"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

1 ఏప్రి, 2010

మా ఈజిప్ట్ విహార యాత్ర విశేషాలు

 ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఈజిప్ట్ యాత్ర ,మార్చ్ నెల ఇరవై మూడున , కువైట్ నుంచి ప్రారంభించాం.
 నేను, నా సహచరుడు కుమార్ ఇక్కడ నుంచి బయలు దేరి, కైరో లో మిగిలిన భారతీయ కుటుంబాలను కలిసాం. SOTC  మేనేజర్, మరి కొందరు, ఇండియా నుంచి వచ్చిన వారు అందరం కైరో  విమానాశ్రయం లో కలిసి  మా రేసోర్ట్ హోటల్ కు బయలు దేరి వెళ్ళాం. దారి లో కైరో నగరం ని వీక్షించే అవకాసం కలిగింది.విమానం నుంచి కూడా చూసాం, అంత ఎడారి, ఒక ఎడారి రంగు లో ఉంది నగరం, ఎక్కడ పచ్చదనం కనిపించ లేదు. విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణం , మా హోటల్ కు. రోడ్డులు అన్నీ చాల ట్రాఫ్ఫిక్ తో నిండి, మా బస్సు ప్రయాణం చాల నెమ్మదిగా సాగింది. రెండుకోట్ల జనాభా కలిగి, నివాస యోగ్యమైన పట్టణం గా కైరో, జనావాసం తో  కిటకిటలాడడం లో ఆశ్చర్యం లేదు. కైరో నగరం ఈజిప్ట్ రాజధాని కూడా కదా. 
ఒక  పక్క ఎత్తైన భవనాలు, మరో పక్క ఎర్రటి ఇటేకలు తో పిచుక గూళ్ళు లాగా కట్టిన మిద్దెలు, ఈ దేశం పేద  దేశం అని, కాని, చక చక సాగుతున్న కట్టడాల పని చూస్తే, అభివృద్ధిచెందుతున్న దేశం అని రెండు రకాలు గా అర్ధ అవుతుంది. వీరికి అత్యధిక ఆదాయం  తెచ్చే పరిశ్రమ ,మనమే అంటే మన లాంటి యాత్రీకులు, మరి ఒక ఆదాయం తెచ్చే వనరు , సజీవ , సనాతన , జీవ నది, నైలు  నది. 
చిన్నప్పుడు నాగరికత అంతా నదుల పక్కనే విలసిల్లుతుంది అని చదువుకున్నాం కదా, ప్రత్యక్షం గా ఇప్పుడు చూస్తున్నట్టు తోచింది. ఈజిప్ట్ నాగరికత అతి పురాతన మైనది, నైలు నది తో ముడి పడి ఉన్నది. అత్యధిక ప్రాంతం ఎడారి అయినా ,నైలు నది వెంబడే రాజ్యాలు వెలిసాయి, ఫారోలు అని పిలవబడే రాజులు తాము అత్యంత శక్తి వంతులం అని నమ్మి, తామే మళ్లీ ఇంకో జన్మ లో మళ్లీ పుడాతం , అవిచ్న్నం గా రాజ్యం ఏలుతం అని నమ్మి, తమ శరీరాలను,చనిపోయాక,  భద్ర పరుచు కున్నారు, అవే మమ్మేలు, వాటిని అతి భద్రం గా గొప్ప పిరమిడ్ ల మధ్య సకల సౌభాగ్యాలతో ,దాచి పెట్టారు.రాజుల సంపద  రాళ్ళ పాలు , అన్నారు కదా అందుకే. ఇవే గిజా పిరమిడ్లు ,మనం కైరో లో చూడబోయేవి. 
టూర్ లో మొదటి రోజు మేము ఆ పిరమిడ్లు చూడదానికే  వెళ్ళాం, కైరో లో ఎక్కడి నుంచి అయినా కనిపిస్తాయి, నూట ఏభై మీటర్ల ఎత్తున ఉన్నాయి మరి అవీ.ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈ పిరమిడ్లు చూడడం ఒక అపురూపమైన అనుభూతి. ఒక పిరమిడ్లో కి మనం పూర్తి గా వంగి పాక్కుంటూ కొంత దూరం వెళ్ళితే, ఒక విశాల మైన గది లోకి వెళతాం, అక్కడే ఈ మమ్మేలను ,ఏవో లేపనాలు పూసి, ఒక బట్ట లో చుట్టి, ఒక పెట్టె లో పెట్టి  సమస్త పరివారం, ఆభరణాలు, మరు జన్మ కు కావలసిన అన్నీ సదుపాయాలతో దాచి పెట్టే వారు ట.ఇరవై మూడు బి . సి. కాలం నాటివి, ఇప్పటికీ చెక్కు చెదర కుండా ఉండడమే వాటి గొప్పతనం. పటిష్త మైన  ఈ పిరమిడ్ల లోకి దారి వెదుకుతూ, ఎందఱో అన్వేషకలు పిచ్చి వారయారు, కొందరు చోర శిఖామనులకే ఇది సాధ్య మైనదని చెప్పుకుంటారు. సంపదలు పోగా, మిగిలిన కొన్ని మమ్మిలను కైరో మ్యూసేం లో దాచి పెట్టారు.
ఇదే స్థలం లో  మనిషి ముఖం, సింహం శరీరం కలిపిన   ఒక అతి పెద్ద విగ్రహం చెక్కి ఉంటుంది. దీనినే స్ఫిన్క్ష అంటారు.రాజులు తాము అతి శక్తి మంతులు గా ఊహించుకుని, వారికే సింహం అంతటి శారీరక బలం మానవుడికి ఉండే పదునైన తెలివితేటలు కలిస్తే కలిగే రూపం ని ఇక్కడ ఒక పెద్ద విగ్రహం గా ఆవిష్కరించారు.అప్పటి కాలం లో ప్రజలు అమాయకం గా రాజులనే దైవం గా కొలిచే వారు. నైలు నది ఫలం గా సుఖ సంతోషాలకు లోటు లేదు, రాజులు తమ ప్రాబల్యం చాటి చెప్పేందుకు, సామాన్య ప్రజలకు పని కల్పించేందుకు, వ్యవసాయ పనులు లేని కాలం లో ఇలాంటి అతి పెద్ద విగ్రహాలు, గుడులు, పిరమిడ్లు కట్టించే  వారు అని చరిత్ర కారులు చెపుతున్నారు.పిరమిడ్ల నిర్మాణానికి రాల్లెత్తిన్ననలభై వేల  కూలీలను స్మరించుకుంటూ అక్కడి నుంచి కదిలాం. ఈ టూర్లలో సమయ పాలన చాల  అవసరం.మేము ఉదయం ఎనిమిది గంటలకు బయలు దేరం, రేసోర్ట్ నుండి, ఇక్కడ మూడు గంటలు సమయం గడిపాం, ఫోటోలు తీసుకోవడం కూడా ఒక ముఖ్య అవసరం కదా,ఇక్కడి నుంచి మేము ఈజిప్ట్ లో తయారు అయే నూలు వస్త్రాల దుకాణం కి వెళ్ళాం.నైలు నది కురిపించే వరాలలో పత్తి పంట ఒక ముఖ్య మైన వరం, దాని నుంచే మేలు రకం నూలు తయారు చేసి వివిధ వస్త్రాలు తయారు చేస్తారు. తరువాత ఈజిప్ట్ లోనే లభించే పపిరుస్ అనే పేపర్ తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళాం. పపిరుస్ అనే ఒక నీటి మొక్క నుంచి, వేల ఏళ్ల క్రితమే ఇక్కడ వాళ్ళు పేపర్ ఎలా తయారు చేసే వారో, దాని మీద అందమైన బొమ్మలు, కథలు, ఈజిప్ట్ కే సొంతం అయినా బొమ్మల లిపి తో పేర్లు, వివరాలు ఎలా తయారు చేసే వారో, మాకు చూపించారు. ఈ పేపర్ అతి పురాతన మైన పేపర్ అని, ఎన్నో విషయాలు తెలిశాయని, వీటి వల్ల అక్కడ వారు వివరించారు. మన పేరు రాసిన ఒక చిత్రం కొనుక్కుంటే మన పేరు కూడా వేల ఏళ్ళు వరకు చిరస్థాయి గా ఉంటుందని, మేమూ కొన్నాం.
మాతో పాటూ, ఒక సంచాలకుడు లేదా గైడ్ కూడా మా టూర్ అఏంత వరకు ఉన్నాడు, అతని పేరు మండూ, ఈజిప్ట్ చరిత్ర మీదే అతఃని చదువు ,చాల చక్కగా అన్నీ వివరించాడు అతను మాకు.
ఇవి అన్నీ చూసే సరికి, మాకు భోజనం సమయం అయింది, అని నీరసం గా పడుతున్న అడుగులు చెప్పాయి, ఈ దేశం లో ప్రసిద్ధి చెందినా ఫలఫిల్ అనే గారె లాంటి వంటకం ,ఒక బ్రెడ్డు మధ్య పెట్టి, సలాడ్ తో కలిపిన సాండ్విచ్ ,ఆ రోజూ మా భోజనం. బస్సు లోనే కూర్చుని తినేసి, అవీ, బస్సు లో అమ్మే మంచి నీరు సీసాలు కొనుక్కుని, తాగేం.ఈ దేశం లో నీరు అందరు కొనుక్కునే తాగుతారుట.అంటే మన లాంటి యాత్రీకులు, రోజూ కొనుక్కోవల్సిందే. 
తరవాత మేము కైరో మ్యూసియం కి వెళ్ళాం, అక్కడ మా గైడ్ మాకు చక్కగా అన్నీ చూపించాడు. కాళ్ళు నొప్పి పుట్టెంత పెద్ద మ్యూసియం అది. బాల రాజు, తూతెన్ హం మమ్మీ వద్ద దొరికిన సంపదలు, అతని ముఖ మాస్క్, అందమైన నేఫ్రాతతిస్ రాణి విగ్రహం, ఆమె ధరించిన నగలు, ఈజిప్ట్ రాజులు ఉపయోగించిన అనేక వస్తువులు, మమ్మిలా తవ్వకం లో దొరికిన అరుదైన వస్తువులు అన్నీ ఇక్కడ భద్ర పరిచారు. మమ్మిలని చూడడానికి వేరే టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. 
మనం వెళ్ళే టూర్ వారు ఈ టికెట్లు అన్నీ ముందే కొని ఉంచితే ,మనకు చాల సమయం కలిసి వస్తుంది, ఈ టికెట్ల ధరలు కూడా ఎక్కువే ఉంటాయి, మన టూర్ వారు మన దగ్గర  వసూలు చేసే  డబ్బు లో ఇవి అన్నీ కలసి ఉన్నాయో లేదో ముందే చూసు కుంటే మంచిది. లేక పోతే మనం అక్కడి  కక్కడ ఇవి కొనుక్కుంటే, మొత్తం మీద చాల ఖర్చు అవుతుంది మనకు.
ఆ రోజు ఇంక అవలేదు, ఆఖరు గా ఒక ఓడ మీద డిన్నర్ కి తీసుకు వెళ్లారు. అక్కడ మగ వారికి ఒక ఆకర్షణ, బెల్లి డాన్స్, ఈజిప్ట్ లోనే ఎంతో ఫేముస్ నృత్యం ఇది. డిన్నర్ చేస్తూండ గా ఈజిప్ట్ దేశ, సంగీతం, నృత్యం తో అలరించారు. ఆ రాత్రి  కి ఇంక అలసి పోయి మా రేసోర్ట్ కి చేరాం.
రెండో రోజు ఉదయమే మేము అలెక్షాన్ద్రెయ  కి బయలు దేరాం  బస్సులో. రెండు వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న ముఖ్య మైన ఓడ రేవు అది, మధ్య ధార సముద్రం ఒడ్డున ఉంది.చాల పురాతన పట్టణం, గ్రీకు వీరుడు ,అలెక్షన్దెర్ పేరు మీద కట్టిన ఊరు అది, అక్కడ కూడా కొన్ని మమ్మిలను భద్ర పరిచే తవ్వకాలు, భూమి అడుగున గదులు తవ్వి , అరలు అరలు గా భద్ర పరిచే వారుట. అక్కడ నుంచి ఒక పెద్ద పొమ్పెఇ స్థూపం, పురాతన ఫోర్ట్, సముద్ర ఒడ్డున లైట్ హుసే ఉన్న ప్రదేశం అవీ, అన్నీ చూసి, అతేన్స్ హోటల్ లో భోజనం చేసి, అతి పెద్ద గ్రంధాలయం చూడడానికి వెళ్ళాం. చాల అందమైన కట్టడం అది, ప్రపంచం లోని అన్నీ లిఖిత పత్రాలు అక్కడ భద్ర పరుస్తున్నారు, ఈజిప్ట్ దేశ గ్రంధాలు అన్నీ అక్కడ ఉన్నాయి ట, పగటి వేళ సూర్య కాంతి ని ఉపయోగించుకునేలా ,నింగి లోకి తొంగి చూస్తున్నట్టు,తెరచిన  కళ్ళు లాంటి కిటికీలు పైన కప్పు మీద అమర్చారు. అక్కడే కూర్చుండి పోయి, పుస్తకాలు చదువుకుంటూ ఎన్ని రోజులు అయినా గడప వచ్చు అనిపించింది.మృష్టాన్నం ముందు పెట్టి ఆకు లాగేసి నట్టు అనిపించింది  నాకు అయితే.
వెనక్కి కైరో చేరి రాత్రి భోజనం ఒక భారతీయ హోటల్ లో చేసి, మా వసతి కి చేరాం, మర్నాడే, మేము విమానయానం చేసి ఆస్వాన్ చేరాం. అక్కడే మా నైలు నదీ విహారం మొదలు అవుతుంది. ఒపేరా అనే ఓడ లో మా నివాసం మరో మూడు రోజులు. అదే తీరం లో ఎన్నో ఓడలు, యాత్రికులతో నిండి పోయి, కళ కళ లాడుతూ ,రకరకాల వేష భాషలు తో, దేశ దేశాల వారు కనిపిస్తారు.
నాలుగో రోజు మా ప్రయాణం మధ్య రాత్రి రెండు గంటలకు లేవడం తో మొదలు అయింది,ఆస్వాన్ కు   270 km. దూరం లో రామ్సేస్ రెండు అనే గొప్ప ఈజిప్ట్ రాజు కట్టించిన అబూ  సింబల్ అనే టెంపుల్ చూడడానికి కొన్ని బస్సుల కనవోయ్ సురక్షిత జాగ్రత్తల నడుమ బయలు దేరింది, దారి అంతా ఒక ఎడారి రోడ్డే. నైలు నది పశ్చిమ తీరాన కట్టిన ఈ టెంపుల్ నైలు నది ఒడ్డున మహా అద్భుతం గా కట్టబడింది. రామ్సేస్ రెండు అప్పటకి ఒక తిరుగు లేని రారాజు. అతని రాజ్య వైభవం అంతా ఈ టెంపుల్ లోని గోడల మీద, అతి పెద్ద విగ్రహాల మీద చెక్కిన దృశ్యాల లోను మనం కళ్ళ కు కట్టినట్టు ఊహించు కోవచ్చు.నైలు నది మీద కట్టిన అతి పెద్ద ఆనకట్ట వల్ల ఏర్పడిన అయిదు వేల కిలో మీటర్ల సరస్సు లో మునిగి పోకుండా కాపాడి,తిరిగి కట్టారు ఈ అబూ సింబల్ అనే టెంపుల్ ను.ఇక్కడే తన రాణి నేఫేర్తరి కి కూడా ఒక టెంపుల్ కట్టాడు ఈ రాజు. ఈ రెండు temples లోనూ ,చక్కని కుడ్య  చిత్రాలు, చెక్కి ఉన్నాయి. ఆస్వాన్ కి తిరిగి వచ్చే దారిలో ఆస్వాన్ డం చూసాం, ఊరి మధ్యలో ఒక గ్రానిటే కొండ , దానిలో ఒక పెద్ద స్థూపం ,సగం చెక్కి ఉన్నది చూసాం, దీనిని ఒబెలిస్క్ అంటారు. ఇది అసంపూర్తి గా ఉన్న ఒబెలిస్క్. అక్కడి నుంచి ఆస్వాన్ లోనే ప్రసిధమైన సుగంధ తైలాలు  తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళాం. స్వచ్చమైన , సుగంధాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. 
ఆ రోజు సాయంత్రం  ఓడ కొంత దూరం ప్రయాణం చేసేక, కొమోమ్బో అనే మరో టెంపుల్ చూసాం,అవీ రెండు తెంప్లెస్, ఒకటి హరొఇఎస్ అనే దేవుడుకి, మరొకటి సోబెక్ అనే దేవుడు డి, ఒకటి పక్షి తల మరొకటి మొసలి తల తో ఉంటాయి.ఇవి రెండూ నైలు నది ఒడ్డునే ఉంటాయి. మా ఓడ నైలు నది లో ప్రయాణం చేస్తూ, ఉదయం ఎడ్ఫు టెంపుల్ కి చేరింది.ఈ టెంపుల్ హోరుస్ అనే దేవుడు కి అంకితం చేయ బడింది, ఇది కర్నాక్ తరువాత రెండో పెద్ద టెంపుల్, చక్కగా చెదిరి పోకుండా దొరికిన టెంపుల్ ఇది, ఎడారి లో కూరుకు పోయిన ఈ గుడి ని తవ్వగా బయట పడింది ట, ఇది అందుకే పరిరక్షించ బడింది అని చెప్పారు. ఆ రోజు అంతా ఇంక మాకు విశ్రాంతి ఓడ మీద.
నైలు నది లో  ఎస్న లాక్ అనే తలుపులు ని దాటుకుని, లక్షొర్ అనే పట్టణం చేరాం, మా ఓడ లో.లక్షొర్ ఒకప్పుడు ఈజిప్ట్ రాజధాని గా విలసిల్లింది, అతి పెద్ద టెంపుల్ కర్నాక్ టెంపుల్ ఇక్కడే ఉంది. రాజుల లోయ, రాణుల లోయ అంటే వాలేయ్స్ ఆఫ్ కింగ్స్ అండ్ వాలేయ్స్ ఆఫ్  క్వీన్స్ కూడా ఇక్కడే చూడ వచ్చు.కర్నాక్ టెంపుల్ రాత్రి సౌండ్ అండ్ లైట్ షో ని దర్శించం,ఆ సాయంత్రమే.చాల చక్కగా రూపందించారు ఈ షో.మనం ఎక్కడికో చరిత్ర పుటల్లో కి వెళ్ళి వస్తాం.. మరునాడే, ఆఖరి రోజు, కర్నాక్ టెంపుల్ పగలు చూసి, ఆనందించాం,అక్కడి గోడల మీద చిత్రించిన ఈజిప్ట్ క్యాలెండరు లేదా మన పంచాంగం చూసాం, వ్యవసాయానికి ఉపయోగించే  పని ముట్లు,అప్పటి జీవన విధానం అంతా చిత్రాల్లో, చిత్రాలతో కూడిన భాష లో చెప్పారు, ఈ రోజు మనం ఈజిప్ట్ చరిత్ర ను ఇంత బాగా తెలుసు కున్నాం అంటే ,ఈ పూర్వ రాజుల దూర దృష్తి వల్లనే అనిపించింది.అయిదు వేల ఏళ్ల నాటి ఈ తెమ్పలేస్ లో ఎంతో సమాచారం పొందు పరిచారు, అక్కడి నుంచి, ఈజిప్ట్ చరిత్ర లో  ఒకే ఒక స్త్రీ  రాజ్యం ఏలింది,  రాణి హత్స్చేప్సుట్ టెంపుల్ ఆవిడ కట్టించింది, అది కూడా చూసాం.
ఎన్ని  తెంప్లెస్, ఎన్ని గుహలు, ఎన్ని పిరమిడ్స్, ఎంత చరిత్ర... ఒక వారం రోజుల్లో చూడ గలిగినంత చూసాం, ఈజిప్ట్ నాగరికత ఎంత పురాతన మైనదో, ఎంత అభివృద్ధి  చెందిందో ఆ రోజుల్లో నే, నైలు నది ఒడ్డున ఎన్ని రాజ్యాలు వెలిసాయో, ఎలా రాజ్యం ఏలాయో, అప్పటి ప్రజలు వారి జీవన విధానం, పిరమిడ్లు కట్ట డానికి ఆ రోజుల్లో వారికి ఉన్న మేధా సంపత్తి, చని పోయిన వారి శరీరాలను భద్ర పరచ డానికి వారు ఉపయోగించిన వైద్య విజ్ఞానం, నైలు నది తీరు తెన్నులని ఎరిగి వారు ఎలా మలిగారో, వేల ఏళ్ళు క్రితమే ఒక భాష ని కనుగుని, పప్యరుస్ ల మీద  ఎలా భద్ర పరచారో, వారి ఇల్లు, వారి వ్యవహారాలూ, అన్నీ ఒక తెఱ మీద చూసినట్టు తోచింది. 
మనం ఇప్పుడు ఎంతో అభివృది చెందాము అనుకుంటున్నాం, కాని ఈజిప్ట్ నాగరికత వైభవ విన్యాసం చూసిన తరువాత, మనం సాధించింది తక్కువే అనిపించింది. కాలం ముందు ఎవరు అయినా తల వంచక తప్పదు అని, అంతటి వైభవం కాలమనే గతి లో రాళ్ళు గా మిగిలింది కదా ,అని ఏవో చరిత్ర పాఠాలు నేర్చుకుని వచ్చాం అని కొంత భారం గా, చరిత్ర పుటలు ని తిరగేసాం అని కొంత సంతోషం గా, ఇన్ని రోజులు కలసి తిరిగిన టూర్ సభ్యులు విడి పోతున్నాం అని కొంత బెంగ గా, చక్కని దేశం ను, నైలు నది ని చూసాం అని సంబరం తోను.. 
భారమైన హృదయాలతో తిరిగి ముప్ఫై మార్చ్ నాటికి కువైట్ చేరాం..కథ కంచికి అంటే కువైట్ కి చేరింది. సెలవా మరి..   









6 కామెంట్‌లు:

  1. Mee vihara yatralo annitini meeru choodadame kakunda maku kooda kallaku kattinattu choopincharu.

    chala thanks.
    Sri

    రిప్లయితొలగించండి
  2. Excellent...మీ విహార యాత్రా విషేషాలు చాలాబాగున్నాయి...ఫొటొలు కుడా జత చేస్తే చాలా బాగు౦డేది...

    రిప్లయితొలగించండి
  3. ఈజిప్ట్ దర్శనం ఒక జీవితకాల అనుభవాన్ని మిగులుస్తుంది. యాత్రా విశేషాలు చక్కగా వ్రాశారు. మరికొన్ని ఫొటోలు ఉంటే వ్యాసానికి నిండుతనం వచ్చేది.

    రిప్లయితొలగించండి
  4. చూడాలనే వుత్సుకత కలిగించారు. చాలా చక్కటి రైటప్.

    రిప్లయితొలగించండి
  5. చూడాలనే వుత్సుకత కలిగించారు. చాలా చక్కటి రైటప్.

    రిప్లయితొలగించండి