"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

26 ఆగ, 2015

జీవన యాత్ర

సుదూరంగా కొండలు విశ్రాంతిగా
దిగంతాల గీతల వేపు ఆర్తిగా తడుముతూ చూపులు
మైదానాల మధ్య చివుర్లూ , చెట్లూ గాలి వీవెన పంపిస్తూ
అలవోకగా నర్తించే చెరువు అలలకి చురుకుదనం అద్దుతూ
ఒడ్డు గతాల స్మృతులని నెమరు వేస్తూ ,
లంగరు వేసిన పడవల కథలకై అర్రులు చాస్తూ ..
వారిద్దరూ ఆదిమ మానవుల జంట
అనంత కాలం లో ఉత్తర దిక్కు తార చెప్పిన గుర్తుల
ఆధారంగా ఎప్పుడూ ఎరగని తీరాల రేవు కై
సముద్ర యానం అంత యాతనగా అలసి సొలసి పోతూ ..
యాత్ర ఫలితం పుణ్యమో పురుషార్ధమో కాదు
కేవలం తీరం కనుక్కోడమే ..
తీరాల వెంట పాద ముద్రలు వేస్తూ నాగరికత
అలుక్కుంటూ వెళ్ళడమే , ఎప్పుడో మళ్ళీ యాత్ర అనుభవం
మానవులని ఆకర్షించి దీపం పురుగులా నలిపేస్తూ ఉంటుంది .
అయినా తప్పదు ,ఒక యాత్ర ,ఒక తీరం ..
మానవ జాతి చరిత్ర సమస్తం యాత్రా ఫలితమే కదా ..
ఈరోజుకీ ఒడ్డున లంగరు వేద్దామా ! హ్మం ..

3 కామెంట్‌లు:

  1. మానవ జాతి చరిత్ర సమస్తం యాత్రా ఫలితమే కదా ..
    ఈరోజుకీ ఒడ్డున లంగరు వేద్దామా ! హ్మం ..
    కనుగొనడం ఒక తీరని దాహం కదా !

    రిప్లయితొలగించండి
  2. మానవ జాతి చరిత్ర సమస్తం యాత్రా ఫలితమే కదా ..
    ఈరోజుకీ ఒడ్డున లంగరు వేద్దామా ! హ్మం ..
    కనుగొనడం ఒక తీరని దాహం కదా !

    రిప్లయితొలగించండి
  3. విస్వా గారికి
    నమస్కారం ..అవును ..తీరాల కై తీరని దాహమే జీవన యాత్ర ..
    ధన్యవాదాలు
    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి