"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

12 అక్టో, 2011

అతడు..అతడే..

హు..చేతిలో పేపర్ కింద
పడేసి,గడ్డి పరక  తో మాట్లాడే
చివరికి మిగిలేది దయానిధి లా
మళ్లీ హు..అని నిట్టూర్చాడు.

హు..అని నిట్టూరిస్తూ మళ్లీ,ఇదే
నా భాష అయిపొయింది,ఈ
నిట్టూర్పులే, నా భాష, అయింది,
అనుకుంటూ టీ వి. రిమోట్ అందుకున్నాడు.

ఒక మాట అంటే మరో మాట గా
మారుస్తుంది,మాట్లాడితే ప్రేమ
పోయింది అంటుంది,అదేమైన
జ్వరమా నాలుగు రోజుల్లో

పోడానికి, గట్టిగ పట్టిన చెయ్యి,
ఎప్పటికి విడనని పట్టుకున్న చెయ్యి,
ప్రేమ అన్నం పెట్టదు కదా,ఉద్యోగాలు
తప్పవు కదా, ఉద్యోగాల్లో, అవస్థలు

నువ్వు ఉద్యోగం చేయి,నీకు తెలుస్తుంది,
అంటే పిల్లలు చిన్న వాళ్ళు,నాకు ఇంట్లో
నే బోలెడు పని ,అది చాలు అంది,మరి
నా బాధ ఎలా చెప్పను?

ఆదివారం వస్తే,బయటకి,అంటే,బాబోయ్ ,
సిటీ ట్రాఫిక్, లో నడపడం మాటలా?
నాకు ఇంట్లో కూర్చుని ,హాయిగా టీ వి
ల లో, వచ్చే నాన్ సెన్స్ అంతా చూస్తో

ఉండాలని, పిల్లలతో  ఆడుకోవాలని,
ఇంట్లో ఆమె వండే బిర్యాని ,తినేసి,
మంచం ఎక్కేయాలని, అంటే పూర్తి గా
సెలవు అంటే సండే ..లా గడపాలని.

ఆమె కి రోజు వంటలు వండి,వండి,
ఆ రోజు వంటింటికి సెలవు చెప్పాలని
ఉంటుందని నాకు తెలుసు, పిల్లలు
కూడా ,బయటకి వెళదాం అంటే

ఎగిరి గెంతుతారు కూడా,పార్కులు
జూలు, గుడులు,కొత్త ప్రదేశాలు 
అన్ని అయిపోయాయి కదా?
ఇంకా ఏమున్నాయి కొత్తవి?

ఇల్లే పదిలం అని నేను ఒక్కడినే 
ఒక పార్టి, ఏమో ,ఇంట్లో అంత అలసి 
పోతావు,బయట తిరిగి కూడా అలసటే 
కదా,ఏమిటి నీ పంతం..అంటే ఈ 

మగవాళ్ళు కి ఎప్పటికి అర్ధం కాదు,
మా మగువుల మనసు అని ఒక 
లుక్ ఇస్తుంది, మా మగ వాళ్ళ కి 
హుహ్..మనసే లేదు అని ఎప్పుడో

అయిపొయింది తీర్మానం.  ఏమని
చెప్పను ,మా కష్టాలు? నీవీ కష్టలేన?
ఎప్పుడు నీదే పై చేయి కదా? ఏది ఆ
పై చెయ్యి చూపించు ఒక్కసారి,

అంటే ,మీరు చాల తెలివైన వాళ్ళు,
ఒప్పుకున్నారు కదా..అలా కాదు,
ప్రేమ.అనే ఒక్క బలహీనత ని
ఎంత బాగా వాడుకోవాలో

మీకు తెలిసినట్టు ,మరి ఎవరికీ
తెలియదు అని మరొక అభియోగం,
ఏమో ..ప్రేమ అంటూ ఏవో మాటలు ,
మంత్రాలు వేయడం మాకు రాదు,

ఆమె ఒక్క కన్ను సైగ తో ,
నన్ను అదుపు చేస్తుంది
అని చెపితే ,మూతి విరుపు
ఒకటి, ఏమో మా మగవాళ్ళ

కష్టాలు, తోటి మగవాడి కే
తెలుస్తుంది, ఆదివారం.ప్రశాంతం
గా గడుపుదామంటే ఎంత గొడవ
అయిందో? సతీష్ మళ్లీ ఫోన్,

ఒరేయ్, సినిమా వద్దు లే పోనీ,
మన మాధవ్ వచ్చాడు రా,
యు ఎస్ నించి, మంచి ఫారెన్
విస్కీ రా..అంటే, మరి నేను లేచి

పాంటూ,షర్టు వేసుకోనా?
ఒక్కసారి ..రా ..ప్లీస్ రా..
అంటూ బ్రతిమాలి ,కాళ్ళు
పట్టుకుని ,బయట పడ్డాను..

మగ వాళ్ళ ఏమి పెద్ద
త్యాగాలు చేయక్కర్లేదు,
మా లాగ ,సంసారాలు కోసం
అంటుంది ఆమె, ఏమో,

ఈ రాత్రి కి అన్నిటికి
ఒప్పెసుకోవడమే.అదే బెటర్,
అతడు ..ఎప్పటికి అతడే.
అని ఏదో అంటుంది, ఏమో మరి.


 






6 కామెంట్‌లు:

  1. అయ్యో..పద్మార్పిత గారు, ఆమె అమ్మ అయింది,అతడు అతడు గా ఉంటాడు..అదే కదా తేడా? నేను రాసిన ఆమె నించి అమ్మ కూడా చదవండి..ప్లీస్.థాంక్స్ అంది కామెంట్ పెట్టినందుకు.

    వసంతం.

    రిప్లయితొలగించండి
  2. మగవానికి వున్నఅన్ని సంబంధాల్లోనూ పెళ్ళీ, పిల్లలూ అనేవి వాటిలో ఒకటి మాత్రమే..
    కాని ఆడవారికి మటుకు అదే సర్వస్వం..
    అదే తేడా..

    రిప్లయితొలగించండి
  3. కరేస్ట్ గా చెప్పారు శ్రీ లలితా గారు..అదే విషయం..నేను ఏమిటో..బారు బారు గా రాసిన వ్యాక్యాల్లో చెప్పాను, మీరు సిమ్పెల్ గా చెప్పేసారు. బాగా పట్టుకున్నారు ..విషయం..ధన్య వాదాలు మీకు ..నా కథ ఏదో ఓపిక గా చదివి,మీ అభిప్రాయం కూడా పెట్టినందుకు.

    వసంతం.

    రిప్లయితొలగించండి
  4. 'మాట్లాడితే ప్రేమ
    పోయింది అంటుంది,అదేమైన
    జ్వరమా నాలుగు రోజుల్లో పోడానికి'
    -Mee Bhaavana baagundi vasanta garu.Nice thoughts

    రిప్లయితొలగించండి
  5. థాంక్స్ సుధామ గారు..సమయం తీసుకుని, నా బ్లాగ్ చదవడమే కాక ,మీ అభిప్రాయం కూడా రాసినందుకు. మళ్లీ,మరో మారు ధన్యవాదాలు.
    వసంతం.

    రిప్లయితొలగించండి