"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 సెప్టెం, 2011

పాదాల వద్ద చోటు ..అనే గుండమ్మ కథ

హమ్మయా ..చివరాఖరికి సరోజని తెచ్చి మావగారి కాళ్ళ మీద పడేసారు. యావత్ ఆంధ్ర ఊపిరి పీల్చుకుంది. పాటలు ఎంత బాగుంటాయో? బ్రదర్ అంటూ..అగ్ర నటులిద్దరూ చేయి, చేయి పట్టుకుని ,షేక్ హాండ్స్ఇచ్చుకుని, ఇద్దరి అభిమాన సంఘాల వారిని  చల్ల బరిచారు..ఎప్పుడో, అవును, నలభై ఏళ్ల క్రితం తీసిన సినిమా..యాభై ఏళ్ళు కూడా నేమో..తొందర పడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు,లేచింది ,నిద్ర లేచింది, మహిళా లోకం అంటూ పాడేసారు..ఇప్పటికి అదే పరిస్థితి.
ఏం చదువు కున్నావు? అంటే గొంతు వరకు అంటుంది..సరోజ.
పరిచయం చేస్తే నమస్కారం అనా అనదు ..సరోజ.
పాపం ,పొద్దున్నే లేచి, కాఫీ అంటూ అరిచే గారబాల పిల్ల..జమున.
తెల్ల వర ఝామునే లేచి, ఇంటెడు చాకిరి చేసే మంచి పనిమంతురాలు..లక్ష్మి..మన చూడ చక్కని, నా అభిమాన సావిత్రి.
కోడళ్ళు ని చేసుకోవాలని వస్తాడు..ఎస్ వి ఆర్ గారు.
ఎవరైనా పనిమంతులనే కోరుకుంటారు కదా..కాని, ఈ కుటుంబంతో పూర్వ పరిచయం ఇలా అయింది ..మరి ఎలాగా?
సరోజకి బుద్ధి చెప్పే పని భుజం మీద వేసుకుని, ఏ ఎన్ ఆర్ ..ముందు ప్రేమికుడు గా, మంచివాడు గా నటించి, తరువాత తాగుబోతు,  చెడు అలవాట్లు ఉన్నవాడుగా  చివరకి ఇంటి దొంగ గా కూడా నటించి, జమున తల్లి గుండమ్మని బాధ పెట్టి, భయ పెట్టి, సరోజ ని తన వెంట ఇల్లు వదిలి వచ్చేటట్టు చేస్తాడు.
కట్టుబట్టల తో, వచ్చి, మట్టి పని చేసి, పొయ్యి ముట్టని అమ్మాయి, వంటలు చేసి పెట్టి, ఇవన్ని,ఆడుతూ పాడుతూ..నెలాఖరికి జీతం కోసం..మావ గారి ముందు చేయి చాపేసరికి, నేను ఒక్క సారిగా..సరోజ అదే జమున ఫ్యాన్ అయిపోయాను.
భర్తే  దైవం అనుకుని, అతని వెంట నడిచిన అమ్మాయి లో ఏమిటి కనీ పించిందో? తప్పు.నా కయితే అందరూ అలా కుట్ర పన్ని, పాపం ఆ అమ్మాయిని అలా బాధ పెట్టడం నాకు సుతారమూ నచ్చలేదు.
ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం..తీసిన సినిమా..అవ్వ ఇప్పుడా ఈవిడ రివ్యు ..అని బుగ్గలు నొక్కుకున్న సరే..
చదువుకున్న ,తల పొగరు సరోజ కే నా ఓటు.
ఎక్కడ ఉన్నా , ఎప్పుడు అయినా సరే..ఆ మాత్రం..పొగరు, వగరు..ఉండాల్సినే..ఆడ పిల్లలికి. అదే ఆత్మ విశ్వాసం అంటాను నేను. సాహా చర్యం కే నా ఓటు. కాళ్ళ దగర మటుకు కాదు. ఒక్క యుగళ గీతం, ఒక అందాల బొమ్మ హీరోయిన్ పాత్ర సినిమాల్లో. ఇంకా ఎన్నాళ్ళో.
నిజం గా మహిళా లోకం లేస్తే..ఏమవుతుందో..ఈ దేశం?
ఎవెర్ గ్రీన్ సినిమా లలో ఒక్కటి అయిన గుండమ్మ కథ ఇప్పుడే (అంతకు ముందు చాలా సార్లు)ఈ టీ. వి. లో..చూసి..రాసిన లేట్ గా కూసిన కోయిల గీతం ఇది.







18 కామెంట్‌లు:

  1. గుండమ్మ కథ మీద నాదీ ఇదే అభిప్రాయం. కాస్త అత్మాభిమానం చూపించే ఆడపిల్లని కాళ్ల మీద పడేట్టు చెయ్యడం నాకు సుతరామూ నచ్చలేదు. ఆడదాని చోటు భర్తకాళ్ళ దగ్గర అని ఉపదేశించే పురుషహంకార కథ.

    మీరన్నట్టు పాటలు, నటన..NTR, NXR, SVR, సావిత్రి,జమున...దేనికీ కొదవలేదు. కానీ కథే...ప్చ్!

    రిప్లయితొలగించండి
  2. ఆ .సౌమ్య గారు..నాకు తెలుసు,నాలాగే అనుకునే వాళ్ళు చాల మంది ఉంటారు అని..అలాంటి సేం టు సేం గా అనుకునే వారందిరికి ఈ టపా అంకితం. అప్పుడే మా చెల్లి ..హాట్స్ ఆఫ్ అక్క అనేసింది.అది ఒక కిరీటం నాకు.మా ఇంకో స్నేహితురాలు లత కూడా ఇదే అభిప్రాయం..మీ పేజ్ చదివితే..అన్ని నాకు ఇష్టమైన ఇష్టాలే.
    చేయి కలిపి ఒక సారి థాంక్స్ అండి..సౌమ్య గారు..మంచి సబ్జెక్ట్ చదివారు. వీలు వెంబడి, నా మిగిలిన బ్లాగ్స్ కూడా చదవండి.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. నిజం గా మహిళా లోకం లేస్తే..ఏమవుతుందో..ఈ దేశం ?
    yes really true ....

    రిప్లయితొలగించండి
  4. Thankyou Ruth..an obsessive compulsory reader seems to fit my profile too..My heart is filled with joy,there are so many like minded women out there,I am just trying to reach you and you..Thanks once again.
    vasantham..

    రిప్లయితొలగించండి
  5. :) నేనూ చూశాను ఈరోజు. అద్భుతమైన కావ్యం.. ఒకరిని మించి ఒకరు నటించి అసలు కొన్ని వందల సార్లు చూసినా విసుగు రాదు. మీరన్న ఒక్క విషయం మాత్రం చూసిన ప్రతిసారీ మీ అభిప్రాయమే నాది.

    ఇదీ కాక రెండు మూడు సీన్లు నాకు కొద్దిపాటి చిరాకు తెప్పిస్తాయి. జమున ANR కి డబ్బు వెనక్కివ్వటానికి వచ్చినప్పుడు మొదటి సారే అమృతాంజన్ రాయటం, అప్పుడు ANR భయంకరమైన ఓవరాక్షన్, వెంటనే పాటందుకోవటం..

    ఇంకోటి SVR పెళ్లి సంబంధం చూసి వెనక్కి రాగానే కనీసం మంచి నీళ్లయినా అడగకుండా, కూర్చోనీయకుండా 'వెళ్లిన పని కాయా? పండా?' అని ఇద్దరు కొడుకులూ అడగటం.. 'రౌతు కొద్దీ గుఱ్ఱం' అనటం.. :)

    రిప్లయితొలగించండి
  6. థాంక్స్ కృష్ణ ప్రియ గారు. అవును చాల సన్నివేశాలు, కృతకం గా ఉన్నాయి.మీరు చెప్పినట్టు,ఒక్క మాట కూడా లేకుండా, ఏకం గా తల నొప్పి అంటూ చనువు తీసుకోవడం..హరనాథ్ ,పద్మా రా..అంటూ ఒక్క డయాలోగ్ తోనే సినిమా అంతా నడిపేయడం..టేమింగ్ అఫ్ ది ష్రు...అనే మహనీయ షేక్ స్పెయర్ నాటకం కి అనుసరణ ఈ సినిమా. అంతా బాగుంటుంది కానీ, జమున నే అన్యాయం గా చూపించేరు.ఏమైనా అల్ టైం హిట్ ఈ సినిమా..నాకు బాగా నచ్చినవి, సావిత్రి, సావిత్రి అండ్ సావిత్రి..అఫ్ కోర్స్ పాటలు.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  7. గుండమ్మకథ ఇష్టంగా చూసినప్పుడల్లా చివరన నేను కష్టంగా అనుకునే మాటల్ని మీరు చెప్పేసేరు.
    నిజమే. కాని అప్పుడు కూడా ఆత్మాభిమానం చూపించింది సరోజ అని సరిపెట్టుకున్నాను.
    ఈ సినిమాలన్నీ ఇంతేనండీ.. కథంతా నడిపి ఆఖర్న పాదాల దగ్గర పడేస్తారు.

    రిప్లయితొలగించండి
  8. థాంక్స్ అంది శ్రీ లలిత గారు..అవునండి..అందరు కూడ బలుక్కుని, హీరోయిన్ ని, తల వంచడమే ధ్యేయం గా పెట్టుకుంటారు..మంచి, మంచి పాటలు, నటన కి మనమూ పడిపోతాం..అందుకే మిస్సమ్మ నాకు ఇంకా ఇష్తం. సావిత్రి రోల్ అందులో, చాల బాగుంటుంది కదండీ..ఆ టపా..ఇంకోసారి.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  9. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం..తీసిన సినిమా..అని మనమే అంకు౦టున్నాం కదండీ..అప్పటి సినిమాలో స్త్రీకి అభిమానం లేకుండా చూపించారు.
    ఇప్పటి సినిమాల్లో కనీసం మానం చూపిస్తున్నా చూస్తూనే వున్నాం కదా. మహిళా లోక౦ ఎప్పటికి లేస్తుందో చూడాలి మరి.

    రిప్లయితొలగించండి
  10. థాంక్స్ అంది జ్యోతిర్మయి గారు..పొట్టి ,పొట్టి, బట్టలు ఉన్నట్ట లేన్తా,అని హీరోయిన్ లు, ఇంకా అధ్వాన్నం గా ఐటెం పాటల్లో పిచ్చి గెంతులు, రెండు అర్దాల పాటలు..ఇవి నేటి స్త్రీ పాత్రలు,ఎప్పుడో ఒక్కటి ,అరా,ఆనంద్ లాంటి సినిమాల్లో, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. ఏభై ఏళ్ళు సినిమా అయినా మనం ఇష్టం గా చూసే సినిమా కదండీ, అందుకే బాధ. నాగి రెడ్డి- చక్ర పాణి -విజయ బ్యానర్ మీద మంచి, మంచి సినిమాలు వచ్చాయి..ఏదో మనసు వప్పుకోదు.. ఇలాంటి బ్యానర్ లో ,స్త్రీ పాత్ర ఇంత తేలి పోయిందా అని, అంతే..లేక పోతే అజరామరం కదండీ ,ఆ పాటలు, నటన లు..మరో సారి..థాంక్స్..మీకందరికీ..మీ అభిప్రాయాలు ప్రకటించి, నా బ్లాగ్ కి అందం తెచ్చినందుకు.

    వసంతం.

    రిప్లయితొలగించండి
  11. పాపం కదా జమున ! అలా మనం పాపం అనుకోవాలనే అన్ని బాధలు పెడతాడు అనుకుంటా నాగెస్వర రావు. ఎంత మంచిది కాపోతే అవన్నీ భరిస్తుంది ! ఇందులో జమున చాలా నచ్చుతుంది నాకు.

    రిప్లయితొలగించండి
  12. అవునండి సుజాతా!!! నాకు కూడా. చాల నచ్చేసింది ఇందులో జమున పాత్ర, ముందు ఏదో పొగరు అని పించినా, పెళ్లి చేసుకుని, భర్త నే దైవం గా భావించి ఫాలో అయిన అమాయకపురాలు..జమున..సరోజ..థాంక్స్ అండి..సుజాతా గారు.నా బ్లాగ్ చదివినందుకు, కామెంట్ రాసి, నాకు బ్లాగ్మిత్రు రాలు అయినందుకు.

    వసంతం.

    రిప్లయితొలగించండి
  13. గుండమ్మ కథకైతే సంబంధం లేని విషయమే. సినిమాలో సతీ సావిత్రి భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకుంటున్నట్టు చూపిస్తే క్లాస్ ప్రేక్షకులు ఆ సినిమా చూడరు అని రంగనాయకమ్మ గారు 'మానవ సమాజం' పుస్తకంలో వ్రాసారు. అలాగే స్త్రీ తన కంటే వయసులో చిన్నవాణ్ణి పెళ్ళి చేసుకుంటున్నట్టు చూపించినా మన క్లాస్ ప్రేక్షకులు చూడగలరా? కాంట్రోవర్సీ అవుతుందని తెలిసే ఈ కథ వ్రాసాను, చదవండి: http://radicalfeminism.stalin-mao.in/story-the-bloomed-flower సినిమాల విషయానికొస్తే సినిమాలో సినిమాలలో హీరోయిన్ ఎప్పుడూ హీరో కంటే తక్కువ designationలోనే ఉంటున్నట్టు చూపిస్తారు. హీరో పోలీస్ ఆఫీసర్ అయితే హీరోయిన్ జర్నలిస్ట్ అయ్యి ఉంటుంది, హీరో IPS అధికారి అయితే హీరోయిన్ IAS అధికారి అయ్యి ఉంటుంది. ఇదీ మన సినిమాలలోని హీరోయిన్ల పరిస్థితి. యాభై ఏళ్ళ క్రితమని కాదు, ఇప్పుడైనా పురుషాహంకార నిర్మాతలు సినిమాలు తీస్తే కథలు ఇలాగే ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  14. నటన విషయంలోనూ సినిమావాళ్ళ చాదస్తం ఎక్కువగానే ఉంటుంది. అరవై ఏళ్ళ హీరోకి మేకప్ వేసి ముప్పై ఏళ్ళ కుర్రవానిలా కనిపించేలా చేసి ముప్పై ఏళ్ళ వయసున్న హీరోయిన్ పక్కన నటింప చేస్తారు కానీ అరవై ఏళ్ళ హీరోయిన్‌కి మేకప్ వేసి ముప్పై ఏళ్ళ వయసున్న హీరో పక్కన నటింప చెయ్యరు. కథలోనే కాదు, స్క్రీన్ ప్లే & దర్శకత్వంలోనూ పురుషాహంకార భావ జాలమే కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  15. పాదాల దగ్గర పడి ఉండటం అంటారా? "స్వేచ్ఛ అనేది ఒకరు ఇస్తే తీసుకునేది కాదు, అది జన్మ హక్కు" అని నా కెనడా స్నేహితురాలు చెప్పిన విషయం గుర్తొస్తోంది. పాదాల దగ్గర పడి ఉండడం అంటే స్వేచ్ఛే కాదు, జీవితం విలువ కూడా తెలియకుండా ఉండడమే అవుతుంది.

    రిప్లయితొలగించండి
  16. భార్యని భర్త పాదాల దగ్గరే పడెయ్యడం ultimate అయితే ఇందులో స్త్రీ అభ్యున్నతి గురించి మాట్లాడడానికి ఏముంటుంది? పాద దస్యత అనేది ఎన్నడూ అభ్యుదయం కానే కాదు.

    రిప్లయితొలగించండి
  17. థాంక్స్ అండి ప్రవీణ్ శర్మ గారూ.వివరం గా అనలిస్ చేయడం కన్నా ,గుండమ్మ సినిమా ,ఇచ్చే వినోదం లో, జమున వ్యవహారం ఒక ఇబ్బంది ని కలిగిస్తుంది అనే నా ఉద్దేశం.
    ఇంత కంటే ఏమి లేదు..మన సిన్మాలు, మన వ్యవస్థ లో ఒక భాగమే..స్త్రీలు కి ఎంత విలువ ఇస్తారో, భార్య కి కుటుంబం లో స్థానం ఏమిటో, అన్ని..అందరికి విదితమే..
    మీ వ్యాఖ్యలకి థాంక్స్ మరి ఒక సారి.
    వసంతం

    రిప్లయితొలగించండి
  18. మీరు అడవి బాపిరాజు కథలు చదివారా? అడవి బాపిరాజు తన కథలలో స్త్రీలు చదువుకుంటున్నట్టు వ్రాసేవాడు, డాక్టర్ ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు వ్రాసేవాడు, భర్త చనిపోయిన స్త్రీలు రెండవ పెళ్ళి చేసుకుంటున్నట్టు కూడా వ్రాసేవాడు. కానీ స్త్రీలు లేచిపోవడం తప్పు అని అడ్వొకేట్ చేసేవాడు. కొన్ని కథలలో లేచిపోయిన స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు కూడా వ్రాసాడు. ఇక్కడే అడవి బాపిరాజులోని అభ్యుదయవాదానికి అంతం కనిపిస్తుంది. http://patrika.teluguwebmedia.in/2010/03/blog-post_2392.html పాద దస్యత అంటారా? లేచిపోయేవాళ్ళకి ఉన్న ఆత్మాభిమానం పాద దాసులకి ఉండదు. ఒకవేళ వాళ్ళు అడవి బాపిరాజు కథలలోలాగ ఆత్మహత్యలు చేసుకున్నా పాద దాసులలాగ జీవచ్ఛవాలుగా బతకరు. ఓసారి చలం గారు అన్నారు "స్వేచ్ఛ ఉంటేనే స్త్రీ మంచి-చెడు నిర్ణయించుకోగలుగుతుంది. స్వేచ్ఛ లేకపోతే చెయ్యగలిగేది ఏమీ ఉండదు" అని.

    రిప్లయితొలగించండి