"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

29 సెప్టెం, 2011

అతడు

నేను నా బ్లాగ్స్ కి వచ్చే స్పందన చూసి, అతడు సినిమా లో త్రిష లా , గొప్ప గా  మురిసి పోతున్నాను. ఇంతలో..తథాస్తు ..అన్నారు దేవతలు..ఇంకేముంది , ఆ సినిమా ఏ వచ్చేసింది. మాకు వచ్చే పుంజీడు చానల్స్ లో, మా టీ. వి .ఒకటి, ఈ టీ.వి.కాకుండా..

ఇందులో  మాస్,బాస్,కింగ్, జోష్ ,అంటూ మార్చి, మార్చి అవే వేస్తూ ఉంటారు.అందులో పదో,వందో సారో చూసేసిన సినిమా  'అతడు ఎందుకో...చాల నచ్చేసింది.

చిన్నాపుడే, బాట్ ,బాల్ పట్టుకుని ఆడుకునే వయసు లో, బొడ్లో ఒక గన్ పెట్టుకుని , తనకి అడ్డు వచ్చే వారందరినీ సిన్మా భాష లో వేసేస్తూ ఉంటాడు, పెద్ద వాడు అయి, మహేష్ బాబు అయాక, చార్మినార్ ఏరియా లో,ఒకడిని, అడ్డం గా ఒక చిన్న చాకు బెట్టి, కెలికి కెలికి చంపేస్తాడు..

మొదటి సారి చూసినప్పుడు, ఎప్పుడో చూసిన ఇంగ్లీష్ మూవి  అస్సాస్సిన్..గుర్తు వచ్చి, బాబోయ్ ..రక్తం సినిమా రా బాబు,నేరక పోయి వచ్చాను..అని చింతిస్తూ. మళ్లీ, మన మహేష్ బాబు గ్లామర్ గుర్తు వచ్చి, సీట్ కి అతుక్కు పోయాను.
ఇంతలో, ఏదో ఒక హత్య చేసో, చేయబోయో, మిస్ అయి, చేసింగ్ సీన్ లో, ఓ పెద్ద అంతస్తులున్న మేడ ఎక్కి, దాని మీద నుంచి దూకి, ఎలాగో ....గో..ఓ రన్నింగ్ రైలు లో అదే మీద పడతాడు. ఏమిటి ఈ  దర్శకుడు కి ఇంత తల తిక్క అనుకున్నాను, నా లాగే, కదులుతున్న రైలు లోకి ఎలా ఎంటర్ అయాడు అబ్బా అని ఓ సింగెల్ సీట్ లో కూర్చున్న అబ్బాయి అనుకున్నట్టు  చూపించేడు...ఓహో..అనుకున్నాను..మరీ  తింగరి..కాదేమో లే..
పార్థు..ఎప్పుడో ఇంటి నుంచి పారిపోయిన పార్థు తాత గారింటికి వస్తున్నాడు...ఒక చిన్న పరిచయం ,జీవితం ని ఎలా మలుపు తిప్పుతుందో ...ఇంకా అక్కడి నుంచి రక్తాలు, గన్ లు పోయి...
పువ్వులు, ప్రేమలు  బాంధవ్యాలు, ఆట పాటలు, గోరు ముద్దలు, చిలిపి ముద్దులు, మండువా ఇంటి నిండా చుట్టాలు, పాత స్నేహితులు, జాతరలు, తాత గారితో చెస్ ఆటలు, బ్రహ్మనందం కామెడి లు, చిన్న పిల్లల అలర్లు,ఇంకా ఇంకా ఎన్నో..సుందర , హృద్య మైన సీన్లు.
మనమూ, ఓహో, ఎంత మంచి వాడో, పాపం..అలా ఎందుకయాడో, అని ఊ..ఫీల్ అయి, మహేష్ బాబు ట్రాన్స్ లోకి వెళ్లి పోతాం.
మనమే కాదండోయ్ ..కథ లో, త్రిష..కి కూడా..ఎంత బాగుందో, చక్కగా లంగా ఓణి ల లో,ముద్దోస్తో ఉంటుంది, నాకే ఇలాగ ఉంటే...మరి హీరో కి ఎలాగో ఉండాలి కదా..

టెక్స్ట్ బుక్ లో ఉండే అన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తుంది..అంటే దొంగ చూపులు చూడ్డం, నడిచే దారిలో కాళ్ళకి అడ్డం గా కూర్చుని లైన్ వేయడం..అబ్బ నాకు కూడా ఈ భాష వస్తోంది ఏమిటి?? అతని ని చూస్తున్న ఆడ పిల్లలని అందరిని, లైన్ లోంచి పక్కకి తప్పించడం, తలుపు సందు లోంచి, నన్ను చూస్తున్నాడా? లేదా అని తను చూడడం..గాలికి ఎగిరే కర్టెన్లు తో పాటు.. ఊహల్లో కి వెళ్లి డ్యుఎట్ పాడడం....
అతని పక్కనే నిల్చుని పనులన్నీ చేసుకుంటూ కవ్వించడం..ఒకటి కాదు మహా ప్రభో..ఒక చిన్న ఆడ పిల్ల తూకం వేస్తె,పాతిక కేజీల బరువుండే.. మెదడు లో ఇన్ని ఊహలా  అవురా అనిపించి..మళ్లీ, మన చిన్నతనం లోకి తీసుకు వెళ్ళింది.
ఇంతకీ పూరి, అదే త్రిష కి తను చాల అందగత్తె ని గాఢమైన నమ్మకం..అందుకే..పాపం..తన అక్క కి పెళ్లి చూపులకి ఇంట్లో నే, కూర్చుని, పెళ్లి వారి  కళ్ళ పడ కుండా ,వంటిట్లో ఏదో తింటూ..ఏదో గంత కు తగ్గ బొంత, అభిషేకో, హ్రితిక్ రోషనో..దొరుకుతాడు..అని లెవెల్ ..లో ఉంటే..పూరి, నువ్వు అంత అందగత్తె వి, ఏమీ కావు, చిన్న కళ్ళు, పెద్ద తెలుపు కూడా కాదు..అంటూ మహేష్ బాబు ఏడిపించే డవిలోగ్ ..తరువాత..పూరి నోట్లో ఒక పూరి తో..వాః అనిపించేడు..త్రివిక్రమ్..
వర్షం పడుతుందా? పూరి అందం కి ఏం తక్కువ..అనే సీన్ ..మళ్లీ ఇంకో పాట...పాటలు కూడా బాగుంటాయి ..తన అందం మీద అతి నమ్మకం..వాడెవడో..నా చెయ్యి పట్టుకున్నాడు..అంటూ పట్టుకు వెళ్లి, ఓ చిన్న వీధి రౌడీలను చూపించడం..పెద్ద ,పెద్ద కిల్లింగ్ కాంట్రాక్ట్ లు తీసుకునే..హీరో..విసురు గా ఓ పేర్చి ఉన్న గోడే అనుకోండి, గట్టిగ ఓ పంచ్ ఇవ్వడం..భలే పంచ్..
ఎన్నో సిన్మాల్లో స్పూఫ్ కూడా అయిపొయింది..
యేసు క్రీస్తు లాగ..సిలువ పోస్ లో..త్యాగానికి ప్రతిరూపం లాగ..మన కిల్లెర్ హీరో..తాత గారి ముందు మోకరిల్లడం..అది ఒక కీలకమైన సీనే..
నువ్వు, మా పొలంని  ఆక్రమణ ల నించి కాపాడినపుడు ,అడగలేదు, పాతిక ఏళ్ళ కుర్రాడు, పది లక్షలు ఎలా సంపాదించాడు ? అని అడగ లేదు..అని తాత గారు.. నాజర్ మాటలు కూడా..క్లాప్స్ పడే సీన్..  ..
బయటకి వచ్చి, తాత గారు ఇచ్చిన బారెల్ గన్ పట్టుకుని, యుద్ధానికి అదే climax సీన్ కి వెలుతూ ఉంటె.. పూరి.." నేనూ వస్తాను"..
మహేష్..అదే పార్ధూ..అదే.." నేనే వస్తాను"
క్లుప్తం గా మాట్లాడి ,ఏక్షన్ ఎక్కువ చేసే మహేష్ కి ఎంత కరెక్ట్ గా రాసాడో..మాటలు.. త్రివిక్రమ్..
ప్రకాష్ రాజ్ డిటెక్షన్  ..ఎత్తు పై ఎత్తులు..
అబ్బ, చాలు బాబూ..ఇది ఎప్పటిదో..పాత సినిమా ..ఏమిటి అంత బిల్డప్ ..అని జుట్టు పీక్కున్తున్నారా??
ఏమిటో నండి..చెప్పెను కదా పూరి లాగ , నా బ్లాగ్స్ నాకే నచ్చేస్తున్నాయి.
ఎవరో..పక్కనే మహేష్ బాబు లాగే..
రాసిందే రాస్తావు..నువ్వు బాగుంది అనుకుంటే చాలా? అంత సీను  లేదు..అని గాలి తీసే  స్తున్నారు..
 ఓహో..టీ కావాలిట.'.అతడు 'కూడా నాకు నచ్చిన సినిమా అండి..ఈ మధ్య కాలం లో హీరోయిన్ ని ఇంత అందం గా చూపించిన సినిమా ఇంకొకటి లేదు..మళ్లీ..మా టీ వి. వ్వాళ్ళు ఎప్పుడు వేస్తారో???
చివారఖరి మాట..మనలో మనం ..ఆ రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ సినిమా పాత్రలను అందరిని తెచ్చి, ఈ ప్రేమ పూరక మండువా లోగిలి, జాయింట్ ఫ్యామిలీ ఇంట్లో తెచ్చి పడేస్తే పోతుందేమో??
ఎందుకు ఇంకా ఆ నరుక్కోడాలు , చంపు కోడాలు?? ట్రై చేయొచ్చు కదా..

8 కామెంట్‌లు:

  1. అయ్యో..detective ..అని తెలుసండి గూగులమ్మ చేసిన అనువాద ..అనుసరణ..తప్పు అది..

    వసంతం.

    రిప్లయితొలగించండి
  2. ok..thanks for correcting me..made my correction..some times google gives me tears, by not cooperating with my telugu..huh..
    vasantham.

    రిప్లయితొలగించండి
  3. try lekhini.org if you are using Windows....
    I am using it and its THE BEST till date....

    Btw... the way u expressed is very nice.....

    రిప్లయితొలగించండి
  4. థాంక్స్..మాడ్డి .గారు. .ఎంకరేజింగ్ గా ఉన్నాయి..మీ కామెంట్స్. మీరు చెప్పిన లేఖిని ట్రై చేస్తాను, ఎక్ష్ప్లొరెర్ లోనే ఉన్నాను. మీ పేజ్ లో ఉన్న లింక్స్ నేను కూడా చదువుతాను..మీరు రాసిన ఫావోరిట్ బుక్స్ అన్ని నేనూ చదివాను. చేతన్ భగత్ నాకు కూడా ఫావోరిట్ ఏ...ఎక్కువ గా చదివి, చదివి, ఇలా రాయడం మొదలు పెట్టాను.బ్లాగ్స్.లో..ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలు, ఉన్నాయి..ఎనీ హౌ,థాంక్స్ అండి మీ కాంప్లిమెంట్ కి.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  5. మీరు వర్ణించిన విధానం చాలా బాగుంది.... :)

    ఇలాంటి రివ్యూలు ఇంకొన్ని మంచి సినిమాలకి రాయడానికి ప్రయత్నించండి...

    రిప్లయితొలగించండి
  6. నేనిప్పటికో యాభై సార్లు చూసుంటానండీ ఈ సినిమా ;)డైలాగ్స్ అన్నీ కంఠతా నాకు ;)

    రిప్లయితొలగించండి
  7. వెల్కొం టు ది క్లబ్..రాజ్ కుమార్ గారు, ఉంటారు మన లాంటి వాళ్ళు..అతడు సినిమా తెగ నచ్చేసిన వాళ్ళు, ఈ మధ్యే జెమిని టీ వి. చానెల్ లో ఖలేజా చూసేను, సగం నుంచి, అది కూడా త్రివిక్రమ్ ఏ ..నాకు అది కూడా చాల నచ్చింది. డిఫెరెంట్ గా ఉంది సినిమా లో, దాని మీద మరో సారి..మరిచి పోయాను..థాంక్స్ చెప్పడం..ఈ సంతోషం లో,
    వసంతం.

    రిప్లయితొలగించండి