అమ్మలూ ..అమ్మమ్మలూ, నాయనమ్మలు తెరవండి తలుపులు, పట్టండి చిట్టెలుకని.. అదే విండోస్ లో కి లాగ్ ఇన్ అయి, మౌస్ పట్టి, కొత్త లోకం లోకి ప్రవేశించండి. ఇప్పుడు అందరి పిల్లలు, వారి పిల్లలు, అమెరికా లోనో లేదా గల్ఫ్ లోనో, ఉంటున్నారు. పిల్లలు గుర్తు వస్తున్నారు అంటూ కళ్ళు వత్తుకోడం కాదు.. వెంటనే లాగ్ ఇన్ అయిపోయి, చాటింగ్ అంటే మాటలు ,పదాల్లో మాటలు మొదలు పెట్టండి, లేదా పిల్లలు ఫేసు బుక్ లో పెట్టే ఫోటోలు చూడండి. అంటే కాని, ఇల్లు ఖాళీ అయిపొయింది అని దిగులు తో ఇంట్లో వాళ్ళ మతి పోగట్టకండి .
ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు కూడా అదేదో బ్రహ్మ విద్య అన్నట్టు, నాకు కంపూటర్ అంటే ఏమిటో తెలీదు. నేను ఏమి నేర్చుకోలేదు అంటారు. పిల్లలు వారి అమ్మలకి, అమ్ముమ్మలకి, కొంచం ఈ బ్రహ్మ విద్య కానిది నేర్పించి వెళ్ళాలి. విదేశాలకి వెళ్ళే ముందు. మనం దానికీ ప్రోగ్రాంలు రాసి ఏమి నేర్పించ అక్కర్లేదు.
పవర్ స్విచ్ ఆన్ చేసి, నెట్ మీద క్లిక్ చేసి, ఒక్కోసారి అది ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది.. ఏదో ఒక ఎక్ష్ప్లొరెర్ కాని, ఒక ఫైర్ ఫాక్స్ కాని పేజీ ఓపెన్ చేసి, మెయిల్ ఓపెన్ చేయడం నేర్పించాలి.. నెట్ లో కొన్ని ముఖ్య మైన పేజెస్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపించాలి. ఇంట్లో మగ వారు కూడా, నీకేం వస్తుంది? నువ్వు ఏదో పాడు చేస్తావు లాంటి మాటల తో ఆమెను నిరుత్సాహ పరచ కూడదు.
నాన్న ల కన్నా అమ్మ లు ఎక్కువ మిస్ అవుతారు పిల్లలని, అస్తమాను ఫోన్ చేసి మాట్లాడండి అని విసిగించలేము , అలాంటప్పుడు ఒక మెయిల్ రాసి పెడితే, వాళ్ళు చూసుకుని , వారి కి వీలు అయినప్పుడు వారే ఫోన్ చేయడమో, లేదా మెయిల్ లో విషయం రాయడమో చేస్తారు. మాకు తెలిసిన రాజ్యం అత్తయ్య గారు, చినవాల్టర్ లో ఉండే మా అత్తయ్య గారి పిల్లలు నలుగురు అమెరికా లో ఉంటారు , ఎప్పుడో పదేళ్ళ ముందు నుంచే ఆవిడ నెట్ ఉపయోగించడం నేర్చుకుని, టక టక మని వెబ్ కమెర కూడా ఆన్ చేసి ఇక్కడ వారిని అక్కడ చూపించడం, వాళ్ళ ఇంట్లో జరిగే వ్రతాలు, పుట్టిన రోజుల పండగలు చూడ్డం చేస్తున్నారు ఆవిడ.అన్నిటికి టికెట్లు కొనుక్కుని అక్కడికి పరుగెట్టలేరు కదా. ఆవిడకి ఏ డిగ్రీ చదువులు లేవు కాని, ఏదైనా నేర్చు కోవాలి అన్న ఉత్సాహం ఉంది. ఎవరి మీద ఆధార పడకుండా ఆవిడే అన్నీ చూస్తున్నారు నెట్ లో. ఫోటోలు చూపిస్తారు మనకి. ఎంత ముచ్చట గా ఉంటుందో?
నాకు తెలిసిన వారు ఎందరో, నా వయసు వారే, కంపూటర్ విద్య నేర్చుకోలేదు అంటారు, ఏ విద్య అక్కర్లేదు అది ఒక మెషిన్, దానిని ఉపయోగించడం వస్తే చాలు, అంటే ఏమిటో సందేహిస్తున్నారు. నా ఉద్దేశం ఇంట్లో ఉండే ఆడవారికి ఈ విషయాలు బోధించే సంస్థలు, ఇంటికి వచ్చి క్లాసెస్ పెట్టి నేర్పిస్తాం అని ,నేర్పించడం మొదలు పెట్టాలి.
ఎన్నో చేయ వచ్చు. స్నేహితులతో మాట్లాడుకోవడం, కథలు చదవడం ,సినిమా కథలు చదవొచ్చు, వార్త పత్రికల లో వార్తలు చదవడం , ఎన్నో చేయ వచ్చు. పిల్లలు ఇల్లు వదిలి, చదువు కోసమో, ఉద్యోగం కోసమో బయటకి వెళుతున్నారు. పాస్ పోర్ట్ ,వీసా లాంటి వివరాలని మనంతట మనమే చూసుకోవచ్చు ఎవరి మీదా ఆధార పడకుండా.
ఒక్క సారి శూన్యం గా అనిపించి, ఏదో బాధ తో, బి . పి .లు, షుగర్ లు వచ్చి, మనకి ఏదో ఆరోగ్య బాధలు ఉన్నాయి అని విచారిస్తూ కూర్చునే రోజులు కావివి. మన ఆరోగ్యం కూడా మనమే బాగా చూసు కోవాలి, ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి మనకి సేవలు చేయడానికీ ,వారికి వీలు పడదు, అని తెలుసు కోవాలి. ఉద్యోగ బాధ్యతలు పిల్లలు ఆడ పిల్లలు అయినా మగ పిల్లలు అయిన ఇప్పుడు ఒక్క లాగే ఉంటున్నాయి.
ఇంక ఆడ పిల్లకి పెళ్లి అయి విదేశం లో ఉంటే, తప్పక అమ్మలు వెళ్ళాల్సిందే డెలివరీ సమయానికి. వారు పంపించే వీసా కాయితాలు, టికెట్ అన్నీ నెట్ నుంచే చూసు కోవచ్చు. అక్కడ వాతావరణం, ఆ ఊరు లో సదుపాయాలు అన్నీ మనం ఇక్కడ ఇంట్లో కూర్చునే చూడ వచ్చు. ఎంత పరిజ్ఞానం ఉంటే ఏ విషయం మీద అయినా అంతా మంచిది, ఈ రోజుల్లో. మన గది లోనే కూర్చుని, ప్రపంచం అంతా చుట్టి రావచ్చు.
ఇంకా వంటలు అవీ ఇష్టం ఉన్నవారు, లెక్క లేని అన్ని వంటల పేజీలు చూడ వచ్చు, లేదా వారికి తెలిసిన వంటలు, ఇంక చిట్కాలు, ఏవైనా ఇలాగే ఒక బ్లాగ్ లో రాయ వచ్చు.
నాకు బాగా నచ్చిన టి వి సీరియల్ అమ్మమ్మ.కామ్ లో అమ్మమ్మ ఇంటి నుంచే ఎంత ఉపయోగ పడే విషయాలు చెపుతో ఉంటుంది. మధ్య తరగతి, మామూలు మగవారి మనస్తత్వం కలిగిన భర్త, మూర్ఖం గా ముందు వ్యతిరేకించినా చివరకి ఎలా ఆవిడ గొప్పతనం అంగీకరిస్తాడో, చక్క గా చూపించారు.
ఇంట్లో గృహిణి గా ఉంటూ, మనం ఏమి చేయలేం, ఏం నేర్చుకోలేదు అని విచారించడం మానేసి, ముందు ఈ ప్రపంచ కిటికీ ముందు కూర్చోండి. చేతిలో మౌస్ పట్టు కోండి. క్లిక్ చేయండి. ప్రపంచమే తెరుచు కుంటుంది. మీ ముందు రండి ఈరోజే, ఈ క్షణమే..
ఈ టపా రాసి మూడేళ్ళ యిందేమో , ఇప్పుడు ఇంకా ముందుకి వెళ్ళి పోయాం ..అంతా వాట్స్ అప్ ల కాలం ఇప్పుడు ..మరి ..అమ్మ లూ అమ్మమ్మలూ అందరూ వాట్స్ అప్ లే మరి ..
మొబైల్ శకం ఇది , దూరాలు తరిగిపోతున్న కాలం ఇది , మన కళ్ళ ముందే విభ్రాంతికర మార్పులు చూస్తున్నాం ..అనుభవిస్తున్నం ..మన తరం నిజం గా చాలా అదృష్ట వంతులం కదా ,ఎవరేమన్నా ..మొబైల్ జిందాబాద్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి