"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

31 మార్చి, 2019

అమ్మదనం



వంటింట్లో గట్టు మీద
కుదురుగా చట్టు మీద
సద్దుకుని కూర్చున్న
మట్టి కుండ అమ్మ ..

దాహం వేసినప్పుడు
గ్లాసు ముంచుకుని
నీళ్లు తాగడమే తెలుసు..
ఎప్పుడూ నిండుగా నీళ్లు
నింపి ఎలా ఉంటాయి
అని ఆలోచన లేని పిల్లలం మనం.

ఆకులతో గుబురుగా
నిండిన చెట్టు పై వచ్చి వాలే
వలస పక్షులం మనం ..
పట్టణాలు , దేశాలు వలస
వెళ్లిన వాళ్ళం..
ఆకు రాలు కాలం ఒకటి
ఉంటుందని చెట్టుకి
తెలిసినా తెలియనట్టు
చరించే పిల్లలం మనం..
అమ్మ ఎప్పుడూ నిండుగా
గల గల లాడుతూ ఉంటుంది
అని భ్రమిసే అమాయకులం మనం.

నది కూడా అంతే..
నీళ్లు ప్రవహిస్తున్నంత కాలం
పరవళ్లు తొక్కుతూ ఆడుకుంటాం
పాడుకుంటాం ఒడ్డునే ..
నది ఒట్టి పోయిన రోజునే
వలస వెళ్లిపోతాం..
ఆకుపచ్చని తోటలు
వెతుక్కుంటూ ..

పిల్లలమే కదా మన పిల్లలే కదా
అని ఎంత కాలం ఓర్చుకుంటుంది అమ్మ..
చూస్తూ ఉందాం..
చూస్తూ ఉంటుంది అమ్మ..

31 03 2018
వసంత లక్ష్మి
కువైట్.

2 కామెంట్‌లు:

  1. మీ కవితలు భలేగా వుంటాయి, వసంతలక్ష్మి గారు!

    "ఆకులతో గుబురుగా
    నిండిన చెట్టు పై వచ్చి వాలే
    వలస పక్షులం మనం ..
    ... .... ...
    ఆకు రాలు కాలం ఒకటి
    ఉంటుందని చెట్టుకి
    తెలిసినా తెలియనట్టు
    చరించే పిల్లలం మనం.."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు అండీ లలితా TS
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం.ఎప్పుడో రాసినవి ఇలా బ్లాగ్స్ లో ఒక చోట భద్ర పరుస్తున్నాను.
      వసంత లక్ష్మి.

      తొలగించండి