"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 అక్టో, 2010

లైసెన్సు టు కిల్ అని జేమ్స్ బాండ్ అనే డిటెక్టివ్

రోజూ  వార్త లలో చూస్తున్నాం, చదువుతున్నాం.. వర్షాలు భీభత్సం గా జన జీవనం ని అతలాకుతలం చేస్తున్నాయి. ఏదో వర్షా కాలం, మూడో, నాలుగో నెలలు వర్షాలు పడడం అలా కాదు, శ్రావణ భద్రపదాలు వస్తున్నాయి అని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే వారు. ఇప్పుడు అలా ఒక నెల, ఒక ఋతువు అని లేదు, ఎప్పుడు ముంచుకుని వస్తుందో తెలీదు.. మన అస్తవ్యస్త ప్లానింగ్ ఫలితం గా, ఎక్కడ పడితే అక్కడ స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టేసుకుని, ఈ వర్షం నీరు వెళ్ళే దారి లేక, ఆ నీరు ఇళ్ళల్లోకి ప్రవేశించడం, ఇంకా వర్షం నీళ్ళల్లో కొట్టుకు పోయి, ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు, ముంబై లాంటి, మహా నగరం లో, వర్షం వల్ల ఆగి పోయే జనజీవనం - దీని మీద సినిమాలు కూడా వచ్చాయి..
ఈ నేపధ్యం లో, ఇవ్వాళ పోస్కో అనే స్టీల్ మహా సామ్రాజ్యం కి ఇచ్చిన లైసెన్సు రద్దు చేయాలి అని నిర్ణయించారు. అనే ఒక వార్త చదివాను నెట్ లో. విశాల మైన ,దట్టమైన అటవీ ప్రాంతం అంతా కొట్టి వేసి, అక్కడే ఒక స్టీల్ సామ్రాజ్యం నెల కొల్పుతారుట. కొన్ని రోజుల ముందే వేదాంత అనే ఒక వ్యాపార సంస్థ కి కూడా ఇలాగే లైసెన్సు రద్దు అన్నారు.
లైసెన్సు టు  కిల్ అని జేమ్స్ బాండ్ అనే  డిటెక్టివ్ ఉంటాడు.. అతనికి చెడ్డ వారిని అంటే విలన్లు ని చంపేయడానికి ఒక స్పెషల్ పెర్మిట్ ఉండేది. అలాగ   ఈ మహా సామ్రాజ్యాలు మానవ జాతి ని తుడిచి పెట్టేయ డానికి ఎదైనా      కంకణం  కట్టుకున్నారా ? అని అనుమానం కలుగుతోంది. 
నాకు అర్ధం అవదు. వారు కూడా ఈ భూమి మీదే నివసించాలి   కదా? మొక్క, మాను, అడవి, పూలు, స్వచ్చమైన గాలి, నదులు, కొండలు, మనం తినడానికి అన్నమో ,గోదుమలో, ఇంకా ఎన్నో పంటలు, కూరగాయలు, పళ్ళు, తాగడానికి నీరు.. ఎన్నో, ఇంకా ఎన్నో మనకి ఈ భూమే అడగ కుండానే ఇస్తోంది. ఇలాంటి భూమి ని చెల్లా చెదురు చేసి, ఏదో ఒక ఇనుము ,స్టీలు, తయారు చేసే వాటిని నిర్మించ డానికి మనసు ఎలా వస్తుంది? రేపు వారి పిల్లలు కూడా ఈ భూమి మీదే నివసించాలి కదా?  ఏ ధైర్యం తో, వారు కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం లాంటి ఈ పనులు చేస్తున్నారో? అర్ధం అవదు. 
గ్రీన్ పీస్ అనే సంస్థ ఇలాంటి వారి ఆగడాలు, స్వార్ధం, ధన అపేక్ష, మానవ మనుగడ గురించి నిర్లక్ష్యం వెరసి ఒక లైసెన్సు టు  కిల్ పుచ్చు కున్న ఇలాంటి మహా సామ్రాజ్యాల అంతం, నియంత్రణ కోసం తాపత్రయపడుతోంది..
ఈ మహా సామ్రాజ్యాలు , చాల ఉపకారం చేస్తున్నట్టు, ఒక పేద దేశం లో పెడుతున్నాం మిమ్మల్ని ఉద్ధరించదానికే అంటారు. ఉద్యోగాలు వస్తాయి అని ఆశలు చూపిస్తారు. వేల, సంవత్సరాల భూమి  తపః ఫలితం గా అన్నట్టు  ఉద్భవించిన ఈ పెను అడవిలను ,బుల్ డోజేర్లు తో అడ్డం గా నరికి , మన వర్షాలకి, మన అటవీ సంపదలకు, మన అడవి పుత్రులకు, మన సజీవ ,అతి ప్రాచీన సంస్కృతి కి , మన కి ఊపిరి పోసే వృక్షాల కి నిలయ మైన అడవులని  నిర్దాక్షిణ్యం గా నరికి వేసి, పొగలు చిమ్మే ,పొగ గొట్టాలు ని మనకి కానుక  గా ఇస్తారుట. 
కళ్ళు, చెవులు, నోరు మూసుకుని కూర్చున్న మన ప్రభుత్వా లకు , ఎవరు విప్పుతారు గంతలు? ప్రజలే.. అంటే మనమే..
డావ్ అనే నురుగు వచ్చే, ముఖానికి అందాలు , మెరుగులు ఇచ్చే సబ్బు ను తయారు చేయ డానికి, ఇండోనేసియా దేశం లోని  అతి ప్రాచీన రైన్ ఫారెస్ట్ లోని చెట్లను నాశనం చేస్తున్నారుట. ఇంకా వింత ఏమిటి అంటే, మేము మరో చోట చెట్లు నాటుతున్నాం అంటారు వీళ్ళు. నాశనం చేయ కుండా ఉంటే చాలు కదా? 
రోదసి నుంచి చూస్తె ,భూమి ఒక గుండ్రని బంతి లాగా కనిపిస్తుంది. పచ్చని బంతి లాగ ఉండే ఈ భూమి ని ఒకే అఖండ పృథ్వి ,అంతే కాని, ఇక్కడ ఒక ముక్క, ఒక దేశం, నా దేశం, అక్కడ ఇంకో ముక్క, నీ దేశం కాదు.. ఎక్కడ ఏం చేసినా , దాని ఫలితం అందరు అనుభవిస్తాం . 
ఊపిరి పిల్చేందుకు గాలి కూడా కొనుక్కోవలసిన రోజు వస్తుంది, ఇప్పటికే తాగడానికి సీసాల్లో నీళ్ళు కొనుక్కుంటున్నాం..
మన అకాల ,అతి భీభత్స వర్షాలకు, ఎడారి ని తలపిస్తున్న ఎండలకు, ఇంకా చాలా వాటికి, కారణం- మూల కారణం వెతికి, ఇప్పటికైనా మేలుకుని ప్రభుత్వాలను కదిలిద్దాం.. మన పిల్లల పిల్లలకు కూడా ఒక హక్కు ఉంది, ఈ భూమి మన ఒక్కరి సొత్తే కాదు.
పోస్ట్ స్క్రిప్ట్ లాంటి ఒక కొస ఆలోచన..
ఇది చదువు తూ ఏమిటి మరి ఇన్డుస్త్రీలు ,వద్దా? అభివృద్ధి వద్దా? ఈమెకు అంటారా? అని ..కావాలి కాని, కేవలం లాభాలు కోసమే కాదు, మానవీయ ముఖం కలిగిన అభివృద్ధి, కొందరిని తొక్కి, వేసే నిచ్చెనలు కాదు, అందరి కోసం..ఉండాలి ఈ అభివృద్ధి...
ఏమిటి ఈ పిచ్చి వర్షాలు? కలి యుగం.. అని నిట్టుర్చే ముందు, ఈ విషయాలు కూడా తెలుసు కోవాలని రాసాను..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి