వినూత్న అలసటతో నిట్టూర్చింది . ఒకటా రెండా ఆరేడు నెలల నుంచి ఈ ఫ్లాట్ ని అలంకరించడానికి ఎంత శ్రమ పడింది? పాలు ఒలికినట్టు కనిపించే తెల్లని పాలరాయి నేల , మచ్చ లేని తెల్లని పాల రాయి కోసం ఊరంతా తిరిగి, ఎక్కడా నచ్చక , చివరికి, రాజస్థాన్ నించి తెప్పించింది , స్వయంగా మాట్లాడి వారితో. అలాగే, వంటింట్లో నల్లని గ్రనైట్ వేయించింది. కిటికీలకి గాజు తలుపులు, అన్నీ సూపర్ క్వాలిటీ. లక్షలు, లక్షలు ఖర్చు అయాయి. కానీ చివరకి ఇల్లంతా చూసుకుంటే ఎంత అందంగా ఉందొ? అని మురిసిపోయింది .
కిచెన్లో లేటెస్ట్ అల్మారా లు, నాలుగు పొయ్యిల స్టవ్. పెద్ద బీరువా అంత ఫ్రిజ్, అంతా తను అనుకున్నట్టే ..భాస్కర్ ,పిల్లలు సంతోషించేరు. కానీ " ఇంత శ్రమ ఎందుకు ? ఇంత చక్కని ఇల్లు ఇలాగే మెరుస్తూ ఉంటుందా ఎల్లకాలం ? దీనినిలాగే మెరిపిస్తూ ఉంచాలంటే , నువ్వు ఎంత కష్ట పడాలో? ఎందుకు నీ శ్రమ ,కాలం ఇలా ఇంటి మీద పెడతావు? ఇంకేదైనా ఉపయోగపడే పని చేసుకో, నీకు ఇష్టమైన కథలు రాసుకో, పుస్తకాలు చదువుకోవచ్చు కదా " అన్నాడు భాస్కర్.
" అన్నీ చేస్తాను, కాని ఇది నా కల, నా డ్రీమ్ ,భాస్కర్ నీకు తెలుసుగా " అంటే ఏం చెప్పలేక పోయాడు.
వెతికి వెతికి మంచి బిల్డర్ని చూసుకుని , విడివిడిగా ఇళ్లు ఉండే గేటెడ్ ఆవరణలో ఇల్లు ఎంచుకున్నారు. చుట్టూ ప్రహరి గోడ, ఎవరి ఇల్లు వారిదే, ఫ్లాట్స్ లాగ కాదు, ఇంటి చుట్టూ తోట, సాయంత్రం నడవడానికి చక్కని పార్క్, మధ్యలో ఆకు పచ్చని లాన్స్ ఎంత బాగుందో?
నెల, నెల కట్ట వలసిన ఈ ఏం ఐ ,యాభై వేలు, అయితేనేం, మెల్లగా తీరుస్తాం. ఇంత మంచి డ్రీం హౌస్ ఫ్రీ గా రాదు కదా..వినూత్నకి సంతోషం కట్టలు తెగి పొంగింది ..గృహ ప్రవేశం నాడు, అందరు మెచ్చుకుని, ఎంత బాగుంది వినూత్న మీ ఇల్లు ..నీ పేరు లాగే, మీ ఇల్లు కూడా నూతనం గా ,వినుత్నం గా ఉంది, నీదే క్రెడిట్ అంతా..అంటుంటే ద్రిష్టి తగులు తుందేమో, అని నమ్మకాలు లేక పోయినా ,ఏదో భయంగా కూడా అనిపించింది.
మెల్లగా కొత్త ఇంట్లో కొత్త వాతావరణంలో అందరూ అలవాటు పడుతున్నారు.
ఉదయం నుంచి, ఇల్లంతా దులిపి, తుడిచి, వంట చేసి అలసి పోయింది. సాయంత్రం నాలుగు అయింది. ఇంకా బబ్లూ, పింకి రాలేదేమిటి స్కూల్ నుంచి అని కంగారుపడుతోంది వినూత్న .ఈ కొత్త ఇల్లు , స్కూల్ కి చాల దూరం అయిపోయింది, బస్సులో వెళుతున్నారు . మునుపయితే, దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు.
ఇంతలో గేట్ దగ్గర నుంచి ఫోన్. ఫోన్ తీసింది , బబ్లూ " అమ్మా! కొత్త వాచ్ మాన్ అమ్మా, నువ్వు ఫోన్లొ చెపితే కాని, మమ్మల్ని లోపలి రానివ్వడుట..అబ్బ ఏమిటమ్మా బోర్ పాత ఇల్లే బాగుండేది " అంటూ విసుక్కున్నాడు . వాడి ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు మరి. చిన్నపిల్లలు ఇంతలో సర్దు కుంటారు ,ఫర్వా లేదు అని సర్ది చెప్పుకుంటూ.. వాచ్ మాన్.. మా పిల్లలే..వదులు లోపలి ..అని గట్టిగ చెప్పింది. " సరే అమ్మా.. సారీ అమ్మా, మా జాగ్రత్త లో మేం ఉండాలి కదా" అన్నాడు .
కొత్త ఉత్సాహం తగ్గి , వారం అయేసరికి, పని మనిషి లేకపోతే కష్టం అనిపించింది, ఇంటెడు పని చేయడం. వాచ్ మాన్కి చెపితే లక్ష్మిని తీసుకువచ్చాడు. నెమ్మదిగా బాగానే ఉంది. హమ్మయ్య..
ఇదిగో మరి, ఈ పనులు అన్ని చేయాలి, గిన్నెలు తోమడం, ఇల్లు తడి గుడ్డ తో వత్తడం, దానికి ముందు ఇల్లు డస్టింగ్ చేయాలి, అంటే, ఈ సోఫాలు ,అలమారాలు, అన్ని పొడి గుడ్డ తో తుడవాలి, బట్టలు మషిన్ నించి తీసి అరేయాలి , మొక్కలుకి నీళ్ళు పోయాలి..జీతం..ఎనిమిది వందలు..కుదరదు అమ్మా..అమ్మో, వెయ్యే..సరే, మరి నాగాలు పెట్టకు..అని అపురూపమైన తన ఇంటిని ,ఈమె చేతిలో పెడుతున్నాను. అని గిల గిల లాడిపోయింది వినూత్న . నాకైతే నా ఇల్లు అని నాకు ప్రాణం, ఈమె ఒక ఇంటి పని కని పెట్టి ,దగ్గరుండి చేయుంచుకోవాలి.
అని మనసులో అనుకుంది.
లక్ష్మి పనిమంతురాలే, చక్కగా ఇబ్బంది పెట్టకుండా పని చేస్తోంది. ఫర్వాలేదు.
రోజూ సాయంత్రం, పిల్లలిని ఆడు కోమని పంపించి, తను కూడా వాకింగ్ చేస్తోంది. ఈ ఇళ్ళ చుట్టూ ,ఒక్కసారి నడిస్తే చాలు, అరమైలు నడిచినట్టు లెక్క అనుకుంటూ.
ఇళ్ళకి వెనక ఓ గేట్ ఉంది, అది ఎప్పుడూ మూసే ఉంటుంది. ఎవరైనా అటు వేపు నుంచి వస్తే, ఒక గంట ఉంటుంది, అది కొడితే వాచ్ మాన్ వచ్చి తలుపు తీస్తాడు. అటు నించి వెళితే ,చిన్న బజారు వస్తుంది, కూరలు అవి దొరుకు తాయి. అక్కడ, ఫ్రెష్ గా..వారానికి ఒక్కసారి వెళ్లి కొనుక్కుని వస్తూంతుంది
ఈ రోజూ అటు వెళుతూంటే, ఓ నాలుగు పాకలు కనిపించాయి. అవి ఎంత దారుణం గా ఉన్నాయి అంటే, మధ్యలో ఒక మురుగు గుంట, చుట్టూ నాలుగు పోలితీన్ షీట్స్ కప్పిన అట్ట పెట్టె లాంటి గోడలు, సగం బట్టలు తో ,ముక్కు తుడుచు కుంటూ చంటి పిల్లలు..
అబ్బ,ఇదేంటి ,మా స్వర్గం లాంటి ఇళ్ళ పక్కన ఈ నరకం..చ..ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తప్పవు కాబోలు, బాబోయ్ ,ఇలాగే వదిలేస్తే ,కాన్సెర్ లాగ పెరిగి, ఒక పెద్ద స్లమ్ తయారు అవుతుంది , ఊరుకుంటే లాభం లేదు అని కంగారు పడింది వినూత్న .
తరువాత నెల రోజులు వినూత్న చేయని ప్రయత్నం లేదు. రోటరీలో తెలిసిన పెద్దల ద్వారా, మున్సిపాలిటీకి అర్జీ పెట్టించి, ఈ స్లమ్స్ఇక్కడ నుంచి తీసేయాలి ,కావాలంటే వేరే చోట ,చిన్న ఇల్లు ఇవ్వండి..అంతే గాని, ఎన్నో లక్షలు వెచ్చించి కట్టుకున్న ఈ స్వర్గం లాంటి మా ఇళ్ళ ముందు ,ఇలా దిష్టి పిడతల్లగా ఈ పాకలు, ఇవి ముదిరి ,మా ఇళ్ళ విలువ పడిపోకముందే, తీయించండి అని గొడవ చేసి, మొత్తానికి అక్కడ నుంచి తీయించారు..మున్సిపాలిటీ.
అమ్మయ్య , ఒక మంచి పని చేసాను అని సంతృప్తి పడింది.
మర్నాడు ఉదయం పది అయింది ఇంకా రాలేదు లక్ష్మి. ఇదేమిటి? రోజూ ఎనిమిది కల్లా వచ్చేదే, పదకొండు అయింది ఇంకా రాలేదు , నాగాలు పెట్టడం మొదలు అయింది , లోకువ అయిపోయాను, ఈ లక్ష్మికి అని కంగారు పడుతూ ఇంటర్ కమ్ ఫోన్లో, లక్ష్మిని తీసుకువచ్చిన వాచ్మాన్ కి ఫోన్ చేసింది, వినూత్న .
ఏమైంది లక్ష్మి ఇంకా రాలేదు, ఈ వేళ?
అమ్మా ! వెనక గేట్ దగ్గర వాళ్ళు వేసుకున్న పాకలు, కూల్చేశారు కదా అమ్మా , పిల్లలతో ,ఊరు బయట ఎక్కడో ఇల్లు ఇస్తారంట, అక్కడ ఎలా ఉంటుంది? ఉన్న సామాన్లు పట్టుకుని, ఇంకో కాలని వెతుక్కుంటూ వెళ్లి పోయిందండి అమ్మా ! వాళ్ళ ఊర్లో కూడా పొలం పనులు లేక ఇలా వచ్చిండమ్మా ,మా ఊరే , మొగుడు లేడు ,ఇంటి పనులు చేసుకుని ,ఇద్దరు పిల్లల్ని పోషిస్తోంది. ఇల్లు దూరం అయింది కదా అమ్మా ఇప్పుడు మరి వస్తుందో లేదో??
హుహ్ నిట్టూర్చింది వినూత్న నా స్వర్గం లాంటి ఇల్లు తుడిచి, అద్దంలాగా మెరిపించే లక్ష్మి కి నరకం లాంటి ఇల్లు కూడా లేకుండా చేసేనా? భాస్కర్ ఏమంటాడో? ఏమిటి నేను ఇలా తయారు అయ్యాను, ఇంత స్వార్ధం గా..
నా ఇల్లు ఒక్కటే స్వర్గం , అదే మా కాలోనీ పేరు , అయితే చాలా??
నా చుట్టూ ఉన్న నరకం నుంచి ఎంత దూరం పారి పోగలను..
హుహ్,ఇంకో పని మనిషి దొరికే వరకు, నేనే చీపురు పట్టుకోవాలి , తప్పదు, పద పద వినుత్నా ,
అబ్బ ఈ దేశం ఎప్పుడు బాగు పడుతుందో? ఏమో? అంటూ నిట్టూర్చింది , వినూత్న.
వసంత లక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమీ పేరు అదే అనుకుంటాను. మీ టపాలో మీరు తీసుకున్న అంశం బావుంది.
'ఏమిటి నేను ఇలా తాయారు అయ్యాను, ఇంత స్వార్ధం గా..' అందరం ఇలా అనుకుంటే యెంత బావుంటుందో కదా.. నులుగు మనుషులు ఉండడానికి ఇన్నిన్ని హంగులు ఆర్భాటాలు ఎందుకో..
జ్యోతిర్మయి గారికి ధన్య వాదాలు..అన్ని కామెంట్స్ కి కలిపి ఒక్క చోటే రాస్తున్నాను. నాలాగే ఆలోచించే వారు, ఎంత మందో, అని సంతోషం
రిప్లయితొలగించండితో ఉబ్బి తబ్బిబ్బై పోయి, ఇంకా ఎన్నో రాసేస్తాను. చదివే వాళ్ళు ఉన్నారు కదా అని ధైర్యం పెరిగి పోతోంది. అవునండి, నేను కూడా ఎక్కువ పుస్తకాలే చదువుతాను. కొడవతగంటి, రావి శాస్త్రి, బీన దేవి, శ్రీ శ్రీ, చలం, ఇంకా ఎందఱో, బుచిబాబు..అందరు నాకు మా ఇంట్లో పెద్దల్లగా అనిపిస్తారు. మంచి మార్గం లో, అని కాక పోయినా ఇది చెడు మార్గం అని తెలుసుకునే బుద్ధి ని కలిగించారు.. ఈ మహానుభావులు. వీరినే అనుసరిస్తూ, నాకు తోచినట్టు రాసుకుంటూ వెళ్లి పోతున్నాను. ఒక్క చిన్న మాట ,అయినా నాకేదో, శాలువా కప్పి సన్మానం చేస్తున్నట్టుంది. మీరు, నా బ్లాగ్స్ చదువుతూ ,ఇలాగే మరిన్ని కొమెంత్స్ రాస్తారని ఆశిస్తూ..
వసంత లక్ష్మి..వసంతం.
చిన్న చిన్న థీంస్ మీద మీరు రాసే కథలు/స్కెచ్ లూ చాలా బాగున్నాయి వసంత గారూ.
రిప్లయితొలగించండిశారద
శారద గారు,
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ పేజ్ కి వెళ్లి చూసాను, హాహా అంటూ గట్టిగ, మనసార నవ్వించే, త్రీ మెన్ ఇన్ ఎ బొట్..చదివినవారు నాకు ఇంకొకరు కనిపించారు, ఇంకేమిటి పుస్తక బాంధవ్యం ఏర్పడింది..ఇంకా నా కథలు /స్కెచ్ లు బాగున్నాయి అనే సరికి మరీ ఆత్మ బంధువు అయిపోయారు. ఇంత ఆనందం ఏమిటండి..ఈ ఒక్క మాట తో..అల్ప సంతోశివి అంటారు నన్ను..ఇంకా ఏదో రాయాలనే తాపత్రయం..పెరిగి పోతోంది. మిమ్మలిని ఇలా కలిసినందుకు చాలా హ్యాపీ.మీ చిన్ని అనన్య కథ కూడా గబా గబా చదివేసాను, మొగ్గలోనే పరిమళం ..చక్కని రచయిత్రి అవుతుంది..
వసంతం....వసంత లక్ష్మి.
మీ మిగిలిన బ్లాగ్స్ అన్ని చదివేస్తాను..ఇవాళే, మీ బ్లాగ్ ఈ రోజే చూసాను ప్రధమం గా..ఇన్ని రోజులు మిస్ అయాను.
I have recently found your blog and it is very nice. Particukarly, the subjects you take up are very good and genuine.
రిప్లయితొలగించండిThank you Ruth..for discovering my blog and receiving my post subjects..I get so much inspired by such compliments..and my pen jumps with joy and treads forward..in this case, the pen is replaced with key board..Thankyou once again.
రిప్లయితొలగించండిVasantham..vasanta lakshmi,p.