"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 ఏప్రి, 2019

ఈ పాట..నా నోట..



పాట ఒక హృదయాన్ని
మీటే వరకూ ఉత్త లల్లాయి పదమే
పాట ఎన్ని ఊళ్ళు దాటినా
అలసిపోదు ఎందుకో !!

కోయిల కంఠంకి ఎవరు తేనె అద్దారు ?
హంస కి ఠీవి, నెమలి కి నాట్యం
నేర్పినవారు , నా కేమి నేర్పించారో
అని రోజూ వెతుకులాటే !!

సంగీతం అంటే నాకు
పగళ్ళు రాత్రుళ్ళు గా మారడమే
ఆకాశం నలుపు రంగు పూసుకునే
ప్రతీ నిముషమూ ఓ స్వర రాగమే !!
వెన్నెల కురిపించే ప్రతీ రాత్రీ
జుగల్బందీ నా కళ్ళ ముందు !!

నీ చుట్టూ చేరి మోగే
అనవసర మోతలు ఒక్కసారి కట్టేయ్
నిశ్శబ్దంలో అలా తపస్సు చేస్తే
నీకు నీ పాట వినిపిస్తుంది .

సంగీతానికీ ,శబ్దానికీ
మృత్యువు లేదు ,కొండలు పాడే
మౌన రాగం ఎన్ని శతాబ్దాలు అయినా
ఒకటే తాళం వేస్తూ నిలబడి ఉంటుంది .

ఆకులు పాడే రాగ మధురిమలు
అమ్మ చెట్టుకి ఎంత ఇష్టమో
కదలక ,మెదలక ,స్థాణువుగా
వింటూ పూలను రాలుస్తూ ఉంటుంది  ...

వసంత లక్ష్మి
04 - 04 - 2017 .
కువైట్

2 కామెంట్‌లు:

  1. ఆకులు పాడే రాగమ్
    ఎంత మంచి ఆలోచనలు పక్కనే సంపెంగలు సంవజస్జులు కలిపి గుబాళించే కవిత్వం నీకు మాత్రం సొంతం సొంతం

    రిప్లయితొలగించండి