"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

16 జూన్, 2013

మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం

నాన్న ఒక జ్ఞాపకమ్.. 
చీకట్లో ,చేతిలో ఒక సిగేరేట్ తో ఏమేమి 
ఆలోచిన్చేవరో ??
ఆరుగురు పిల్లలు, నలుగురు ఆడపిల్లలం 
నత్త నావా , రోజుకి నాలుగో ,ఆరో అన్నాలు వండి వార్చే అమ్మ ,
చిన్న ఉద్యోగం, చిన్న జీతం, కాని ఎప్పుడూ కళ్ళల్లో ఏదో కలల వెలుగు 
చదువు తాళం చెవి అన్ని కల ల ద్వారాలకి అని నమ్మకమ్.. 
ఎంత చదివితే అంత చదివించే నాన్న ఉన్నారని ధైర్యం .. మాకు . 

లోటు అంటే ఏమిటో తెలీదు , ఆకలి వేసి ,అమ్మా అన్నం అంటే ఏ వేళయినా పెట్టే అమ్మ, అన్నపూర్ణ ఇంట్లో .. 
అమ్మా అంటే ఏం కావాలి ? ఆకలి వేస్తోందా అంటూ పరుగున వచ్చే అమ్మ .. 
ఎలా తెచ్చేవారో, ఏం కష్ట పడే వారో? నెలాఖరు అయినా చెరగని చిరునవ్వే ,నాన్న ఆస్తి . 

మా చదువు ,మా స్నేహితులు ,మా కబుర్లు అన్ని తన సొంతం చేసుకున్న 
అమ్మ , నాన్న మా సంపద . 
దిగులు అంటే తెలియదు, కలిసి ఉండడం లో ఆనందం మాకు తెలుసు, 
ఇంటికి ఎవరు వచ్చినా , ముందు ఒక కప్పు కాఫీ , తరవాత అన్నం పడేసి వచ్చి కూర్చునే అమ్మా. 

పిల్లల్లో ఒక్కరై , మా స్నేహితులతో కబుర్లు , జోక్స్ , సమస్త ప్రపంచం లో కబుర్లు 
అందరిని మన వాళ్ళే అంటూ హత్తుకునే పెద్ద గుండె , 

ఎందుకో ,ఏమో ఆ సిగేరేట్ పొగ తో ఉక్కిరి బిక్కిరై, ఆనాడు మొరాయించింది , 
మరో ఆరు సార్లు పోరాడి గెలిచారు.. 
తెల్లవారు ఘామున ఏదో ఘడియ లో , మా పిల్లలని ,అమ్మ ని వదిలి ఎలా 
వెళ్ళ గలిగారో ? చాలా దిగులు పడి ఉంటారు , అయ్యో ఎలా ? అని.. 

ఎందుకో ,ఈ రోజు తండ్రి ని తలుచుకునే దినం అంటే కొండంత దిగులు వచ్చి కూర్చుంది గుండెల్లో .. 
మనవళ్ళు అంటే ఎంత ప్రేమో ? ఎంత అపురూపమో?

మా నాన్నగారి కి తగిన కూతుర్లం అని పేరు తెచుకునే ప్రయత్నమే ప్రతి రొజు.. 
మన వారిని మనం చూసుకోవాలి, అందరూ సౌఖ్యమ్ గా ఉండాలి ,
అనే ఆలోచనలు నిజం చేసుకుంటూ , నాన్నగారండి , అని ఇంత పొడుగ్గా పిలిచే వాళ్లం . .. 

ఏదో , తెలియని ఆశ ,అంతా చూస్తున్నారా ?పై నుంచి .. 
అనే ఆశిస్తూ .. ఒక దినం ,ఒక్క దినం కాదు, ఇది ప్రతి దినం జరిగే మథనం .. 

ఇలా ఎంత మందో ? మధ్యలో వెళ్ళిపోయినా నాన్నలు .. ఆ సిగేరేట్ చేతిలోది 
విసిరేయండి ..ఇదే నా విన్నపమ్.. మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం 

4 కామెంట్‌లు:

  1. ఆ సిగేరేట్ చేతిలోది
    విసిరేయండి ..ఇదే నా విన్నపమ్.. మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం
    ---------------------------------------------------------------
    నొక్కి చెప్పటం బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju gaaru,

      థాంక్స్ అండీ ,చాలా రోజుల తర్వాత వ్రాసాను,
      గుండెల ని ఆపేసే ఆ పొగరెట్ అసలెందుకు పుట్టించారో ?
      నాకు తెలిసి మా ఇంట్లో ఇద్దరు బలి అయ్యారు..
      మా ఉన్నతి ని చూసి ఆనందించే వారు కదా అని దిగులు ..
      ఇంకా చిన్న పిల్లలు కూడా వాళ్ళ నాన్నని మిస్స్ అవుతూ.. మా తమ్ముడు కూడా అలాగే మధ్యలో వెళ్లిపోయాడు. చాలా బాధ గా ఉంటుంది, ఇలాంటివి..
      ధన్యవాదాలు మీకు మరో సారి, ప్రతి పోస్ట్ చదివి ,మీ అభిప్రాయం చక్కగా చెపుతున్నందుకు..

      వసంతం.

      తొలగించండి
  2. "చిన్న ఉద్యోగం, చిన్న జీతం, కాని ఎప్పుడూ కళ్ళల్లో ఏదో కలల వెలుగు
    చదువు తాళం చెవి అన్ని కల ల ద్వారాలకి అని నమ్మకమ్..
    ఎంత చదివితే అంత చదివించే నాన్న ఉన్నారని ధైర్యం .. మాకు . ...
    మా చదువు ,మా స్నేహితులు ,మా కబుర్లు అన్ని తన సొంతం చేసుకున్న
    అమ్మ , నాన్న మా సంపద . ...
    పిల్లల్లో ఒక్కరై , మా స్నేహితులతో కబుర్లు , జోక్స్ , సమస్త ప్రపంచం లో కబుర్లు
    అందరిని మన వాళ్ళే అంటూ హత్తుకునే పెద్ద గుండె .."
    వసంతగారు ఇంత మంచి తల్లిదండ్రులను పొందిన మీరు ఎంత అదృస్టవంతులో .....
    హ్మ్మ్...ఆ సిగేరేట్ చేతిలోది
    విసిరేయండి ..ఇదే నా విన్నపమ్.. మీ పిల్లల కోసం , మీ కుటుంబం కోసం....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డేవిడ్ ..
      అవును మేం చాలా అదృష్టవంతులమే ,
      నాన్నగారు లేరు ఇప్పుడు, స్మోకింగ్ చేసే వారిని చూస్తే ఎంత హాని కలిగించుకుంటున్నారో ,వారికి , వారి కుటుంబానికీ చెప్పాలని అనిపిస్తుంది, అలాగే ఈ ఘుట్కా ,పాన్ లు తినే వారిని చూస్తే భయం వేస్తుంది , ఇలాంటి విష పదార్ధాలని ఎలా అమ్మనిస్తున్నరు అసలు ? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ? అవునులే ,సారా, మందు మీద నడిచే ప్రభుత్వాలు మనవి ..ఇంకేం చెప్పగలం? ఎవరికి వారు తెలుసుకోవాలి, అవేర్నెస్స్ పెంచాలి .. చాలా చేయాలి ..
      వసంతం.

      తొలగించండి