కమల ..ఏదో నలత గా ఫీల్ అయి , మధ్య రాత్రి లో లేచింది, మాధవ్ ని లేపింది, అతను లేచి, ఒంటికి పట్టిన చమటలు అవి చూసి, వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు..
ఒక్క గంట లేట్ అయినా మీకు దక్కేది కాదు..మీకు..అన్నారు డాక్టర్లు.
పది రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చింది.కమల.
ఇల్లంతా దుమ్ము పట్టి ఉంది.ఆడ వాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుంది?
ఎక్కడ మొదలు పెట్టి చేయను? ఈ ఇంటికి..
ఎంత చేసాను? ఈ ఇంటి కోసం.
కమల ఇల్లు అద్దం లా పెట్టుకుంటుంది,కమల కి రాని విద్య లేదు..పిల్లలని ఎంత బాగా పెంచింది? ఇద్దరు పిల్లలు బాగా సెట్టేల్ అయారు..
ఇంకేమిటి ? కావాలి..
అందరూ అనే మాటలు ఇవి.
కమల మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది.
కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకా పనులు అవి చేయొద్దు అని చెప్పేరు, ఈయనే అలా చెప్పించేరేమో కూడా..లేక పోతే నేను ఊరుకోను అని.
ఒక్క రోజు కూడ రెస్ట్ తీసుకోలేదు, ఒక తల నొప్పి లేదు, ఒక జ్వరం లేదు, తనది మంచి ఆరోగ్య మైన శరీరం. ఇప్పుడేంటి? ఇలా..రెస్ట్
అంటారు. సరిగ్గా మొన్నే యాభై ఏళ్ళు నిండాయి.
ఓ గంట పడుకుని ,ఇంకా అలా మంచం మీద పడుకుంటే కష్టం ..చ..మరీ పేషెంట్ లా ఉన్నాను.అయినా నాకు ఇప్పుడేమయింది?
అనుకుంటూ లేచింది.ఇల్లంతా నిశ్శబ్దం గా ఉంది, పిల్లలిద్దరూ అమెరిక లో.ఈయన ఆఫీసు కి వెళ్ళారు ,ఈ వేళె..ఎన్ని రోజులు సెలవు పెట్టి కూర్చుంటారు. ఇంట్లో?
ముందు గది లోకి వచ్చి,సోఫా లో కూర్చుని న్యూస్ పేపెర్ తీసింది, ఏమిటో మనసు కుదర లేదు. పొద్దున్నే ఏదో కూకెర్ పెట్టి, అన్నం వండి వెళ్ళేరు మాధవ్, తనని ఏదో కొంచం వేడి చేసుకుని తినేయ మన్నారు.
ఏమిటో ఆకలే వేయటం లేదు..చారు అన్నం ఒక్కటే తినాలని ఉంది, ఆ మందులకి నాలుక చేదు గా అయి పోయింది.
అలసట గా సోఫా లో తల వెనక కి వాల్చింది..గోడ మీద తళ తళ మెరుస్తూ, తాన్జూరు పైటింగ్ ..ఎంత శ్రమ పడి నేర్చుకుంది ..ఇంతేనా ,ఆ మూల పెట్టిన ఫ్లవర్ వాస్ ..చక్కని వాస్..పోటేరి క్లాస్ కి వెళ్లి, మట్టి కుండలు కి రంగులు వేయడం..చక్కని పూల తో అలంకరించడం అన్ని నేర్చుకుంది..ఆఖరికి అందులో అలంకరించిన పువ్వులు కూడా..తను తయారు చేసినవే..
ఇంట్లో ఏ మూల చూసినా తను చేసిన అందమైన వస్తువులు కనిపిస్తాయి.పిల్లల కోసం బేకింగ్ నేర్చు కుంది, పుట్టిన రోజు కేకు ఇంట్లో నే తయారు చేసి ,అందరిని ఆశ్చర్య పరిచేది.
కమల అంటే..అమ్మో ..ఎంత పని మంతు రాలో అనిపించు కుంది. పని వాళ్ళ తో పని చేయించడం లో ఆమె తరువాతే అనిపించు కుంది.
పిల్లల పరీక్ష లని, వాళ్లకి ఇబ్బంది అని, ఏ పెళ్లి పేరంటాలకి వెళ్ల లేదు, నువ్వు లేకుండా నేను ఒక్కడిని ఎందుకు అని మాధవ్ కూడా బద్దకించడం..అలా చుట్టాలు తో సంబంధాలే తగ్గి పోయాయి.
ఎలా ఉన్నావు అమ్మా..అని పిల్లలిద్దరూ దూరాల నించి ఫోన్లు చేసారు..రామా ? అమ్మా..అని అడిగేరు..ఇద్దరి మంచి బిజీ టైం ...అని నాకు తెలుసు, పరీక్షలు, తేసిస్ చివరలో ఇంకొకరికి..
ఇప్పుడు వస్తే..అంతా వృధా అవుతుంది..ఏం లేదు..అంతా బాగానే ఉంది..అని సర్ది చెప్పింది.
మాధవ్ కూడా ,ఫర్వాలేదు అమ్మకి అని నచ్చ చెప్పేడు..పిల్ల లిద్దరికీ.వస్తాం అనే అన్నారు..
మెల్లగా లేచి, వంటిట్లో కి వెళ్ళింది కమల.
విశాలమైన వంటిల్లు, తామే దగ్గరుండి కట్టించుకున్నారు. ఒక పక్క పెద్ద ఫ్రిజ్, మరో పక్క ఎల్ షేప్ లో గట్టు..వాటి మీద మిక్సి , గ్రయ్ న్డేర్ , ఓవెన్ , ఒక వేపు,తళ తళ లాడే స్టీలు గిన్నెలు, అన్ని ఎంచి, ఎంచి కొన్నవే..
నాకు కావల్సింది ఇవాల్టికి కాసింత చారు అన్నం..ఎవరైనా దగ్గరుండి వడ్డిస్తే బాగుండును అని పిస్తోంది.
ఫ్రిజ్ లో మంచి నీళ్ళు తెచ్చుకుని కూర్చున్నాను.
నా చిన్నప్పటి స్నేహితురాలు గుర్తు వచ్చింది..వసుధ, అమెరిక లోనే ఉంటుంది.ఇండియా వచ్చిన ప్రతి సారి చెప్పేది.
"కమలా..నువ్వు ఎంతో విలువైన సమయం ఇంటి మీద పెట్టేస్తున్నావు. ఇల్లు శుభ్రం మంచిదే కానీ, నువ్వు నీమీద కూడా కొంచం శ్రద్ధ పెట్టు.పిల్లలు, భర్త..అందరూ ముఖ్యమే కానీ, ఎంత వరకూ? నువ్వే నీ గురించి ఆలోచించక పోతే, ఇంకెవరూ ఆలోచించరు..నువ్వు ఏదో ఒకటి ,బయటకి వచ్చి పని చేయి, డబ్బు కోసం కాదు..నీ తృప్తి కోసం.."
అని చిలక్కి చెప్పినట్టు చెప్పింది.
ఏమిటో? ఈ వసుధ, సమాజం..సేవ, ఇల్లు తరువాతే కదా,అని నవ్వు కునేది. తన కి ఎంత గర్వమో, అందరూ కమల నిజం గా సూపర్ భార్య,సూపర్ అమ్మా అని..
అబ్బ ..ఏమిటో, నీరసం గానే ఉంది. ఆ అన్నం కూడా ఇప్పుడు వేడి చేసుకుని తినడం కష్టం గానే ఉంది..ఒంటరితనం ఎంత భయంకరం..
నేను సేవ చేసిన ఈ ఇల్లు, ఈ సోఫాలు, ఈ అలంకరణలు, ఈ వంటిట్లో స్టీల్ సామాన్లూ, ఈ బీరువాల నిండా ఉన్న బట్టలు, ఈ నగలు..
నాకు ఒక్క పూట భోజనం పెట్టవేమిటి?
నాకు తోడూ..నాకు మాట సాయం..నాకు సపోర్ట్ ..ఎక్కడుందో ..నాకు తెలుసు. ఎప్పుడో మర్చి పోయిన నా ప్రియ స్నేహితురాలి కి ఫోన్ చేస్తాను ఇప్పుడే..ఎన్ని సార్లు పిలిచింది, ఒక్కసారి మా ఇంటికి రా..నువ్వు బయట పడాలి కమలా..లేక పోతే నీకు ఒంటరి తనం ,ఒక రోజు తప్పదు అని.
కమల ఇక నించి..నా జీవితం నా చేతి లోకి తెచ్చు కోవాలి అని నిశ్చయించు కుని , స్నేహితు రాలు రమ్య కి ఫోన్ చేయ డానికి ...లేచి నిలుచుని ..కుప్ప కూలిపోయింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి