"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

21 నవం, 2010

చదువు- సంస్కారం...

చదువు- సంస్కారం..అంటారు, ద్వంద్వ  పదమే కాని, చదువు తో సంస్కారం వస్తుంది అని గారంటీ లేదు ఏమో అనిపిస్తుంది, కొన్ని విషయాలు చూస్తే ,వింటే..
సైన్స్ పుస్తకం లో చిన్నప్పుడు అందరూ చదివే ఉంటారు, పుట్టేది ఆడా? మగా? అని నిర్ధారించే జన్యువులు మగ వారిలోనే ఉంటాయి, అని, తీరా ఆడ పిల్ల   పుట్టేసరికి ,తల్లి ని బాధ్యురాలిని చేసి, ఆమెను కొట్టడం, మాటలతో గాయ పర చడం, ఇంకా చంపేయడం, అవి చూస్తే మనం ఏ యుగం లో ఉన్నాం అనిపిస్తుంది. అసలు ఆడ పిల్ల అంటే ఎందుకు అంత లోకువ?
ఇప్పుడు తల్లితండ్రులని కని పెట్ట్టుకుని, ప్రేమగా చూసేది ఆడ పిల్లలే, చక్కగా చదువు కుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలని పెంచుతూ, ఇంటా బయటా బాధ్యతలు సక్రమం గా నిర్వర్తిస్తూ, ఇంటికే ఒక కళ గా వెలుగు తున్నారు. ఇలాంటి ఆడ పిల్ల పుట్టింది అని విచారించే వారిని చూస్తే, తన్నా లని పిస్తుంది నాకు అయితే. 
సైన్స్ అంటే ఏమిటి, పుస్తకాల్లో చదివి, డిగ్రీలు తెచ్చుకుని, ఉద్యోగం చేయడాని కేనా? ఏమిటి ఈ చదువులు ? మనసు కి వికాసం , వెలుగు, ఇవ్వని ఈ చీకటి చదువు , డబ్బు పెట్టి చదువులు కొను క్కునే చదువులు ఉన్నంత కాలం , మనుషులు ఇలాగే అజ్ఞానం లో కొట్టుకుంటారు. 
మనుషులంతా ఒకటే, ఆడ పిల్ల అయినా ఆమె కూ, ఒక మనసు, మెదడు ఉంటాయి అని ఇంకా ఎన్ని యుగాలు ఎలుగెత్తి చాటు తూ ఉండాలి. ఒక వీరేశ లింగం గారు, ఒక గురజాడ , ఒక చలం, ఒక కొడవటిగంటి, ఇలా ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పేరు, సమాజం అభివృద్ధి చెందింది అనడానికి తార్కాణం ,అక్కడ స్త్రీలకి పొందే గవ్రవమే   నని. 
పల్లెటూరుల్లో, పని పాటలు చేసు కుని బతికే వారిలో ఈ వివక్ష అంత కని పించాడు, పట్టణాల్లో  ,  నగరాల్లో, బాగా చదువుకుని, ఆస్తులు అవి ఉన్న స్థితి మంతులకే  ఈ జబ్బు ఉన్నట్టు తోస్తోంది. ఆడ పిల్ల అంటే కట్నం ఇవ్వాలని, ఆస్తులు పంచాలని, అంత ఖర్చే తప్ప వెనక్కి ఆదాయం రాదనీ, లెక్కా  జమలు చూసుకుని, ఒక ఇంటూ పెట్టేసి, భ్రూణ హత్య లకి కూడా పూను కుంటున్నారు. 
ఇంకా బాధ కలిగించే విషయం అత్తగార్లే, లేదా తల్లులే వీటిని ప్రోత్స హించడం. ఎంత అజ్ఞ్ఞానం, ఎంత చీకటి, సమాజం లో, వెయ్యి మగ శిశువు  జననాలకి , ఆడ శిశువుల జననం ఎనిమిది వందల వరకు పడి పోయింది ట. రేపు ఈ మగ పిల్లలు పెద్ద వారు అయి, వారికి పెళ్లి చేయాలి అంటే ఆడ పిల్లలే దొరకడం కష్తం అయి, ఒక విపరీత , విపత్కర ,పరిస్థితి కి దారి తీయ వచ్చు.
ఇలాంటి విపరీత పరిస్థితి మీద ఒక సినిమా కూడా తీసారు ట, నేను చూడలేడు, పేరు కూడా గుర్తు లేదు కాని, ఇంట్లో మగ వారు అంతా ఒక కోడలు ని ఎలా అనుభవిస్తారో, ఆమె మవున సంఘర్షణ , చివరకు ఏమయింది కూడా తెలీదు నాకు, కాని ఇలాంటి సినిమాలు, అందరు తప్పక చూడాలి, ఆడ పిల్లలు కరువైన సమాజం ఎంత దుర్భాగ్యపు స్థితి లో ఉంటుందో అందరికి తెలియాలి. 
ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిన, సామాజిక మార్పులు రానిదే, ఏమి ఫలం లేదు, వర కట్న నిరోధ చట్టం, గృహ హింస నిరోధ చట్టం, ఆస్తి హక్కు, ఇంకా చాల చట్టాలు ఉన్నాయి. ఎక్కడ స్త్రీ గావ్రవింప బడదో అంటూ, మన పురాణాలు కూడా స్త్రీలని నెత్తిన పెట్ట్టుకున్నాయి.
ఇంటెడు చాకిరి కి కొలమానం లేదు, ఒక విలువ లేదు, తన సంపాదన మీద పెళ్లి అయాక అధికారం ఉండదు, తల్లి తండ్రులని చూడ వలసి వస్తే, అత్త గారింట్లో ఆంక్షలు, సమాజం లో అడుగడుగునా చిన్న చూపు,  వీధి లోకి అడుగు పెడితే ఎదురు అయ్యే, మగవారి నీచపు చూపులు, మాటలు,  ఆఖరికి ఆఫీసు లో కూడా వివక్ష, సతాయింపులు, ఎంత పని చేస్తున్నా విసిరే చులకని మాటల కత్తులు, ఇవి అన్నీ ఎదుర్కునే అమ్మలు, ఒక స్త్రీ గా , నా కూతురుని  పువ్వులాగా ఎలా పెంచగలను, ఈ సమాజం లో అని మధన పడి, అమ్మో , నా గర్భం లో ఆడ పిల్లా? అని కన్నీళ్ళు కార్చే వారికి ఒక్కటే సమాధానం. ఏడిచే వారినే ఏడిపిస్తుంది, ఎదురు తిరిగి ఒక్కటి చ్చి,  నా గర్భం లో శిశువు నా రూపం, దానిని మొగ్గ గా తుంచే హక్కు మీకు ఎవరికి లేదు అని అరచి చెప్పాలి. 
స్త్రీలని విలాస వస్తువులు గా, అశ్లీలం గా చూపే, ఈ సినిమాలు, మీడియా ,సాహిత్యం లను మనం ఖండించాలి, ఒక మగవాడు, ప్రేమిస్తే అదే భాగ్యం అనుకుని ఒప్పు కోని వారి మీద ఆసిడ్ లతో దాడులు, అత్యాచారాలు, చిన్న పిల్లలని కూడా లేదు, వారి మీద లైంగిక దాడులు, చూస్తూంటే  , వింటూ ఉంటే, భయం వేస్తుంది, ఏమిటి సమాజం ఇలా ఇంత ఘోరం గా తయారు అయింది ఏమిటి? అని.
రోజు రోజు కీ, అభద్రతా భావం పెరిగి పోతోంది మహిళ లో, వీటి అన్నిటికి మూల  కారణం, మనిషి లో కరువు అవుతున్న మానవత్వం.. చదువు అంటే ఒక డిగ్రీ, ఉద్యోగం, డబ్బు, ఇదే, అని నమ్మే నేటి యువ తరం, అలాంటి చదువు నే ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, అంతా ఒక విష వలయం లాగ ఉంది.
అమృత భాండారం లాంటి ఒక స్త్రీ, ఒక అమ్మ, ఒక కూతురే, ఈ విషానికి విరుగుడు. 
ఆడ పిల్లలని ఆనందం  గా ఇంట్లో కీ ఆహ్వానిద్దాం, ఇద్దరు ఆడ పిల్లలే అని కంగారు  కాదు, భయం కాదు, లక్ష్మి, సరస్వతి వచ్చారు మన ఇంటికి అని సంతోషించండి, చక్కగా చదివిస్తే, ఆడ పిల్లే ఇంటికి దీపం. ఇంటికి అందం. అయ్యో ఒక్క ఆడ పిల్ల లేదే అని బాధ పడాలి , ఇప్పుడు చాల మారింది సమాజం మునుపటి రోజులు కావు అనే వారికి, 
పూణే లో ఈ మధ్యనే, ఒక టెఖి , ఆడ పిల్ల పుట్టింది అనే నెపం తో భార్య ని చంపేసాడు అనే వార్త చదివాక, ఇలాంటి ఒక్కరేనా, ఇంకా ఎంత మంది ఉన్నారో? ఎలా , ఎప్పటికి బాగుపడుతుంది ఈ సమాజం? అనే ఆవేదన లోంచి పుట్టింది ఈ పోస్ట్. వాడు పుట్టింది ఒక అమ్మ కే గా?  ఒక స్త్రీ  కే కదా? ఏమిటి వాడి దురహంకారం? ఒక నిండు ప్రాణాన్ని , తీసేయడానికి , కారణం ఆడ పిల్ల పుట్టడమా? వాడి వల్లే కదా? ఈ విషయం కూడా తెలీని మూర్ఖుడా? అందుకే అంటున్నాను, చదువు- సంస్కారం.. కలగలిపిన వ్యక్తుల తో నిండిన సమాజం కావాలి, రావాలి...



2 కామెంట్‌లు:

  1. మా పట్టణంలో టీచర్ ఉద్యోగాలు చేసేవాళ్లలో ఎక్కువ మంది ఆడవాళ్లే. బ్యాంక్ ఉద్యోగులలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి చదువులు, ఉద్యోగాల వల్ల స్త్రీల జీవితాలలో గొప్ప మార్పేమీ రాదు.

    రిప్లయితొలగించండి
  2. నేను చెప్పేది అదే, ఈ రోజు చదువు మార్పును, మానవత్వం ను, విలువలను, పెంపొందించే చదువు కాదు..స్త్రీలకు మనో వికాసం కలిగించని చదువు, ఆత్మ విశ్వాసం కలిగించని చదువులు, కాదు, మనకి కావలసినవి. అని..
    సమాజం బాధ్యత యుతం గా ప్రవర్తించ డానికి , సమాజ స్థాయి పెరగడానికి ఉపయోగించే చదువు కావాలి.
    ఆడ పిల్లలని, గఉరవం గా చూడ గలిగే సమాజం, ఇది మనకి కావలసినది..ఉద్యోగాలు, చదువులు ఎందుకు వికాసం కలిగించటం లేదో ఆలోచించాలి అందరు.

    రిప్లయితొలగించండి