"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

29 జులై, 2017

సాయంత్రాలు బిడియం గా
పదహారేళ్ల పడుచు యవ్వనంలా
సందేహ పడుతూ వస్తాయి ..

పరదాల అంచున కొంచం
సరదాలు దాచేసుకుని
చీకటి పడనీ అంటూ మారాము చేస్తూ

అది కొంచం అలకో ,తీవ్రమైన వేదనో
తెలియ చెప్పని కళ్ళ ఎరుపు
చాటున తెల్లని కనుపాప చల్లగా నవ్వుతూ

సన్నజాజులు తెచ్చావా ? మల్లె మొగ్గలు
ముడిచావా ? అని కొంటె మాటలు
బిగించిన ఆ గాలి వెనక వెనక అలఓకగా ..

సముద్రం ఒక్క పరి ఆగి నెమ్మదించి
నలు దిక్కులా చూసి ,రాత్రి ఆకాశంకి
ఎలా స్వాగతాలు పలకాలా అని ఉసురుసురంటూ
ఘోషిస్తూ అలల తో మొర బెట్టుకుంటూ ..

ఆట పాటల సూర్య బింబం ఆఖరి గోల్
కొడుతూ ఆమడ దూరంలో ,ఆ కొండల మధ్యలో
ప్రకృతి అంతా స్త్రీ రూపమే సుమా ? అంటూ
ఉద్విగ్నంగా మైదానం పరుచుకుంది ..

పలచటి ఆ మబ్బు తెర ,ఆ కొండల
శిఖరాల్ని కప్పేస్తూ , ఎందుకో విచ్చలివిడితనం
ఎవరూ ఒప్పరు !!

సాయంత్రాలు మటుకు ఒలికిన
ఆ రెండు అమృత బిందువులు
రుచి చూసి రాత్రి కోసం తహ తహ లాడే
పెదవులు అనిపిస్తాయి ..

ఈ సాయంత్రం కూడా
అదే వేషం ధరించి
ఇలా అరుదెంచింది ..
ఎందుకో అంత తొందర ?
రాత్రి గా మారాలని ఎంత విరహమో !!

ఈ సాయంత్రం ..ఇలాగే ఇలగే
ఎప్పటికీ ఇలాగే ..

వసంత లక్ష్మి
మా ఇల్లు ..వైజాగ్
29 -07 - 2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి