"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

15 సెప్టెం, 2010

నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు.



మధ్యాన్నం పెళ్లి భోజనంకి వెళ్ళి వచ్చాం. నాలుగైదు బల్లల మీద అమర్చిన పది పన్నెండు రకాల రుచి కరమైన పదార్ధాలు, మరో నాలుగు రకాల కొసరు తీపి రుచులు తృప్తి గా ఆరగించి,భుక్తాయాసం  తో,ఎలాగో ఇంటికి వచ్చి,కళ్ళు మూసు కు పోతూంటే, ఇంక రాత్రి  కి ఏమి తినక్కర లేదు అంటూ మంచం మీద నడుం వాలుస్తూ అనుకోవడం గుర్తు.


నిద్ర లేచి, ఇంకా భోజనం నే తలచుకుంటూ, పెళ్ళికూతురు- పెళ్ళికొడుకు విశేషాలు కి ఇంకా సమయం ఉంది, ఇప్పుడు గుర్తు ఉన్నది, భోజనంరుచుల  విశేషాలే...విప్పి పడేసిన పట్టు చీరలు మడిచి పెట్టుకుంటూ, ఇంకా ఆయాస పడుతూ, ఇంక రాత్రి కి మజ్జిగ తాగిపడుకోవడమే, అని నిట్టురుస్తాం .


సరే, రాత్రి అవుతుంది, మెల్లిగా అరిగి పోయిన భోజనం స్థానం లో ఏం పడేస్తారు ఈ చిన్న పొట్ట లో .. అని అడగడం మొదలు పడుతుంది..


ఆకలి కి సిగ్గు ఉండదు కదా? ఏవో వెతికి వండ డానికి వంటింట్లో కి దారి తీస్తాం మనం అంటే స్త్రీలు అని అర్ధం.


మన దేశం లో కోట్ల మంది కి తినడానికి తిండి ఉండదుట.తిండి  కొన డానికి డబ్బులుండవు, డబ్బులు సంపాదిన్చాద్దనికి పని ఉండదు, పని చేయ డానికి పొలం ఉండదు, పొలం ఉన్న, నీరు సదుపాయం ఉండదు, రోజు కూలి దొరికినా పై పైకి ఎగురుతున్న ధరలు కి సరిపడా కూలి దొరకదు. పట్నం వస్తే పని కోసం, ఉండ డానికి ఇల్లు ఉండదు. పెద్ద లు పస్తు ఉండి పిల్లలికి చాలీ చాలని తిండి పెడతారు. 


మన  ప్రభుత్వం చాల కష్ట పడి పేదరికం తో,తిండి కి కూడా లేని పేదల సంఖ్య ని చాల తక్కువ చేసింది ట. వారి లెక్కల ప్రకారం అన్ని కోట్ల మంది కాదుట,కొన్నే కోట్ల మంది తిండి లేక ఉన్న వారుట.వీరికి కూడా, రెండు రూపాయల గోదుమలో లేక బియ్యమో ఇచ్చే పధకాలు ఉన్నాయిట. ఇంకా ఏమిటి మీ గోల ? అని చాల చికాకు పడుతుంది.


ఇది  చాలక, ఎలుకలు తింటున్న గోధుమలు, గోదాములులేక ఎండా కి వాన కి ఎండుతూ, తడుస్తూ వృధా అవుతున్న తిండి గింజల ను కొందరు ఫోటోలు తీసి, వార్త పత్రికల్లో ప్రచురించారుట. మొదటి పేజీ లో ఈ ఫోటోలు చూసిన మన అత్యంత పెద్ద న్యాయ స్థానం, ఏమిటి ఈ నిర్లక్ష్యం? అని ప్రభుత్వం ని చివాట్లు  వేసిందిట.


ప్రతి పక్షాల కుట్ర అని, పొరుగు దేశం కుట్ర అని కుంటి సాకులు చెబితే ఇంకా ఎక్కువ చికాకు  పడి, ఎవరు మీ  భోజన వ్యవహారాల మంత్రి అని అడిగితే ఆయన కి ఇది ఒక్కటేనా? ప్రపంచం లోనే అతి గొప్ప (ఖరీదు) అయిన ఒక క్రీడ ని ఆడించే పనిలో చాల బిజీ గా ఉన్నారు ఇలాంటి బీద విషయాలను ఆయన దృష్టి కి తీసుకు వెళితే, ఆయనకు చికాకు అన్నారుట.


న్యాయ స్థానం ఊరుకోలేదు, మన దేశం ఎంత గొప్ప దేశం అని పేరు, కాని ఇలాంటి దేశం లో ఆకలి అరుపులు,ఆకలి చావులూ నా సిగ్గుచేటు, వెంటనే ఈ కుళ్ళి పోతున్న ధాన్యాన్ని, గోధుమలను బీదలకు, ఆకలి తో అలమటించే వాళ్లకు పంచి పెట్టండి, ఇది మా ఆర్డర్ ,వెంటనే అమలు పరచండి అన్నారు ట.


మంత్రి గారు ఇంకా ఆ ఆట వ్యవహారాల్లో తల మునకలై ఉన్నారు పాపం. ఏవో కొట్లలో వ్యవహారాలు,పెద్ద ,పెద్ద తలలు ,  తలలు పట్టుకుని కూర్చున్నారు లెక్కలు , వాటాలు తేలక. మధ్యలో, ఈ బీద వాళ్ళు, ఆకలి, తిండి గింజలు,ఊరికే పంచి పెట్టడం, ఏమిటి ఇదేమైనా సత్రమా ? ఆషామాషీ వ్యవహారమా? నాకు అంతా తీరిక ఏమి లేదు,నా చేతులు ఖాళి లేవు, పక్కింటికి వెళ్ళు అని ఉచిత సలహా ఇచ్చే గృహినిలాగా   .. . 


న్యాయ స్థానం ఊరికినే పంచమని సలహా ఇచ్చింది, సలహాలు విని ఊరుకోవాలి కాని ,పాటించ క్కర్లేదు కదా అని కూడా అన్నారుట.


ఈసారి న్యాయస్థానం కి నిజం గా చాల కోపం వచ్చింది ట. ఏమిటి ఈ మంత్రి వ్యవహారం , అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాట ని కరివేపాకు లా తీసి పడేస్తారా? ఇలా ఊరుకోం మేం. మేము చెప్పింది సలహా కాదు, ఇది ఒక నిర్ణయం. మీరు పాటించండి ,చాలు, ఇంక మాటలు వద్దు అని గర్జించింది.


మంత్రి   ఇంక చాలు ఈ వ్యవహారం చాల దూరం వెళ్ళింది అని వెళ్ళి ప్రధాన మంత్రి గారిని కలసి, నేను మంత్రి  ని కదా,నాకు స్వతంత్రం లేదా?అని  గోల పెట్టేసరికి, ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడ వలసిన సమయం వచ్చింది మరి,ఇంత వరకు తీసుకువచ్చేరు. 


ప్రభుత్వం ఎలా నడపాలో మాకూ తెలుసు, మాకు ఎవరూ చెప్పకర లేదు, ప్రభుత్వం నడప డానికి ముఖ్యం గా కావాల్సింది..ప్రజలు, కాదు, కాదు, ధనం. ఉచితం గా తిండి గింజలు పంచి పెడితే,రైతుల కి నష్టం కదా, రైతుల దగ్గర కొని, దాచలేక వృధా అవుతున్న గింజలు సంగతే న్యాయస్థానం  చెప్పింది కదా అని మన లాంటి వాళ్లకి ఒక సందేహం వస్తుంది, తప్పు లేదు, కాని, చాల పెద్ద,పెద్ద వ్యవహారాలు పట్టించు కునే, మంత్రులకి, ఇలాంటి చిన్న చిన్న సందేహాలు రావు.


మళ్లీ కథ మొదటికి వచ్చింది.


చాప చాప ఎందుకు ఎండలేదు అంటే??? కథ లా ఉంది కదా?


వార్త పత్రికలూ చదవ లేని, ఆకలి తో కాళ్ళు ముడుచుకుని పడుకునే సామాన్యుడు, అతి బీద వాళ్ళు, అంటే ఒక గీత కింద ముడుచుకుని పడు కునే వాళ్ళు..(ఇంగ్లీష్ లో బెలౌ ది పోవేర్తి లైన్), ఇవేమీ తెలియని వాళ్ళు,ఈ పూట ఎలా గడుస్తుందా?అని  దిక్కులుచూస్తూ ఉంటారు.


నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు.


ఒక డబ్బా బియ్యం కుక్కేర్లో    పడేసి, వంకాయో, అరటి కాయో  వండి పడేసి, ఓ పచ్చడి తో ఇవాల్టికి, అదే ఈ రాత్రి కి సరిపెట్టుకుందాం.. పదండి..మరి..



3 కామెంట్‌లు:

  1. మీరు చెప్పేది మానవత్వ పరంగా బాగున్నా పంపిణీలో అంతకు మించిన కష్టాలుంటాయి. ఫ్రీగా ఇస్తామంటే పనులు ఆపేసి ఎగబడతారు. నన్నడిగితే 50మిలియన్ల పాకీ వరద బాధితుల సహాయం కింద ఆ ధాన్యాన్ని ఇచ్చేసి అల్లార్పణం అనుకుంటే పుణ్యమూ పురుషార్థమూ రెండునూ దక్కుతాయి.

    రిప్లయితొలగించండి
  2. బియ్యాన్ని అతి తక్కువ ధరకి అమ్మినా ఆకలితో ఉన్నవాళ్లకి తిండి దొరుకుతుంది. గోదాముల్లో ఎలుకలు, పందికొక్కులకి ధాన్యాలని ఉచితంగా మేపడం లేదా? అలాంటప్పుడు మనుషులు ఉచితంగా తింటే తప్పా?

    రిప్లయితొలగించండి
  3. ఆకలి తో కొన్ని కోట్ల మంది పస్తులు ఉన్నారు అని తెలిసి, బియ్యం, గోధుమలు ఎండకి, వానకి వదిలేసాం అని తలుచు కుంటే, మార్గాలు అవే తెరుచు కుంటాయి, వాటిని సవ్యం గా పంచడానికి. సామూహిక వంట సాల లు తెరిచి, కటిక దారిద్ర్యం తో, బాధ పడే, వృద్ధులు,పిల్లలు, రోగ పీడితులు, వీరికి ముందుగా కొంత పంచాలి,ప్రభుత్వం కి సమయం, సామర్ధ్యం లేక పోతే, మంచి పేరుఉన్న , సేవ ద్రుఖ్పథం కలిగిన సేవ సంస్థల సాయం తీసుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుది అంటారు కదా..
    ఇప్పటికీ అయినా మేల్కొని యుద్ధ ప్రాతి పదికిన గిడ్డంగులు నిర్మించాలి,ఇవి నిర్మించటానికి రైతులకు , వ్యాపారస్తులకు బ్యాంక్లు సహాయం చేయాలి. మనం పండించిన పంటలను దాచు కోవదానికే చోటు లేదు అంటే, ఎంత సిగ్గు.
    ఊరు ఊరుకి, ముల్తిప్లెక్ష్ లు కడుతున్నారు, గిడ్డంగులు కట్ట డానికి ధనం లేదా? తిండి ఉంటే కండ కలదోయ్ అన్నరుగురజాడ కవి గారు. రైతు సంక్షేం మమే మన మనుగడ కి అత్యవసరం.ఇంక నైనా మేలు కోవాలి, ఈ ప్రభుత్వాలు. అనే నా విన్నపం. అదే నా విలాపన.

    రిప్లయితొలగించండి