పసుపు , ఎరుపు, ఆకు పచ్చ రంగులు..అంటే ఏవో పువ్వులో,నచ్చిన రంగులో కాదు,మనం తిన వలసిన పళ్ళు, కూరల రంగులు ట. తూచి,తూచి, కాలోరీలు లెక్క పెట్టు కుంటూ తినాలి ట. కమ్మగా వాసన, మరింత కమ్మని రుచి ఇచ్చే నెయ్యి ,ఊరికే అలా వాసన చూసి, పక్కకి తోసేయాలి ట. నాలిక మీద జివ్వు మనిపించే పండు మిర్చి, కొత్త ఆవకాయల రుచి ఎప్పుడో ఏడాది కి ఒక్క సారి కి సరి ట.
చిన్నప్పుడు బ్రెడ్ అంటే జ్వరం వచ్చిన వాళ్ళకే..వాళ్ళు తింటూంటే, శుభ్రం గా కంచాలు కంచాలు లాగించిన వాళ్ళు కూడా..అమ్మా..మాకో బ్రెడ్ అంటే అబ్బ ..మీకెందు కే ..అది జ్వరం వాళ్ళకే అంటే..అబ్బ మాకెప్పుడు వస్తుందో జ్వరం..అని బెంగ వచ్చేది.
బ్రెడ్ కోసం జ్వరం రావాలని కోరుకునే అమాయక బాల్యం రోజులు అవి.ఇప్పుడు రోజూ టోస్ట్ చేసుకుని, సాండ్ విచ్ బ్రెడ్ తింటూంటే..అయ్యో ,అమాయకం గా ఎందుకలా అడిగే వాళ్ళం. తథాస్తు దేవతలు, ఈ కోరిక మటుకు తథాస్తు అని దీవించి తీర్చేసారు ,అనిపిస్తుంది నాకు.
అన్నం బరువు, తెల్లని అన్నం మరీ ను ట. ఎర్రని దంపుడు బియ్యం తిన వచ్చుట. అయ్యో,మా ఏలూరులో దంపుడు బియ్యం వాళ్ళు ..అదే వాళ్ళ ఇంటి పేరు అనుకునే వాళ్ళం.. ఎన్ని రోజులు తిన్నామో? అప్పుడు తెల్లని అన్నం అంటే ఎంత మోజో..వాళ్ళంతా ఏమయారో పాపం?
పాపం..ఏమయారో? అందరం తెల్ల బియ్యం కే అలవాటు పడి పోయాం.చిన్నప్పుడు గుజ్జన గూళ్ళు అంటూ, చిన్న కంచు గిన్నెల్లో, మా పిల్లల చేత అన్నాలు వండించి, తాటాకు బొమ్మల పెళ్లి చేయించే వాళ్ళు.
ఇప్పుడు అచ్చం అలాగే ,అంతే అన్నం తినాలిట.. వందో ,నూట యాభయ్యో గ్రాముల బియ్యం ట.
ఇప్పుడు అచ్చం అలాగే ,అంతే అన్నం తినాలిట.. వందో ,నూట యాభయ్యో గ్రాముల బియ్యం ట.
అలాగా కడుపు మాడ్చుకుంటేనే ఆరోగ్యం గా,వందేళ్ళు బ్రతుకుటాము ట.నేను చదివే పత్రిక ల లో కూలిన గోడలు సేరియల్స్, లేదా సెక్రెటరీ
సేరియాల్ ,తరువాత యండమూరి అభిలాష ,ఇలాంటి వి, ఉండేవి, కొంచం సినిమా
వార్తలు, కాని ,ఇప్పుడు పత్రిక తెరిస్తే, ఆరోగ్య నియమాలు, స్పెషలిస్ట్ ల తో సలహాలు, ప్రశ్నలు -సమాధానాలు, ఏదో ఒక డాక్టరు చేత, అది కాక ,ఏదో ఇంగ్లీష్ మాగజిన్ నించి తస్కరించి
రాసిన స్పినాచ్ యొక్క ప్రాముఖ్యం వంటిట్లో అని, ఈ స్పినాచ్ అంటే ఏమిటో ,అని
ఎప్పుడూ ఒక రహస్య సందేహం..నాకు అయితే..తోట కూరా, పాల కూరా..ఏదో
ఒకటి ఆకూ కూర అని సర్ది చెప్పుకోవడం..
ఇన్ని ఆరోగ్య సమస్యలు, సలహాలు, షుగర్ వ్యాధి వారు తీసు కో వలసిన జాగ్రత్తలు,
బీ.పి..వారు తగ్గించాల్సిన ఉప్పు, ఇలాంటి ఎంతో సమాచారం కో కొల్లలు గా ,నాలుగు వేపులా..
ఓహో ,అందరూ పాటించేస్తున్నరు ,మనమూ పాటించాలి..అనుకుని మంచి రోజు
చూసుకునే టైం కి, ఒక వార్త కనిపించింది.
అన్నం తినే వాళ్ళు భయపడ కుండా తినేయండి, పిండి పదార్ధం లు కూడా మంచి వే..అని..
ఇలా కాదు అను కుని, డాక్టర్ సలహా కోసం వెళితే ఆ హాస్పిటల్ లో ఇసక వేస్తె
రాలనంత మంది జనం. ఇదేమైన సినిమా హాల్ ఆ అనిపించేలా?
ఏమిటి ,మరి ఈ సలహాలు ఎవ్వరు పాటించటం లేదా? ఎడ పెడ రాస్తున్నారు కదా.ఏమిటి ఇన్ని రోగాలు? కానీ విని ఎరగనివి?
చిన్న పిల్లలికి ,పెద్ద వాళ్లకి అని లేదు..
ఎక్కడ వచ్చిందో ఈ తేడా?
అమ్ముమ్మ , అమ్మ లాగ, శుభ్రం గా రెండు పూటలా..అన్నం,పప్పు,పప్పు లోకి నెయ్యి, కూర, కూర లోకి నూనె, పులుసు, పచ్చడి, మజ్జిగ..ఇలా సమస్త రుచులతో అన్నం తింటే..అన్ని సమస్యలు సర్దు కుంటాయా?
లేక ,ఇలా ఒక కంప్యుటర్ ,ఒక టీ వి. ముందు నించి కదిలి పనులు చేస్తే సర్దు కుంటుందా ఆరోగ్యం..అని ఆలోచన .. వచ్చింది.
చెప్పుచేది ఏమిటంటే..అన్నం పరబ్రహ్మ స్వరూపం..
ధైర్యం గా లాగించేద్దమా కంచం కంచం డు..కంది పొడి అన్నం విత్ ముక్కల పులుసు కి జై, గోంగూర పచ్చడి అన్నం విత్ ఉల్లిపాయ కి జై, ఆవకాయ విత్ నెయ్యి, అన్నం కి జై.ఆఖరి గా చిక్కని పెరుగు అన్నం లో, మాగాయ ముక్క కి జై..
అందుకే..అన్నం పర బ్రహ్మ స్వరూపం..అని ఎప్పుడో చెప్పేరు..
అంటూ లేచాను, నా రెండు పుల్కాలు, చించి, గోదావరి లో పడేద్దామని..ఏమో..పెద్దల మాట చద్దన్నం మూట..అని కూడా అన్నారు, టోటల్ గా ఈ రోజు మటుకు ,నేను అన్నం కే నా ఓటు..
రేపటి సంగతి ఆలోచించుదాం.
అన్నమొద్దని ఆ అన్నవాడిని పట్టి
రిప్లయితొలగించండికాలుసేతులుకట్టి గట్టిగాను
ఎదురుగా కూర్చుని
వేలిసందుల మాగాయపచ్చడి పసందుగా
కంచాలు లాగించ కలలు వచ్చె...
సరే..ఆ చేత్తోనే..ఫర్వాలేదు అంటు అయినా..ఒక హాయ్ ఫైవ్ ఇవ్వండి లలిత..జి.. అన్నం ముందు అన్ని దిగ దుడుపే..అన్నం సాక్షిగా చెప్తున్నా..ఈ మాట..
రిప్లయితొలగించండివసంతం.
అన్నం ప్రాముఖ్యత గురించి చక్కగా చెప్పారు...
రిప్లయితొలగించండినిజంగా అన్నం ఎంత తిన్నా ఏమీ కాదండీ.....
ఊరికే ఈ జనాలు ఇష్టమొచ్చినట్టు రాసేస్తారు కానీ....
థాంక్స్ Maddy గారు..నా అన్నం బ్లాగ్ కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటోంది. ఇంత మంది ఉన్నారా? అని నాకు సంతోషం గా ఉంది..అన్నం జిందాబాద్..
రిప్లయితొలగించండివసంతం.
మా చిన్నప్పటి విషయం. మాది చాలా పేద్ద కుటుంబం. మా నాన్నగారు యెప్పుడైనా సరదాగా 'ఇవాళ చపాతీలు' అనేవారు. ఇక చూస్కోండి. బోలెడు చపాతీలు చేసి అందరం హాయిగా వెరైటీ భొజనం చేసే వాళ్ళం అన్నమాట (దానికి ముందు మా అమ్మగారు, బామ్మగారూ గంటలతరబడి చపాతీ ఫ్యాక్టరీ నడపాల్సి వచ్చేదనుకోండి, అది వేరే సంగత). చెప్పొచ్చేదేంటంటే, అంతా చపాతీలు ఊదేశాక, మా అమ్మగారు 'ఇంక మజ్జిగా అన్నం' అనే వారు. యెవరైనా పొరబాటున కడుపు నిండి పోయిందంటే, 'అన్నం తినకుండా కడుపు నిండటమేమిటీ' అని గదమాయించేవారు. అన్నం అన్నమే. అది తినక పోతే ఆ భోజనం అసంపూర్ణమే.
రిప్లయితొలగించండిశ్యామలీయం..నమస్తే అండి, మిమ్మల్ని కలుసు కోవడం ఇలా, బాగుంది. అవును, ఎన్ని చపాతీలు తిన్నా,అన్నం కి సరి రాదు. నా బ్లాగ్స్ చదువుతున్నందుకు..చాల సంతోషం.
రిప్లయితొలగించండిమన తెలుగు వాళ్ళం మరీ..ను. మనం అన్న ప్రానులం.
వసంతం.