సునీత ఆటో దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి, సంచులు మోసుకుంటూ పైకి వెళుతోంది. రెండో అంతస్తు లో ఉంది ఆమె ఫ్లాట్. సంచులు ఒకటో అంతస్తుకి చేరేసరికే బరువు అయిపోయాయి. కూరలు, కరాచివాలాలో పిల్లలికి కావాల్సిన తినుబండారాలు, ఇంకా ఏవో డబ్బాలు, పాకెట్స్, ఒక నెల రోజులకి సరిపడా..కాని ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్లీ, మళ్లీ, వెళ్ళడం ఆమెకు అలవాటే.
అమ్మాయ్ ..షాపింగ్ చేసి వస్తున్నావా? పిల్లలికేనా?? ఇంకా ఏం కొన్నావు? బాబోయ్ ..ఈవిడని తప్పించుకోవడం చాల కష్టం ఎప్పుడు కనిపించినా ఇలాగే అడుగుతుంది. పల్లెటూరు బుద్ధులు.."ఆ..ఎప్పుడూ ఉండేవే ..కొత్తగా ఏం లేవండి. " ,ఆవిడ రా అమ్మా అని పిలుస్తుంది.
కాని, సునీత ఎప్పటికప్పుడు ఆవిడకీ నాకూ కామన్గా కబుర్లు ఏముంటాయి..తరువాత వస్తాను అండీ అని తప్పించుకుంటుంది.మనసులో అయ్యో పాపం అనిపించినా.. వయసులో వ్యత్యాసం, ఏదో పల్లెటూరు చాదస్తం అని కొంత విసుగు .
చేతిలో సంచులు బరువు అనిపించినా ఎక్కడా ఆగకుండా తన ఫ్లాట్ లోకి వెళ్లి, అమ్మయ్య అని నిట్టూర్చి ,కూరలు తీసి ప్లాస్టిక్ సంచుల్లో సర్ది, సరుకులు అల్మారాలలో సర్ది, ఊపిరి పీల్చుకుంది సునీత . కాఫీ తాగుతూ, ఇంక పిల్లలు వచ్చేవరకు విశ్రాంతి , అని టీ వి ఆన్ చేసి వార్తలు వింటూ కూర్చుంది .
ఇంతలో, కింద నించి, ఏవో ఏడుపులు వినిపించాయి, ఎవరైనా పిల్లలు దెబ్బలు తగిలించు కున్నారా? ఎవరి పిల్లలో అని ఆందోళనతో కిందికి దిగుతూండగా ఏడుపులు ఐదో నెంబర్ నుంచే బంగారమ్మ గారి ఫ్లాట్ నుంచి అని తెలిసింది .
నెల రోజులు ఇట్టె గడిచిపోయాయి , సునీత సంచులు మోసుకుని వస్తూ, ఐదో నెంబర్ ఫ్లాట్ బెల్ కొట్టింది , తనంతట తనే ఆశ్చర్యంగా ..
అమ్మాయ్ ..షాపింగ్ చేసి వస్తున్నావా? పిల్లలికేనా?? ఇంకా ఏం కొన్నావు? బాబోయ్ ..ఈవిడని తప్పించుకోవడం చాల కష్టం ఎప్పుడు కనిపించినా ఇలాగే అడుగుతుంది. పల్లెటూరు బుద్ధులు.."ఆ..ఎప్పుడూ ఉండేవే ..కొత్తగా ఏం లేవండి. " ,ఆవిడ రా అమ్మా అని పిలుస్తుంది.
కాని, సునీత ఎప్పటికప్పుడు ఆవిడకీ నాకూ కామన్గా కబుర్లు ఏముంటాయి..తరువాత వస్తాను అండీ అని తప్పించుకుంటుంది.మనసులో అయ్యో పాపం అనిపించినా.. వయసులో వ్యత్యాసం, ఏదో పల్లెటూరు చాదస్తం అని కొంత విసుగు .
చేతిలో సంచులు బరువు అనిపించినా ఎక్కడా ఆగకుండా తన ఫ్లాట్ లోకి వెళ్లి, అమ్మయ్య అని నిట్టూర్చి ,కూరలు తీసి ప్లాస్టిక్ సంచుల్లో సర్ది, సరుకులు అల్మారాలలో సర్ది, ఊపిరి పీల్చుకుంది సునీత . కాఫీ తాగుతూ, ఇంక పిల్లలు వచ్చేవరకు విశ్రాంతి , అని టీ వి ఆన్ చేసి వార్తలు వింటూ కూర్చుంది .
ఇంతలో, కింద నించి, ఏవో ఏడుపులు వినిపించాయి, ఎవరైనా పిల్లలు దెబ్బలు తగిలించు కున్నారా? ఎవరి పిల్లలో అని ఆందోళనతో కిందికి దిగుతూండగా ఏడుపులు ఐదో నెంబర్ నుంచే బంగారమ్మ గారి ఫ్లాట్ నుంచి అని తెలిసింది .
ఆయన,అంటే బంగారమ్మ గారి భర్త రాజు గారు, బంధువులతో కలిసి ఉత్తరదేశ యాత్ర వెళ్లి పది రోజులు అవుతోంది. " నా మందులు, గొడవలతో నేను రాలేను " అని ఈవిడ ఇంట్లో ఉండిపోయారు అని వాచ్ మాన్ చెప్పిన మాట గుర్తు వచ్చింది సునీత
కి . అప్పటికే నలుగురైదుగురు చేరారు. సునీతకేమీ అర్ధం కాలేదు , ఎదురింటి పంకజం చెప్పింది, రాజు గారు, ఉత్తర కాశిలో గుండె పోటుతో మరణించారని. అయ్యో !
కి . అప్పటికే నలుగురైదుగురు చేరారు. సునీతకేమీ అర్ధం కాలేదు , ఎదురింటి పంకజం చెప్పింది, రాజు గారు, ఉత్తర కాశిలో గుండె పోటుతో మరణించారని. అయ్యో !
ఒక గంటలో కావాల్సిన వారందరూ వచ్చేసారు., " నాకు చివరి చూపు ప్రాప్తం లేదు " అంటూ, అక్కడే అన్ని చేసేయమని బంగారమ్మగారు చెప్పడంతో అన్ని కార్యక్రమాలు అక్కడే చేసి వచ్చారు బంధువులు పదో రోజుకి.
ఈ పది రోజులు వచ్చేపోయేవారి హడావిడితో ఐదో నంబర్ ఫ్లాట్ సందడిగా ఉండడం పద మూడో రోజుకి అందరు వెళ్లి పోవడం గమనించిన సునీత ఈవిడకిక ఒంటరితనమే అనుకుని బాధపడింది .
బంగారమ్మగారు మటుకు తన ఇంట్లో నుంచి తను ఎక్కడికి కదలనని చేప్పేసారుట పిల్లలతో.
కొడుకులు, కూతుళ్ళు, ఎంత బ్రతిమాలినా ఆవిడ పంతం పట్టినట్టు ఒక్కటే మాట, "నేను నా ఇంట్లో ఉంటాను, రాజు గారి పెన్షను వస్తుంది.నేను ఎవరి మీద ఆధార పడను " అని. ఈ వివరాలన్నీ వాచ్ మానో ఎవరో ఒకరు సునీత చెవిన వేస్తూ ఉండేవారు .
నెల రోజులు ఇట్టె గడిచిపోయాయి , సునీత సంచులు మోసుకుని వస్తూ, ఐదో నెంబర్ ఫ్లాట్ బెల్ కొట్టింది , తనంతట తనే ఆశ్చర్యంగా ..
తలుపులు తీసారు బంగారమ్మ .టీ. వి. పెట్టుకుని తెలుగు సినిమా చూస్తున్నారు. అంతకు ముందు ఎప్పుడూ ఇంగ్లీష్ వార్తలు వినిపించేవి వాళ్ళింట్లో.
" ఎలా ఉన్నారండి? ఏమైనా కావాలి అంటే చెప్పెండి, " " ఎలాగు వెళుతూ ఉంటాను కదా " అంటూ సునీత మొదటిసారి మాటలు కలిపింది ,ఆత్మీయంగా .
" మీకు ఒక్కరూ బోర్ కొట్టటం లేదా? ఎలా ఉన్నారు? అంకుల్ లేకుండా " ??అంటూ ఆగి పోయింది ,సందిగ్ధంగా .
" ఫర్వాలేదమ్మా నిజం చెప్పాలంటే, ఆయన ఏదో ఊరు వెళ్లినట్టుంది కానీ, ఆయన లేరు అని పించటం లేదు నాకు . నాకు పద్నాలుగేళ్లకే పెళ్లి అయింది. ఆయనికి ఇరవై అయిదు..నాకేమో చిన్న పిల్ల సరదాలు, ఆయనకేమో ఉద్యోగం వ్యాపకాలు తప్ప ఏమి పట్టదు.
నాకు తెలుగు సినిమాలు, పాటలు ఎంత ఇష్టమో? ఆయనికి చికాకు, ఏముంది ఆ పాటలలో ..ఆ సినిమాలన్ని ఒక్కలాగే ఉంటాయి, హాయిగా ఇంగ్లీష్ సినిమాలు చూడు అనే వారు. కేబల్ కనక్షన్ కూడా లేదు, ఈయన ఉద్యోగ విరమణ తరువాత ఇంట్లోనే ఉండి నన్ను కాల్చుకు తిన్నారనుకో , " అంటూ పైట కొంగుతో కళ్ళు ఒత్తుకున్నారామె .
"ఆయనికిష్టమైన కూరలే వండాలి, పక్కింటికి వెళ్లి కబుర్లు చెప్పకూడదు, ఫోన్ బిల్ మూడు వందలు దాటకూడదు, ఇలాగ ఈయన పని చేసే కాలేజ్ లో కుర్రాళ్ళుని అదుపులోపెట్టినట్టే నన్ను కూడా, అడక్కు అమ్మా ,నాకెంతో ఇష్టమైన కూరలు వండుకుని తిని ఎంతకాలం అయిందో? నాకు నిన్ను చూస్తే ముచ్చట గా ఉండేది , నీ కిష్టమైనవన్ని నువ్వలా కొనుక్కుని రావడం చూస్తూ ఉంటే " సునీత చున్నితో కంట తడి అద్దుకుంది.
" ఇప్పుడు నాకు డబ్బులకు లోటు లేదు, కొడుకు దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వండి పెట్టింది నేను తినాలి, వాళ్ళ టైములు అవీ నాకు సరిపడవు. నాకు ఇప్పుడు ఏ లోటూ లేదు.
యాభై ఏళ్ళ తరువాత నా బ్రతుకు నేను బ్రతకడానికి నాకు స్వేచ్చ వచ్చింది. ఇది వదులు కోలేను. పెద్ద పెద్ద మాటలు నాకు రావు గాని, నాకు స్వతంత్రం వచ్చింది. నా బతుకు నేను నా ఇష్టం తో హాయిగా బతుకు తాను."
కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ లేచింది సునీత .
ఆవిడ పల్లెటూరని ఏదో చిన్న చూపు కాని ఎంత పెద్ద మనసో ! ఎంత చక్కని మాట చెప్పారో.. ఒకరిని ఒకరు నొప్పించ కుండా, ఒప్పించు కుంటూ, పరస్పరం ప్రేమతో మెలగాలి , కాని అధికారంతో కాదు అని.
సంచులు మోసుకుంటూ, సునీత ఐదో నెంబర్ ఫ్లాట్ దగ్గర ఆగి పలకరిస్తుంది ,ఇప్పుడు .
Nice
రిప్లయితొలగించండిThank You..Rajesh Maaram..garu..
రిప్లయితొలగించండిvasantham.
అయ్యో ! మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నా అండీ ! చాలా బావుందీ పోస్ట్. ఇది నా కళ్ళారా చూసిన సంగతి కూడా అండీ! మా బంధువుల్లో ఒకాయన నానా పీనాసి తనం తో డబ్బులు కూడబెట్టి, 5 ఇళ్ళు కొన్నాడు. పదీ పదిహేనేసి వేలు చొప్పున ఇళ్ళద్దెలు వస్తాయి. ఆయన పోయాకా, భార్య కి ఇప్పుడేవో కట్లు తెంచేసినట్టయింది. ఇప్పుడు ఆవిడ చీకూ చింతా లేకుండా (భర్తకి కృతజ్ఞతలు) హాయిగా కావల్సిన బంగారం, చీరలూ అవీ కొనుక్కుని, 24 గంటలూ ఇంట్లో టీవీ మోతలతో, భలే హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. నాకు ఆ భర్త ని గురించి తల్చుకుంటే చాలా జాలి వేస్తుంది. తన తదనంతరం భార్య కి ఆర్ధిక భద్రత అనే 'కుషన్' ఇచ్చినా, ఉన్నన్నాళ్ళూ, ఆవిడ స్వాతంత్ర్యం ఆవిడకిచ్చి, ప్రేమ, అనుబంధం లాంటివేవీ మిగిల్చుకోలేకపోయాడు. ఎందుకో - భర్త పోయాక భార్య హమ్మయ్య అనుకునేట్టు ఉండడం కొంచెం బాధాకరం. మీరు చాలా హర్రీ లో పోస్ట్ చేసినట్టున్నారు ! కానీ మీ భావం (చెప్పదల్చుకున్నది) చాలా స్పష్టంగా అర్ధమయింది.
రిప్లయితొలగించండిఅవును సుజాత గారు..నా భావం అదే, నేను కూడా చూసిన ఒకరి కథే ఇది.ఉన్నంత కాలం పీడించుకుని తిని,వెళ్లి పోయాక ..హమ్మయ్య.......పో...అన్నట్టు ఉంటే..ఎవరికీ నష్టం? సన్నిహిత, ఆప్యాయతల సాహచర్యం మేలు కదా,అవును అనుకుంటాను..హడావిడిగా రాసినట్టే ఉంది. నా బ్లాగ్స్ మీద మీ కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాను. రాయాలని, ఇంకా బాగా రాయాలని..కోరుకోండి..విష్ మీ.
రిప్లయితొలగించండివసంతం.
చాల బాగా చెప్పారండీ...
రిప్లయితొలగించండిభార్యా భర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండడం ఎంత ముఖ్యమో వివరించారు...
OMG I mmjust seeing this today 26/11/2018/ The Firstb Two Paragraphs reminded me of Sridevi Scenes fro Kshaaksham. The whle is is so realistic. Yes we have to face the truth and accept. Men and husbands have the freedom to live how they want and wife is just a free servant. but Women are very restricted and het their freedom afterr they become widows and their mind and Body feels the freedom. Sad But True., Our Soco=iety expects woman not have fun even after becoing a widow. You have written very well. This is the reality of modern times. L Iam reading this now 7 years afte you wrote.
రిప్లయితొలగించండిOMG, I 'm just seeing this today 26/11/2018/ The First Two Paragraphs reminded me of Sridevi Scenes fro Kshaaksham. The whole is so realistic. Yes, we have to face the truth and accept. Men and husbands have the freedom to live how they want and wife is just a free servant. but Women are very restricted and get their freedom after they become widows and their mind and Body feels the freedom. Sad But True., Our Soco=iety expects a woman did not have fun even after becoming a widow. You have written very well. This is the reality of modern times. L I am reading this now 7 years after you wrote.
రిప్లయితొలగించండి