"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

30 మార్చి, 2012

జాగ్రత్త రా..బాబూ.

సుధాకర్ స్కూటర్ కి స్టాండ్ వేసి, ఇంట్లో కి వస్తూ, బయట చెత్త బుట్ట లో పడేసిన వాడిపోయిన పూల దండలు చూసి గతుక్కుమన్నాడు.
అమ్మో, ఇవి ఎవరు పడేసారు? సుధ చూసిందంటే..అమ్మో ఇంకేమయినా ఉందా??సుధ కి ఆ పూల దండలు ,ఎంత ప్రాణమో? నేను ,మామూలు మగవాడి లాగే, మనుషుల మీదే ఫీలింగులుంటాయి ,కానీ ఇలా దండలు, పువ్వులు మీద కాదు.ఇవన్ని ,కొత్తగా నేర్చుకుంటున్నాను.
సుధా..చూసావా? ఆ దండలు? అని ఇంకా ఏదో అన బోతూంటే ..
ఉండండి ,ఉండండి, ముందు ఆ షూస్ విప్పి, కాళ్లు కడుక్కుని లోపలి రండి, అని ఆర్డర్..
సరే, తప్పుతుందా !! చేయి పట్టుకున్నాను కదా ,అదే పాణిగ్రహణం..
"ఇవాళ మనం బీచ్ కి వెళ్లి , ఐస్ క్రీం పార్లోర్ లో, మంచి ఐస్ క్రీం తిని రావాలండి.."
"సరే, ముందు కాఫీ ఇస్తావా మరి?"
"నువ్వు తాగావా?"
"ఆ ,మీకు ఇదిగో కాఫీ ..నేను .".కొంచం సిగ్గు తో, "ఇవాల్టి నించి పాలే .."
"ఎందుకు? "..ప్రశ్నమొహం లో?
"మరి మన పాపో, బాబో, తెల్లగా, హెల్తి గా పుట్టాలి కదా?"
హా..ఆశ్చర్యం, ఆనందం, అప్పుడేనా అని కొంత నిరుత్సాహం..
ఇంకా మూడు నెలలేగా? అయింది, పెళ్లి అయి..
ఇంకా ఎన్ని అనుకున్నాడు తను..
మా ప్రేమ గుర్తు గా పాపో, బాబో వస్తున్నారు కదా, అందుకే దండలు పడేసాను, ఇంకా తొమ్మిది నెలలు మరి ఐస్ క్రీం తినను, పాప కి జలుబు చేస్తుంది కదా? అన్న సుధ మాటల్లోనే పాపాయిని చూసేను ఆ రోజు..అమ్మ ని కూడా..
సరే, సుధ మొహం లో సంతోషం చూసి ..తను మనస్ఫూర్తి గా సంతోషించేడు.
ఇంకా మొదలు, కాష్మీర పువ్వు, పాలు, పెద్ద వాళ్ళ జాగ్రత్తలు.
ఆరో నెల ,డాక్టర్ చెక్ అప్ అయి వస్తున్నాం.
ఆ రోడ్డు, అంతా తవ్వి పెట్టేరు, గతుకులు..గుంటలు..
"ఆపండి, ఆపండి, నేను నడిచి వస్తాను..ఈ గతుకుల్లో స్కూటర్ మీద కూర్చుంటే, లోపల పాప కి ఎలా ఉంటుందో?"

"అబ్బ ! సుధా, దేవుడు చాల జాగ్రత్తగా పెడతాడు , అంత ఫ్రజ్యల్ అని లేబెల్ పెట్టి పంపించడు, పసి పిల్లలని. "
"అయినా, నీతో వాదించలేను," అని పూర్వ  అనుభవం తో..
మరు నెల లోనే, ఒక ఫ్రెండ్ అమ్మేస్తూంటే ..ఓ చిన్న కార్, కొనేసాను.
ఇంక ఇబ్బంది ఉండదు అని..సుధ పొట్టలో ఉన్నది, మరి మా ప్రేమ గుర్తు కదా?బాబు పుట్టాడు.

ఇంక మూడో నెల లో, మెడ నిలపగానే ,అదేదో ఒక అపూర్వమయిన దృశ్యం లా ఇద్దరం ఎంత సంతోషించామో?
ఒక చిన్న ఊయల ,ముందు, అది సరిపోక, ఒక చిన్న మంచం కొన్నాం, చుట్టూ ,ఒక ఫ్రేం..బాబు పడిపోకుండా..సుధ కి ఇంక బాబు 'ప్రణవ్' తో నే లోకం..అడుగులు వేస్తే..ఒక పండగ, మాటలు వచ్చిన రోజు, అమ్మా ..అని నాన్నా అని పిలిచినా రోజు, ఇంతే తేనే నోట్లో పోసినట్టయింది.ఇంక మూడో ఏడు వచ్చింది, బడి లో వేయాలి.

ఒక పదో , ఇరవయ్యో చిన్న పిల్లల నర్సేరీలు చూసి, అన్ని విచారించి, చివరికి ఇంటికి దగ్గరని, పెద్ద గొప్ప గా లేక పోయినా అందులోనే  వేద్దాం ..అని నిర్ణయించింది.సరే అన్నాను.చూస్తూండగా ,పెద్ద బడి లో వేయాల్సి వచ్చింది.
స్కూల్ బస్సు ఉన్నది, ఎంచుకున్నాం.బస్సు డ్రైవర్ కి , విడి గా బాబు ని అప్పగించింది.

రోజు వెళ్లి, బస్సు కి దింపడం, మళ్లీ సమయానికి వెళ్లి, సాయంత్రం ,తీసుకు రావడం, దగ్గర కూర్చుని చదివించడం..ఆమె ఇష్టం గా చేసే పనులు అయిపోయాయి.
"అమ్మా..నేను ఇంక పెద్ద వాడిని అయాను ,ఎందుకమ్మా? నేను వచ్చేస్తాను ..బస్సు స్టాప్ నించి" ,
అంటే "ఒద్దు లేరా? పుస్తకాల సంచి బరువు..మోయాలి కదా, అయినా నాకు ఇంకేం పని ఉంది..?", సుధ లోని అమ్మ..జవాబు.
మూడు చక్రాల సైకెల్ నించి , రెండు చక్రాల సైకెల్ కి మారడానికి ,

సుధ ,తీసిన పరుగులు, వెనకే, హ్మం..నవ్వు, బాధ..ఇంత ప్రేమేంటి? ఈమెకు? అమ్మ లందరూ ఇంతేనా??
పార్క్ లో ఆడుకుంటూ, పడి పోతే, అంత పెద్ద అయిన,వాడిని ఎలా మోసుకుని వెళ్లిందో ..డాక్టర్ వరకూ, ఇప్పటికి నాకు ఆశ్చర్యమే..

రెండే రెండు కుట్లు పడ్డాయి, నుదుటి మీద...ఎంత కన్నీళ్ళు కార్చింది?
వాడికి కారిన రక్తం కన్నా ,సుధ కన్నీళ్ళే  ..ఎక్కువ బాధాకరం అని పించింది.

పదో తరగతి చక్కగా పాస్ అయాడు, ఇంటర్ అంటే, అందరి లాగే ,కోచింగ్ కాలేజ్ లోనే వేసాం..నా స్నేహితులు అందరూ అక్కడే ,అమ్మా..నాన్నా,అన్నాడు.
బస్సు లేదు, చిన్న బండి కావాలి, అన్నాడు.
ససే మిరా..వీల్లేదు ,సుధ..
ప్లీస్ అమ్మా..అని బతిమాలితే, ఒక చిన్న మోపెడ్ కొన్నాం.
కాలేజ్ అయిదు కి అవుతుందో, ఒక్కోసారి, ఇంకా ఏదో, ఎనిమిదో ? అవుతుంది.

సుధ గుమ్మం లో నే మకాం. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, 
ఇంత ఆలస్యం అయింది ఏమిటి ?అయినా ,ఏదో ఒక సీట్ వస్తుంది, ఎందుకు అన్ని గంటలు అలా కూర్చోపెడతారు, వెధవ కాలేజ్, మానేయ్..అంటుంది.
అదేమిటమ్మా? అందరు అమ్మలు రాంకులు ,రాంకు లు అంటూంటే ..
నువ్వు ఏమిటమ్మా? ఇలా అంటావు

ఎంసెట్ లు అయాయి, ఉన్న ఊరు లోనే చదువుకో ,అని సుధ పట్టు పట్టింది. ఇక్కడే మంచి కాలేజ్ లో ప్రవేశం కూడా వచ్చింది.

ఇంక ప్రణవ్ ఇప్పుడు ఎంజేనీరింగ్ స్టూడెంట్.
అమ్మా..నాకు మోటర్ సైకెల్ కావాలి 
అంటూ పట్టు పెట్టేడు ..సుధ ఒప్పుకోలేదు.

అలిగి ,పంతం పట్టి..కొనిపించేడు, హీరోహోండా..ఇంకా..లైసెన్స్..కూడా రాలేదు, వద్దు రా..అంటే వినడు..ఎప్పుడూ లేనంత రాష్ ..స్నేహితుల ప్రభావం అని సుధ, కాదు, ఈ వయసు అంతే అని నేను..
ఇద్దరికీ ,నిద్ర పట్టటం లేదు.ప్రణవ్.కి .ఈ నాలుగేళ్ళు ఎలా గడుస్తాయి?
ఇంత లోనే ఈ వార్త..
ఇద్దరు ఎంజెనేరింగ్ విద్యార్ధుల మృతి, బైక్ ఆక్సిడెంట్ లో. బీచ్ రోడ్ మీద అని
సుధ స్పృహ తప్పి పోయింది.ప్రణవ్ కాదు..అని ఎవరో అంటున్నారు..ప్రణవ్ కాదు, ఇంకో అబ్బాయి..ఎవరయినా ,ఎంత నరకం..

ఈ బైక్ లు ,ఎందుకు ఇలా స్పీడ్ గా వెళ్ళడానికి తయారు చేస్తున్నారు?
ఇదేమి ,రేసింగ్ కాదు కదా?
ఎలా చెప్పాలి? 
మా ప్రాణం అంత మీ మీదే..
జాగ్రత్త రా బాబూ..బాబులూ..

ఈ అమ్మ చెప్పే మాట వినండి.
అని సుధ గట్టిగా ఎలుగెత్తి చాటాలి అనుకుంది..
అందుకే ..ఈ కథ..ఇది  కథ...కాదు..రోజూ చూస్తున్న ,వింటున్న వార్తలు, నిజాలు. ఈ బైక్ లు మీద పిల్లల విన్యాసాలు, రేసులు, ఎంత శోకం మిగులుస్తున్నాయో,తల్లి తండ్రులకి ?
వింటున్నారా? పిల్లలూ..మీ అమ్మ మాట..వింటున్నారా?
జాగ్రత్త రా..బాబూ..
జాగ్రత్త..గా ఇంటికి వెనక్కి రండి. మీ భవిష్యత్తు బంగారం..మరు భూమి చేసుకోకండి..ప్లీస్..వినండి  అందరి అమ్మ ల మాట.











4 కామెంట్‌లు:

  1. ఎంత బాగా చెప్పారండీ! ఈ ట్రాఫిక్ వలన అయిదు నిమిషాలు ఆలస్యమయినా ఇంట్లో కంగారే! తల్లి మనసుని ఎంతో చక్కగా చెప్తూనే మీరు సున్నితంగా చేసిన హెచ్చరిక బాగుంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు రసజ్ఞ..

      ఈ మధ్య వింటున్న వార్తలని , చెదిరి పోతున్న తల్లీ తండ్రుల కలలు చూసి, విని, రాసేను ఇది..ఒక్కరయినా వింటారేమో అని.

      మీ అభిప్రాయం రాసినందుకు ,మళ్లీ మరో సారి థాంక్స్.

      వసంతం.

      తొలగించండి
  2. aravind Joshua,
    Thanks for your compliment, hope it will reach, at least a single person/student..Keep writing your valuable feedback, Thanks once again..

    Vasantham

    రిప్లయితొలగించండి