"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

22 ఏప్రి, 2010

క్షమయా ధరిత్రి ...

క్షమయా ధరిత్రి అన్నారు..కదా ..
పుచ్చుకున్నమ్మ వాయనం అన్నట్టు, అన్నీ తీసుకోవడమే కాని ఇవ్వడమే తెలీదు ,ఈ బుద్ధి హీన మానవుడు, ఇంక నాలుగు రోజుల్లో, ధరిత్రి దినం అంటూ, ఊదర కొడతారు, టీవీ లలో, మాట్లాడు తారు, పుస్త కాల్లో రాస్తారు,  ఇన్ని చెట్లు కొట్టేస్తున్నారు, అడవు లని నేల మట్టం చేస్తున్నారు కఠిన వ్యర్ధ పదార్ధాలు వదిలేసి నదులలోకి నీటిని కలుషితం చేస్తున్నారు,  ఒక విత్తు నాటితే  , ఒక్క చెట్టే కాదు, వంద పండ్లను ఇస్తాను, అయినా ఏవో, రసాయనాలు నా నోట్లో పోస్తారు, అని విలపిస్తున్న భూదేవి, కోపం తో ఒక్క సారి, పొగలు, సెగలు చిమ్మి, తన ప్రతాపం చూపించింది. 
ఐస్లాండ్  లో నివురు గప్పిన వోల్కానో , ధరిత్రి దినం అంటూ మీరు చెప్పే మాటలు ఇంక చాలు అంటూ నోరు తెరిచి చెప్పినట్టు అన్పించింది నాకు అయితే. అభివృది చెందాం మేము అని గొప్పలు చెప్పుకునే దేశాలు యావత్తు, కాళ్ళు కట్టేసి నట్టు చతికిల పడ్డాయి. విమనాశ్రాయాలే నివాసాలు. సాక్షాత్తు  అమెరికా ప్రెసిడెంట్ గారు, తలుచు కుంటే, ప్రయాణం ఆగిపోయింది. కోట్లు కోట్లు డాలర్లు నష్టం అంటున్నారు. వారం పాటు ఆకాశ ప్రయాణాలు రద్దు. 
క్షమయా   ధరిత్రి అంటూ ,ఎవరు మనసు లో తలుచుకుని వేడుకున్నారో, అల్ప మానవులు అని దయ తలిచి శాంతించింది.. అమ్మ.
ఇప్పటి కైనా ఒక చెట్టు కొట్టితే మరో చెట్టు పెంచడం, నీరు ని పదిలం గా వాడు కోవడం, నదు లని పూజించడం అంటే, బొట్టు పెట్టి కాదు, హారతి ఇచ్చి కాదు, బొట్టు బొట్టు, విలువైన ప్రాణ జలం అని నమ్మి, ముందు తరాలకు కూడా కొంచం నీరు మిగుల్చుదాం అని ఒట్టు పెట్టుకుని, స్వచ్చని జలం నదిలో పారడమే, మనం ఇచ్చే హారతి అని గట్టిగా పాటించి, చెవిటి ప్రభుత్వాలు మేలుకోవడానికి, చెవి లో శంఖం ఊది, కళ్ళు మూసు కున్న జనాలకు మన ఆచరణలతో కళ్ళు తెరిపించి, వాడ వాడ లా ప్రకృతి ని గవురవించే వారసత్వం ను ముందు తరాలకు అందించే బృహత్ కార్యాలకు, నడుం చుట్టి, ఈ భూమి కి అతిధి గా వచ్చాం, మర్యాదగా  మసలుకుందాం మర్యాద తెలిసిన నాగరికులం  కదా.
ఇంక ఈ భూమి ని ఒక పట్టు పట్టాం, ఇప్పుడు చంద్రుడు, గ్రహాలూ అంటూ ఎగురుతున్నాం. చల్లని జాబిలి మామ , చందమామ, తల ఎత్తి చూస్తే , నిండు గా నవ్వుతూ, వెండి వెన్నెల ని దయ గా కురిపిస్తాడు. కుందేలు బొమ్మే కని పిస్తుంది నాకు, ఇప్పటికీ, చంద్రుడి మధ్యలో, ఆకాశ హర్మ్యాలు పొగలు చిమ్మే మన వాహనాలు ఊహించుకుంటే, ఆ చంద్రుడి మీద జాలి కలగదూ. రియల్ ఎస్టేట్  ఏజెంట్లు కూడా తయారు అయారుట చంద్రుడి మీద ప్లాట్లు అమ్మడానికి. 
ఒక భూమి చాలలేదు మన ఆశల వెర్రి కి, ఇంకో గ్రహం కూడా ఎగర డానికి సిద్ధం అవుతున్నాం. చూద్దాం చూద్దాం, ఈ మానవుల ఆశ కు హద్దు ఎక్కడో? అని భూదేవి ఓపిక పట్టింది. మన గొయ్యి ని మనమే తవ్వుకున్నట్టు  ,  మన నాశనం కి  మనమే బాటలు వేసుకుంటున్నాం. భూమి, నీరు, గాలి అన్నిటి తో వ్యాపారమే, ముందు వెనక ఆలోచన లేదు,గల గలమని కాసులు కురిపిస్తే చాలు, దేనిని అమ్మడానికినా  మనం సిద్ధమే ..మానవులు, నీచ మానవులు అని ఈ తల్లి మనలని శపించక ముందే, మేలుకోవాలి మనం. క్షణం క్షణం విలువైనది, రేపు నీ పిల్లలకి ఎన్ని మూటలు మిగిల్చావని చూడరు, మనకి ఎంత నీరు, గాలి, భూమి మిగిల్చారు ,మా అమ్మ నాన్నలు అని చూస్తారు. 
నెవిల్ షుటే బీచ్ నవల లో ఒక దేశం లో అందరు అణు ప్రయోగం వల్ల చనిపోవడానికి సిద్ధం అవుతూ, చెట్లు నాటు తారు. తమ తరువాత వచ్చే తరంకు ఏదో మిగాల్చాలి అని ఆశ, మనం కూడా ఇదే ఆఖరి రోజేమో ఈ భూమి మీద మనకి నూకలు చెల్లిపోయాయి అను కుని  వందనం గా , భూదేవి ముందు వినమ్రం గా మెలగాలి, మన అడుగు జాడలు కూడా మిగలవు, కాని మనం నాటే ఒక మొక్క, మిగుల్తుంది, రెప రెప లాడుతూ, భూమి కి మొక్కుతుంది.
ఈ రోజు, ఈ దినం, అని లెక్కలు మరిచి కోట్ల సంవత్సరాలు గా మనలని మోస్తున్న ఈ ధరిత్రి కి తల వంచి ఒక వినమ్ర దణ్ణం...అంతేనా??

3 కామెంట్‌లు:

  1. Excellent thoughts and articulation! I enjoyed reading this, especially for being a worker in the environmental industry.
    The issue we have, especially in India, is complex. We, the middle class folks, who are assured of food and shelter in foreseeable future, want to protect the earth so that we can have cleaner air to breathe and good water to drink. Our concern is discomfort or disease in the future, when we get old. If he doesn’t cut the tree, the poor man probably cannot have food tonight! So, we need to consider that aspect too. We can’t tell the folks to stop chopping trees, without showing them a viable alternative to support their existence.
    At a fundamental level, I think, deep down, we care about earth because we want to have good living conditions for us and for our posterity. I don't think we really want to protect Earth. More importantly, Earth doesn't need our protection! It survived volcanoes, floods, and meteor hits in epic proportions for 4.5 billion years!
    If we think that we are powerful enough to damage it or protect it from damages, we are grossly overestimating our strengths. Earth’s core is 4,000 miles deep and the deepest hole we could drill with all our technology was less than 10 miles! We are not powerful enough even to scratch its surface!
    So, if our concern is Earth's health, we can be assured that it will continue to exist for a very long time after the whole life becomes extinct! We (the pressurized leather bags with an illusion of intelligence) are so delicate. If average surface temperature rises to 100 degrees centigrade, we get vaporized in a big hurry. Earth has been handling an estimated 5,000 degrees Centigrade temperature at its core for a very long time!
    So, the Earth probably is not weeping in fear. May be it is giggling at our monumental stupidity and arrogance.

    రిప్లయితొలగించండి
  2. గోపా,
    చాల ధన్యవాదాలు, నా బ్లాగ్ చదివి నందుకు, మీ అభిప్రాయం, రాసినందుకు.
    నా జవాబు.భూమి తన చుట్తో తానూ తిరిగుతూ, సూర్యుని చుట్తో తిరుగు తున్న ఒక గ్రహం.భూమి మీద మాసు లుతున్న జీవులం మనం. సహా జీవనం చేయడానికి, భూమి అనుమతించింది. అంతే కాని, భూమి మీద వనరలు అన్ని పూర్తిగా ఖాళి చేసి, ముందు తరాలకు, స్వచ్చమైన గాలి, భూమి, నీరు అంద కుండా చేయడానికి మనకు ఏం హక్కు ఉంది. ఈ రోజు భూమి మనుగడ గురుంచి కాదు, భూమి, కోట్ల ఏళ్ల నుంచి ఉంది అనే రాసాను, భూమి మీద మానవుల ఉనికి, మనం భూమి పట్ల చూపించాల్సిన మన బాధ్యత గురించి ఈ వ్యధ.మనం బాధ్యత తో వ్యవహరించకపోతే, నష్టం మనకే ఎక్కువ, మానవాళి మనుగడ భూమి తో ముడి పడి ఉంది. మన స్వార్ధం ,దూర దృష్టి లేని పను లతో, భూమి కి నష్తం కలిగి స్తున్నం. ఇది భూమి మనుగడ కాదు ,మన మనుగడ కే ముప్పు.

    చెట్లు కొట్టుకునే పేద వారు ని ఆపటం లేదు, పేపర్ పరిశ్రమ కోసం ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారు? ఎంత పేపర్ వృధా అవుతున్నది. మన పవర్ కోసం, రైన్ ఫొరెస్త్స్ ని కూడా ముంచేసి, ఆన కట్ట లు కడుతున్నాం. మన వాహనాలు కోసం శిలజ వనరలు -పెట్రోల్- ని పూర్తి గా వాడుతున్నాం. అంతా వాడు కోవడమే కాని, భూమి కి తిరిగి మనం ఏమి ఇవ్వటం లేదు. మన అభివృద్ధి కి భూ వనరలు వాడుకోవాలి నిజమే, మన ఇల్లు, వాహనాలు, మన భోజనం, మన దాహం, మన బట్టలు, అన్ని టికి భూమి నే నమ్ముకున్నాం. పాలు తాగే రొమ్ము ని గుద్దడం అని ఒక నానుడి ఉంది, మన మే ఒక ఉదాహరణ.

    ఒక గఉరవం, ఒక ఆలోచన, ఒక బాలన్సు, లేకుండా, విచక్షణా రహితం గా మనం చేస్తున్న పనుల గురించే ఈ ఎఅర్త్ డే నాడు తలుచు కోవడం.అంతే కాని, భూమి తిరగడం మానేస్తుంది అని కాదు.భూమి మీద ,భూమి నే నమ్ముకుని బతికే మన గురించే ఒక మేలుకొలుపు దినం, ఈ ధరిత్రి దినం. భూమి మీద వనరలు అందరికి కావాలి, పేద వారికే కాదు గొప్ప వారికి కూడా. గాలి, నీరు, ఆహారం.. అందరికి అవసరం. అందు కే అందరి కి ఈ పిలుపు. ముఖ్యమగా రాజ్యాలు - స్టేట్- వ్యవస్థ లకి ఈ పిలుపు, ఈ అరుపు, ఈ గట్టి మేలు కొలుపు.

    రిప్లయితొలగించండి
  3. లత ఇలా అన్నారు.

    ఇంట్లో పసి పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ పడిపోయి తలకు దెబ్బలు తగిలించుకుంటారు. తత్తరపడే కొత్త తల్లికి ఫరవ లేదమ్మా భూదేవి కాస్తుంది అని ఆభయమిస్తారు ఆమె అమ్మమ్మో బామ్మో . అంత నమ్మకం మనకు భూమిమీద. ఉదయమే నిద్ర లేస్తాం కాలికింద భూమి కదిలిపోదు అని నమ్మకం. ఆకసం విరిగి నెత్తిన పడదు. సముద్రం పక్కనే ఉంటాం అది పొంగి మున్చేయదని నమ్ముతుం టం . అసలు ఆ విషయాలు ఆలోచనకే రావు. మరి అంత విశ్వాసం ప్రేమ మనం ఈ భూమి ఎడల చూపిస్తున్నామా ? భూగోళాన్ని అంత చాపలా చుట్టి దోచేయా లన్న మో హం సూదిమొన మోపిన భూమిని కూడా వదులుకోలేక కురుక్షేత్రాలు సాగించే లోభం ఉన్నాయి మనకు భూమి మీద. కానీ బాధ్యత ఉందా??ఈ అనంత సిరులు పొందుతున్నందుకు ప్రతిగా కృతజ్ఞతఉందా ? అయితే ఏమి చేయాలి? విజ్ఞానం నాకందించిన సౌ కర్యలన్ని వ దులుకుని రాతి యుగంలో జీవించాల? నేనేమి సైనికుడిని కాదు. దేశం కోసం ప్రాణ లీయడానికి. నేనేమి మహా దాత ను కాదు. నన్ను నేనే త్యాగం చేసుకుని దానా లీయడానికి. నేనేమి సన్యాసిని కాదు సుఖాలు సౌ కర్యాలు వదులుకోడానికి అయిన నేనొక్కదాన్ని ఎం చేయాలి? నేనొక్కడిని ఎం చేయాలి? అనుకోవచ్చు ఎవరికీ వారు. అందుకని ఏమి చేయమా? ఒకటి ఆలోచించండి. రూపాయలో పైసా తగ్గిన అది తొంభై తొమ్మిది !పైసలె కదా.! పర్యావరణ రక్షనే ధ్యేయంగా జీవితాలు అంకితం చేసిన మహానుభావులు జీవితాలు ధారపోసిన వారు మనకు ఆదర్శంగా ఉన్నారు వారు నిరంతరంగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారికీ మనం అన్ని విధాల మద్దతు ఇద్దాం. ప్రజలలో స్పృహ ఎక్కువైతే ప్ర భు త్వాలు ప్రతిస్పందిస్త యి . పర్యావరణ సదస్సులు మొక్కుబడిగా మిగిలిపోకుండా ఉంటాయి. వ్యక్తిగతంగా మనకు ఆచరణ సాధ్యమైన చిన్న గోల్ ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తాము అనో . మొక్కలు నా టుతా మనో అనుకుని దానిని నిష్టగా చేద్దాం ఎక్కడో చదివాను ప్రతి ఇంటి ముందు ముగ్గు ఊరంతా రంగవల్లులు. .వ్యక్తిపరంగా సామూహికంగా మనం మన కృతజ్ఞతలు వెల్లడించుకోవాలి. మనుషులమనిపించుకోవాలి. ఋణం తీర్చుకోవాలి. గంగ సర్వ పాప నాశిని . ఆ నది కాలుష్యం మనుషులా పోగేట్టేది? అని అనుకుంటామా ? ఆ ప్రయత్నం మనుషులు చేయాలి. ఎందుకంటే కలుషితం చేసింది వాళ్ళే కాబట్టి. భూమాత మన ని కాస్తుంది. మనం భూమిని రక్షించే వాళ్ళం కాకపోవచ్చు. కానీ మనం చేసినదానికి మనం అమెంద్స్ చేయాలి. ఎ శాస్త్రజ్ఞులకి భూమి ఎలా గోచరించిన మనం హిందువులం భారతీయులం మనకు ఈ భూమి తల్లే. నిద్ర లేచి నేల మీద కాలూనే ప్రతిసారి "సముద్ర వసనే దేవి పర్వత స్థ న మండలే విష్ణు పత్నీం నమస్తుభ్యం పాద స్పర్శం క్ష మస్వమే.. అని ప్రార్ధించి ఆ తల్లిని అనుజ్ఞ వేడాలి అన్న సంప్రదాయం మనది. ఎ మంచి పూవులన్ ప్రేమించినావో నిను మోచే నీ తల్లి కనకగర్భమున అని తన అదృష్టానికి పులకించిన జాతి మనది.. మనకు ఈ భూమి తల్లే . వందే మాతరం

    రిప్లయితొలగించండి