం ఒక్కరు సంపాదించలేరా ?

ప్రతిభా పాటవాలు ఏ ఒక్కరి సోత్తో కాదు అని  కామన్ వెల్త్ ఆటలు లో దీపిక , డోన మొదలైన ఆట గాళ్ళు నిరూపిస్తున్నారు. వంద కోట్ల భారత్ లో, ఒలీమ్పిక్ బంగారు పతకం ఒక్కరు సంపాదించలేరా ? అంటూ టీవీ లు చూస్తూ, చిప్స్ తింటూ, సోఫా లో కూర్చుని నిట్టురుస్తాం. ప్రభుత్వం ఆటలకు సముచిత స్థానం కల్పించడం లో ఘోరం గా విఫల మయింది. 
ఒక స్కూల్ అంటే, తరగతి గదులు, చుట్టూ విశాల మైన ఆవరణ ,ఆటలకి, పరుగులకి, నాలుగు గోడల తరగతి గది నుంచి బయటకి వచ్చి ఊపిరి పిల్చు కోడానికి, ఒక మైదానం.. కాని, ఇప్పుడు స్కూల్స్ ని చూస్తే కడుపులోంచి దుఖం వస్తుంది. నాలుగు అంతస్తుల అద్దె భవనం, రోజు కి  పదహారు గంటలు చదివిందే చదివి, బట్టి పట్టడం, కళ్ళ ఎదుట నాలుగు గోడలు, చుట్టూ గోడలు, ఊపిరి ఆడని ఈ బడులలో, నీరసం గా వాలి పోయి బయటకు వస్తారు.
ఏ ఆట అయిన టీవీ స్క్రీన్ మీదే ఆడ గలరు, శరీరం కదపకుండా.
విద్య రంగం పూర్తి గా ప్రైవేటు పరం చేసి, పిల్లలకి  ఒక ఎంజేనీరింగ్ లేదా మెడికల్ అంటూ ఒక పరుగు పందెం పెడు తోంది. మనం చూస్తూ ,ఏమి చేయాలో తెలియక , చేతులు కట్టుకుని కూర్చున్నాం.
బాగా ఉన్నతం గా ,జీవితం లో నిలదొక్క కోవాలని, మనం మన పిల్లలని, బాగా చదివిస్తాం. ఆటలు జీవితానికి స్థిరపడ డానికి సరి పోవు కదా? అని మన దృక్పధం.
కాని, నిండైన మన అసలు జీవిత, భారతీయ విలువలు, ఇంకా పల్లె లలో బతికి ఉన్నాయి. ఈ కుస్తీ లు, విల్లు ఎక్కి పట్టి , గురి కి సంధించడం, అవలీల గా ఏభై కేజీలు బరువు ఎత్తడం , చదరంగం ఎత్తులు వేయడం, బలం గా , జీవం తో నిండిన శరీర ఆకృతులు,  తినడానికి లేక పోయినా, మొక్క పోనీ దీక్షతో, వారికి వారే, ఆకాశమే హద్దు అనుకుంటూ, భారత దేశం ముద్దు బిడ్డలం మనమే అని వారే గుర్తు ఎరిగి, ఈ ప్రభుత్వాలు, కళ్ళు మూసుకుని కూర్చుంటే, వారు ఇంటా బయట, గుర్తింపు తెస్తున్నారు.   ఢిల్లీ లో బంగారు పతకాలు     పండిస్తున్నారు.  మన దేశం పరువు నిలు పుతున్నారు.
టీవీ లో చూసాను, తల్లి, నర్సు ఉద్యోగం, తండ్రి ఆటో డ్రైవర్, దీపిక విలు విద్య లో రెండు బంగారు పతకాలు పొందింది. ఆనందం   తో ఒళ్ళు పులకరించింది...దీపావళి మాకు ముందే వచ్చింది అని ఆ తండ్రి, పండుగ చేసుకుంటున్నాడు. మనం అందరం కూడా ఆ  సంతోషం లో పాలు పంచుకుని వారికి మన అబినందనలు  తెలియ పరుద్దాం.
ఇప్పటి కైనా ప్రభుత్వం మేలుకుని, ఆటలు, వ్యాయామం, మన దేశి క్రీడలు, యోగ వంటి విద్యలు చదువు లో భాగం గా చేర్చాలి.
కొమ్పుటర్ లో ఆటలు ఆడడం కాదు, నిజమైన మైదానం లో పిల్లలు పరుగులు తీయాలి, క్రికెట్ ఒక్కటే ఆట కాదు, ఇంకా చాల ఆటలు కూడా ఉన్నాయి అని పిల్లలికి తెలియాలి.
వచ్చే ఒల్య్మ్పిక్స్ కని ఇప్పుడే ప్రారంభించాలి ప్రయత్నాలు.. 
వంద కోట్ల మంది లో, కొందరైనా మన ఆశలు నెరవేరుస్తారు, ప్రభుత్వం, సాయం అని ఎదురు  చూడకుండా , ఎవరి ప్రయత్నాల్లో వారుండే దీపికలు, డోన లు, మనకి ఉండనే ఉన్నారు.
రండి, చప్పట్లు కొట్టి, వారికి ఉత్సాహం నిద్దాం, ఇంక ఏమైనా చేయగలమా? మనం అని ఆలోచిద్దాం. నిండైన కండ కలిగిన జాతి , మన జాతి అని గర్వ పడే రోజు కోసం ఎదురు  చూద్దాం. 

4 కామెంట్‌లు: