ఇరవై ఏళ్ల క్రితం ఫోన్ కోసం ఒక ఏడాది తపస్సు చేస్తే అంటే ముందు అయిదు వేలు ధరావతు కట్టి ఏమైంది మా ఫోన్ విషయం ,అంటే, అప్పుడేనా ఇంకా ఇన్ని వేల మంది మీ ముందు ఉన్నారు, అంటూ మురిపించి, మురిపించి, చివరకు ఒక రోజు మేం ఊరులో లేని సమయం లో, ఓ ఫోన్ కేబుల్ కిటికిలోంచి పడేసారు, మా రెండో అబ్బాయి పుట్టిన కొన్ని నెలలకే, ఆ రోజు మా ఆనందం ఇంత అంతా అని కాదు. ఫోన్ ఉన్న కొంత మంది అదృష్ట వంతుల జాబితా లోకి మేమూ చేరాం..అదే ఆంగ్లం లో ప్రివేలేజేడ్ ఫ్యూ అంటారు.
ఇంక ఓ పది ఏళ్ళు ఏ మార్పులు లేవు, పొడవాటి లైన్ లో నిల్చుని ఫోన్ బిల్ కడుతూంటే, మీకు మేం ఎంత సేవ చేస్తున్నాం అంటూ డబ్బు తీసుకోవడం అమ్మయ్య ఈ రోజు మనం ఎంత గొప్ప పని చేసాం, ఒక గంట లోనే బిల్ కట్టేశాం అంటూ నేను నేను అభినందించు కోవడం, ఇవి ఇప్పుడు ఏదో కల లాగ గుర్తు ఉంది.
రాజీవ్ గాంధీ టైం లో, శామ్ పిట్రోడా అనే ఓ టేక్నోక్రాట్ ఆధ్వర్యంలో మొదలయింది, మన సమాచార వ్యవస్థ ప్రయాణం.. ఒక దశాబ్దం లో ఎంత మార్పు, ఇప్పుడు వీధికి నాలుగు ఎస్ టీ డి కొట్లు, పల్లె పల్లె కూ ఫోన్ లైన్లు, అదే ఒక విప్లవం మన భారత దేశం లో అనుకుంటే, నవ శతాబ్దం లో అంటే రెండు వేలు ఏడాది నుంచి మన దేశం తన మార్కెట్ తలుపులు తెరిచింది, అంతే, మొబైల్ లేదా సెల్ ఫోన్ అనే సమాచార విప్లవం ఉదయించింది మన భారత్ దేశం లో, మన జీవితాలే మారి పోయాయి.
మనం ఇంట్లో లేక పోతే ఏదైనా ముఖ్య విషయం చెప్పాలి, అంటే అవతలి వారు మనం ఇంటికి వచ్చే వరకు ఓపిక గా వేచి ఉండడమే . ఒకే ఒక ఫోన్ రింగ్ అయి, రింగ్ అయి ఓపిక పోయి, నీరసం వచ్చి ఊరుకునేది. మన కి ఏదో ఊరడింపు గా నెల కి, ఒక ఏభై రూపాయలు అదనం గా కట్టించు కుని ఒక కాలర్ గుర్తింపు సదుపాయం అంటూ పెట్టారు. మన సమాచార శాఖ వారు, ఏదీ చేసినా ఒక మెహర్బానీ ఏ వీరికి. వెంటనే ఆ సదుపాయం పెట్టించు కున్నాం . అయితే, ఈ సదుపాయం ఉన్నట్టే చాల మందికి తెలియదు, చాలా రహస్యం గా దాచుకునే వారు, ఇలాంటి సేవలు ..అందరికి అందుబాటు లో ఉంటే, వీరికి పని ఎక్కువ అవుతుందనో ఏమిటో? మరి.
ఇలాంటి సమయం లో ఈ మొబైల్ ఫోన్ అనే సదుపాయం ఆకాశమే చేతిలో కి వచ్చినట్టు. ఏదో బయట పని లోకి, వెళ్ళే మగ వాళ్ళు కి ఒక ఆభరణం లాగ వచ్చింది మొదట్లో ఈ ఫోన్. జేబులోనో, బెల్ట్ కి నడుము దగ్గరో కట్టుకుని ఉండేది, సౌండ్ వస్తే, మాట వినబడదు, మన మాట వాళ్లకి వినబడదు, సెల్ కవరింగ్ లేదు అంటూ నడుచుకుంటూ , ఎక్కడికో వెళ్ళిపోవడం, దాని మీద బోళ్ళు జోక్స్..
టాటా వారే అనుకుంటా ముందు పోటిగా ప్రవేశించారు రంగం లోకి, అంతే సీను మారి పోయింది. పెను నిద్ర లోంచి ఆవులించుకుంటూ లేచారు. మన భారత దేశ సమాచార శాఖ వారు వారం రోజుల్లోనే ఫోన్ . మీ ఇంటికి వచ్చి అప్లికేస్సన్ తీసుకుంటాం అంటూ. నేను రెండు మూడు సార్లు నన్ను నేను, పక్క వాళ్ళని కూడా గిల్లి చూసాను, కలా? వైష్ణవ మాయా? అని..
ఇంట్లో లేక పోతే ఏ బొమ్మనో లోనో, చందనా లోనో, లేదా కరాచి వాల షాప్ లోనో ఉంటాను, నాకు ఎందుకు ఈ సెల్ ఫోన్ లు అవీ అని మొదట చాల వ్యతిరేకించాను. ఏదో అనుమానం మొగుడు లాగ (నా అనుభవం లో కాదు) వెంట వెంట వస్తున్నట్టు, మనం ఎక్కడ ఉంటే అక్కడికి పోన్ ఆ ? అదో మోత దండుగ, ఇప్పటికే భుజం లాగేస్తోంది ఈ హ్యాండ్ బాగ్ మోయలేక అనుకున్నాను. కాని, ప్రలోభంకి లొంగి పోయాను. అది ఒక ఫ్యాషను కదా మరి.
ఒక రోజు హైదరాబాద్ కి విజయవాడ మీదుగా బయలు దేరాను, ఉదయమే వెళ్ళే జన్మ భూమి లో టికెట్ కొనుక్కుని, ఏ సి చైర్ కార్ లో పెట్టె పెట్టి, మా వైజాగ్ స్టేషన్లో కొత్తగా పెట్టిన హోటల్ లో, వేడి వేడి ఇడ్లి తిని, వేడి కాఫ్ఫీ ,ఊదుకుంటూ తాగుతూంటే, రైలు కదిలిపోయింది. నా పెట్టె రైల్ లో, నేను ప్లాట్ ఫాం మీద.. దిక్కు తోచలేదు. వెంటనే స్టేషన్ మాస్టర్ కి రిపోర్ట్ చేశాను. అనకాపల్లి లో ఆగుతుంది, అక్కడ కాచ్ చేయండి అని ఒక సలహా ఇచ్చారు. అప్పుడు, ఒక అర గంట తేడా తో బయలు దేరే సింహాద్రి రైలు ఎక్కి, ఈ జన్మ భూమి రైలు ని చేసింగ్ మొదలు పెట్టాను.
అప్పుడు నా బాగ్ లోని ఈ సెల్ ఫోన్ ,ఒక దేవత లాగ అని పించింది. వెంటనే తీసి, ఎడ పెడ రాజమండ్రి లో ఉన్న మా మరదలు కి, పెట్టె ఉందో లేదో కని పెట్టమని, ఒక ఫోన్, విజయవాడ లో ఉన్న మా మరిది కి ఇంకో ఫోన్ కాల్ కలిపి, నా కన్నా ముందు నా పెట్టె, ఇంకో రైలు లో వస్తోంది, ఎలాగో ఒక లాగు ,దాన్ని అంది పుచ్చు కోమని, చేసి, ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే ఏం ప్రయోజనం .ఇలాగ బాగ్ లో ఎప్పుడూ, నా వెంట ఉండే ఈ సెల్ యొక్క మహత్యం ఇంత అంతా అని కాదు. అని చాల ప్రత్యక్షం గా అనుభవం తో నేర్చుకున్నాను సెల్ ఫోన్ యొక్క అవసరం.. మహత్యం పెట్టె దొరికింది లెండి.
ఇంక ఈ సెల్ ఫోన్ ఇంతై వటుడింతై అన్నట్టు పెరిగి, ఓహో ఎంత వింత అన్నట్టు చేతిలో అద్భుతాలు చూపిస్తోంది. ఫోన్ అంటే మాట్లాడు కోడానికి,టేప్ రికార్డర్ అంటే పాటలు విన డానికి, కేమెర అంటే ఫోటోలు తీయడానికి ,కంపూటర్ అంటే , మెయిల్స్ అవీ చూసు కోవడం ,నెట్ లో ఏదైనా వెతుకోడానికి, ఇలాగ వేటి అవసరం వాటికి, నాలుగైదు వస్తువులు కొనుక్కోవడం ఉండేది.
ఇప్పుడు అన్నీ కలిపి ఒకే ఒక బుల్లి, చేతిలో పట్టే అందమైన చిన్న యంత్రం.. సెల్ ఫోన్. అవురా? ఎంత మార్పు.. ? అని ముక్కు మీద వేలు వేసుకోవాల్సి వస్తోంది.
మాట్లాడు కోడానికి, ఫోటోలు తీసు కోవడం, పాటలు వినడం, వీడియో కూడా తీయ వచ్చు , నెట్ కనెక్ట్ చేసుకుంటే, అదీ వై ఫై అనే కేబుల్ అక్కరలేని సుకర్యం ఉంటే, ఎక్కడైతే ఈ సదుపాయం ఉంటుందో, అక్కడ నుంచి మనం మెయిల్స్ పంపించ వచ్చు, మనకి ఏమైనా తెలుసు కోవాలి అంటే వెతుక్కోవచ్చు, ఇంకా జీ పి ఎస్ అనే సదుపాయం కూడా ఫోనే లో ఉంటే, ప్రపంచం లో ఎక్కడి కైనా మనం దారి చూసుకుంటూ క్షేమం గా వెళ్ళి పోవచ్చు, ఆపద లో ఉన్నాం అనుకుంటే ఒక కాల్ తో పోలీసులకి సమాచారం ఇవ్వవచ్చు. ఇన్ని ఎందుకు ప్రపంచమే మన గుప్పెట్లో ఉంది.. అంటే అంత విషయమూ చేతిలో పట్టేంత చిన్నదిగా చేసి, రోజు రోజు కి ధర కూడా అందరికి అందుబాటులోకి తెస్తున్నారు, పోటీ పడి మరీ.
ఇంకా అంతేనా ఇంకా ఇవ్వాలో రేపో, మనం మాట్లాడే వాళ్ళ మొహాలు కూడా చూడ వచ్చు .నీవేనా నను తలచినది, అని తలుచు కాగానే వారినే చూడ వచ్చు మాయా బజారు లో పెట్టె లాగా అన్నమాట..
తపస్సు చేసి సంపాదించిన ల్యాండ్ ఫోన్ నుండి, చేతిలో పట్టే ఈ దివ్య మైన ఆల్ ఇన్ ఒన్..వరకు మన సమాచార వ్యవస్థ ప్రయాణం.. దూరాలను దగ్గర చేసే మహత్తర వరం.
దీని వెనక ఎందరో వైజ్ఞానికులు, అందరికీ వందనంలు.

nice post
రిప్లయితొలగించండి