అయితే , మన రాష్ట్రం లో, కోర్పోరాటే కళాశాల లో జరుగుతున్న అందరం పట్టించుకోని , హింస గురించి ముందుగ రాయాలని ఇది రాయడం మొదలు పెట్టాను.
ఎనిమిది, తొమ్మిది తరగతులు కి రాగానే, రోజూ సాయంత్రం ఆడుకునే ఆటలు బంద్. దాని స్థానం లో ఎక్ష్త్ర క్లాస్స్లు, లేదా ట్యూషన్లు మొదలు, అప్పుడప్పుడే సాగుతున్న పిల్లవాడి కాళ్లు, చేతులు కట్టేసినట్టే. అది ఒక మెదడేనా? లేక ఒక యంత్రమా? ఇవి కాదు, ఇన్ని రక రకాల కష్టాలు ఎందుకు మనకి అను కునే తల్లిదండ్రులు, ఏకంగా ఉదయం నుంచి రాత్రి వరకు చదువులు చెప్పే ఒక జైలు లాంటి ఖార్ఖానా లో పడేస్తారు.
ఒక సంవత్సరం పాటు నింపాదిగా చెప్పా వలసిన సిలబస్ ను, ఆరు నెలలో, నో ఇంక ముందు గానో పూర్తి చేసి, ఇంక ఆ తరువాత అంతా రివిషన్ పేరు తో, తోమించడం, చదువు అంటే నే వెగటు పుట్టదూ?
ఈ పిల్లలే, కట్టులు తెంచుకుని, విచ్చలవిడిగా ప్రవర్తించడం చూస్తాం, బయట. వారికి ఒక మానసిక వికాసం, ఒక విశ్రాంతి , ఒక సంపూర్ణ వ్యక్తీ వికాసం ..ఇవేమీ ఉండవు. బాగా చదవడం, ఇంకా బాగా చదవడం, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఇదేనా చదువు..అంటే.
నాకు తెల్సిన ఒక స్కూల్ లో, ఉదయమే అయిదు గంటలకి ,ఒక ఫోన్ వస్తుంది, స్కూల్ అధికారి నుంచి. ఆ పిల్లాడే అందు కోవాలి ఆ ఫోన్, నేను లేచే వున్నాను, చదువుతున్నాను అని వారికి హామీ అన్నమాట పిల్లాడి నుంచి. కలలే అపహరించే దొంగలు అన్న మాట గుర్తు వచ్చింది నాకు, కమ్మగా నిద్ర కూడా పోనివ్వరు, ఇదేమి బడి? ఇదేమి చదువు?
తల్లిదండ్రులు ఎందుకు ఇలాగ లొంగి పోతున్నారు? ఈ శిక్ష లా ఉండే విద్య కు?అంటే కంపిటేశున్ అంటారు. రెండు లక్షల పై చిలుకు ఇంజేనీరింగ్ సీట్లు, పిలిచి ఇస్తున్నారు, ఏమిటి ఈ పిచ్చి? ఏమిటి ఈ వెర్రి?
నాతో చదివిన స్నేహితురాలు ఒక కార్పోరాట్ కళాశాల లో పని చేస్తోంది. ఉదయం ఆరు గంటల నుండి క్లాస్ ట. అక్కడే ఫలహారం, అక్కడే భోజనం, మొత్తం మీద ఒక గంట విశ్రాంతి, రాత్రి ఎనినిది వరకు బోధించాలి. సిలబస్ అంత ఎప్పుడో అయిపొయింది, మళ్లీ, మళ్లీ, రుబ్బి, రుబ్బి, పిల్లల మైండ్ లోకి ఎక్కించాలి. ఇన్ని గంటలు అధ్యాపకలు ఎలా అరుస్తారు? వీళ్ళు మనుషులే కదా? గొంతు మండడూ? మెదడు వేడి ఎక్కి, పిల్లలికి మెదడు వాపు వ్యాధి వస్తుందేమో అన్నాను, హాస్యం గా, కాని కడుపు మండి పోతోంది, నిజం గా ఇన్ని గంటలు పిల్లలు వింటారా? అంటే కళ్ళు పుస్తకం మీద ఉంటాయి ,ఆలోచనలు ఎక్కడో ఉంటాయి.
ఆదివారం అంటే మనకి హాలిడే ,జోలి డే..ఆ రోజు ఆలస్యం గా నిద్ర లేవడం మన జన్మ హక్కు అనుకుంటాం. మెల్లిగా లేచి, ఏ పూరిలో , దోసలో, టిఫిన్ తిని, అమ్మ ఇంక స్నానం చేయవే అని తిడు తూ ఉంటే, పత్రికో, పేపరో, ఫోనో, ఏదో పట్టుకుని వేలాడుతూ, అన్ని పనులు స్లో మోశున్ లో చేసే రోజు అది.
కాని, ఈ కాలేజ్ లో కాదు. ఆ రోజు ఒక స్పెషుల్ పరీక్ష ఉంటుంది, ఆ వారం లో జరిగిన పాఠాలు మీద. ఆ రోజు ఇంకా ఉదయమే లేచి, మళ్లీ ,మళ్లీ ఇంట్లో చదువుకుని వెళ్ళి పరీక్ష రాసి రావాలి. ఆదివారం కాలేజే నడిపే వారందిరిని ఒక టో,పడి రోజులో జైలు శిక్ష వేయాలి, నా ఉద్దేశం లో.
పాఠాలు చెప్పే అధ్యాపకులు కి కూడా ఒక సెలవు రోజు ఉండ వద్దా? ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకు కాలేజ్ లో నే గడిపితే, ఇంక వారు ఇంటికి వెళ్ళి, వారి పిల్లలను, కుటుంబం తోనూ ఎప్పుడు గడుపుతారు?
ఇవి అన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘనే అని పిస్తున్నది నాకు అయితే. ఆల్ ఇండియా లెవెల్ టెస్ట్ ల లో మనకే బోలెడు రాంకులు, వీటి కోసం ఈ మాత్రం కష్ట పడాల్సిందే అంటారు , కాని, ఒక లక్ష మండి రాస్తే ఒక వెయ్యి మంది కి వస్తాయేమో ఈ రాంకులు. ఈ కర్పోరాటే కళాశాలలు లేనప్పుడు కూడా వచ్చాయి మనకి రాంకులు.
చదవాలి అనే ఆకాంక్ష, కొంత తెలివి తేటలు , కొంత నియమ నిబద్ధత , ఉండాలి ఆ పిల్లవాడికి, అంటే కాని బలవంతం గా కుక్కి, కుక్కి పెట్టే అన్నం ముద్ద లాగ, మక్కి పెట్టించి చదువు చెపితే రాంకులు వస్తాయా?
సంస్కారం, ప్రపంచ జ్ఞానం, విజ్ఞానం , సమయస్ఫూర్తి, ఆటలు లో ఓటమి గెలుపుల సంయమనం, అందరి తో కలిసి సామూహికం గా పని చేయడం, పదిమంది లో ఒక్కడిగా మెలగడం, అవసరం అయినపుడు సారధ్యం వహించే నాయకుడి లక్షణం. .. ఇవి నేర్పించేదే విద్య ,చదువు, అంతే కాని, ఒక్క మార్కు తగ్గిందని ప్రాణాలు తీసుకోవడాన్ని నేర్పించే పోటి చదువులు కాదు.
పని గంటలు అని మనకి ఒక రూల్ ఉంది, దానిని పట్టించు కోరు, పిల్లలకి ఒక చదువు సమయం అని తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు బడి వేళ లు ఉన్నాయి. ఇవేమీ పట్టించు కోని ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం పై అజమాయిషీ లేదా?
అసలు ప్రభుత్వం ప్రాధమిక విద్య ను పూర్తిగా పట్టించు కోవడం మానేసి, అంతా ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించింది. ఎంత చిన్న ఆదాయం ఉన్నవారు కూడా అప్పో సొప్పో చేసి, ఈ ప్రైవేట్ బడి లోనే పడేస్తున్నారు తమ పిల్లలిని. వేలకి వేలు ఫీజు. ఉనిఫోరములు, షులు, చదువు ఏం చెపుతారో, తక్కువ జీతాలకు పని చేసే టీచర్లు. ఇది మన విద్య రంగం పరిస్థితి.
వారిలో వారు అధికారం కోసం కుమ్ములాటలు, గ్రూపులు, అస్తవ్యస్త పాలన. ఎంతో ముఖ్యమైన విద్య కు అత్యంత తక్కువ ప్రణాళిక నిధులు.
కనీస కర్తవ్యమ్ గా ముందు, ఈ కార్పోరేట్ కళాశాల లో పరిస్థితిని సమీక్షిన్ చాలి, రోజు లో పద్దెనిమిది గంటలు చెప్పడం, విద్యార్ధులను కూర్చో పెట్టడం, మానవ హక్కుల చట్టం కింద వీరిని శిక్షించాలి, తల్లి తండ్రులూ, మేల్కోండి, వారి భారి విజ్ఞాపనలు చూసి, మోస పోకండి, లక్ష మంది లో కొన్ని వేల మంది కి వస్తాయి రాంకులు, అవీ బాగా చదివే కొంత మందికి, నేను బి కామ్ చదువుతాను నాన్న అంటే ఎందుకూ పనికి రావు అంటూ, ఎంజేనీరింగ్ లో పడేయకండి, అయిదేళ్ళు చదివినా పాస్ అవని విద్యార్ధులు కనిపిస్తున్నారు, ఎందుకు, వారికి ఆ చదువు మీద అభిరుచి లేదు, అందరు చదువుతున్నారు అని చదివించడం.. . మూస పధ్ధతి లో ఆలోచన ..
ఇకనైనా మేల్కోండి, పిల్లలు స్వభివ కం గా పెరగాలి, వారిని గైడ్ చేయండి, కాని, అణగదొక్కి, కొమ్ములు విరిచి కూర్చో పెట్టడానికి వాళ్ళు గిత్తలు కారు, గాలే చొరబడని, నాలుగు గోడల మధ్య ,రోజు లో పద్దెనిమిది గంటలు కూర్చో బెట్టి, చదువు, చదువు అని అంకుశం తో పొడుస్తూ ఉంటే, వాళ్ళే మరి తిరగ బడతారు.
బయట సమాజం లో, ప్రేమించు అని వెంట పడే వాళ్ళు, ఆడ పిల్లలని వేధించే వాళ్ళు, తల్లిదండ్రులని ఆస్తి కోసం హింసించే వారు, ఇలాంటి రూపాలను తయారు చేస్తున్నాం, మన విద్య వ్యవస్థ ను సమూలం గా తీర్చి దిద్దాలి, ముందు గా ఈ ప్రైవేట్ కాలేజ్ విష వ్యవస్థ ని వేళ్ళ తో పెరికి వేసి, ఒక బాద్య త యుతమైన , ప్రభుత్వ ఆధీనం లో మెలిగే చక్కని శిక్ష బుద్ధులు నేర్పే విద్య సంస్థల నియామకానికి శ్రేకారం చుట్టాలి.
తల్లి దండ్రులు, విద్య వేత్తలు, ప్రణాళిక వేత్తలు, అందరు కలిసి ,చర్చించి, మన పిల్లలే రేపటి పవ్రులు అనే ఆలోచనతో, చక్కని విద్య వవస్థ కి పునాదులు వేయాలి.
పువ్వుల్లాగా సున్నితం గ పుట్టిన మన పిల్లలను చదువు ల పేరిట బలవంతం గా నలిపి వేయకండి, పువ్వుల్లాగే వికసిస్తారు, వారు కూడా, చదువు ని ఆనందించాలి వారు, భయ పడుతూ ,బెంగ పడుతూ, అసహ్యించుకుంటూ కాదు.
ఒక తరం ,రేపటి తరం , కి చక్కని పునాది వేద్దాం.. రండి.
Very thought provoking.
రిప్లయితొలగించండిThanks Shyamala..
రిప్లయితొలగించండి