"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

12 ఏప్రి, 2010

పిచుక మీదా బ్రహ్మాస్త్రం?

పిచుక మీదా బ్రహ్మాస్త్రం? అనే నానుడి వినే ఉంటారు, ఇప్పుడు పిచుక అంటే?? ఏమిటి?? ఏమిటి అది అని మన పిల్లలు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాలి మనం.మన చిన్నప్పుడు, తిరగని ఫ్యాన్ మీదో  , అలమరః ల్లోనో,ఓ పిచుక వచ్చి గూడు కట్టడం, అందులో గుడ్లు కూడా పొదగడం, అవీ పొరపాటున కింద పడితే, పిల్లల ఏడుపులు, అమ్మలు నచ్చజెప్పడం, అద్దం కనిపిస్తే , ఇంకో పిచుక అనుకుని పాపం, పొడిచి, పొడిచి, అద్దం మీద గీతలు వేయడం,నేల మీద గింజలు కనిపిస్తే కిచ కిచమని గోల చేస్తూ, అవీ తినడమే కాక ఇంకో నాలుగు పిచుకలని వెంట పెట్టుకు రావడం,అన్నీ గుర్తు ఉన్నాయి, అయితే గుండె ఘల్లుమంది, మొన్న పేపర్ లో, పిచుక ల సంరక్షణ రోజు అని ఓ రోజు న చదివి నప్పుడు.
అవును కదూ , ఎన్ని రోజులయింది పిచుకలని చూసి, వాటి కిచ కిచ మంటూ చేసే సవ్వడి విని. కాకులు ఇంట్లో కి అదీ, ఫ్లాట్ లోకి వచ్చేస్తున్నాయి  అని గ్రిల్ల్స్ పెట్టిందాం అనుకున్నాం, ఇప్పుడు ఆలోచిస్తే, నాలుగు ఎంగిలి మెతుకులు కోసం వస్తున్నాయి, పాపం అని అనిపిస్తోంది.
ఈ పిచ్చుకలు ఎప్పుడు మాయం అయిపోయాయి, మన ఇళ్ళల్ల లోంచి. మనం ఇల్లు కూల్చి ఫ్లాట్స్ కట్టుకుని, తలుపులు గట్టిగా ప్రకృతి కి మూసినప్పుదేనా,లేక,కరెంటు వైర్లకి అడ్డం అని చెట్లు కొట్టేసినప్పుడా లేక బియ్యం బస్తాల్లో,చిల్లుల గోనె సంచిల్లో మానేసి, ప్లాస్టిక్ సంచుల్లో తేవడం మొదలు పెట్టినప్పుడా, గోనె బస్తాలు అయితే ,దారి లో పడిన గింజలు పిచుకలకి ఆహారం అయేవి, మనం మన సుఖ్యం కోసం చేసుకునే సదుపాయాలూ, ఏవో జీవ రాసులకి , జీవన్మరణ సమస్య అవుతోంది అంటే,ఆశ్చర్యం కలుగుతుంది కదా.
ఇప్పుడు కొండల్లో, కోనల్లో, దైనాసార్లు వాటి అవశేషాలు కోసం వెదు కుతున్నారు అని చదువుతాం,రేపు ఈ పిచుకల గుర్తుల కోసం వెతకాల్సి వస్తుంది అంటే, ఇంకా ముందు కి పోయి, ఈ దేశాల మధ్య యుద్ధాలు, అణ్వాయుధాలు,చూస్తూంటే, మానవుల జాడలు కూడా మిగలవు అనిపిస్తోంది. ఎక్కడికి పోతున్నాం మనం??
పులుల్ని గోళ్ల కోసం పులి చర్మం కోసం చంపడం ఆపలేక పోతున్నాం, జపాన్ దేశం తిమింగలాలని చంపడం తమ హక్కు అంటోంది, ఏనుగులు సరే సరి, వాటి అమూల్య మైన దంతాల కోసం ఎన్ని వేల ఏనుగులను చంపారో ఆఫ్రికా వాసులు. మృగాలు నివసించే అడవుల్లోకి చెట్లు కొట్టి,వ్యవసాయం అంటూ,మైదానాలు, చేసి, లేదా గనులు తవ్వుతాం అంటూ రోడ్లు వేసి,అడవి మృగాలకు నివాసం లేకుండా పట్టణాల్లోకి తరుముతున్నాం.
అడవిమృగాలు,అరణ్య సంపద తరువాత, ముందు చిన్న,చిన్న పక్షులం, పిచుకలం,మా సంగతి ఏమిటి? పిచుకా మీద బ్రహ్మాస్త్రం? అని పిచుకలు కిచ కిచ మని, ప్రశ్నిస్తున్నట్టు  తోస్తోంది.
మనం ఏమని జవాబు ఇవ్వాలి? పిచుకలని తిరిగి మన దైనందిన జీవితాల్లోకి ఎలా ఆహ్వానించాలి? కోయిల కూస్తే వసంత ఆగమనం పిచుకలు తిరిగితే మన ఆహార సంపద,ఇలాగ కొన్ని సజీవ సమాసాలు ఇవి. మనం బ్రతుకు తూ, మన చుట్టూ ఉన్న ప్రాణులని కూడా బతకనిద్దాం అని శపధం చేదామా..లాభం లేదు,మన జీవన విధానమే మార్చుకోవాలి అంటే,పిచుక ల కోసమా అని నవ్వుతారేమో. 
మన ముందు తరం వాళ్ళు, పిచుకలని బొమ్మల్లోనే చూడ గలరు,ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో??  
అంతా మన చేతుల్లోనే ఉంది..ఇప్పటికైనా మేలుకుందాం.

2 కామెంట్‌లు:

  1. అవునండీ నిజమే మీరన్నాకే అనిపిస్తోంది పిచ్చుక ని చూసి ఎన్నాళ్లాయింది??????

    చిన్నప్పటి పిచ్చుక ఙ్ఞాపకాలు భలే గుర్తు చేసారు.... నాకు ఇప్పుడు అర్జెంట్ గా పిచ్చుక ని చూడాలనిపిస్తోంది, ఎలా?

    రిప్లయితొలగించండి
  2. మీ బాధ నిజమే. ప్రస్తుతం పిచ్చుకలు కనబడకపోవడానికి కారణం నాకు తెలిసి సెల్ ఫోన్ టవర్స్. ఈ మధ్య పరిశొధనలలో తెలిసిన విషయం. టవర్స్ నుంచి వచ్చే ఫ్రీక్వేన్సీ వల్ల పిచ్చుకలు చనిపోతున్నాయని. పట్టణాల మాట అటుంచితే మా పల్లెటూర్లో కూడా అవి కనబడటం లేదు. ఆఖరికి మొన్న ధాన్యం కోతల రోజు కూడా. పాపం పిచ్చుకలు.
    శ్రీవాసుకి, http://srivasuki.wordpress.com

    రిప్లయితొలగించండి