"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

8 నవం, 2010

టు డై ఆర్ నాట్ టు డై ....

అబ్బే నాకు వేరే ఆలోచన లేదు, శత మానం భవతి అని చాల దీవెనెలు తల మీద ఉన్నాయి, పెద్దలవి.
ఈ సాల్ట్ అండ్ పెప్పేర్ అంటారు, కదా , సాల్ట్ ఎక్కువ అయిపోయిందే ,అందరు నన్ను చూసి ఏం అనుకుంటారు?  కాళ్ళు నొప్పులు, మెడ నొప్పులు ఇంకా ఏవో బాధలు ఉన్నా,మన  వయసు దాచడానికే  ఈ ప్రయత్నాలు అన్ని..
ప్రపంచ సుందరి ఐశ్వర్య చెప్పింది అని ఒక షాంపూ, అంతా కంటే గొప్ప భువనైక సుందరి ట, సుష్మిత  సేన్ చెప్పింది (ఆవిడ ఓ అమ్మాయిని పెంచుకుంటోంది అని ఒక ఇష్టం), ఆవిడ వాడ మంది అని ఇంకో రకం, ఇంకా ఇప్పుడిప్పుడే జేనేలియా అని ఒక చిన్న పిల్ల చెపుతోంది, ఇది వాడితే, నా అంత అందం గా కనిపిస్తారు అని, అంత మిధ్య అని తెలిసినా ఎలా ఈ జీవితం లో కోరికలు పెంచు కుంటామో, అలాగే, ఈ విజ్ఞాపనలు ఓ మిధ్య అని తెలిసినా ,తెలిసి, తెలిసి, వ్యామోహం లో పడిపోతాం. 
సరే, ఆఖరికి ఈ సాల్ట్ అండ్ పెప్పేర్ జుట్టు మిగిలింది, ఈ షాంపూ లు అవి వాడడం వల్ల. ఇంకా ఇప్పుడు వీటికి ఓ రంగు వేయడం తప్ప ఇంకో మార్గం లేదు అని ఒక మొహమాటపు నిర్ణయానికి వచ్చాను.
మేహేంది అని పిలవబడే మన గోరింటాకు  ట్రై చేయండి అని, సెలవు ఇచ్చారు, ఇప్పటికే ఈ విషయాల్లో తల పండిన వాళ్ళు. సరే అని,  గోరింటాకు పొడి లో, ఏవో పది రకాల పొడులు, గుడ్డు, డికోశున్, ఇలాంటివి ఏవో నానా రకాలు కలిపి తలకి పట్టిస్తే, చిత్ర కారుడు వాడే రంగుల మిశ్రమం లాగ తయారు అయింది, పెద్ద వారు, ఫ్రెండ్సు, మొహమాట పడి, ఏమి అనలేదు కాని, మా చెల్లెలు కూతురు, రాజు గారి బట్టల గురించి నిజం బయట పెట్టినట్టు, దొడ్డమ్మా నీ  జుట్టు ఆరు రంగుల్లో ఉంది, అని చెప్పింది.. చక్కగా గుట్టు రట్టు చేస్తూ..
ఈ రంగుల బుట్ట ని ఎలా మోయడం, పూర్తి గా ఒకటే రంగు అని నిర్ణయించి, సరే అని మళ్లీ మన ఐశ్వర్య రాయ్ చెప్పింది కదా అని ఓ రంగు డబ్బా కొన్నాను, దాని ఖరీదు చూసి, ఇంట్లో వారు, నువ్వు ఎలా ఉన్న నాకు (మాకు) బాగానే ఉంటావు, అయినా ఎవరు నీ తల ఎవరు చూస్తారు? అని ఒక  ఐ ఐ టి ప్రొఫెసర్ ఏదో సందర్భం లో ఇలా అన్నాడు, నేను రెండు వారాలు, రంగు వేసుకున్నాను, మూడో వారం పని హడావిడి లో మర్చి పోయాను, ఒక్కరు కూడా, వేసుకున్నానని కాని, వేసుకోలేదు అని కాని, ఒక్క కామెంట్ చేయలేదు, ఇంకా ఎందుకు అని నేను నేను లాగే ఉంటున్నాను అని చెప్పాడు అని నాకు కూడా కొంచం జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నించారు.ప్రొఫెసర్ ని చూసి, అందరు తల దించుకుని వెళి పోతారు ,అంతే కాని తల ఎత్తి, మొహం లోకి చూడరు, పైగా ఆయన ఉండేది ఎక్కడో కామ్పుస్ లో, మనం ఉండేది, ఇంత మంది ఉన్న ఈ గొప్ప ఊరులో కదా..లాభం లేదు, అని నా మానాన నన్ను వదిలేసేరు, నా ఖర్మానికి, నా రంగుల ఎక్స్పెరిమెంట్ కి..
మనం ఈ బాధలు పడలేం అని , ఈ రంగులు వేసే వారి ముందు తల దించాను, ఓ రెండు గంటలు లో, నేను బయటకి వచ్చాను, బీచ్ రోడ్ లో నడుస్తూ ఉంటే రోజు పలకరించే వారు కూడా అలాగ పలకరించా కుండా వెళుతూ ఉంటే ఏమిటో అనుకున్నాను, నల్లని జుట్టు తో నా మొహం నేనే గుర్తు పట్టకుండా ఉంది, ఎవరో ఈమే  అనుకున్నాను,అద్దం లో చూసుకుని, ఇంత నల్ల మేఘం లాంటి జుట్టు నాకు ఎప్పుడూ లేదు, మనది బ్రౌన్ కలోర్   , అలా అని ముందే చెప్పాలి ట ..
నలుపు  లో ఇన్ని రంగులా మళ్లీ? బోలెడు  షేడ్స్ ట..ఇన్ని గొడవలా? పోనీ ఇలాగే ఉన్చేసుకుందాం అని మధ్యలో అని పించినా , ఐశ్వర్య రాయ్ కూడా వేసుకుంటోంది రంగులు, మనకి ఏం తక్కువ? అని మళ్లీ మొదలు పెట్టాను నా ప్రయత్నాలు. 
ఇంటి నిండా ఎక్కడ కూర్చుంటే అక్కడ జుట్టు రాలి పడడం, ఈ రసాయనాలు ,మరి ఏం చేస్తాయి   ? ఉన్న జుట్టు ని రాల్చేస్తాయి కాబోలు?  భూగోళం మీద ఓ పెన్సిల్ గీత గీసినట్టు, పల్చని, ఈ జుట్టు ని ఇలాగ సాల్ట్ అండ్ పెప్పేర్ రూపం లో అయినా మిగుల్చు కోవాలి అంటే, ఈ రంగుల మేళం ఇంకా ఆపేయాలి కాబోలు. 
అయినా మనం వాడే సబ్బులు అన్నీరసాయనాలే. పొద్దున్నే వాడే పేస్టు నుంచి అన్నీ అవే, ఏదో, పువ్వు పరిమళం , లేదా నిమ్మ ,దానిమ్మ అంటూ ఏవో పళ్ళ, పూల పేర్లు చెబితే మనం నమ్మేస్తాం, అన్నీ చక్కని ఆ వాసన ఇచ్చే రసాయనాలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ లో ఉంటాయి, ఇలగ్గా వాసనలు వచ్చే వాటి కోసం ఏమిమి కలపాలో, అదంతా ఒక వ్యాపారం.
అందాల నిచ్చే సాధనాల వ్యాపారం అంత కోట్ల కోట్ల లో ఉంది ట. మన భారత దేశం లోని అందాల ,ఆడ పిల్లల్ని ఆకర్షించ డానికే, ఒకటి రెండు సార్లు మనకి విశ్వ సుందరి లాంటి బిరుదులూ ఇచ్చేరు అని ఒక వార్త.. ఉంది.
చెప్పకేం, మనం చక్కగా పడి పోయేం,ఇప్పుడు చిన్న చిన్న ఊరు లలో కూడా రాంప్ వాక్స్ అంటూ నడిచేస్తున్నారు, వీధికి ఒక అందాలు మెరుగు పరిచే పార్లర్లు, అందాన్ని ఇనుమిన్డించే రక రకాల  సాధనాలు, ఖరీదు అయిన వాటికి పోటి గా వాటిని పోలిన చీప్ రకాలు, ఇమిటేశాన్లు, ఏమిటో అందం , తెలుపు- నలుపు వీటిలో ఉంటుందా? 
యింక  ఈ నల్ల వారిని అందర్నీ, తెల్లగా మార్చేయడానికి కంకణం కట్టుకుని ,కొన్ని సాధనాలు , ఎంత ప్రాముఖ్యం సంపాదిస్తున్నాయి అంటే, ఆడ వాళ్ళు మార్కెట్ అయిపొయింది అని మగ వారు మీద కూడా పడ్డారు. తెల్లగా అయిపోతే చాలు ట, ఉద్యోగాలు నడుస్తూ వస్తాయిట, టెన్నిస్ , లాంటి ఆటలు ఎంత కష్ట పడాలో, వాటికి కూడా, తెలుపు ఒక్కటే మార్గం అని నమ్మిస్తున్నారు. వ్యాపారం ,చల్లగా ఉంటే చాలు, ఎన్ని మాటలు అయినాచేపుతారు, మనం కూడా , చూడగా ,చూడగా పడి పోతాం ఆ మాయ లో. లేక పోతే, నాకు ఇప్పుడు ఈ నలుపో, బ్రౌనో.. ఇది అవసరమా?
పైగా ఏదో పెద్దరికం కూడా ఉంటుందేమో, నాకు ఎక్కడ ఆ జాడలు కనిపించ క పోయినా.. నా జుట్టు , నా తల నా ఇష్థం. ఏమైనా చేసుకుంటాను.. ఏమో అంతా తల తిక్క వ్యవహారం నీది.. అదే నాది.. అన్ట్టారు ఇంట్లో..
శుభం..రంగు పడింది..అదే తలకి.. ఇప్పుడు ఇంకో  షేడ్ లో.. 

3 కామెంట్‌లు:

  1. hi anti !
    meeru ivala ti post thoo maa kadupulu chekkalu chesaru.. Thanks!!

    Thanks Lakshmi...

    రిప్లయితొలగించండి
  2. గార్నియర్ గురించి మర్చిపోయినట్లున్నారు! వేసే రంగులగురించి బాగా చెప్పారు! దయచేసి వర్డ్ వెరిఫికేషన్ తొలగించండి. అక్కడుండే లెటర్స్ అర్ధం అవవు.

    రిప్లయితొలగించండి
  3. Hi,
    Wonderful. I like to add that the hair falls like autumn leaves. The number of incomplete maps formed on the floor are all black in colour. It makes one wonder did we have really have so much pepper on us?

    రిప్లయితొలగించండి