"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

23 అక్టో, 2011

చిత్రాలకే చిత్రం..సినిమాలకే సినిమా

దూకుడో, మూకుడో తేల్చుకొమ్మని, అంటే, సర్వ జనం అలా సమ్మె లు చేస్తూంటే, నేను మటుకు ఎందుకు వెనకబడి పోవడం..అని వంటింటి టూల్స్ అంటే, మూకుడు ముట్టనని సమ్మె చేసిన సరే, ముప్ఫై రోజులు కాదు ,నలభై రోజులు చేసినా మాకు ఒక్కటే..అని కేంద్రం..తేలిగ్గా..చులాగా ,కేరేజాట్ అని తీసి పడేసినట్టు..గా మా ఇంట్లో కేంద్రం కూడా..అలానే..కాని, రేపో..మాపో..అని నిర్దుష్టం గా ఏమి సమాధానం చెప్పకుండా ,అలా దాటేస్తూంటే ఆ సినిమా మా ఊరు నించి దూకేసింది..

సరే లెమ్మని, ఆ దుఖం మరిచి పోడానికి, ఏవో రకరకాల బ్లాగ్స్ చదువుతూంటే, ఎప్పుడూ నావే చదువుకుని ఎంతని మురిసి పోతాను? అని..అప్పుడప్పుడు నాకే ఏదో జ్ఞాన బోధ దానంతట అదే అయిపోతూ ఉంటుంది మరి..
దూకుడు లో డైలోగ్స్ అని ఎవరో రాసి, పుణ్యం చేసుకున్నారు..నా బుర్రలోంచి దూకుడు దెయ్యం కూడా దెబ్బకి వదిలింది.
అవేమిటి ..రకరకాల తిట్లో, ఇంకా మాటాడితే నేను రాయలేని, మాట్లాడ లేని ......ఇలాంటి భాష ని పెద్ద పెద్ద స్టార్స్ చేత పలికించి, జనం ని ఎంత వెర్రి వెంగలయాలని చేస్తున్నారో?
నా జీవితం లో నేను ఎప్పుడూ ఇలాంటి భాష వాడలేదు, నా చుట్టూ ఉండే నలుగురో, పది మందో, కూడా ఇలాంటి భాష వాడడం నేను ఎరగను.
మా ఇంట్లో మొత్తుకుంటూనే ఉన్నారు, మిస్సమ్మ..మాయాబజారు, వెలుగు నీడలు, పెళ్లి నాటి ప్రమాణాలు, నర్తన శాల ఇంకా ఇలాంటి ఎన్నో మంచి,మంచి ఆణిముత్యాల లాంటి సినిమాలు ఇష్టపడిన నువ్వు, ఏమిటి ఇలా భాష మార్చేసి, పోకిరి, ఊసరవెల్లి, యముడు, మొగుడు, దూకుడు..ఇడియట్, వెధవ అంటూ ఇలా తిట్ల పురాణం లోకి దిగావు అంటే, నువ్వు స్వీట్ హోం లో బుచ్చి బాబు వి, నీకు తెలిదు, ఇప్పుడు అన్నీఇలాంటివే వస్తున్నాయి మరి మారుతున్నకాలం తో మనం మారక పోతే ఎలాగా అని ఇన్ని రోజులు, దబాయింపు స్వరం తో నెట్టుకు వచ్చాను.
ఎంత పొరపాటు చేసాను? అని ఈ రోజు..చాల బాధ పడుతున్నాను , ఏ సినిమా విడుదల తీస్తే అది చూసేయక్కర్లేదు కొంచం మన విచక్షణ చూపించి, ప్రమాణాలు నిలపాలి అని చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉన్నారు..ప్రిన్స్ , నాగ్..అంటూ నేనే ఏదో భ్రమ లో కొట్టుకు పోయాను.
అయినా ఏ సినిమా చూసినా ఏమున్నది..స్టొరీ, అదే స్క్రీన్ ప్లే ఆర్ ట్రీట్మెంట్ ..ఒక హీరో..సకల గుణాభిరాముడు, కాని, భాష చూస్తే వర్స్ట్. తను మటుకు తానూ,మొదటి చూపు లోనే హీరోయిన్ ని చూసి, కాలేజ్ అయితే ఒక టీసింగ్ సాంగ్ తో ఎంట్రి..ఆ పై, నాలుగు సీన్ల తరువాత విలన్ ఎంట్రి, ఇద్దరూ తాగుతారు, క్లబ్లు కి వెళతారు..కాని, ఏమిటో..హీరో అనేసరికి అన్నీ దురలవాట్లు..హీరోయిన్ తో ఓ సాంగ్ వేసుకునే సరి కి సరి అయిపోతాయి..కాని, విలన్ మటుకు నలుగురు చిన్న చితక , చింపిరి మొహం వేసుకుని ,దెబ్బలు తినడానికి రెడి గా ఉండే వారితో, చివర వరకు తిరిగుతూ ఉంటాడు.
ఎందుకైనా మంచిది, సరిగ్గా చూడండి, వీళ్ళల్లో ఒకడు, హీరో అయిపోతాడు, గబుక్కున..
ఇంకా ఎప్పుడూ, హీరో చేత ఎప్పుడు పడితే ,అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తింటూ..కుయ్యో మొర్రో మంటూ ఉంటాడే అతనే జోకర్..సారీ ..హాస్య నటుడు..
లేదా.. కుళ్ళు జోకులు చెపుతూ ,కాలేజ్ లో విద్యార్ధుల అపహాస్యానికి బలి అయే వాడూ ఒక హాస్య నటుడే..
ఇంకా పిడికిలి బిగించి ఒక్కటి ఇస్తే ...ఓ అర మైలు దూరానికి వెళ్లి పడితే..వాడే పాపం ఒక విలను..ఇంక హీరో గారు ఒక్కటి ఇస్తే ,రక్తం, అన్నీ వేపులనించి ఫౌంటెన్ లా జిమ్ముతుంది..
నేను అసలే రక్తం చూస్తే ..కళ్ళు తిరిగే టైప్..అలాంటిది, పెద్ద పకోడీ పొట్లం లోంచి పాప్ కోరన్ ని నమిలి, నమిలి, మింగేస్తూ..ఒక్క క్షణం కళ్ళు మూస్తే ..ఎన్ని రక్తాల ఫౌంటెన్ లు మిస్ అవుతానో, అనుకుంటూ మైమరచి చూస్తోండడం..
అబ్బా..ఇదేమిటో..ఇలా మారిపోయాను..
పోనీ,డ్యూయెట్ లు ఏమైనా బాగుంటాయా?అంటే..ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు..పాపం ఆ హీరోయిన్ తో బాటు, పాట లోని మాటలని, నమిలి మింగేస్తూంటాడు ..ఎక్కడికో, మారిషస్సో, ఇటలీ యో, అమెరికయో వెళ్ళే , పాపం ఆ హీరోయిన్లు నిర్మాతలకి భారం ఎందుకని, చిన్న, చిన్న,కర్చీఫలే డ్రెస్ లు గా వేసుకుని..ఎంత సహకరిస్తారో.
ఇంక హీరోయిన్ ఎన్ని సాంగ్స్ వేసుకున్న ఫర్వ లేదు, హీరో గారి చెల్లెలు, ఎవరినైనా ఒక్క చూపు చూసి, మనసు పడేసుకొనే లోపే, హీరో ..అన్నయ్య గా మారిపోయి వీరంగం ఎక్కి, పరువు ప్రతిష్ట అంటాడు..
నాకు అర్ధం కానిది అదే హీరోయిన్ అన్నయ్య అంటే..పాపం విలన్ అయిపోతాడు..ఇంక రివెంజ్ లేనిదే ఒక్క సినిమా నడవదు.
ఎంత ఎక్కువ గన్ ఫైట్స్, ఎన్ని శవాలు, ఎన్ని ఎతైన బిల్డింగ్ నించి గ్రావిటి సూత్రం తల్ల కిందులు చేసే జుంప్స్, ఎంత లాంగ్ చేసిన్గ్స్, ఎంత హీన మైన విలన్ డెత్ లు, ఎన్ని సార్లు హాస్య నటులు తన్నించు కున్నాడు..ఇలాంటి లెక్కల మీదే ..సినిమా విజయాలు ఆధార పడి ఉన్నాయి..
వీటన్నిటి తో, విసిగి వేసారి, నాని లాంటి చిన్న హీరోల సినిమాలు, నెమ్మదిగా వంద రోజులు ఆడేస్తున్నాయి.
ఈ మధ్య చూసిన అలా మొదలయింది..ఎంత హాయిగా ఉందో?
పెద్ద కత్తులు, గన్నులు, గోడ్డళ్ళు .ఏరులుగా ప్రవహించే రక్తాలు..బాబోయ్..వీటికి మమ్మలిని అలవాటు చేయకండి..అని జనం సుతి మెత్తగా చెపితే వినరు..వినటం లేదు..
చెత్త భాష, చెత్త సినిమాలని..వెనక్కి పంపించండి..శత దినోత్సవాలు, పండగలు అంటూ నెత్తి కి ఎక్కించుకోకండి ప్లీస్..
మన పిల్లలు ఎవరైనా..తోలు తీస్తా, వంచుతా గుద్దుతా..గిద్దెడు రక్తం కక్కిస్తా..ఏమే ..ప్రేమిస్తావా ,చస్తావా?? నీ తాట వలుస్తా...ఇంక..నాకు వీలు కాదు రాయడం..ఇలాంటి మాటలు అంటారా? అంటే మనం సహించ గలమా?
అమ్మా..తెలుగు సినిమా ఆ ..అమ్మో వద్దు అమ్మా..అని పారిపోయే మా పిల్లలిని ,కాదు రా ,ఇది బాగుంది, రా కలిసి చూద్దాం  అని గలిగే ఒక్క తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందో..
ఈ లోగా ,మధ్యాన్నమో, అర్ధ రాత్రో వచ్చే ..మిస్సమ్మ సినిమా ముందు కూర్చో బెట్టి, పళ్ళెం లో పకోడీలు వేసి, అబ్బ..ఎన్ని సార్లు అమ్మా అంటే..ఊ .ఈ సారి ..ఒక్క మాట కూడా మాట్లాడని బాలకృష్ణ ,అదే ది గ్రేట్  డెఫెక్టివ్ అనబడే గ్రేట్ డిటెక్టివ్ నాగేశ్వరావు అసిస్టెంట్ ని చూడరా, ఎంత బాగా చేసేడో, చిన్న పెన్సిల్ పట్టుకుని ,అన్నీ ఎలా ఎక్కిస్తాడో చూడు.చూడు..అంటూ కడుపుబ్బా నవ్వే నన్ను చూసి, కిందటి సారి సావిత్రి అందం, నటన చూడ మన్నావ్..అంతకు ముందు ఎన్టీఅర్ నటన ,అందం చూడమన్నావ్..అంతకు ముందు ఎస్వీఆర్ జమున..అబ్బాబా..అన్నీ కలిపి ఒక్కసారి చూడొచ్చు  కదా..
ఊహూ ..అదేరా.మాస్టర్ పీస్ అంటే..ఎన్ని సార్లు చూసిన విసుగు రాదు, ఇది సినిమాకి టెక్స్ట్ బుక్, ఇది..గొప్ప..అంటూ మాటల కోసం వెతుక్కుంటూ ఉంటే..చిత్రాలకే చిత్రం..సినిమాలకే సినిమా..అంటూ ముగించేడు.
సరే ,ఇంతకి దూకుడు..దగ్గర కి వద్దాం..లెంపలు ఘాట్టిగా వేసుకుని, ఒక దణ్ణం పెట్టి, గులాబ్ జామ్‌  నైవేద్యం సమర్పించుకుంటాను..ఇంట్లో..నా ..దాసుడి తప్పులు దండం తో సరి ..అనేసారా  మీరు కూడా...

5 కామెంట్‌లు:

  1. మీరు లెంపలేసుకున్నామంటున్నారు కానీ మా పట్టణంలో దూకుడు సినిమా సూపర్ హిట్ అంటూ పెద్ద ఫ్లెక్సీ మీద వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  2. అంతే నండి ఎవరి ఖర్మ వారు అనుభవించాల్సిందే, ప్రవీణ్ శర్మ గారు,నేను నా చెంపలు నేనే వేసుకున్నాను..గాని.అందరిని అని...అన లేదు..
    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. ఇందాక పని మీద రైల్వే స్టేషన్‌కి వెళ్తోంటే బస్ స్టాండ్ దగ్గర ఫ్లెక్సీ కనిపించింది. దూకుడు సినిమా హిట్ ఆఫ్ ది సెంట్యురీ అని ఫ్లెక్సీ మీద వ్రాసి ఉంది. ఇక్కడ ఇంత నెగటివ్ టాక్ ఉంటే అక్కడ హిట్ ఆఫ్ ది సెంట్యురీ అని వ్రాసుందేమిటా అని ఆశ్చర్యపోయాను.

    రిప్లయితొలగించండి
  4. :-)

    వెర్రి వెయ్యి రకాలనీ...

    మళ్ళీ అలాంటి సినిమాలు అంటే కష్టమేనని చెప్పను కానీ ఎవరు తీస్తారు చెప్పండి.....

    చూసేవాళ్ళు ఉండరు అంటారు... మరి మనమంతా ఎవరమో......

    రిప్లయితొలగించండి
  5. థాంక్స్ Maddy గారూ.ఎందుకు ఉండరు ,మంచి సినిమాలు చూసే వారు. కానీ, సినిమా ఒక వినోదం అని 100%

    నమ్మి ,మనకి వినోదం, వాళ్ళ కి, కాసుల గలగలలు.

    శ్రీకారం లాంటి మంచి ,ఆలోచన కలిగించే సినిమాలు ఎంత మంది చూసి ఉంటారు?

    మనకి కావాల్సింది ఇదే అని చెప్పి, నెమ్మదిగా పాలు లాంటి విషాన్ని తల కి ఎక్కిస్తున్నారు.

    హీరో లే హాస్యాన్ని పండించేస్తున్నారు..ఏమిటో? అందరూ పడి పడి, చూస్తున్నారు ఏమిటో? అని మనమూ ఓ లుక్ వేస్తాం..అది సంగతి. మందే పండి ని నంది ని చేస్తుంది.

    వసంతం.

    రిప్లయితొలగించండి