"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

3 అక్టో, 2011

అమ్మ అదృశ్యం..

అమ్మా! అమ్మా ! పెద్దవాడు బబ్లూ కేకలు  ఉండరా  కుక్కర్ పెట్టేను, పాలు కూడా ఉన్నాయి..స్టవ్ మీద, నీ స్కూల్ డ్రెస్ ,నీ గదిలో  మంచం మీదే ఉంది, చూసుకో , అని,నేనూ అరిచేను  బదులు గా.
ఇంకా అరగంటే టైం ఉంది, స్కూల్ బస్సు వచ్చేస్తుంది, నేను నీకు లంచ్ బాక్స్ తయారు చేయాలి,ఇంకా తమ్ముడిని లేపాలి,అంటూ దండకం చదువు తున్నాను..
భారతీ..బబ్లూ సంగతే కాదు, నా సంగతీ చూడు..అంటూ..ఆయన కూడా మరో గది లోంచి కేకలు..
అబ్బబ్బ ..ఇంత బద్ధకం అయితే ఎలా? ఆయనకేం  కావాలో నాకు తెలుసు, వీధి గుమ్మంలో పడేసిన హిందూ పేపర్ తెచ్చి, అప్పుడే నిద్ర లేచిన చేతన్ అదే మా ఆయన పేరు..చేతికి అందించి, చాచిన ఆయన చేతిలోంచి తప్పించు కుని మళ్లీ వంటిట్లో, పనిలో పడ్డాను. పాలల్లో కంప్లాన్ కలిపి, పాలు చల్లబడడానికి ఒక   గిన్నెలో చల్ల నీళ్ళల్లో గ్లాసు పెట్టి, రాత్రి కలపిన చపాతి పిండి ఫ్రిడ్జ్ లోంచి తీసి, యమ స్పీడ్ లో, ఆలూ తొక్కలు తీసి, ఈ లోపల వేడి అయిన పెనం మీద రెండు ఆలూ పరోటాలు చేస్తూ, మధ్య మధ్య లో,అయిందా స్నానం..అయిందా డ్రెస్ వేసుకోడం బబ్లూ అంటూ అరుస్తున్నాను.
అబ్బ ఎంత నెమ్మదిగా మాట్లాడుతావే, చెవి దగ్గర రహస్యం చెపుతున్నట్టు అనే గీత, ఇప్పుడు నా అరుపులు వినాలి..అన్నట్టు గీత నన్ను చూస్తే ఇప్పుడు ఏమనుకుంటుందో..సన్నగా ,సన్నజాజి తీగ లా ఉంటావే నువ్వు..అబ్బ కొంచం లావు అవవే..నీ పక్కన మేం బొండాం లాగా ఉంటాం, అని వాపోయే గీతని విడిపోయి  పదేళ్ళు అవుతోందా?
అమెరికా వెళ్లి పోయింది. ఏం చేస్తోందో? ఎంత క్లోస్ స్నేహితులం అప్పుడు అయ్యో, పరోటా మాడి పోతోంది, నేను ఇంతే , నా పీ జీ చదువు, స్నేహితుల రోజులు తలచుకుంటే అన్నీమర్చి పోతాను.
"నన్ను" కూడా అంటాడు, చేతన్. హు..చేతన్. ఎంత ఇష్ట పడి చేసుకున్నాం.. మేం ఇద్దరం..పెద్దవాళ్ళని ఒప్పించి, ఎదిరించి..
ఒప్పుకోని పెద్దలు గర్వించేలా ,మంచి పోసిషన్ కి  రావాలని, ముందు అయిదేళ్ళు ఉద్యోగం చేసి, ఐ టి లో, ఈ మధ్యే స్వంతం గా తనే కంపనీ మొదలు పెట్టేడు, అప్పడి నుంచి, ఎంత బిజీ యో..
ఇంట్లో నుంచి ఎనిమిది ,తొమ్మిది మధ్య వెళితే, ఇంక రాత్రికి  ఎప్పుడు వస్తాడో చెప్ప లేం..
"ఇంకో అర గంట లో వస్తాను", "ఇదిగో వస్తున్నాను..పిల్లలు పడుకున్నారా? సారీ రా..రాలేక పోయాను, పేరెంట్స్- టీచర్ మీటింగ్కి , అయినా నువ్వు కూడా పేరెంటే కదా, ఎవరయితేనేం?"
"నాకు తెలుసు, నువ్వు పిల్లలని చక్కగా చదివిస్తావు, చదువుల సరస్వతివి కదా..అందుకే కదా నిన్ను ఇష్ట పడి చేసుకున్నాను."
ఇలాగ ఫోన్లోనే ముచ్చట్లు,మురిపాలు.
అమ్మో టైం ఎంత అయిందో? ఒక్క సారి, పరుగులు..పొద్దున్నే ఈ ఆలోచనలేమిటి ? భారతీ, నీకు బుద్ధి లేదు అని నన్ను నేను తిట్టుకుంటూ .
ఒక చేతిలో లంచ్ బాక్స్,మరో చేతిలో వాటర్ బాటిల్ , బబ్లూ స్కూల్ బాగ్ లో సర్ది, పరుగెత్తు! వచ్చేస్తోంది బస్సు అని వాడిని తరిమి, రెండో శాల్తి , బంటీని లేపడం మొదలు పెట్టేను,
అప్పుడే ఎనిమిది  తొమ్మిదికి వీడి బస్సు..
మళ్లీ వంటింట్లోకి ఒక్క పరుగు. వీడికి కొంచం పప్పు అన్నం తినిపించి పంపాలి, నాలుగు గంటలకి వస్తాడు, మళ్లీ స్కూల్ నుంచి.
ఈ లోపల చేతన్‌కి  కాఫీ , ఇడ్లి  చట్నీలు  రెడీ చేస్తూ..డైనింగ్ టేబెల్ మీద టిఫిన్ ప్లేట్, మంచి నీళ్ళ గ్లాస్, రిలే రేస్ లా పరుగులు పెడుతూ బంటీని బాత్రూం లోకి పంపించింది, వాడి స్కూల్ డ్రెస్ రెడీగా పెట్టి, ఇప్పుడు వాడే సొంతంగా వేసుకుంటున్నాడు, నయమే,మొన్నటి వరకు, ఆ పని కూడా నాదే..
చేతన్ బెడ్ రూమ్‌ లోంచి అరుపులు, భారతీ,భారతీ, "ఈ సూట్కి , ఏ టై బాగుంటుందో చెప్పు, ఈ పింక్ కలర్ బాగుందా? "
"థాంక్స్ ఓయ్, నా సూట్ రెడీ చేసేవు, నువ్వు లేకపోతే నేను ఏం అయిపోతాను..నువ్వు అన్నీ ఇంట్లో ఉండి చూసు కుంటున్నావు కాబట్టి, నేను హాయిగా నా పనులు , నా కంపనీ పనులు చూసు కుంటున్నాను". అంటూ బుగ్గ మీద ఒక చిటిక  వేసి,

హాయి, హాయిగా ఆమని సాగే..అంటూ ..మా కిద్దరికి ఇష్ట మైన పాట హమ్ చేసుకుంటూ, టిఫిన్ ముందు కూర్చున్నాడు..
నాన్నా..అంటూ బంటి..హాగ్ చేసుకున్నాడు..ఉండు..ఉండురా..నా సూట్ ..అంటూ..కోట్ విప్పి, వాడి బుగ్గల మీద ఒక కిస్ ఇచ్చి, ఏంటవుతోంది? మీ క్లాస్ టీచర్ ఏమంటోంది?అంటూ కబుర్లు చెపుత్తోంటే, నేను వాడికి  పప్పు  అన్నం ప్లేట్లో కలిపి ముద్దలు పెట్టేసి, నోట్లో, నోరు కడిగి, వాడి స్కూల్ బాగ్  వీపుకి తగిలించి, బై, బై,చెప్పి, పంపించేను..
చేతన్ టిఫిన్ చేస్తూంటే, నేను ,నా ఫస్ట్ కాఫీ తెచ్చుకుని, ఊపిరి పీల్చుకుంటూ ,నెమ్మదిగా , ఇంకో సీట్ లో కూర్చున్నాను.
"హా..ఎంత దారుణం..ఏమిటి ఈ రాజకీయాలు అనుకుంటూ , నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడా అని లాస్ట్ పేజ్, స్పోర్ట్స్ కోలం  చూస్తూ, భారతీ.."ఏమైనా చెప్పు, నువ్వు ఏం చేసినా బాగుంటుంది..ఈ ఇడ్లి చెట్నీచూడు, ఎంత రుచిగా ఉందొ, హమ్..ఈ ఇడ్లీలు, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి."
ఏమిటో ,ఈ పొగడ్తలు మొన్న మొన్న వరకు, చెవులకి ఇంపుగా తోచేవి. ఇపుడిప్పుడే ,ఏమిటో ఈ పొగడ్తలు కి నాకేమి సంతోషం కలగటం లేదు.
పిల్లల హోమ వర్క్ చేయించడానికి, నా పీ జి చదువు, బయట పనులు చేసుకోవడానికి, నా డ్రైవింగ్ స్కిల్ల్స్, ఇల్లు అందంగా సద్దడానికి, నా మంచి అభిరుచులు, పిల్లల ప్రాజెక్ట్స్ చేయడానికి, నా కంప్యుటర్ స్కిల్స్ , చేతన్ భార్య ఎంత అందగత్తో, పిల్లలుని ఎంత బాగా చదివిస్తుందో, చేతన్ అదృష్ట వంతుడు,చక్కని, అందమైన, అర్ధం చేసుకుని సహాకరించే భార్య ,ఉన్నారు..
ఈ మాటల్లో, నేను..నా ఉనికి ఎక్కడ ఉన్నాయో? ఏమిటో,నాకంటూ ఒక ఉద్యోగం లేక పోవడం వల్లా..ఇద్దరు ఎందుకు ఇల్లు వదిలి కష్ట పడడం, నేను ఎలాగు బయట తిరగాలి, ఇల్లు నడపాలి కదా.నువ్వు ఇల్లు, పిల్లలు చూసుకో..ఇది డివిషన్ అఫ్ లేబర్..అంతే..నువ్వు నా కన్నా తెలివైనదానివి..నాకు తెల్సుగదా..అవును మరి క్లాస్ లో ఎప్పుడూ నేనే ఫస్ట్.
ఇవాళ పొద్దున్న లేచి ..అన్నీ ఇలాంటి డిస్టర్బింగ్ ఆలోచనలే..
వారం..పది..నెల రోజులు ...కొంచం కొంచం తేడాతో ఇదే రొటీన్ లైఫ్...
ఇంతలో ఉరుము లేని పిడుగులాగా..
ఎవరో చెప్పుకో..అని ఫోన్..గీత దగ్గర నుంచి.
 ఏయ్ భారతీ..ఎలాగో నీ ఫోన్ నంబర్ కనుక్కున్నానే..అయినా నువ్వు ఒక్కర్తివేనా పిల్లలు ,  ఫ్యామిలి ఉన్న దానివి.
అంటూ మొదలుపెట్టి, నిన్నేతలుచుకున్నానే  ఈ మధ్యే అని చెపుతున్న వినకుండా..నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా..
నేను మీ ఊరులోనే ఉన్నాను..సర్ప్రైస్ కదా..
చివరికి మాటల్లో తెలిసింది ఏమిటంటే.. గీత ఇప్పుడు, మహిళలకు, లావు తగ్గించి చక్కగా, సన్నగా తయారు చేసే ఒక కొత్త సెంటర్ ప్రారంభించింది.
అన్నీ లేటెస్ట్ టెక్నిక్‌  లేనే..చాల బాగుంటాయి చాలా సులభం కూడా మీరు అలా వచ్చి, పడుకుంటారు, మేం కొన్ని వైర్లు తగిలిస్తాం హాయిగా మంచి, పాటలు వింటూ. రిలాక్స్ అవుతారు అంతే..
నాకేమి ,నేను బాగానే ఉన్నాను కదా అన్నా వినిపించుకోకుండా,  అద్దం లో నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసు కున్నవా ?
ఎంత సేపూ ,పిల్లలు, మా ఆయన..అంటూ ఎందుకలా వేలాడుతావు? ఒక్క సారి అందరినీ  చూడు, నీ ఏజ్ వాళ్ళని..
అంటూ, మాటల్లో పెట్టి, నన్ను ,చేతన్ ని ఒప్పించింది..చాల ఖరీదైన వ్యవహారం కాబట్టి ,చేతన్ కూడా  ఒప్పకోవాలి.
ఒక నెల గడిచింది..బాగానే ఉంది  కొంచం బరువు తగ్గాననే అని పించింది..
రెండు,మూడు నెలలు గడిచాయి 
ఐదో నెల గీత, ఫ్రెండ్స్.నువ్వు యింకా అందంగా ఉన్నావు ఇప్పుడు  అని ఒకటే పొగడ్తలు  ఇంట్లో మటుకు, దోసలు అద్భుతం..నీ చేతి వంట అమృతం..అంటూ పొగడ్తలు తప్ప ,నా అందం గురించి, చిక్కిన నా అందం గురించి ఒక్క మాట లేదు..
పిల్లలు, అమ్మా..అమ్మా..అంటారు..వాళ్ళ పని అవగానే..పరుగులు ,స్కూల్ కి, ఆటలకి, టీ. వి. లో కార్టూన్లు చూడ్డానికి..
ఒక్కోసారి, నేనెందుకు ఈ ఇంట్లో ఉన్నాను? అనిపిస్తుంది.
ఆరో నెల..గీత లేటెస్ట్ మెషిన్ తెప్పించింది, తన బిజినెస్ ,మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.
ఒక రోజు మంచి పాత పాటలు వింటున్నాను .వింటూ .పడుకుని ఉన్నాను.
శరీరం అంతా వైర్లు, నేను హాయిగా పడుకుని ఉంటె, నా బరువు..తగ్గి పోతోంది, తగ్గి పోతోంది..తగ్గి పోతోంది..
రాత్రి అయింది, సెంటర్ మూసి అందరూ వెళ్లి పోయారు..నేను అక్కడే ఉన్నాను ఎవరూ నన్ను చూడలేదు, నేను కనిపించటం లేదు..
ఎలాగో ఇంటికి వెళ్ళాను
మర్నాడు, వారం, ఒక నెల  నా పనులన్నీ  నేను చేస్తూనే  ఉన్నాను..
ఎవరూ  అమ్మా ఏది అని అడగటం లేదు..వాళ్ళ పనులు అయిపోతున్నాయి..
నెల రోజులు గడిచాయి.
ఒక రోజు  నేను అదృశ్యం అయిపోయాను .మా ఇంటి నుంచి..
చూడాలి ఎన్ని రోజులకి తెలుస్తుందో? ఈ అమ్మ అక్కడ ఇంట్లో లేదని..

నోట్...ఇది కథే కాబట్టి, నా ఊహ ఇది..అమ్మా లేని ఇల్లు..అమ్మా ఉనికి గురించే ఈ కథ కాని, ఇది ఏదో స్సైన్స్ ఫిక్షున్ కాదు.

4 కామెంట్‌లు:

  1. బావుందండీ అమ్మ అదృశ్యం..అమ్మ చేసే పనులే కాని అమ్మ వాళ్లకు అవసరం లేదంటారు. గాలి మన చుట్టూనే ఉంటుంది. మన ప్రాణ వాయువు, కాని మనం గాలిని తలచుకు౦టున్నామా..అలాగే అమ్మ కూడా, లేనప్పుడు విలువ తెలుస్తుంది అంటారేమో, చెప్పే భాష తెలియక పోవచ్చు. అమ్మ అదృశ్యమయితే అవనే అదృశ్యమవుతుంది.

    రిప్లయితొలగించండి
  2. ముందు గా థాంక్స్ అంది జ్యోతిర్మయి గారు..
    అమ్మ అంటే అవని..అంటే భూమి..భూమి కి కూడా సహనం నశించి, అప్పుడప్పుడు, రెండు గా చీలిపోవడం..క్రోధం తో నో,బాధ తోనో, బుద్ధి చెప్పాలి, ఈ పుడమి మీద ఉండి, నన్ను గురవించని ఈ మానవ జాతి కి..అనేది చూస్తూనే ఉన్నాం కదండీ.
    అమ్మ కి కూడా ఒక్కో సారి, సహనం నశించి, అదృశ్యం అవుతుంది.. భుతికం గా కాక పోవచ్చు..ఈ భావం నాకు తోచింది, నచ్చింది..మీరు సరిగ్గా అర్ధం చేసు కున్నారు..మరోసారి థాంక్స్ జ్యోతిర్మయి.
    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. మ్మ్.... చాలా బాగుంది. మీరు భలే చక చకా రాస్తారు :) అంటే ఫాస్ట్ గా అనే కాదు, మ్మ్...చాలా క్రిస్ప్ గా బొరు కొట్టకుండా ఇంకా చిన్న చిన్న కథలు.. బాగుంటాయి.

    రిప్లయితొలగించండి
  4. థాంక్స్ Ruth ..మీరిలాగా పొగుడుతూ ఉంటే..నేను నాకంటే పెద్ద గా అయిపోతాను,అంటే ఉబ్బి పోతాను..ఒక సారి, కీ బోర్డ్ టచ్ చేస్తే..పదాలు అలా దొర్లి పోతాయి..అవి తల లో నలిగి నలిగి ఉంటాయి, బయట పడి,ఊపిరి పీల్చుకుంటాయి. ఒన్స్ అగైన్ థాంక్స్..

    వసంతం.

    రిప్లయితొలగించండి