"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

29 సెప్టెం, 2011

పెళ్లి కాని పిల్లలు..లో హీరో లు..సూర్య కాంతం-రమణ రెడ్డి లే

అవునండి..ఈ సినిమా లో హీరో అయిదుగురు ఆడ పిల్లల తల్లి తండ్రులు..సూర్య కాంతం-రమణ రెడ్డి..లే..నాకు ఎంత నచ్చేరో? ఇది కూడా పాత  సినిమా..ఈ టీ వి. లో వచ్చిందే ..ఇది కూడా వచ్చి,ముప్ఫై ,నలభై ఏళ్ళు అయి ఉంటుంది.
ఆడ పిల్లల తండ్రి అంటే, ఏమిటో,పెద్ద బరువు తల మీద పెట్టుకున్నట్టు, భారంగా, దిగులు గా ఉండే సినిమా తండ్రుల ని చూసాం..తల్లి కూడా ,ఏమండి, పిల్లలకి పెళ్లి చేయండి, అని బ్యాక్ గ్రౌండ్ మ్యూసిక్  లాగ పాడుతూ ఉంటుంది. కానీ ఇందు లో..

పిల్లలందరికి వాళ్లకి ఇష్టమైన చదువులు అప్పు చేసి మరి చదివిస్తాడు, రమణ రెడ్డి, తండ్రి గా..అబ్బ నాకెంత నచ్చిందో? పెద్ద అమ్మాయి ఎం ఏ,పీ హెచ్ డి అని గర్వం గా చెప్పుకుంటుంది. రెండో అమ్మాయి సంగీత సరస్వతి, మూడో అమ్మాయి నాట్య మయూరి, నాలుగో అమ్మాయి,ఆటల్లో బెస్ట్.ఐదో ఆఖరి అమ్మాయి ,చదువుకుని, ఉద్యోగం చేస్తూ ఉంటుంది. హీరోయిన్ జమున.

ఇంక తల్లి పాత్ర లో సూర్య కాంతం..సంతాన లక్ష్మి గా అదర గొట్టింది. పిల్లలు తో ఒక పెళ్లి కి వెళ్ళిన సన్నివేశం లో, ఏమిటమ్మా ..మీ పిల్లలికి పెళ్లి ఎప్పుడు చేస్తావు? అని అమ్మలక్కలు అడిగితే.. మీకెందుకు?? నా పిల్లలు, నా ఇష్టం..అని సూర్య కాంతం గయ్యాళి గొంతు తో అడిగే సరికి, ఇంట్లో సోఫా లో కూర్చుని సినిమా చూస్తున్న నాకు ..కేయ్య్ మని ఈల వేసి, చప్పట్లు కొట్టాలి అనిపించింది.

అవును లే, మీ ఆఖరి అమ్మాయి ఉద్యోగం చేసి, మిమ్మలిని పోషిస్తోంది కదా, పెళ్లి ఎందుకు చేస్తారు?అని సన్నాయి నొక్కులు నొక్కితే, ఆ అమ్మలక్కలు, హాయ్ ..అని పెద్ద గొంతు తో మీద పడి పోయి, తన దైన శైలి లో చేతులు తిప్పుతూ, ఏం మీకేంటి సంబంధం? మీరేమైనా పోషిస్తున్నారా? మమ్మలిని..పదండి, పదండి, నేనింక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, పిల్లలూ..అని ఒక్క మాట తో, విదిలించి పడేసి, నిష్క్రమిస్తుంది, తన సంతానం తో.
కాని, నా మనసు లో ప్రతిష్టించు కున్నాను..అసలే సూర్య కాంతం వీర ఫ్యాన్ ని.

మామూలు రొటీన్ సినిమాల్లో, ఇలాంటి సీన్ ల లో.తల్లి గుడ్ల నీరు నింపుకుని,అవమాన భారం తో, చీర కొంగు నోట్లో కుక్కుకుని ,పారి పోతుంది. శెభాష్..సి .వి. రావ్.. దర్శక మహాశయుడు.

పిల్లలు మాకు ఇష్ట మైన వారినే చేసుకుంటాం, అల్లా టప్పావాళ్ళని కాదు ,అని భీష్మించుకుని కూర్చుంటారు, ఏ సంబంధం తెచ్చినా తిప్పి కొట్టేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి లో, జగ్గయ్య జమున ని, చూసి ప్రేమించి, అక్క లందరికి పెళ్లి చేసే బాధ్యత తన నెత్తి మీద వేసుకుంటాడు.
తండ్రి గా రమణారెడ్డి,అద్భుతం..ఆ పాత్ర, ఆ నటన.

జగ్గయ్య ని ఆమోదించి, అతని ప్రయత్నాలకు సహా కారం అందిస్తాడు..నూరు అబద్ధాలు ఆడి,పెళ్లి అంటారు కదా, ఈ అమ్మాయిలకి సరి జోడు లని కుదర్చడం లో, తన పిల్ల ల  అభిష్టాలు ,నెర వేరుస్తూ,భార్య సూర్య కాంతం మాట కి విలువ నిస్తూ,ఒక్కో సారి మందలిస్తూ, హబ్బ ..మధ్య తరగతి తండ్రి పడే కష్టాలని ,అవలీలగా మోసే తండ్రి పాత్ర..
చివరాఖరికి ,జగ్గయ్య కుదిర్చిన జత గాళ్ళు, అసలు రంగు తెలిసి, పిల్లలు వద్దు పొమ్మంటే, ఇన్నాళ్ళు ఓపిక గా ఉన్న తండ్రి,ఒక్క సారి,పిల్లల మీద  చేతి కర్ర ఎత్తి, ఇన్నాళ్ళు ఓపిక గా మీ ఆటలు సహించాను, ఇంక చాలు, ఈ పెళ్ళిళ్ళు మీరు చేసుకోవలసిందే, అని దండ ప్రయోగం చేసిన సన్నివేశం, నేను ఒప్పను అనే భార్య మీద కూడా అదే ప్రయోగం..
తండ్రి గా ఎంత ముద్దు చేసినా పిల్లలు, దారి తప్పుతూంటే, దండం ఉపయోగించే తండ్రి..
నలుగురు ఆడ పిల్లలిని ,ఎంత కావాలంటే అంత చదువు లు చదివించిన ,మా నాన్న గారే గుర్తు వచ్చారు.పెద్దగ ఆస్తి పాస్తులు  లేక పోయినా, అందరూ పెళ్ళిళ్ళు, అని గోల పెడుతున్నా, నా పిల్లలే నా ఆస్తి అంటూ గర్వం గా తిరిగిన మా నాన్న గారు..అందరికి తగిన సంబంధాలు, చదువులు తరువాతే అయ్యాయి అనుకోండి.
ఇంత చక్కని తల్లి తండ్రులు ఉన్న పిల్లలు ఎంత అదృష్ట వంతులో కదా..జగ్గయ్య ఇన్నాళ్ళకి హీరో గా కనిపించాడు, ఎప్పుడూ సెకండ్ హీరో కదా, పాటలు కూడా బాగున్నాయి..
దూకుడు, కందిరీగులు, ఊసరవెల్లులు ఉన్నాయి కాని, ఇలాంటి ఆర్ద్రత నిండిన సినిమాలు ఉన్నాయా ఇప్పుడు?
సినిమా చూసి, ఇలా మనసులో సంతోషాన్ని నింపి,జ్ఞాపకాల తెరలను అలవోకగా రెప రెప లాడించ గల ,సినిమాలు ఎక్కడ ఉన్నాయి?
అందుకే ఈ పాత సినిమాలే అయినా,ఆపాత మధురాలు.

6 కామెంట్‌లు:

  1. అవునండీ... చూద్దమనుకుని, చూడలేకపోయాను ఈ సినిమాని మొన్న ! మీరు చెప్తూంటే మిస్స్ అయ్యానన్న బాధ ఎక్కువవుతూంది. ఇంత మంచి సినిమాలు ఇప్పుడు రావట్లేదు. వచ్చినా చూడరేమో అని ప్రొడ్యూసర్లకి భయం కామోసు.

    రిప్లయితొలగించండి
  2. సుజాత గారు,బాధ పడకండి,మళ్లీ వేస్తారేమో లెండి, ఈ టీ వి..వారు. మీ పేజ్ చూసాను,ఏమిటో నండి,నా లాగే ఎంత మంది ఉంటారో?అని రోజు రోజు కి ఆశ్చర్యం పెరిగి పోతోంది. రోమన్ హాలిడే నాకూ మహా ఇష్ట మైన మూవీ ..ఆడ్రి హెప్ బెర్న్ ..ఊరికినే, ఒక నైట్ పైజమా లో ఏమి ఆభరణాలు లేకుండా, ఎంత అందం గా ఉంటుందో? ఇంక గ్రెగరీ పెక్..అప్పుడే పెళ్లి అయిన కొత్త రోజులు,మనసు పడేసుకుంటే..ఎలా అని గిల్టీ గా కూడా ఫీల్ అయాను,అమాయకం గా. నా రహస్య కోరిక కూడా రచయిత్రి అయి పోవాలని..ఈ బ్లాగ్స్ నాకు ఒక మొదటి అడుగు..విష్ మీ అల్ ది బెస్ట్, థాంక్స్ అండి ,సుజాత గారు మళ్లీ, మళ్లీ..
    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. ఏంటండీ మన అభిరుచులు ఇలా కలిసిపోతున్నాయి :)
    నేను చూసాను ఈ సినిమా. సూర్యకాంతం తెర మీదకి వచ్చినప్పుడల్లా నేను లేచి ఓ విజిల్ వేస్తూనే ఉన్నాను. రమణారెడ్డి మొదట్లో అమయాకపు తండ్రిగా, చివరకి ఇంటిని ఇంటిని నిలబెట్టే తండ్రిగా...అదుర్స్.

    అప్పుల అప్పారావు, పెళ్ళిపందిరి సినిమాలు పెళ్ళికాని పిల్లలు సినిమాకి రీమేక్ లా అనిపించాయి కాస్త.

    రిప్లయితొలగించండి
  4. సౌమ్య..అవునండి, ఏమిటో ఇలా కలసి పోతున్నాయి..చాల సినిమాలు అలా మళ్లీ, మళ్లీ తీస్తూంటారు ,కాని, ఒరిజినల్ అంత బాగుండవు.మీరూ విజిల్ వేసారా..అందుకోండి ఒక షేక్ హ్యాండ్, రమణ రెడ్డి, పాత్ర, నటన..అదుర్స్ కదా..బ్లోగ్మిత్రురాలి ని అందించిన కూడలి కి థాంక్స్..మీకు కూడా నండీ..
    వసంతం.

    రిప్లయితొలగించండి
  5. ఆపాత మధురాలు.. ఎప్పటికీ బంగారాలే. చూసి ఆనందించడమే కాదు.. నేర్చుకోవాల్సింది ఎంతో ఆ సినిమాల్లో మిగిలే ఉంటుంది. సినిమా మాదిరిగానే మీరు కూడా చక్కగా రాశారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. థాంక్స్ అంది నాగరాజు గారు, ఆ సినిమాల గొప్పదనమే..నా మాటల, రాతల వెనక బలం. అవునండి, నేర్చు కావాల్సింది చాల ఉంటుంది,ఆ సినిమాల్లో, వ్యాపారమే అను కోండి, అయినా మనసుని ఆకట్టుకునే ఏదో హృదయ మైన విషయం ఉండేది, మేస్సజే అని అన లేం, కాని, ఏదో తాకేది..ఇప్పటి సినిమాలు పాప్ కార్న్ సినిమాలు, అయినా ఇందులో కూడా కొన్ని ఎంజాయ్ చేస్తాను నేను.
    వసంతం.

    రిప్లయితొలగించండి