"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

10 జన, 2010

మన అలవాట్లు..మనం....

మనం చిన్నప్పట్ట్టి నుంచి నేర్చు కున్న అలవాటులే మనలని జీవిత కాలం వరకు నడిపిస్తాయి. ఎంత మారాలని ప్రయత్నించిన, మనం మన అలవాట్లు కి బానిసలం.నడి వయస్సు రాగానే, అందరం, పుల్కాలు అంటూ కొత్త అలవాటు చేసుకుంటామా ఎప్పుడైనా, ఒక రోజు అవి మానేసి, అన్నం తింటే, ఎంత తృప్తి గా ఉంటుందో? వేడి, వేడి, తెల్లని అన్నం లో, ఆవకాయో, కంది పోడో,ఇంత నెయ్యో, నానో వేసుకుని ,కంచం నిండుగా తింటూ ఉంటే, స్వర్గం కి కొంచం దూరం లో ఉన్నట్టు ఉంటుంది.మనం చిన్నప్పుడు, ఏమేమి చేసామో, అవన్నీ, ఇప్పుడు చేయ లేక పోయిన, ఆ అలవాట్లు ని మటుకు మర్చి పోలేము. ఇరవై ఒక్క రోజులు ఏ పని అయిన చేస్తే అది అలవాటు అవుతుంది అని, కొంత మంది నమ్మిస్తారు. అర్ధ రాత్రి ,పన్నెండు గంటలు వరకు  గుడ్ల గూబ లాగ మేలుకుని, ఏదో ఒక స్వీట్ తిని పడుకుంటే కాని, నాకు నిద్ర పట్టదు.చిన్నప్పుడు ఏళ్ళ తరబడి ,  పరిక్షల కోసం చదివి, చదివి, అయిన అలవాటు ఇది. ఉదయం ఏడు గంటలకి తెల్ల వారుతుంది అందుకే.. నాకు.ఉదయించే సూర్యుడు, అందాలు అని ఎంత వర్ణించినా.. అస్తమయం చూస్తూ, ఊహించు కోవడమే.ఎందు కైనా, అవసరం అయి, తెల్ల వారు ఝామున అయిదు గంటలు కి లేస్తే, ఆ రోజు అంతా మత్తు  మంది ఇచ్చి  ఆపరేషన్ చేసేక, మెలకువ వస్తే, ఎలాగా అవక తవక గా ఉంటుందో, అలాగా అస్త వ్యస్తం అయిపోతుంది. మన శరీర వ్యవస్థ, మనస్సు కూడా. చిన్నప్పటి అలవాట్లు అందుకే అంత   powerful అంటున్నాను. ఇలాంటివే పుస్తకం చేతిలో పట్టుకుని చదువుతూ పడుకోవడం, పొద్దున్నే, కాఫీ తాగాలి అంటే, చేతులో, హిందూ పేపర్ ఉండాలి అనుకోవడం,అమెరికా అవీ వేరే దేశాలు వెళ్లి నప్పుడు , పొద్దున్నే పేపర్ రాదు అంటే, నెట్ లో చదువు కుంటూ, కాఫీ తాగ డానికి ప్రయత్నం చేయడం, ఇవి అన్నీ చిన్నప్పటి అలవాట్లే మరి. మన దేశం లోని రైళ్ళు సరిగ్గా సమయానికి రావడం, నాకు, చాల ఇబ్బంది కలిగించింది. చిన్నప్పటి అలవాటు ప్రకారం, ఒక గంట లేటు అని బయలు దేరితే, ఇప్పుడు రైళ్ళు మిస్ అవుతాము. నేను మారలేదు కాని, యీ రైళ్ళు మారాయి.అలవాట్లు ని మార్చు కున్నాయి. రేపటి నుండి నేను కూడా, ఉదయించే సూర్యు డిని చూడ డానికి ప్రయత్నిస్తాను. మరి, తొమ్మిది గంటల కే మంచం ఎక్కేయాలి, సెలవా మరి???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి