"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

4 జూన్, 2014

అగ్ని సాక్షి గా పెళ్ళి ,చావు...

చిట్టి చిట్టీ ,ఏమిటమ్మా .. చా పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి నాకు ఇంకా చిట్టి ఏమిటి అంటూ సీత గొడవ పెడుతూ ఉంటుంది , మనకంత తాహతు లేదు అంటూ ,డిగ్రీ చదువు అయినా చదవనివ్వండి అంటే ,మన కుటుంబాల లో ఇదే గొప్ప ,నేనూ ఎనిమిది వరకు చదివాను అని మీ నాన్నమ్మ నన్ను చదువు కున్న కోడలు అంటూ మూతి మూడు వంకలు తిప్పేది ,అంటూ అమ్మ నా చదువు మధ్యలో ఆపించినా ,పత్రికల లో కథలు ,నవల లు చదవడం నాకెంత ఇష్టమో ,భర్త అంటే ఇలా ఉండాలి అని ఎన్ని కలలో ..
ఇంట్లో ఎప్పుడూ చూసార ? అల్ల వారి అబ్బాయి అంటూ ..చిన్న చిన్న గా చెవులు కొరుక్కోవడం . బడి లో గుమాస్తా ..మంచి సంబంధం అంటూ ,ఉన్న దంతా ఊడ్చి ,ఊడ్చి ,నాన్న గారు ఈ సంబంధం కుదిర్చారు ..మరి పాపం తమ్ముడికి ?? చదువు చెప్పిస్తాం .వాడి ఊసు నీకేలా ? అమ్మ ప్రేమ గా చివచివ లు ..
రామారావు అమాయకుడు అన్నారు ,అంటే ఏమిటొ మరి , సీత నువ్వింత అందం గా ఉన్నావు నీ కు ఎవరూ ప్రేమికులు లేరా ? అంటే అయోమయం గా , నేనంత అందగెత్తనై నాకు తెలియదే ,మీరు మరి లక్ష రూపాయిల కట్నం తీసుకున్నరేం ? నేను అంత అందగెత్త నైతే అన్నందుకు ,మొదటి సారి నా చెంప పై దెబ్బ పడింది ..
రామారావు మెత్తనైన వాడు ,అమాయకుడు ..అన్నారే ..ఇంత గట్టిగా ఉందే అతని చేతి దెబ్బ ? కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి మొట్ట మొదటి సారి ..చిట్టీ అని పిలిచే అమ్మ ఏది ? నా కంట నీరు చూడలేని అమ్మ ఏది ??
రామారావు చేతిలో నా చేయి పెడితే అంతేనా ? ఇంక నా మంచి చెడ్డలు అమ్మ నాన్న కి పట్టవా ? ఎలా ఉన్నావు ? అని అడగరేం ?
అవును లక్ష రూపాయలకి వడ్డీ కడుతూ ,ముక్కుతూ మూలుగుతూ నడుపుతున్న సంసారం ,ఎలా ఉన్నావు తల్లీ అని అడిగి ,దించిన కుంపటి మళ్ళీ ఎద పై ఎక్కించుకోరు కదా ? నేనేమైన అడిగానా ? నాకు పెళ్ళీ చేయండి అని, చదువుకుంటాను నాన్నా అంటే ,భారం తల్లీ అన్నారు ..నేను ఉద్యోగం చేసి ,వారిని పువ్వుల్లో పెట్టి చూసుకునే దాన్ని కదా ,ఎవరు చెప్పారో ఆమ్మాయిలు కుంపట్లు అవీ అని ,కాలం ఎంత మారినా మా అమ్మ నాన్న మటుకు పాత కాలం పద్ధతులే ఏమైనా అంటే ,మనకి అంత తాహతు లేదు ..అన్నిటికీ ఒక్కటే మాట ..
ఏం చెప్పి పంపించింది అమ్మ ..తల వంచుకు ఉండు ,అత్తారింట్లో ,ెదురు సమాధానం చెప్పకు , నీ పని నువ్వు చక్కగా చేసుకో ,బద్ధకించకు , పని మనిషి అంటూ ఎవరూ వద్దు ,పని చేసుకుంటూ ఉంటే పని చులాగా ఉంటుంది ..ఆరోగ్యం గా ఉంటుంది .పని బద్ధకం పనికి రాదు ..అంటూ ..
తు చ తప్పకుండా , అమ్మ మాటలు పాటిస్తున్నాను ..ఐనా అప్పుడప్పుడు చెంప దెబ్బలు , నడుం వంచి పిడ్ గుద్దులు ..ఎందుకు ? అని అడిగినందుకు ..మరో రెండు ..
అత్తగారు వచ్చి ఏం చెప్పారో మరి , పండగ ఈనాం అంటూ ఎభై వేలు తెమ్మని సతాయింపు ..వద్దు అండీ ,మా నాన్న ఇప్పటికే అప్పుల్లో ఉన్నాడు .నా వల్ల కాదు ,పని మనిషి కూడా పెట్టుకోకుండా పొదుపు గా చేస్తున్నాను ,ఇంకా యేమిటి తక్కువ ? అని అన్నందుకు ..
రెండ్రోజులు అయింది గాస్ అయిపోయి ,కిరస నూనె కుంపటి మీద వంట .. ఏమండీ ఒక్క సారి వచ్చి కాస్త స్టవ్ లో కిరసం పోయండి ,నా చెయ్యి బాగా లేదు , ఇంట్లో నే ఉన్న రామారావు ని కేకేసి పిలిచాను ..
ముందు గదిలోం చి నవ్వుకుంటూ , వచ్చి , కిరసన్‌ డబ్బా లో నూనె అంతా నా పై వంచాడు ,పాపాత్ముడు ..వీడు భర్తా ?? కళ్ళల్లో నీళ్ళూ తిరిగి ,కిరొసిం కంపు కొడుతూ నేను ,అవాక్క్కయ్ నిల్చుని ఉండగా ,అగ్గి పుల్ల అంటించి నా పై వేసాడు ..
ఆ చిన్న గదిలో మంటలు పైకి ఎగిసాయి ..సీత ..అగ్ని సాక్షి గా పెళ్ళాడిన సీత కి అమ్మ మాటలు గుర్తు వచ్చాయి .బ్రతికినా చచ్చినా అత్తా రింట్లో అని , లుంగి ఊడి ,కాళ్ళ కి అడ్డం పడి ,ఒక్క క్షణం , పారిపోవడం ఆలస్యం అయిన రామరావు ని గట్టిగా కౌగిలించుకుంది ..
అగ్ని సాక్షి గా పెళ్ళి ,ఒక్క ఏడాది గడవకుండానే చావు ..సీతా ..రామారావుల కథ ఇది ..కాదు కాదు ఇంకా ఎంత మందిదో కథ ..సీతల కథ ..
అగ్ని కి ఆహుతవుతూ భర్త ని కూడా కౌగిలించుకుని , చనిపోయిన.. చంపేసిన ...ఒక భార్య గురించి వార్త ..శభాష్ ...అని ...ఆమె లాంటి మరెందరో ..పెళ్ళి పెళ్ళి ..కాదూ ..జీవితం ..జివితం ..ముఖ్యం ..
UnlikeUnlike ·  · 

4 కామెంట్‌లు:

  1. Patee saha gamanam... Aadapillalu andaru inta samaya sphoortiga pravartiste ee maga buddhi ki kontaina marpu vastundemo.

    రిప్లయితొలగించండి
  2. స్వర్ణ మల్లికా !
    బాగా చెప్పారు , అగ్రహం తో ఒళ్ళూ మండి పోతుంది ,ఇలాంటి పత్ని దహనాలు వింటూ ఉంటే ,ఇది పరిష్కారం కాదు కానీ , ఇది కూడా ఒక మార్గమే అనుకోవాలి , మీ స్పందన తెలిపి నందుకు సంతోషం .
    వసంత లక్ష్మి .

    రిప్లయితొలగించండి
  3. హ్మ్ ..ఎదో మూల ప్రతినిత్యం ఒక ఆడపిల్ల బలి అవుతూనే ఉంది. భారం, కుంపటి పేరుతో కన్న తల్లిదండ్రులు. కట్నం పేరుతో అత్తింటివారు. మధ్యలో మాత్రం బలి అవుతున్నది మాత్రం ఆడపిల్ల. ఇంకా ఎంత మంది ఇలా బలి కావాలేమో. దీనికి అందరూ కారకులే. ఆడది తనకాల్లమీద నిలబడి, స్వతంత్ర్యంగా అలోచించగలిగి,నిర్ణయాలు తీసుకొగలిగే స్థితి వస్తే తప్ప పరిష్కారం దొరకదేమో. .ఆ రోజు రోజు రావాలి కోరుకుంటూ.

    రిప్లయితొలగించండి
  4. డేవిడ్ ,,
    నీ స్పందన ఇప్పుడే చూసాను ..థాంక్ యూ ..ఇది ఒక నిరంతర పోరాటం ..మన దేశం లోనే కాదు అన్ని చోట్లా ఈ వివక్ష ఉంది ..కాక పోతే మన దేశం లో మరీ ఎక్కువ, అవిద్య ,పేదరికం , మూఢ నమంకాలు ..ఒకటేమిటి ..ఎన్ని కారణాలో ..
    వసంత లక్ష్మి

    రిప్లయితొలగించండి