"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

10 సెప్టెం, 2015

సన్న జాజి తీగా !


సన్నజాజి తీగ డాబా పైకి
సన్నగా పాకి గుబురుగా ఎదిగింది
సాయంత్రానికి ప్రమాణం చేసినట్టు
సన్నజాజి మొగ్గలు మోసుకు వస్తుంది .
ఖాళీ పూల సజ్జను
సన్నజాజులతో నింపేయాలని
ఆత్రంతో , విచ్చిన పూలని
నిర్దాక్షిణ్యంగా తీవె నుంచి తెంపి
నా సజ్జ నింపుతూ
నిన్నటి ఏవో లాలసలు
తనువంతా పాకి ,అలసత్వం
తనువంతా నిండి
సంధ్యా దేవి
అలకలతో ఎర్రబడ్డ
ఆకాశం సాక్షిగా
పూలు కోస్తూ నేను .
విచ్చిన పూలా ?
విచ్చి విచ్చని మొగ్గలా ?
అన్న మీమాంసలూ
మొహమాటాలూ లేనే లేవు
నన్ను చూసి నవ్విన
పూలనే ఎంపిక చేసుకుంటూ
సజ్జ నింపుతూ , రాత్రి కి
సమాయత్తం అవుతున్న నేను
గాలి ఏవో ఊసులు
మోసుకు వస్తోంది
దూర దూర తీరాల గుబాళింపులు
అలవోకగా తన వెంట ..
మొన్నటి వర్షం మిగిల్చిన
వాన నీటి తో తడిసిన మట్టి వాసనో
తడిసిన మామిడి పూత
పచ్చి పరిమళమో మరి
అలసిన పొద్దు
రాత్రిలో విశ్రమించాలని
తొందరిస్తూ సమాయత్తం
అవుతున్నాది , ఆకాశం పక్క పై ..
పూలు తీవె నుండి విడివిడినా
ఇంకా ఫకాలున నవ్వుతూనే ఉన్నాయి
వియోగ విషాదానికి ఇంకా
సమయం రాలేదు .
పూలే భారమా ? అని సజ్జ
నిశ్శబ్దంగా మోస్తూ , నింపుకుంటోంది మొగ్గలు
ఇంక చాలు అని ఎప్పటికైనా నా మది
చెప్పేనా నాకు ? అని నిట్టూరుస్తూ నేను .
తీగె నంటుకుని పూసిన
పూలన్నీ దూసిన నా చేతి నిర్దయకి
ఏం శాపమో ! ఆలోచిస్తూ వెను తిరిగిన నాకు
దయగా ..కోసుకొమ్మని మరి కొన్ని
కోసుకొమ్మని ఆలస్యంగా విచ్చిన పూలు
పలకరించి ,ప్రకృతి ఎంత దయామయో
మరో సారి నిరూపించింది ..
సన్నజాజి మరునాటికి మొగ్గలు
సమాయత్తం చేసే పనిలో శ్రద్ధగా నిమగ్నమై ...
నా దయా ,నిర్దయలతో పని లేని ప్రకృతి .

12 కామెంట్‌లు:

  1. మీ సన్నజాజి తీగ పరిమళాన్ని గుబాలిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మార్పితా !
      నా సన్నజాజి పరిమళం మీకు నచ్చినందుకు ..చాలా సంతోషం ..ధన్యవాదాలు .
      వసంత లక్ష్మి

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. నవ మల్లికా !
      థాంక్యూ ! నా సన్నజాజి పూల పరిమళం మీకు చేరినందుకు ,నచ్చినందుకు ..
      వసంత లక్ష్మి

      తొలగించండి
  3. బావుంది మీ సన్నజాజి తీగ .....పూలు తీగ నుండి విడువడినా ఇంకా నవ్వుతూనే ఉన్నాయి ....చాల బావుంది

    రిప్లయితొలగించండి
  4. బావుంది మీ సన్నజాజి తీగ .....పూలు తీగ నుండి విడువడినా ఇంకా నవ్వుతూనే ఉన్నాయి ....చాల బావుంది

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీ శైలజా !
    థాంక్యూ ..సన్నజాజి తీగ కవిత మీకు నచ్చినందుకు సంతోషం ..పరిమళాలు అందరికీ చేరాయి అని తెలిపే ఇలాంటి స్పందనలు మరి ..సంతోషం పెంచుతాయి ..థాంక్యూ మరో సారి ..
    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి
  6. సింప్లీ సూపర్బ్ సన్న జాజి తీగా

    www.computerintelugu.com

    రిప్లయితొలగించండి
  7. శివనాధ్ బాజీ కారంపూడి గారూ !
    సన్న జాజి తీగ మీకు ఇంత నచ్చినందుకు చాలా సంతోషం ..
    ధన్యవాదాలు ..మీ స్పందన తెలియ చేసినందుకు ..
    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి
  8. ప్రకృతి మనకోసమే అన్న అహంకారం మనిషిది ప్రకృతి మన బానిస అనుకుంటాం అదిగమించాలని నిరంతరం ప్రయత్నం చేస్తాం కానీ ప్రకృతి మనల్ని ఎంత మాత్రం పట్టించు కోకుండా తనపని తాను చేసుకుంటుంటుంది...మన వెర్రి విపరీత మయినపుడు కళ్ళెర్రచేస్తుంది...మీ భావన బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. ప్రకృతి మనకోసమే అన్న అహంకారం మనిషిది ప్రకృతి మన బానిస అనుకుంటాం అదిగమించాలని నిరంతరం ప్రయత్నం చేస్తాం కానీ ప్రకృతి మనల్ని ఎంత మాత్రం పట్టించు కోకుండా తనపని తాను చేసుకుంటుంటుంది...మన వెర్రి విపరీత మయినపుడు కళ్ళెర్రచేస్తుంది...మీ భావన బాగుంది.

    రిప్లయితొలగించండి
  10. వసుధా !!

    ధన్యవాదాలు ,మీ స్పందన తెలియజేసినందుకు , ప్రకృతి ని అనుసరించి మన జీవనం సాగితే మనకే కాదు ,మనం నివసిస్తున్న ఈ గ్రహం కూడా మనలని ఆదరిస్తుంది అని నా నమ్మకం ..
    నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు ..వసుధా !!

    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి