"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

28 అక్టో, 2015

జ్ఞాపకాల పెట్టె ..


వెనక్కి వెనక్కి చూస్తూ నడుస్తూ
ముందుకు కదిలాను ..
నా జ్ఞాపకాల నీడలు నా వెంట ఉన్నాయా లేవా అని ..
అవి భద్రంగా ఆభరణాల పెట్టెలో
చెల్లా చదరుగా పడేసిన నగల లాగా
కొంచం మెరుస్తూ , కొన్ని మెరవక పోయినా అలవాటుగా ధరించేవి
కొన్ని ఊరికే పడి ఉండేవి ..
ఎవరూ ఎత్తుకుపోలేరు ఈ సంపద నా నుంచి ..
అలా తీరుబడిగా వడి వడి నడకలలో
కొన్ని పారేసుకుందామని పయనిస్తాను
సాయంకాలపు నీడల్లాగా ..
దొంగల్లా నా వెంటే ..ఎప్పటికీ పారేసుకోలేను అవి .
కాలంకి ఇంక అప్పచెపుతాను ఆ పని
సవ్వడి చేయక , కాళ్ళ కింద నుండి జారే
సముద్రం ఒడ్డున నీటిలా ...
సల్లగా జారిపోతాయేమో అని ఆశ ..
నిగూఢంగా అడవిలో దట్టమైన
పిచ్చి మొక్కల్లాగా అల్లుకుని ,చిక్కుకుని కొన్ని ..
విడదీస్తూ దీస్తూ కాలం వేసే చిక్కులు మరి కొన్ని
కూడిస్తూ , ఎప్పటికీ ఎడ తెగక పారే ఏరు లా ఈ జ్ఞాపకాలు ..
సెలయేరులా పారుతూ , ఏ ఒడ్డుకీ చేరని ఏరు ..ఏరులూ ..
ఈ జ్ఞాపకాలు ..
ఎన్నని మోయను ? ఎన్నని పారేయను ?
శూన్యంగా మిగిలేవు సుమీ అని హెచ్చరికలు
యే ఒక్కటని ఎంచేను ? ఏవని చించేయను ?
కలశం నిండా తొణికిస లాడే నీరుతో ..
కదిలే నేను ..ఎప్పటికీ తొణకను ,బెణకను అని
ప్రమాణాలు చేస్తూ ..ఇలా ముందుకే మరి పయనాలు చేస్తూ
నిండు కుండ లా నేను ..
నిండు కుండలా నేను ..

4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలు రాజశేఖర్ కింతలి గారూ !
      నా చిన్న కవిత నచ్చినందుకు చాలా సంతోషం .

      వసంత లక్ష్మి

      తొలగించండి
  2. Bavundi mee smrti bharata poorna kalasam..kaadu adi akshaya paatra enta todina..vooru to one vuntaayi..ఈ పయనం..ఇలా అవిశ్రాంతం గా కొనసాగుతూనే వుంటుంది..ఉండాలి..మంచి కవిత..అభినందనలు..సావిత్రి

    రిప్లయితొలగించండి
  3. Bavundi mee smrti bharata poorna kalasam..kaadu adi akshaya paatra enta todina..vooru to one vuntaayi..ఈ పయనం..ఇలా అవిశ్రాంతం గా కొనసాగుతూనే వుంటుంది..ఉండాలి..మంచి కవిత..అభినందనలు..సావిత్రి

    రిప్లయితొలగించండి