"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

19 అక్టో, 2011

అదితి..

అదితి అలసట గా ఇంట్లో కి అడుగు పెట్టింది.

అబ్బ ..ఆఫీస్ అయింది, ఇంక ఇంట్లో కి అడుగు పెడితే..హు..పని అంతా కళ్ళ ముందు కదిలింది.

ముందు ఒక కప్పు టీ పెట్టుకుంటాను..అనుకుని, ఆఫీస్ బాగ్ కొక్కేనికి తగిలించి, బెడ్రూం లోకి వెళ్లి, ఓ ఇంట్లో వేసుకునే సింపిల్  కాటన్ డ్రెస్ వేసుకుని,మొహం కడుక్కుని,వచ్చి టీ కోసం నీళ్ళు పడేసింది.

హరీష్ వచ్చేసరికి ఎంత రాత్రి అవుతుందో? హరీష్ కి ఎల్ ఐ సి లో పని.

ఇంట్లో పిల్లలు కూడా లేరు, ఇద్దరు స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్ కి వెళ్లి ఉంటారు.


వేడి, వేడి, గా టీ తాగుతూంటే హుమ్మ్  ..ఎంత రిలాక్సింగ్  గా ఉందో? ఆఫీస్ లో కూడా టీ తాగుతుంది ,ఇది ఇంటి మహత్యమే..ఇల్లు..ఆ ఫీలింగే వేరు.
అదితి బ్యాంకు లో ఆఫీసర్ ..బాధ్యత ఎక్కువే మరి.

సరే, ఇంక రాత్రి వంట సంగతి చూడాలి.అత్తయ్య ఉంటే,ఆవిడ సాయం కొండంత ఉండేది. ఆడపడుచు డెలివేరి కి సాయం గా యు ఎస్ వెళ్లారు.
ఇంతలో సెల్ రింగ్...

ఇంకెవరు? హరీష్..

ఏమిటి ఈ రోజు ఈ స్పెషల్ ..ఫోన్..పిలుపు.ఈ సమయం లో ..
అదితి..మై స్వీట్ డార్లింగ్..అంటూ..మొదలు పెట్టి, అప్పుడే మొదలు పెట్టలేదు కదా..ఇవాళ వంట వద్దు..నువ్వు ,పిల్లలు, చైనా బౌల్ కి వచ్చేయండి.

నో,నో,నేనేం వినను..తొమ్మిది ..షార్ప్..అక్కడే కలుద్దాం.

అదితి నిట్టూర్చింది. వంట తప్పింది అని ఏమంత సంతోషం లేదు, పదిహేనేళ్ళ సాహచర్యం లో అర్ధ మయింది..

హరీష్ నాకు ఇష్టం లేని పనులు ,నాచేత చేయించాలంటే ,ఇలాగే ఏదో సడన్ ప్రోగ్రాం వేస్తాడు.


అలసి పోయి ఉన్నాను అసలే..ఆఫీస్ పని తో, ఆడిటింగ్ ఉంటుందని,అందరం కష్ట పడుతున్నాం. ఎంత కష్టమైన ఈ ఉద్యోగం ఇలా చేస్తున్నాను అంటే ..నాన్న గారే కారణం.


చిన్న ఊరు బొబ్బిలి, స్కూల్ మాస్టారు,నలుగురు ఆడ పిల్లలు, కానీ ఏనాడూ ,బాధ పడుతోనో, బరువు అనో అనుకోలేదు. అందరి ని ఎవరికీ ఇష్టమైన చదువులు వారిని చదివించారు.


పెద్ద అక్క అపూర్వ డాక్టర్ ,రెండో అక్క అనన్య ఇంజేనీరింగ్ చేసి మంచి జాబ్, అమూల్య  మూడో అక్క..లెక్చరర్ ..తను ఆఖరిది ,అదితి..అందరం..ఒకే కొమ్మకి పూసిన చక్కని పుష్పాలు ..ఎవరి అందం, వారిది. ఎవరి చక్కదనం వారిది..


అందరం ఉద్యోగాలు చేస్తున్నాం..నాన్న కోరిక అదే.మేం ఉద్యోగాలు చేస్తూ,మా కాళ్ళ మీద మేం నిలబడాలని. ..జీవితం లో ,స్వతంత్రం గా బ్రతకడం చాలా అవసరం..అన్నట్టు ,ఎప్పుడూ మాటల్లో చెప్పక పోయినా,మా ఉద్యోగాల కోసం తాపత్రయ పడడం .ఎక్కడ వచ్చినా ఉద్యోగం మాతో ఉండడం ,పెళ్ళికి ముందు మాకు సపోర్ట్ అంతా.అమ్మ ..నాన్న లే.

నలుగురు పిల్లలం ఉన్నా,ఎక్కడ ఒక్క రెండ్రోజులు కన్నా ఎక్కువ ఉండరు, అందరం పెళ్ళిళ్ళు చేసుకుని, హాయిగా ఉంటున్నారు,నాకు ఇంకేం బెంగ లేదు అంటారు.


ఆరు నెలలు అయింది, అప్పుడే.అమ్మ నాన్న లని చూసి. ఎక్కడ ఊపిరి సలపని ఉద్యోగాల పని, పిల్లలు శిరీష ,శిశిర లు చదువులు, పరీక్షలు, ఏమిటో ఫోన్ లో మాట్లాడడం కూడా అవటం లేదు.


పోనీలే అమ్మ..అందరూ బాగుంటే..ఫోన్ లు ఎందుకు? అంటారు పైగా ..అమ్మ కి మా దగ్గర వచ్చి ఉండాలని ఉంటుంది, కాని ,నాన్నగారు అక్కడ ఊపిరి సలపని వాళ్ళ దినచర్య లో మనం భారమే కాని, ఏమి సాయం కాదు అని ఆపేస్తూంటారు.


ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం ,ఎన్నో పరీక్షలు రాసి, ఎంత మంది తో నో పోటీ పడి, సంపాదించుకుంది. కాని .ఏమిటో..ఒక్కోసారి, పిల్లల ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే బాగుంటుందా ? అని పిస్తుంది.


కాని, నాలుగు రోజులు సెలవులు వరుసగా వస్తే, మళ్లీ ఇల్లు ..ఇంటి పనులు విసుగు వచ్చేస్తాయి. బాబోయ్ ..నేను ఇంట్లో ఉండలేను, నా ఉద్యోగం నాకు చాల ముఖ్యం..అని అనిపిస్తుంది.


ఇంకా హరీష్, మంచి వాడే ,చాల సపోర్ట్ చేస్తాడు ,అన్ని బాగుంటాయి..కానీ,చిన్నపట్ట్నించి మగ వారే ఇంటికి ఆధారం అని పించే మాటలు, వాతావరణం లో పెరిగాడేమో, అప్పుడప్పుడు విసిగిస్తాడు. స్వార్ధమో, తన ఆధిక్యమో, ఏదో..ఇబ్బంది ..అనిపిస్తుంది.

ఏం చేయగలదు? తనే కొంచం అడ్జుస్ట్ అవుతూ, అప్పుడప్పుడు  వచ్చే ,చిన్న తగాదాల ,చిన్న  గొడవల వరకు మితం చేస్తూ..చాల మంది కన్నా నయమే కదా..మెల్లగా మారుతాడు అని సరి పెట్టుకుంటోంది.

ఇవాళ ,ఈ సడన్ ఔటింగ్ ఎందుకో, లీలగా నాకు అర్ధం అవుతోంది. వారం మధ్య లో..హుహ్..నాకు ఇలాంటి అన్ ప్లాన్డ్ ఔటింగ్ లు నచ్చవు.నువ్వు మరి లెక్కల మనిషి వి అని తేలిక గా తీసేస్తాడు.

పోనీలే, పిల్లలకి చినీస్ ఫుడ్ ఇష్టమే, నాకు ఇన్ని రకాల వంటలకి టైం ఉండదు, ఏదో హడావిడి గా పొద్దున్నే కుకేర్ పెట్టి, అన్నం, పప్పు, కూర చేస్తుంది, అంత కన్నా టైం ఎక్కడ ఉంటుంది?


సరే..లెమ్మని, తయారు అయి కూర్చుంది, పిల్లల కోసం ఎదురు చూస్తూ. ఇంకా పావు గంట లో వచ్చేస్తారు.


హరీష్ వాళ్ళది చాల పెద్ద ఫ్యామిలీ, ఒక డజను మంది కసిన్స్ ఉంటారు, వాళ్ళవి ఎప్పుడూ ఏవో పెళ్ళిళ్ళు, ఇంకేవో మొదటి పుట్టిన రోజులు అంటూ పిలుస్తారు. అన్నిటికి వెళ్ళాలి మనం అంటాడు.

నాకు ఎలా కుదురుతుంది ? నువ్వు వెళ్లి రా..అంటే చ..ఆడ వాళ్ళు లేకుండా ఫన్ క్షన్ లకి వెళితే పోతు పేరంటాలు అని వేళ కోళం చేస్తారు అంటాడు.

నాకు సెలవులు తక్కువ,బాధ్యత గల ఉద్యోగం. ఎంత బాగా ,చేసినా, ఆడ వాళ్ళు, చీరలు ,షోకులు అంటూ చీప్ గా మాట్లాడే మగ సహోద్యోగులు, ఎన్నని చెప్పను, ఇంట్లో ఇలాంటివి నేను చెప్పను అసలు.

ఈ నెల లో ,మాకు ఆడిషన్ ,చాల బిజీ ..ఈ నెల మధ్య లోనే ,హరీష్ కి ఎంతో ఇష్టమైన అక్క రజని అక్క కూతురు సంజన పెళ్లి.

యు ఎస్ లో చదువుకుని వచ్చింది సంజూ, మంచి అమ్మాయి. సరదా, అంటూ మూడు రోజుల పెళ్లి చేస్తున్నారు. రజని ,బావగారు కి ఒక్క అమ్మాయి. గ్రాండ్ గా పెళ్లి అంటూ ఆరు నెల నించి ప్లాన్ చేస్తున్నారు.

హరీష్ మూడు రోజుల ముందే వెళుతున్నాడు..సాయం ,మా అక్కకి అంటూ..నేను కూడా రావాలని, తన కోరిక..అతి కష్టం మీద రెండు రోజులు సెలవు కి మేమో పెట్టి ఉంచాను.

పిల్లలి కి సరదాయే, సంజు అక్క పెళ్లి, అని..

ఇంత బాధ్యత ఉన్న ఉద్యోగం లో ఎందుకు చేరనా? అని మొదటి సరిగా బాధ పడుతున్నాను. ఏ క్లెర్క్ అయిన అయి ఉంటే, ఒక లీవ్ లెటర్ పెట్టి వెళ్ళొచ్చు, కాని, ఆడిటింగ్ అయే టైం లో నేను బాధ్యత గల ఆఫిసుర్ గా బ్యాంకు  లో ఉండాలి.

హు..చూద్దాం ..ఏమవుతుందో?

ఇవే జీవితం లో పరీక్షలు.. అంతా పెద్ద పి . ఓ.పరీక్ష లో నే నెగ్గాను..ఇది దాట లేనా?

చైనా బౌల్ లో డిన్నర్ బాగా జరిగింది.

హరీష్ చాల ఖుషి మూడ్ లో ఉన్నాడు.హమ్మయా.నేను అనుకున్నట్టు ఏమీ కాదు లే అను కున్నాను.

రాత్రి, పడుకున్నాక వచ్చింది ..విషయం.

అదీ..."మా రజని అక్క ఇవాళ ఫోన్ చేసింది."

"ఈ పెళ్లి చాల ఘనం గా చేస్తున్నారు కదా కట్నాలు అవి లేవనుకో.. కాని బంగారం ధర పెరిగి పోవడం,నీకు తెలుసు గా పెద్ద గా బంగారాలు అవి కొనే లేదు సంజు కి, ఎమ్ ఎస్ చేయడానికి చాల అయింది."

"నీకూ తెలుసు గా.".అవును మా బ్యాంకు లోనే లోన్ ఇప్పించాను..

"ఇప్పుడు పెళ్లి ఖర్చులకి డబ్బు అనుకున్నట్టు సరిపోలేదు, మనం కొంత సర్దాలి, తరువాత మెల్లిగా తీర్చేస్తారు. "బావ గారు గుంటూర్ వికాస్ లో లెక్చరర్ ..

"ఎంత?" నా గొంతు లో వణుకు.

"అయిదు లక్షలు.."

నాకు ఒక్క క్షణం ..మొద్దు గా అయిపొయింది, అయిదు లక్షలా..ఇంత ఆర్భాటం గా మూడు రోజుల పెళ్లి ఎందుకు?? అని మళ్లీ నేనే, ఈ సినిమాల ప్రభావం తో, పిల్లలికి ఇలా చేయక పోతే నచ్చదు..

ఒకరిని చూసి మరొకరు, అందరూ ఇదే దారి, పెద్ద హోటల్, పూల అలంకరణ , అయిదు ,ఆరు పూటల భోజనాలు, భారి విందులు, మళ్లీ వచ్చిన వారికీ కానుకలు, బందువలకి బట్టలు, పెళ్లి వారికీ ఖరీదైన బట్టలు..అవుతాయి మరి లక్షలు.

"సరే ..ఎక్కడివి అంత డబ్బు.".మన దగ్గర అన్నాను..
సంవత్సరం క్రితమే ఈ కొత్త ఫ్లాట్ లోకి మారాం. లోన్ కాకుండా ఇంటీరియర్స్ చేయించ దానికి, మాకు నచ్చినట్టు..చాల ఖర్చు అయింది. ఇంకా ఎక్కడ ఉన్నాయి, నా జీతం..ఎక్కువే గాని, పిల్లల స్కూల్ ఫీజు, ఇతర ఖర్చులు, ఎక్కడకి పోతున్నాయో నెలకి లక్ష దాటుతోంది ఖర్చు, ఒక్కో సారి.హరీష్ జీతం లోన్స్ తీర్చడానికి సరిపోతున్నాయి..ఇల్లు, కార్ లోన్లు.

" నువ్వు నీ బ్యాంకు లో లోన్ తీసుకో.. పర్సనల్ లోన్.."

వడ్డీ రజని అక్క వాళ్ళు తీర్చేస్తారు..మా సేవింగ్స్ లో చాల తక్కువ నిల్వలు ఉన్నాయి అని నేను భయ పడుతున్న టైం లో ..ఈ అదనపు ఖర్చు.

ఏమిటో? బ్యాంకు లో అంత పెద్ద జమ ఖర్చులు బాలన్సు చేస్తాను గానీ, ఇంట్లో మటుకు, నా లెక్క ఎప్పుడూ తప్పు తోంది.

రజని అక్క అంటే నాకూ ఇష్టమే, ఎలా..సరే..చూడాలి..లోన్ దొరకడం పెద్ద కష్టం కాదు గానీ..నా పేరు మీద లోన్ అంటే నాకు కొంచం ఇబ్బంది గానే ఉంటుంది.

"పోనీ వాళ్ళే లోన్ పెట్టొచ్చు కదా..అంత టైం లేదు, మనం రెండు మూడు రోజుల్లో ఈ డబ్బు వాళ్లకి అంద చేస్తే, పెళ్లి పనులు చురుగ్గా సాగుతాయి."

చూద్దాం..నేను నా అకౌంట్ లో కొంత వెనక వేస్తూ ఉంటాను, చిన్న మొత్తాలు ఫండ్స్ లో పెడుతూ ఉంటాను, లోన్ లేకుండానే ఇవ్వ వచ్చు..కాని రెండు రోజులా..ఇంత తక్కువ టైం లో..

రెండ్రోజులు కాదు గానీ , ఒక వారం లో డబ్బు రెడి చేసి పంపించేం. హరీష్ చాల సంతోషించేడు, నా పరువు నిలబెట్టావు ..

అని చెయ్యి పట్టుకుని ..ఒకటే అభినందనలు,

"సరే, నువ్వు అనుకున్నట్టు అంతా అయింది, పిల్లలు నువ్వు వెళ్ళండి, నేను పెళ్లి రోజు కి వస్తాను, రాత్రి కి బయలుదేరి."

"మూడు రోజులు సెలవు, అంటే నేను చాల ఇరకాటం లో పడి పోతాను. చాల ముఖ్యమైన ఆడిటింగ్ జరుగు తోంది, నేను లేక పోతే అస్సలు బాగుండదు.రజని అక్క కూడా నేను ఫోన్ చేసి మాట్లాడ తాను ..ప్లీస్.
అర్ధం చేసుకో.."

హరీష్ ఒక్క క్షణం ఆలోచనలో పడినా ..తప్పదు ..అని అర్ధం చేసు కున్నాడు..

హమ్మయ్య ఈ సారికి, రజని వాళ్ళ అవసరం..నన్ను ఇలా ఆదుకుంది..
నా ఉద్యోగ నిర్వహణ లో ఇలాంటి ఇంకా ఎన్ని పరీక్షలో?

ఇవే జీవితం లో లెక్కలు.. ఈ ఆడిటింగ్ అయ్యాక ఒక వారం చివర ,ఒక రోజు అయిన సెలవు పెట్టి, మూడ్రోజులు బొబ్బిలి వెళ్లి అమ్మ నాన్నలని చూడాలి..అని నిశ్చయించు కున్నాక తెరిపి గా అనిపించింది.
అదితి హుషారు గా ఆఫీసు కి బయలు దేరింది..తేలిక అయిన మనసు తో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి